బ్రెజ్జా దూకుడుతో కుప్పకూలిన టాటా, అన్ని లెక్కలను తారుమారు చేసింది.

భారతీయ కస్టమర్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, గత నెల అంటే మే 2025 అమ్మకాల విషయానికి వస్తే.. చాలా మంది టాటా పంచ్ లేదా టాటా నెక్సన్ నంబర్ 1 అనుకుని ఉంటారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ మారుతి సుజుకి బ్రెజా ఈ విభాగంలో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. మారుతి సుజుకి బ్రెజా గత నెలలో ఏకంగా 15,566 యూనిట్ల ఎస్‌యూవీలను అమ్మి, ఏడాదికి 10 శాతం వృద్ధిని సాధించింది. మరి, గత నెలలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


బ్రెజా దూకుడు.. పంచ్‌కు తగ్గుదల
మే 2025 అమ్మకాల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఎస్‌యూవీలు ఇవే: మారుతి సుజుకి బ్రెజా అందరినీ అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో 15,566 యూనిట్లను అమ్మింది. గత ఏడాది మే 2024లో ఇది 14,166 యూనిట్లు మాత్రమే అమ్మగా, ఈసారి ఏకంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో మారుతి ఫ్రాంక్స్ ఉంది. గత నెలలో 13,584 యూనిట్ల ఎస్‌యూవీలను అమ్మి, ఏడాదికి 7 శాతం వృద్ధిని సాధించింది. ఆశ్చర్యకరంగా.. టాటా పంచ్ ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. గత నెలలో 13,133 యూనిట్ల ఎస్‌యూవీలను అమ్మింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 31 శాతం తగ్గాయి. నాల్గవ స్థానంలో టాటా నెక్సన్ నిలిచింది. గత నెలలో 13,096 యూనిట్లను అమ్మి, ఏడాదికి 14 శాతం వృద్ధిని సాధించింది.

మిగిలిన టాప్ ఎస్‌యూవీలు
టాప్ 4 తర్వాత స్థానాల్లో కియా సోనెట్ 8,054 యూనిట్లను అమ్మి, 8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. మహీంద్రా XUV 3XO ఈ మోడల్ 7,952 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో ఉంది. అయితే, దీని అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గాయి. హ్యుందాయ్ వెన్యూ 7,520 యూనిట్లను అమ్మి ఏడో స్థానంలో నిలిచింది. 19 శాతం వార్షిక తగ్గుదలను నమోదు చేసుకుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 5,899 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం తగ్గాయి. తొమ్మిదో స్థానంలో నిలిచిన స్కోడా కైలాక్‌కు 4,949 మంది కొత్త కస్టమర్లు లభించారు. ఈ జాబితాలో కియా సైరాస్ 3,611 యూనిట్ల అమ్మకాలతో పదో స్థానంలో ఉంది.

మొత్తంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ పోటీలో టాటా పంచ్, నెక్సన్ వంటి మోడల్స్ కూడా గట్టి పోటీని ఇస్తున్నాయని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ సెగ్మెంట్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.