దొరికిన రుద్రమదేవి శాసనం…దానిలో ఏం రాసి ఉంది?

తెలంగాణలో ఒకప్పుడు కాకతీయ మహాసామ్రాజ్యం పరిపాలన సాగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అనేక శాసనాలు ఇప్పటికే బయటపడ్డాయి.


కాగా తాజాగా మరో శాసనం బయటపడింది. 1184లోనే ఈ శాసనాన్ని రాసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస ప్రసాద్ తురిమెల్ల అనే వ్యక్తి తానే ఈ శాసనాన్ని కనిపెట్టానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతే కాకుండా ఇప్పటికే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ డిపార్ట్‌మెంట్‌కు పంపినట్టు తెలిపారు. శాసనంలో రుద్రమదేవి కళింగుల జయించి కళింగరాయదిశావట్ట బిరుదు పొందినట్టు పేర్కొన్నారు.

వీరి సామంతరాజు జన్నిగ దేవుడు శాసనాన్ని లిఖించాడని తెలపారు. జన్నిగదేవుని మామ గంగయ సాహిణికి పుణ్యం కొరకు శ్రీశైలం పర్వత స్వామికి 1262 సంవత్సరంలో గూడూరు అనే గ్రామాన్ని దానం చేసినట్టు ఈ శాసనం చెబుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీనివాస ప్రసాద్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఉన్న భాష కన్నడలా ఉందంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టి గ్రోక్ ని అడిగాడు. దానికి గ్రోక్ ఇది ఓల్డ్ తెలుగు అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో కన్నడ, మలయాళం భాషలు తెలుగు తరవాతనే పుట్టాయని కామెంట్లు చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.