పోస్టాఫీస్‌లో మీరు పొదుపు చేస్తున్నారా? మీకు కేంద్రం శుభవార్త!

ప్రస్తుతం ప్రతి మనిషికి ఆర్థిక క్రమ శిక్షణ ఎంతో అవసరం. ఈ మద్య కాలంలో మనిషికి ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే సామర్ధ్యం ఉండాలి. అందుకోసం మనం సంపాదించే డబ్బులో ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతుంటారు. అలా చేయకుంటే కష్టకాలంలో మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. పొదుపు చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పొదుపు చేసుకునే సౌలభ్యం ఉంది. తాజాగా పోస్టాఫీస్ లో పొదుపు చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.


సాధారంగా మార్కెట్ లో కొన్ని ప్రైవేట్ సంస్థలు పొదుపునకు సంబందించిన ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే చాలా మందికి ప్రైవేట్ సంస్థలపై పెద్దగా నమ్మకం కుదరదు. అందుకే ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే పోస్టాఫీస్ పరిధిలో పలు పెట్టుబడి పథకాలను కేంద్రం అమలు చేస్తుంది. పోస్టాపీస్ లో జీవిత బీమా పథకాలను తీసుకువస్తుంది. తాజాగా జీవిత బీమా తీసుకున్న పాలసీదారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. పోస్టాఫీస్ లు ఆరు రకాల జీవిత బీమా పథకాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో సురక్ష పేరుతో హూల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సువిత కన్వర్బబుల్ హూల లైఫ్ ఇన్సురెన్స్ గ్యారంటీ , సంతోష్ ఎండోమెంట్ ప్లాన్, సురక్ష అనే పేరుతో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, సుమంగల్ పేరుతో యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ప్లాన్, పాల్ జీవన్ బీమా అనే పేరుతో చిల్డ్రన్ ప్లాన్ పథకాలను కేంద్రం ప్రకటించింది.

ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ లు కూడా ప్రకటించింది. బోనస్ ఏప్రిల్1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి మార్చి 13 న కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనలకు సంబంధించిన బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ప్రకారం.. ప్రతి 1000 లైఫ్ ఇన్సూరెన్స్ కు 60 రూపాయలు వరకు బోనస్ రూపంలో పెట్టబడిదారుడికి వస్తుంది. ఇక పిల్లల కోసం పాలసీలతో పాటు ఎండోమెంట్ పథకాలలో 1000 హామీకి 48 రూపాయలు బోనస్, యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై 1000 రూపాయలకు గాను 45 రూపాయల వరకు బోనస్ లభిస్తుంది. కేంద్రం టెర్మినల్ బోనస్ ప్రవేశపెట్టింది.. దీని ప్రకారం ప్రతి 10 వేల రూపాయలకు 20 టెర్మినల్ బోనస్ లభిస్తుంది. చాలా మందికి పోస్టాఫీస్ లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. మరి ఎందుకు ఆలస్యం.. దగ్గరలోని పోస్టాఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకొని పోదుపు మొదలు పెట్టండి.