సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

అమరావతి: గ్రామ పంచాయతీ సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల మేరకు నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పనులు చేసి, మెజర్‌మెంట్స్‌ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వేగవంతం కానున్నాయి.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.