AP TET 2024 All Details -Notification, Syllabus Website links

www.mannamweb.com


AP TET 2024: All the Details Here
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024: ముఖ్యమైన వివరాలు ఇవే

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు ముహూర్తం ఖరారైంది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్ధులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- 2024

అర్హతలు: పేపర్ ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం. 2023-24 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్ధులూ అర్హులే.

కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు

1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆపైన

2. బీసీ- 50% మార్కులు ఆపైన

3. ఎస్సీ/ ఎస్టీ/ పీ హెచ్/ ఎక్స్ సర్వీస్మెన్- 40% మార్కులు ఆపైన

పరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తామన్నారు.

పరీక్ష రుసుము: రూ.750.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 08-02-2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 08-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 18-02-2024

ఆన్లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: 19-02-2024

హాల్ టికెట్ల విడుదల తేదీ: 23-02-2024

పరీక్షల తేదీలు: 27-02-2024 నుండి 09-03-2024 వరకు

పరీక్ష సమయం: సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు. సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.

ప్రాథమిక ‘కీ’ విడుదల: 10-03-2024

అభ్యంతరాల స్వీకరణ: 11-03-2024

తుది ‘కీ’ విడుదల: 13-03-2024

ఫలితాలు విడుదల తేదీ: 14-03-2024

పూర్తి నియామక ప్రక్రియ రోజులు: 35 రోజులు

AP  TET -2024 WEB LINKS 

PAYMENT

CANDIDATE LOGIN

SYLLABUS

NOTIFICATION

INFORMATION BULLETIN

SCHEDULE

AP DSC & TET – 2024 TENTATIVE DATES

WEBSITE