బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు లు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో స్టార్ట్ అయింది. అలాగే యంగ్ హీరో నితిన్ తన నెక్స్ట్ సెట్స్‌పైకి త్వరలోనే వెళ్లనున్నారు.
విజయ్ చివరి గా ప్రచారం జరుగుతున్న దళపతి 69పై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. రివైండ్ విడుదల కానున్న వేళ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. సూర్య కంగువా నిర్మాత జ్ఞానవేల్ రాజా సమాధానంతో రాజుకున్న వివాదం.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో మొదలైంది. చాలా రోజులుగా చర్చల్లో ఉన్నట్లుగానే.. ఈ కు అఖండ 2 అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఉప శీర్షిక తాండవం. పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది BB4. ఈ లో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
బలగం తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే కు కథ రాసుకుని హీరోల దగ్గరికి తిరుగుతున్నారు. నానితో మొదలై ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి వెళ్లింది ఆ కథ. చివరికి నితిన్ దగ్గర ఆగినట్లు ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. ఈ ను దిల్ రాజు నిర్మించబోతున్నారు. తాజాగా నితిన్ నటిస్తున్న తమ్ముడు ను కూడా ఆయనే నిర్మిస్తున్నారు.
ఈ మధ్యే తన చివరి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు విజయ్. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క చేయబోతున్నారీయన. హెచ్ వినోద్ తెరకెక్కించబోయే ఈ లో మమిత బైజు, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై మరో అప్‌డేట్ వచ్చింది. ఇది భగవంత్ కేసరికి రీమేక్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇది బలపరుస్తూ.. లో విజయ్ ఎక్స్ పోలీస్‌గా నటిస్తున్నారని తెలుస్తుంది.
సాయి రోనక్, అమృత చౌదరి జంటగా క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్‌పై కళ్యాణ్ చక్రవర్తి దర్శక నిర్మాతగా వస్తున్న రివైండ్. ఈ మధ్యే ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఒక రేడియోలో సంవత్సరం మారిస్తే కాలంలో వెనక్కి వెళ్తారు. లవ్, సస్పెన్స్, టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో రివైండ్ వస్తుంది. అక్టోబర్ 18న విడుదల కానుంది ఈ చిత్రం.
తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. కంగువా క్యాస్టింగ్ ఎవరో పోస్టర్స్‌తో విడుదల చేయొచ్చుగా అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ఈయనిచ్చిన సమాధానం వివాదంలో పడేసింది. ఈ మధ్యే ఓ పెద్ద కు ఇలాగే క్యాస్టింగ్ రివీల్ చేసారు.. కానీ అంత మంది స్టార్స్ ఉన్నా ఓపెనింగ్ కూడా రాలేదంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇది వెట్టైయాన్ గురించి అనుకుని రజినీ ఫ్యాన్స్ ఈయన్ని టార్గెట్ చేసారు.. కానీ అది హిందీ ఖేల్ ఖేల్ మే గురించి అంటూ క్లారిటీ ఇచ్చారు జ్ఞానవేల్ రాజా.