గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. విమానంలోని 11A సీట్‌లో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ (40) అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అతడు దూకి బయటపడ్డట్లు తెలుస్తోంది.
విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ ఏకైక బ్రిటీష్ పౌరుడు రమేష్ భయంకరమైన క్షణాల గురించి వివరించాడు. ‘టేకాఫ్ అయిన 30సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని.. ఆపై విమానం కూలిపోవడం చాలా వేగంగా జరిగిందని తెలిపాడు. మృతదేహాల మధ్య లేచి అంబులెన్స్‌లోకి చేరుకున్నాన్నట్లు పేర్కొన్నాడు. అతని సోదరుడు ఆచూకీ తెలియాల్సి ఉందన్నాడు.
































