ఆంధ్రా స్టైల్ మునగాకు కారం పొడి.. రోజూ తింటే మీకు సూపర్ ఎనర్జీ!

నం ఇళ్లలో రకరకాల పొడులను తయారు చేసుకుంటూ ఉంటాం. పుట్నాల కారంపొడి, పల్లీల కారంపొడి, కరివేపాకు కారంపొడి, వెల్లుల్లి కారం పొడి, ఇలా చాలా రకాల కారంపొడి లను తయారు చేసుకుంటూ ఉంటాం.


అయితే అటువంటి కారంపొడులలో మునగాకు కారంపొడి ఒకటి. ఈ కారప్పొడిని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్నంలో కొద్దిగా ఈ మునగాకు కారంపొడిని వేసుకుని తింటే బోలెడంత ఆరోగ్యం.ఎలా తయారు చేయాలో చూద్దాం.

మునగాకు కారం పొడి తయారీకి కావలసిన పదార్థాలు

మునగాకు- పావు కిలో

జీలకర్ర- 2 టీ స్పూన్లు

నువ్వులు- రెండు టేబుల్ స్పూన్లు

మినప్పప్పు- ఒక టేబుల్ స్పూన్

శనగపప్పు- ఒక టేబుల్ స్పూన్

ఎండుమిర్చి- 20

ధనియాలు- ఒక టేబుల్ స్పూన్

చింతపండు- కొంచెం

ఇంగువ- అర టీ స్పూన్

పసుపు- అర టీ స్పూన్

వెల్లుల్లి రెబ్బలు- 20

ఆయిల్- మూడు టేబుల్ స్పూన్లు

ఉప్పు- తగినంత

తయారీ విధానం

పావుకిలో మునగాకుల శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో మునగాకు వేసి క్రిస్పీగా వేయించాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా ఫ్రై చేయాలి.

మునగాకు పొడి ఇలా చెయ్యాలి

పప్పులు దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 20 మిర్చి యాడ్ చేసి వేయించాలి. అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర, రెండు టీ స్పూన్ల నువ్వులు, చిటికెడు మెంతులు కొద్దిగా చింతపండు వేసి వేయించాలి. అందులోని వెల్లుల్లి రెబ్బలు, పసుపు అర టీ స్పూన్, ఇంగువ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇందులో ముందుగా వేయించిన మునగాకును వేసి బాగా కలిసేలా కలపాలి.

రెండు ముద్దలు మునగాకు కారం పొడితో తింటే ఆరోగ్యం

ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దీనిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు అన్నంలో ముందు రెండు ముద్దలు మునగాకు కారం పొడితో తింటే ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.