బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్‎తో ఆత్మహత్యకు పాల్పడ్డ నాలుగో తరగతి విద్యార్థి

నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‎లోని చందానగర్‎లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ప్రశాంత్(9) అనే బాలుడు నివాసం ఉంటున్నాడు.


ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. అయితే.. ఏమైందో తెలియదు కానీ మంగళవారం (డిసెంబర్ 16) ఇంట్లోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్‎తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రశాంత్.

గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‎కు తరలించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. నాలుగో తరగతి చదువుతోన్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.