మహిళల కంటే పురుషుల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ ను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా?
లేక త్వరలో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని ముందే తెలుసుకోవడానికి కొన్ని ప్రారంభ లక్షణాలను గుర్తించొచ్చు. ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా, మీరు మీ గుండె ఆరోగ్యాన్ని అర్థం చేసుకుని, గుండెపోటును నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు.
హార్ట్ ఎటాక్ కు ముందస్తు లక్షణాలు:
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం: ఇది పురుషులు, మహిళల్లో సాధారణమైన గుండెపోటు లక్షణం. ఇది సాధారణంగా గుండెలో బరువు వేసినట్లు, నొక్కుతున్నట్లు లేదా గట్టిగా బిగించి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్ని నిమిషాలు పాటు ఉంటూ
వెళ్లిపోవచ్చు లేదా తిరిగి రావచ్చు. ఛాతీ నొప్పి కొన్నిసార్లు భుజాలు, చేతులు, మెడ, వెన్ను లేదా దవడ వరకు వ్యాపించవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీ నొప్పితో పాటు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే, అది గుండెపోటు ముఖ్యమైన సంకేతంగా పరిగణించాలి. కొన్నిసార్లు రిలాక్స్ డ్ గా ఉన్నప్పటికీ లేదా తేలికపాటి పనులు చేస్తున్నప్పటికీ ఇది రావొచ్చు.
అలాగే, తలనొప్పి లేదా తేలికగా మర్చిపోవడం కూడా ఈ లక్షణాలతో కలిసివచ్చే అవకాశం ఉంది.
ఎగువ శరీర భాగాల్లో నొప్పి
గుండెపోటు నొప్పి ఎప్పుడూ ఛాతీలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇది వెన్ను, భుజాలు, చేతులు (ప్రత్యేకంగా ఎడమ చేయి), మెడ లేదా దవడలోనూ కనిపించవచ్చు. ఈ నొప్పి ఛాతీ నుంచి వ్యాపించవచ్చు. ఏదో కండరాల నొప్పి అని పొరపాటు పడే ప్రమాదం ఉంటుంది.
విపరీతంగా చెమటపట్టడం
అలసట లేకపోయినా, బాడీలో విపరీతంగా చెమటలు పడుతుంటే, అది గుండెపోటు సంకేతంగా ఉండొచ్చు. ముఖ్యంగా చల్లని చెమటలు పొక్కుతుంటే ప్రమాదకర సంకేతం.
వాంతులు లేదా అజీర్ణం
వాంతులు రావడం లేదా అసహజమైన మలబద్ధకం అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతంగా అనుకోవచ్చు. ఇది ఛాతీ నొప్పి లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలతో కలిసివస్తే, తేలికగా తీసుకోవద్దు. కొన్నిసార్లు, దీన్ని అజీర్ణంగా పొరపాటు పడే అవకాశం ఉంది. కానీ ఇది తీవ్రమైన హెచ్చరిక కావొచ్చు.
Also, Read:
కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు ఇవే.. రేట్లు, ఫీచర్స్..
తలనొప్పి లేదా మైకం కమ్మినట్టు ఉండడం
సడన్ గా తలనొప్పి రావడం, తల తిప్పేసినట్టు మైకం కమ్మినట్టు అనిపించడం, కళ్లు తిరగడం అనిపిస్తే మీ హార్ట్ నుంచి బ్లడ్ సరఫరా సరిగా చేయలేకపోతుందనే దానికి సంకేతంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇది ఛాతీ నొప్పి లేదా ఊపిరితిత్తుల సమస్యలతో కలిసివస్తే, వెంటనే డాక్టర్ ని కలవాలి.
అతి అలసట
అసాధారణమైన అలసట లేదా అతి తొందరగా నీరసించిపోవడం గుండెపోటు మొదటి సూచనగా ఉండవచ్చు. ఈ లక్షణం కొన్ని రోజులు లేదా వారాల ముందు నుంచే కనబడొచ్చు. రోజూ చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా విపరీతంగా నీరసం అనిపిస్తే, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.