రామ మందిర ప్రారంభోత్సవం దగ్గరపడుతుండడంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామభక్తులు అయోధ్య చేరుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా కొంతమంది ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు. అలాగే స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించలేరు. అలాంటి వారి కోసమే ఖాదీ ఆర్గానిక్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
రామ్ లల్లా ప్రసాదాన్ని మీ ఇంటికి డెలివరీ చేసేందుకు కసరత్తు చేసింది. దీనికోసం మీరు ఇంట్లో కూర్చొని ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రసాద్‌ని ఆర్డర్ చేయాలి. అలా చేస్తే ఎలాంటి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రసాదం మీ ముంగిట్లోకి వచ్చేస్తుంది. మరి ప్రసాదాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాదీ ఆర్గానిక్..
రామ్ లల్లా ప్రసాదం కోసం మీరు Google కి వెళ్లి KHADI ORGANIC అని టైప్ చేయాలి. అప్పుడు మీకు ఖాదీ ఆర్గానిక్ వెబ్‌సైట్ కనిపిస్తుంది. తర్వాత మెనూలో ఫ్రీ ప్రసాద్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి యాడ్ టు కార్ట్ అండ్ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత బై నౌ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు దాని ప్రాసెసింగ్ కోసం కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ పూర్తి చిరునామాను పూరించి సబ్మిట్ కొట్టండి.
డెలివరీలో ఆలస్యం కావచ్చు
పైన పేర్కొన్నట్లుగా, మీ ఆర్డర్ ధృవీకరించబడటానికి సమయం పడుతుంది. ఈ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, మీరు మీ ఆర్డర్‌ను ధృవీకరించిన తర్వాత జనవరి 22 తర్వాత మాత్రమే ట్రాక్ చేయగలరు. ఈ వెబ్‌సైట్ లో మీరు ఒక ప్రసాదం బాక్స్‌ను మాత్రమే ఉచితంగా డెలివరీ పొందగలరు. ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి నిర్ధారణ సందేశం లేదా ఎలాంటి అప్‌డేట్ రాకుంటే, మీరు వారి సంప్రదింపు నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి లావాదేవీలు చేయనవసరం లేదని గుర్తుంచుకోండి.