ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో తులం బంగారం రూ.1.80 లక్షల జీవితకాలపు గరిష్ట స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత నుంచి క్రాష్ అవుతూ వస్తోంది.
ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద ఊగిసలాడుతున్నాయి. అయితే ఇండియాలో గోల్డ్ అంటేనే ప్రజలకు సెంటిమెంట్. పంక్షన్లు, పండుగలు ఏదైనా మెడలో బంగారం ఉండాల్సిందే. ధరలు పెరిగిన క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కొన్నిచోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. నకిలీ లేదా నాసిరకం బంగారాన్ని విక్రయించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. కొన్నిసార్లు ధరించిన బంగారం నల్లబడుతుందని చాలామంది చెబుతుంటారు. అసలు బంగారం నిజంగానే నల్లబడుతుందా..? దీనికి రీజన్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
నల్లగా అయితే నకిలీదా..?
మీరు ధరించిన బంగారం నల్లగా మారిందని ఆందోళన పడుతున్నారా..? నకిలీ బంగారం అనుకుని అయోమయానికి గురవుతున్నారా..? అయితే గోల్డ్ కొంతకాలం తర్వాత నల్లబడుతుందని పరీక్షల్లో తేలింది. 24 క్యారెట్ల బంగారం నల్లబడదు. అయితే అది మృదువుగా ఉండటం వల్ల ధరించలేము. దీంతో ఆభరణాలు తయారుచేసే సమయంలో వాటిల్లో రాగి, వెండి, జింక్ లాంటివి కలుపుతారు. ఈ లోహలు గాలిలోని ఆక్సిజన్, తేమ, చెమటకు ప్రభావితం అవుతాయి. దీని వల్ల ఆక్సీకరణం జరిగి ఆభరణం ఉపరితలంపై నల్లటి పొర ఏర్పడుతుంది.
కారణాలు ఏంటంటే..?
చెమటలోని అధిక అమ్లత్వం గోల్డ్‌తో కలవడం వల్ల చర్య జరుగుతుంది. దీని వల్ల ఆభరణాలు నల్లగా మారుతాయి. ఇక గాలి కాలుష్యం, అధిక సల్పర్ బంగారాన్ని నల్లగా మారుస్తుంది. ఇక దుమ్ము, ధూళి, సబ్బు మలినాలు వంటివి కాలక్రమేణా బంగారాన్ని నల్లగా మారుస్తాయి. ఇక పెర్ప్యూమ్స్, లోషన్లు, మేకప్, హెయిర్ స్ప్రేలోని రసాయనాలు గోల్డ్‌ను నల్లగా మారుస్తాయి. మీరు ఇంట్లోనే ఉండి నల్లగా అయిన బంగారాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్ సెప్ కలపండి. అందులో ఆభరణాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత మెత్తని టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దండి. దీని వల్ల నలుపు పోతుంది. ఇక బేకింగ్ సోడా, నీటితో చేసిన పేస్ట్ రుద్దడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక మీరు నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలంటే.. నిజమైన బంగారం బరువు వల్ల నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతుంది. అదే ఇతర లోహాలు కలిపిన బంగారం తేలియాడుతూ ఉంటుంది. ఇక నిజమైన బంగారం అయస్కాంతానికి ఆకర్షించబడదు. అదే ఆయస్కాంతానికి అతుక్కుపోతుంటే బంగారంలో ఇతర లోహాలు కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు.






















