నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ.. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB)..
నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (NMHP).. టెలి మానస్ (Tele MANAS) ప్రాజెక్టుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనుండగా.. అర్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. జూన్ 7, 2025 నుంచి జూన్ 18, 2025 లోపు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
పోస్టుల వారీగా ఖాళీలు..
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ – 12
క్లినికల్ సైకాలజిస్ట్ – 19
సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 06
కౌన్సిలర్ – 36
టెక్నికల్ కో-ఆర్డినేటర్ – 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02
విద్యార్హతలు..
ఉద్యోగానికి అనుగుణంగా ఎంబీబీఎస్, బీఈ/బీటెక్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఎం.ఫిల్, పీహెచ్‌డీ, ఎంఎస్‌డబ్ల్యూ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయస్సు పరిమితి..
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు (జూన్ 5, 2025 నాటికి)
వయో సడలింపులు..
ఓబీసీ – 3 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ – 5 సంవత్సరాలు
దివ్యాంగులు – 10 సంవత్సరాలు
జీతం..
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ – రూ.1,00,000
క్లినికల్ సైకాలజిస్ట్ – రూ.27,500
సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – రూ.25,000
కౌన్సిలర్ – రూ.18,066
టెక్నికల్ కో-ఆర్డినేటర్ – రూ.40,000
డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ.18,450
దరఖాస్తు ఫీజు..
OC అభ్యర్థులు – రూ.1,000
BC, SC, ST, EWS, ESM, PwBD అభ్యర్థులు – రూ.750
ఎంపిక విధానం..
విద్యార్హతల్లో పొందిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు గడువు..
జూన్ 7, 2025 నుంచి జూన్ 18, 2025 వరకు
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను చూసి సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మంచి జీతం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు.