ఫీచర్స్‌ తెలిస్తే గంతేస్తారు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది

www.mannamweb.com


ప్రస్తుతం భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త మోడల్‌ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తూ మార్కెట్లోకి లాంచ్‌ అవుతోంది. ముఖ్యంగా బడ్జెట్‌, మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఎఫ్‌27 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో ఎఫ్‌27 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 వంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ సూపర్ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ బ్యాటరీ వేగంగా ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

కాగా ఈ ఫోన్‌లో కెమెరాకు కూడా అధిక ప్రాధానత్య ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో మెయిన్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన పోర్ట్రైట్‌ కెమెరాతో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఏఐ స్టూడియో, ఏఐ ఏరేజర్‌ 2.0, ఏఐ స్మార్ట్‌ ఇమేజన్‌ మ్యాటింగ 2.0 వంటి ఆర్టిఫిషియల్ సంబంధిత ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు.

ఒప్పో ఎఫ్‌27 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉండనుందని తెలుస్తోంది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1800 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ డిస్కౌంట్‌ లభించనుంది. ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.