బంగారం, వెండి ధరలపై బిగ్ రిలీఫ్..! ఆర్థికమంత్రి కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా కొంతకాలంగా పెరుగుతున్న బంగారం (gold), వెండి (silver) ధరలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ కీలక విశ్లేషణ చేశారు. ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, ఆర్బీఐ పాత్ర, ఈ ధరలు ఎప్పటికల్లా తగ్గుతాయన్న అంచనాల్ని ఆమె వెల్లడించారు.
దీంతో కొంతకాలంగా బంగారం, వెండి ధరల పెరుగుదలపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు చెక్ పడినట్లయింది.


బంగారం, వెండి ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్బీఐ అధికారులతో భేటీ అయ్యారు. ఈ రెండు లోహాల ధరలపై చర్చించారు. అంతర్జాతీయ పరిస్ధితుల గురించీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం బంగారం, వెండి ధరలను నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ధరల పరిస్థితి ఆందోళనకరంగా లేదని తేల్చేశారు. దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ “సీజనల్” గా కనిపిస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో జరిగే సంప్రదాయ భేటీలో పాల్గొన్న నిర్మల.. అనంతరం మార్కెట్‌కు వచ్చే దాదాపు మొత్తం బంగారం దిగుమతి చేసుకున్నదేనని తెలిపారు. మనది దిగుమతులపై ఆధారపడిన దేశమని, వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, కానీ అవి డిమాండ్‌ను తీర్చడానికి సరిపోవన్నారు.

బంగారం ఇళ్లకు అనుకూలమైన పెట్టుబడి అని, దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ కాలానుగుణంగా కనిపిస్తోందని తెలిపారు. ఇవాళ చాలా దేశాలు, ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నాయని నిర్మల తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎక్కువగా కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల కారణంగా పెరుగుతున్నాయన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.