ఓటీటీలోకి వచ్చేసిన రానా, సమంతల ‘బెంగళూరు డేస్’ తెలుగు వెర్షన్

www.mannamweb.com


ఈ వారం ఓటీటీ లో పలు సూపర్ హిట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తెలుగు లతో పాటు ఇతర భాషలకు చెందిన సూపర్ హిట్ లు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి, సమంతలు నటించిన ఓ సూపర్ హిట్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మరేదో కాదు బెంగళూరు డేస్. సాధారణంగా ఈ పేరు వింటేనే దుల్కర్ సల్మాన్ నే గుర్తుకు వస్తుంది. 2014లో మలయాళంలో రిలీజైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటు నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఫ్రెండిషిప్ నేపథ్యంలో వచ్చిన ఈ యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇదే ను 2016లో తమిళంలో ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఆర్య, శ్రీవిద్య, రానా , సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్ప్పట్లో దీని తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ అది జరగలేదు.

మంచి ఫీల్ ఉన్న ..

ఇప్పుడీ బెంగళూరు డేస్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఒరిజినల్ మలయాళం వెర్షన్ కావాలంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికి వస్తే.. మొత్తం నలుగురు స్నేహితుల చుట్టే తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, పెళ్లి, కెరీర్ కు సంబంధించి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఎక్కడ బోర్ కొట్టని ఈ చూసే వారికి మంచి ఫీల్ ను ఇస్తుంది. మరి మీరు కూడా ఈ బెంగళూరు డేస్ ను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఎంచక్కా తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి..