ఉగాదికి ముహుర్తం ఫిక్స్‌..ఏపీకి కొత్త సీఎం వస్తున్నాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. వైసిపి పార్టీని కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఓడించిన సంగతి తెలిసిందే.


పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అటు భారతీయ జనతా పార్టీ మూడు కలిసి మొన్న అధికారంలోకి కూడా వచ్చాయి. వైసిపి పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేస్తూ 160 కి పైగా స్థానాలు దక్కించుకుంది కూటమి.
ఇంతటి స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది ఇదే తొలిసారి కావడం విశేషం.

దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని అడిగే వాడే లేకుండా పోయింది. అయితే అలాంటి కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు సైడ్ అయిపోయి దేశ రాజకీయాల్లోకి వెళ్తారట. ఆయనకు రాష్ట్రపతి లేదా గవర్నర్ లేదా టీడీపీ సలహాదారులుగా ఉంటారట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యత తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఉగాదికి ఈ ముహూర్తం పెట్టారట. ఈ మేరకు కూటమి పెద్దలతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి రావడం వెనుక పవన్ కళ్యాణ్ కష్టం ఉందని, చంద్రబాబు తప్పుకుంటే జనసేనాని ముఖ్యమంత్రి చేయాలని అంటున్నారు. నారా లోకేష్ కు పదవి ఇస్తే ఊరుకునేది లేదని వారిని ఇస్తున్నారు. అయితే దీనిపై టిడిపి సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏపీలో ఎక్కువ సీట్లు ఉన్న వాళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సింపుల్గా పోస్టు ద్వారా కౌంటర్ ఇస్తోంది టిడిపి సోషల్ మీడియా. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.