ఈ 10 యాప్‌లను వెంటనే తొలగించండి… లేకుంటే మీరు డేటా మరియు డబ్బు రెండింటినీ కోల్పోతారు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ కూడా సైబర్ మోసాలు కొత్త కొత్త విధాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పెరిగిన తర్వాత మోసగాళ్లు మరింత ఎక్కువగా మోసాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఈ క్రమంలోనే తాజాగా సైబర్ భద్రతా సంస్థ CRIL Warning (Cyble Research and Intelligence Labs) నివేదిక ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజర్ యాప్‌లు (Malicious Apps)ఉన్నట్లు తెలిపింది. ఈ యాప్‌లు క్రిప్టో వాలెట్‌ల రూపంలో కనిపిస్తూ వినియోగదారుల విలువైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దోచేస్తున్నాయని వెల్లడించింది.

ప్రధానంగా ఈ యాప్స్..

ఈ నేపథ్యంలో మీరు Android ఫోన్ వాడుతున్నట్లయితే, తక్షణమే మీ మొబైల్‌ నుంచి ఈ ఆప్‌లను వెంటనే తొలగించాలని సూచించింది. లేకపోతే పెద్ద నష్టం తప్పదని హెచ్చరించింది. ప్రమాదకరమని గుర్తించబడిన యాప్‎లలో Suiet Wallet, BullX Crypto, SushiSwap, Raydium, Hyperliquid, OpenOcean Exchange, Pancake Swap, Meteora Exchange, Harvest Finance Blog వంటివి ఉన్నాయి.

మోసం ఎలా పనిచేస్తోంది

ఈ యాప్‌లు వాస్తవమైన క్రిప్టో వాలెట్‌లను అనుకరించేలా డిజైన్ చేయబడ్డాయి. SushiSwap, PancakeSwap, Raydium, Hyperliquid, Suiet Wallet వంటి పాపులర్ డీసెంట్రలైజ్డ్ వాలెట్‌ల పేరుతో వచ్చాయి. కానీ యూజర్ ఇంటర్‌ఫేస్ విషయంలో వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యూజర్‌ను వారి 12 వర్డ్ రికవరీ ఫ్రేస్ (wallet recovery phrase)ను ఎంటర్ చేయమంటాయి. ఇది ఓ వాలెట్‌ను తిరిగి యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే అత్యంత కీలకమైన సెక్యూరిటీ విధానం. ఆ తర్వాత మోసగాళ్లు మీ వాలెట్‌ను యాక్సెస్ చేసి అందులో ఉన్న క్రిప్టోకరెన్సీని దోచేస్తారు.

ప్రైవసీ పాలసీ

ఈ యాప్‌లను డెవలపర్లు గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి యాప్‌ల పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. విశ్వసనీయంగా కనిపించేందుకు ఫేక్ ప్రైవసీ పాలసీ లింకులు కలిపి, అందులో ఫిషింగ్ లింకులను చొప్పిస్తున్నారు. ఈ యాప్‌లు రియల్ యాప్‌ల లేఅవుట్‌ను అనుకరిస్తాయి. దీంతో డౌన్‌లోడ్‌ల సంఖ్య, రేటింగ్‌లు కూడా ఫేక్‌గానే ఉంటాయి. చాలా మంది వీటి గురించి తెలియక బలైపోతున్నారు. కాబట్టి ఇలాంటి పేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.