ఏపీలో పదో తరగతి రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు..


విద్యార్థుల నుంచి సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 66,421 జవాబు పత్రాలు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా 47,484 జవాబు పత్రాల ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన ఫలితాలు సైతం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు తమ స్కూల్‌ కోడ్, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఈ ఫలితాలను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.