వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బుధవారం ఉదయం బెయిల్ ఇచ్చింది. దీంతో అంబటి రాంబాబు విడుదలకు మార్గం సుగమం కాగా.. బుధవారం సాయంత్రం అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారని రాంబాబు ఆరోపించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బుధవారం రోజు గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చింది. దీంతో అన్ని కేసులలోనూ బెయిల్ మంజూరు కావటంతో.. అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. అన్నింటికీ దేవుడే సమాధానం చెప్తాడని.. ఎన్ని రోజులైనా జైలులో ఉండేందుకు సిద్ధపడే వెళ్లినట్లు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.


































