వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త రూల్స్

వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త రూల్స్
ప్రస్తుతం దేశంలో వాహనాలను నడపాలనుకుంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అయితే ఈ లైసెన్స్ పొందాలంటే జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో ఆర్టీవో కార్యాలయంలో మాత్రమే ఈ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందులకు గురి చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
ఇక నుంచి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థల్లోను డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే విధంగా చట్టాలు మార్చింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
అలాగే ఫోర్ వీలర్, అంతకంటే ఎక్కువ లైసెన్స్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్ కి కనీసం 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, డ్రైవింగ్ లో ఐదేళ్ల అనుభవం కచ్చితంగా ఉండాలి. కాగా ఈ రూల్స్ ప్రకారం.. లైట్ వెహికల్స్ కు 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39 గంటల శిక్షణ తప్పని సరిగా ఇవ్వాలని.. ఆ తర్వాతే వారికి టెస్ట్ ద్వారా లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం దేశ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా మారుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.