బాలయ్య బాబు(Balayya Babu) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2′(Akhanda 2) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కారణం ఏంటి అంటే బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక అఖండ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక దానికి సీక్వల్ గా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా మహా కుంభమేళలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి దానికి తగ్గట్టుగానే బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా ను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాను అంటూ చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
ఇంతకీ ఆ సీన్ ఏంటి? డైలాగు ఏంటి అంటే కొంతమంది రౌడీలు ఒక ఏరియా ను కబ్జా చేసి జనాలను చంపుతూ ఉంటే బాలయ్య బాబు అక్కడికి వెళ్లి ‘జనాన్ని చంపకుండా వదిలేయండి’ అని ఆ రౌడీలతో చెప్పిన కూడా వాళ్ళు వినరట. ఇంక దాంతో బాలయ్య బాబు ఉగ్రరూపాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది అనుకొని వాళ్లను కొడుతూ ‘ఆ పరమ శివుడు రెండు కళ్ళతో చూసినప్పుడే మనం క్షేమంగా ఉంటాం మూడో కన్ను తెరిస్తే ఆ ప్రళయం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రా’ అంటూ బాలయ్య వాళ్ళతో ఫైట్ చేస్తారట.
ఇక మొత్తానికైతే ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి డైలాగ్ బాలయ్య నోట్లో నుంచి వస్తే అది ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే… థియేటర్లో స్క్రీన్స్ చిరిగిపోవడమే కాకుండా బాక్సులు కూడా పేలిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలని బోయపాటి శ్రీను చూస్తున్నట్టుగా తెలుస్తోంది…