అయ్యో దారుణం.. చికిత్స కోసం వెళ్తే కన్ను కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. చివరకు

తిరుపతిలో కంటి చూపు సమస్యతో ఆసుపత్రికి వెళితే.. ఏకంగా కంటి చూపుకే ప్రమాదం ఏర్పడింది. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గిరీష్ అనే ఐటీ ఉద్యోగికి ఈ అనుభవం ఎదురయింది. అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి గిరీష్ కొంతకాలంగా కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.
తిరుపతిలో కంటి చూపు సమస్యతో ఆసుపత్రికి వెళితే.. ఏకంగా కంటి చూపుకే ప్రమాదం ఏర్పడింది. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గిరీష్ అనే ఐటీ ఉద్యోగికి ఈ అనుభవం ఎదురయింది. అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి గిరీష్ కొంతకాలంగా కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తిరుపతిలోని అగర్వాల్ ఆసుపత్రికి వెళ్లాడు. 8 నెలల క్రితం గిరీష్ కంటి చూపు సమస్యకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఎడమ కంటికి ఆపరేషన్ చేసారు. అయితే కంటి సమస్యతో అగర్వాల్ ఆసుపత్రికి వెళ్లిన గిరీష్ కు కంటి చూపు సమస్య పరిష్కారం కాకపోగా మరింత ఇబ్బంది ఏర్పడింది. ఆపరేషన్ చేయించుకున్న ఐటీ ఉద్యోగి గిరీష్ కు చేసిన ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో గిరీష్ ఆసుపత్రి వర్గాలను నిలదీశాడు.


కంటి చూపు రావాలంటే తిరిగి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని ఇందుకు సమయం పడుతుందంటూ కాలయాపన చేసినట్లు బాధితుడు వాపోయాడు.. ఈ మేరకు ప్రజా సంఘాలతో కలిసి మీడియాను ఆశ్రయించాడు. 8 నెలలుగా కంటి చూపు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆసుపత్రి చుట్టూ తిరిగి విసిగి పోయిన గిరీష్ ప్రజా సంఘాలతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని తిరుపతి ఈస్ట్ పీఎస్ లోనూ ఫిర్యాదు చేశాడు.
అగర్వాల్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతో జిల్లా ఎస్పీని సిపిఎం నేతలు కూడా కలిశారు. ఇక కంటి చూపు సమస్యను గుర్తించినట్లు ప్రస్తుతం ఉచితంగానే వైద్యం అందిస్తున్నామంటున్న అగర్వాల్ యాజమాన్యం వివరించింది. హీలింగ్ సమస్య వల్ల తిరిగి ఆపరేషన్ చేయాలంటే కొంత సమయం పడుతుందని వివరణ ఇస్తోంది. మెరుగైన వైద్యం కోసం హయ్యర్ ఇన్‌స్టిట్యూట్ లో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పరిశీలిస్తున్నారని చెబుతోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.