1620 కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

 ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


మొత్తం 1620 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. జానియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఖాళీగా ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, టైపింగ్ సర్టిఫికెట్ ఇలా ఉద్యోగాన్ని బట్టి క్వాలిఫికేషన్ ను నిర్ణయించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో మొత్తం 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అఫీషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. జూన్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1626

దరఖాస్తుకు ప్రారంభ తేది: మే 13 (దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి.)

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2

విద్యార్హత: కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో పాసై ఉండాలి. తప్పనిసరిగా టైపింగ్ వచ్చి ఉండటమే కాకుండా… కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఏడో తరగతి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 ఫీజు ఉంటుంది.

పోస్టులు – వెకెన్సీలు:

జూనియర్ అసిస్టెంట్ – 230

ఆఫీస్ సబార్డినేట్ – 651

ప్రాసెస్ సర్వర్ – 164

రికార్డు అసిస్టెంట్ – 24

కాపీయిస్ట్ – 193

ఎగ్జామినర్ – 32

ఫీల్డ్ అసిస్టెంట్ – 56

టైపిస్ట్ – 162

స్టెనోగ్రాఫర్ – 80

డ్రైవర్ – 28

వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కొన్ని ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

సందేహాల కోసం: కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయండి. లేదా 0863-2372752 నెంబర్ ను అభ్యర్థులు సంప్రదించవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఫోన్ కాల్ అందుబాటులో ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.