TTD: వాట్సప్‌ గవర్నెన్స్‌లోకి తితిదే సేవలు

రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని వాట్సప్‌ గవర్నెన్స్‌లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైలు టికెట్లు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు.


సినిమా టికెట్లు కూడా దీని ద్వారా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ బస్సుల జీపీఎస్‌ ట్రాకింగ్‌ వాట్సప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు. వాట్సప్‌లో టెక్ట్స్‌ చేయలేని వారి కోసం వాయిస్‌ సర్వీస్‌ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సప్‌లోనే అందుబాటులో ఉంచాలన్నారు.

సచివాలయంలో మంగళవారం మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమీక్షించారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీశైలం మల్లన్న ఆలయంలోనూ వాట్సప్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఈవోలు తెలిపారు.