నేడు ఏపీ కేబినెట్ మీటింగ్.. ఈ అంశాలపైనే చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది.


ఈ మేరకు మంత్రులందరూ హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. ఇక ఈ కేబినెట్ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సిఐఐ సబ్మిట్, మొంథా తుఫాన్‌ ప్రభావంతో జరిగిన పంట నష్టాలపై కేబినెట్ చర్చించనుంది.

ఈ సందర్భంగా పరిహారంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం అందుతోంది. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనను ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం NaBFID నుంచి దాదాపు రూ.7500 కోట్ల రుణం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ అంశంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఈ మేరకు కేబినెట్ అనుమతి ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అటు ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణపై కూడా చర్చ జరగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.