ఎల్ఐసీ తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల పాలసీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే “జీవన్ ఉత్సవ్” అనే సరికొత్త పాలసీని ప్రారంభించింది.
ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ప్రీమియం చెల్లింపు కాలం పరిమితంగా ఉండగా, ప్రయోజనాలు జీవితాంతం అందేలా రూపొందించబడింది. ఈ పాలసీ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. ముందుగా నిర్ణయించిన కాలానికి ప్రీమియం చెల్లించి, జీవితాంతం ప్రతి సంవత్సరం పెట్టుబడిలో 10% పెన్షన్ రూపంలో పొందవచ్చు.
జీవన్ ఉత్సవ్ ప్లాన్ వివరాలు:
వయసు పరిమితి:
ఈ పాలసీకి కనీస వయసు 90 రోజులు కాగా, గరిష్ఠంగా 65 ఏళ్లు ఉంది.
సమ్ అష్యూర్డ్:
కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు. అంటే, మీరు చెల్లించే ప్రీమియం మొత్తానికి ఆరు ప్రకారం పాలసీ గడువు ముగిసే నాటికి రూ. 5 లక్షలు సమ్ అష్యూర్డ్ ఉండాలి.
ప్రీమియం కాల వ్యవధి:
ప్రీమియం చెల్లింపుల కాలం 5 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు మీకు అనువైన కాలాన్ని ఎంచుకోవచ్చు.
గ్యారెంటీ రిటర్న్స్:
ప్రీమియం చెల్లింపు కాలం పూర్తైన తర్వాత, డిఫర్డ్ పీరియడ్ (వేచి ఉండే సమయం) ముగిసిన వెంటనే, ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో 10% చొప్పున జీవితాంతం పొందవచ్చు. పాలసీదారుడు 100 సంవత్సరాలు జీవించి ఉంటే, ఆ కాలం వరకూ ఈ రిటర్న్స్ కొనసాగుతాయి.
ఉదాహరణకు:
ఎదుకు ఒక సంవత్సరం ₹50,000 పొందాలనుకుంటే, కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ ₹5 లక్షలు ఉండాలి. ఈ పాలసీకి 5 ఏళ్ల ప్రీమియం చెల్లింపును ఎంచుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం దాదాపు ₹1.16 లక్షలు (జీఎస్టీతో కలిపి) ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లింపు 5 సంవత్సరాల తరువాత 5 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్ ఉంటుంది. 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ₹50,000 చొప్పున రాబడి పొందవచ్చు.
ప్రీమియం టర్మ్, డిఫర్డ్ పీరియడ్ (వేచి ఉండాల్సిన సమయం) వివరాలు:
6 ఏళ్ల ప్రీమియం టర్మ్: 4 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్.
7 ఏళ్ల టర్మ్: 3 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్.
8 ఏళ్ల టర్మ్: 2 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్.
9-16 సంవత్సరాల టర్మ్: 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్.
మరణానంతర ప్రయోజనాలు:
పాలసీదారుడు అకాల మరణం చెందితే, రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ రూపంలో కుటుంబానికి అందుతుంది. ఇది సహజ మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. యాక్సిడెంట్ బెనిఫిట్, డిసేబిలిటీ బెనిఫిట్స్ కోసం యాడ్ ఆన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకునే సమయంలో, ప్రీమియం టర్మ్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే డిఫర్డ్ టైమ్ ఆయా టర్మ్‌ల ప్రకారం మారుతుంది.