డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్‌లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్‌లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఇతర దేశాల నుంచి ఎలాగైనా అధిక పన్నులు వసూలు చేయాలని డిసైడ్ అయిన ట్రంప్ అందుకోసం కొత్త దారులను వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ‘301 సెక్షన్’ను బయటకు తీశారు (US Section 301 tariffs).
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తివంతమైన ఆయుధం ‘301 సెక్షన్’. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న విధానాలు, అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఈ సెక్షన్ వీలు కల్పిస్తుంది. ఏదైనా దేశం తమ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని దర్యాప్తులో తేలితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతులు లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. సుప్రీం కోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ట్రంప్ తాజాగా ఈ ‘301 సెక్షన్’ను బయటకు తీశారు (Trump trade probe India China).
ఈ ‘సెక్షన్ 301’ కింద (US tariff investigation countries).. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేసియా, కంబోడియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై దర్యాప్తు జరుగుతుందని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు. కాగా, అమెరికా వాణిజ్య విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కెనడా పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.

































