పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.. చికెన్ తినొద్దని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది.
ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని అధికారికంగా తేల్చారు. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు.. కిలోమీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్‌ఫ్లూగా భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టత ఇచ్చింది. కోళ్ల ఫారంలకు కిలోమీటరు దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతా ల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్‌లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేవారు. కోళ్ల ఫారాల్లో పనిచే స్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వ హిస్తున్నారు.
చికెన్ తినొద్దని హెచ్చరికలు
బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి.. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా విధించారు అధికారులు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు
తెలంగాణలో అలెర్ట్
ఏపీలో బర్డ్ ఫ్లూతో తెలంగాణలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్లు చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. : పక్క రాష్ట్రంలోని ఫౌల్ట్రీలలో బర్డ్ ప్లూ వ్యాధి సోకుతున్నందున జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.