ఫూల్ మఖానాతో లడ్డూ.. పిల్లలకు బెస్ట్ రెసిపీ..

www.mannamweb.com


పిల్లలకు ఏదన్నా ఆరోగ్యంగా చేసి పెట్టాలని తల్లులకు ఉంటుంది. వెరైటీగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ డైలీ పెట్టేవి కాకుండా వేరే స్నాక్స్ కావాలని అంటారు.

ఫూల్ మఖానా తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫూల్ మఖానాతో కూడా ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖానాతో వంటలే కాకుండా లడ్డూ కూడా చేసుకోవచ్చు. దీంతో తయారు చేసే లడ్డూ ఒక్కటి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బెల్లం కలిపి చేస్తారు కాబట్టి.. శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం లభిస్తాయి. మరి ఈ ఫూల్ మఖానా లడ్డూ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫూల్ మఖానాకు కావాల్సిన పదార్థాలు:

ఫూల్ మఖానా, బెల్లం పొడి లేదా పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి.

ఫూల్ మఖానా తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఫూల్ మఖానా వేసి.. దోరగా వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును కూడా అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫూల్ మఖానా, డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టండి.

ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్‌లోనే బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు కూడా వేసి పాకం తీయాలి. ఇప్పుడు ఈ పాకంలో ఫూల్ మఖానా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. నువ్వులు, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. కాస్త చల్లారిన తర్వాత చేతి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా తయారైన వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి పెడితే నెల రోజుల వరకూ నిల్వ ఉంటాయి.