ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలను(Departmental Exams) వాయిదా వేసింది.
మే లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ప్రకటించింది. మే నెలకు సంబంధించిన పరీక్షలను జూన్ 6 నుంచి 12వ తేదీ మధ్య నిర్వహించాల్సిన గతంలో షెడ్యూల్ చేసినప్పటికీ.. అనివార్య కారణాలతో వాయిదా వేసినపట్టు కమిషన్ పేర్కొంది. కొత్త తేదీలను ఇంకా వెల్లడించలేదు. రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా, రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల ఆందోళనలు, ఇతర ఆడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఈ వాయిదాకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు.
ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ రూల్స్ కోసం నిర్వహిస్తారు, వివిధ డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులు (ట్రెజరీ, అకౌంట్స్, ఫారెస్ట్, ఎడ్యుకేషన్ వంటివి) ఈ పరీక్షలు రాస్తారు. కొత్త పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ appsc.ap.gov.in లో చెక్ చేసుకోవాలని తెలిపింది.