టాటా గ్రూప్ రూ. 1 కోటి ఎక్స్-గ్రేషియా ప్రకటించింది, గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా భరిస్తుందని ప్రకటించింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు టాటా గ్రూప్(Tata Group) ప్రకటించింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్(Chandrasekaran) ట్వీట్ చేశారు.


విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇది చాలా విషాదకరమైన ఘటన. మా బాధ వర్ణనాతీతం. క్షతగాత్రుల వైద్య ఖర్చలు కూడా తామే మొత్తం భరిస్తాం. ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీకి కొత్త భవనం కట్టిస్తామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మృతిచెందారు. ఈ ఘటన మొత్తం దేశాన్ని కలిచివేసింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేస్తోందని పేర్కొంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.