Astro Tips: ఏ వారంలో ఏది దానం చేస్తే మేలు జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..

www.mannamweb.com


Astro Tips: జ్యోతిషశాస్త్రంలో, వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక గ్రహం, దేవుళ్లకు అంకితం చేయడం జరిగింది. ప్రతి రోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
ఆయా రోజుల్లో దానం చేయడం, ఉపవాసం ఉండటం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. హిందూ మతంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా చేయడం పుణ్యం కలుగుతుందని నమ్మకం. ఒక వ్యక్తి దానం చేయడం చేయడం.. అతను మరణించిన తరువాత అతను చేసిన పనులు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఆ మంచి పనుల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది. అందుకే.. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా దానం చేయాలని మత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది.

అయితే, దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ రోజునైనా తెలిసి లేదా తెలియకుండా ఏదైనా చేస్తే.. దాని వలన మంచి ఫలితాలకు బదులుగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పు, పంచదార, బట్టలు మొదలుకొని నగలు వరకు వివిధ వస్తువులను దానం చేయడానికి మత గ్రంధాలలో వారంలోని ఏడు రోజులు కేటాయించడం జరిగింది. దాని ప్రకారం దానం చేస్తే మేలు జరుగుతుంది. మరి ఏ వారంలో ఏ వస్తువులు దానం చేస్తే మేలు జరుగుతుందో ఓసారి చూద్దాం..

ఆదివారం..

ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. సూర్యభగవానున్ని గ్రహాలకు రాజు అంటారు. ఈ రోజున గోధుమలు, ఎర్రటి పువ్వులు, బెల్లం, రూబీ రత్నం మొదలైన వాటిని దానం చేయాలి. ఆదివారం రోజున ఈ వస్తువులను దానం చేయడం వలన కీర్తి, గౌరవాన్ని పొందుతారు.

సోమవారం..
హిందూ మతం ప్రకారం.. సోమవారం శివుడు, చంద్రుడికి నిర్దేశించడం జరిగింది. ఈ రోజున బియ్యం, తెల్లని దుస్తులు, తెల్లటి పువ్వులు, పంచదార, కొబ్బరి మొదలైన తెల్లని రంగు వస్తువులను దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో చంద్రుడి బలం కూడా పెరుగుతుంది.

మంగళవారం..

హనుమంతుని ఆరాధనకు మంగళవారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసే దానం అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది. మంగళవారం నాడు ఎర్రటి పూలు, ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, బాదం, రాగి పాత్రలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి.

బుధవారం..
గణేశుడిని బుధవారం పూజిస్తారు. ఈ రోజు బుధ గ్రహానికి సంబంధించినది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. పేదలకు ఆకుపచ్చ పప్పు(పెసలు), పచ్చి కూరగాయలు, ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ దుస్తులు మొదలైనవి దానం చేయాలి.

గురువారం..

గురువారం శ్రీ మహా విష్ణువు, బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సంపద, శ్రేయస్సు, కీర్తిని తెస్తుంది. పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు దుస్తులు, పసుపురంగు పువ్వులు, పసుపురంగులో ఉండే పండ్లు, బెల్లం, బంగారు వస్తువులను గురువారం దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.

శుక్రవారం..

శుక్రవారం లక్ష్మీ దేవత, శుక్రుడికి అంకితం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున దానం చేస్తే మేలు జరుగుతుంది. ఈ రోజున ఉప్పు, ఖీర్, వస్త్రాలు, కుంకుమపువ్వు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపద సిద్ధిస్తుంది.

శనివారం..

హిందూ మతంలో శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది. శనిదేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. నల్లని వస్త్రాలు, ఇనుము, ఆవనూనె, నల్ల నువ్వులు, తోలు వస్తువులు దానం చేస్తే మేలు జరుగుతుంది.