ఫేక్ సర్టిఫికెట్‌తో MBBS చేసిన పేద విద్యార్థి.. హైకోర్టు సంచలన తీర్పు

చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు, జాబ్ కోసం అప్లై చేసేవాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకుంటారు. అయితే ఓ యువకుడు ఎంబీబీఎస్ అవ్వాలన్న కలను నిజం చేసుకోవడం కోసం ఫేక్ సర్టిఫికెట్ ని సృష్టించుకున్నాడు. అయితే ఆ యువకుడు తప్పు చేసినప్పటికీ అతను చేసిన ఎంబీబీఎస్ విద్య ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫేక్ సర్టిఫికెట్ తో ఎంబీబీఎస్ చేసి ఉండవచ్చు. అయితే అది నేరం కాదని కోర్టు నిర్ణయాత్మక తీర్పు వెల్లడించింది. సాధారణంగా సినిమాల్లో మాత్రమే న్యాయమూర్తులు మనసుతో ఆలోచించే సన్నివేశాలు ఉంటాయి. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి తీర్పులు ఉంటాయని ముంబై హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో రుజువైంది. సాధారణంగా ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ కి అప్లై చేస్తుంటారు కొంతమంది. నకిలీ పత్రాలతో ఎలాగోలా జాబ్ తెచ్చుకుని కష్టాల ఊబి నుంచి బయటపడితే చాలనుకుంటారు.


దాదాపు చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టే వాళ్లలో మధ్యతరగతి ప్రజలే ఉంటారు. అయితే ఓ యువకుడు ఫేక్ సరిటిఫ్కెట్ పెట్టి ఎంబీబీఎస్ చేశాడు. ఈ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భారతదేశంలో జనాభాకు సరిపడా డాక్టర్లు లేరని.. ఆ కుర్రాడు తప్పు చేసిన అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలోని లోకమాన్య తిలక్ మెడికల్ కళాశాలలో లుబ్నా ముజావర్ అనే స్టూడెంట్.. నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ చూపించి ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నాడు. ముజావర్ తండ్రి తన తల్లికి తలాక్ చెప్పడంతో.. ఆర్థికంగా తల్లికి భారం కాకూడదని ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి క్రియేట్ చేయించాడు. ఆదాయపు ధ్రువీకరణ పత్రంలో రూ. 4.5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉన్నట్లు చూపించాడు. నిజానికి ముజావర్ తల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తుంది. ఆ విషయాన్ని దాచి పెట్టి ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు.

2012లో అడ్మిషన్ రాగా.. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అయితే ఫేక్ సర్టిఫికెట్ తో అడ్మిషన్ తీసుకున్నందుకు.. అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ని క్యాన్సిల్ చేయమని న్యాయవాదులు కోరారు. 2012లో నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ ఆధారంగా ఓబీసీలకు వచ్చిన ఎంబీబీఎస్ అడ్మిషన్స్ పై ముంబై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో.. మూడు నెలల్లో ఎంబీబీఎస్ కోర్సు కోసం చెల్లించాల్సిన ఫీజుతో పాటు 50 వేల రూపాయలు చెల్లించాలని ముజావర్ ని కోర్టు ఆదేశించింది. అయితే ఫేక్ సర్టిఫికెట్ తో ఎంబీబీఎస్ పూర్తి చేసినంత మాత్రాన అతని సర్టిఫికెట్ రద్దు చేయలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే దేశంలో వైద్యుల కొరత ఉందని.. అతని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ రద్దు చేస్తే అది జాతికే నష్టం అని కోర్టు వెల్లడించింది.