పార్టీ కోసం కష్టపడినా ప్రాధాన్యత ఇవ్వలేదు – పురుగుమందు తాగిన టీడీపీ కార్యకర్త – మహానాడులో విషాదం

 అనంతపురం అర్బన్ నియోజకవర్గం మినీ మహానాడులో ఓ టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడం సంచలనగా మారింది.


ఆ కార్యకర్త పేరు సాకే వెంకటేష్. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడినా.. టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు అన్యాయమే జరుగుతోందని సాకే వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎదుటే పురుగుల మందు తాగాడు.

తెలుగు దేశం పార్టీ మహానాడు సన్నాహాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీ మహానాడుల్ని నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలోని కమ్మభవన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. సభా వేదికపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతుండగా ఒకసారిగా సభ వేదిక ఎదుటకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందును సాకే వెంకటేష్ తాగి ఎమ్మెల్యే ఎదుటే పడిపోయాడు. వెంటనే పోలీసులు, టిడిపి కార్యకర్తలు సాకే వెంకటేశును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాకే వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న సాకే వెంకటేష్ పార్టీ కోసం కష్టపడుతున్నట్లు తోటి కార్యకర్తలు చెబుతున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. వెంకటేష్ ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తోటి కార్యకర్తలు నేతలు తరలించారు. వెంటనే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా మినీ మహానాడు కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి ఆసుపత్రికి వెళ్లారు. వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశించారు. వెంకటేష్ వైద్యం గురించి దగ్గరుండి ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ కోసం కష్టపడినా ప్రయోజనం లేదని పలువురు కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారు. వారిలో కొంత మంది ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది .. పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఏదైనా ఉంటే పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.