చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ 13 ప్రో పేరుతో ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రోతో పాటు, రియల్‌మీ 13 ప్రో+ ఫోన్‌లను విడుదల చేయనున్నారు.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో సోనీ ఎల్‌వైటీ 600 లెన్స్‌ను ఇస్తున్నారు. ప్రపంచంలో ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.
1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 1 టిగా బైట్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. రియల్ మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్ ఫోన్ ఇదే. హైపర్ ఇమేజ్+ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను అందించనున్నారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.
సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 5050 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇస్తున్నారు. కలిగి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సమాచారం మేరకు ఈ ఫోన్ అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్ మీ 13 ప్రో+, రియల్ మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.