Friday, November 15, 2024

Coriander Water: ధనియాలతో ఫుల్ బెనిఫిట్స్.. 15 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

Coriander Water: ధనియాలతో ఫుల్ బెనిఫిట్స్.. 15 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

Coriander Water for Weight Loss: సాధారణంగా ఇళ్లలో రోజు వాడే ఆహారపదార్థాల్లో కొత్తిమీర కూడా ఒకటి. ఇది వంటకు మంచి రుచి ఇవ్వడంతో పాటు సువాసనను కూడా అందిస్తుంది. కొత్తిమీర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే దాని పుట్టుకకు కారణమైన ధనియాలు కూడా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయంటే మీరు నమ్ముతారా ? అవును మార్కెట్‌లో చవకగా దొరికే ధనియాలను నానబెట్టిన నీరు తాగటం ఊహించని ఫలితాలు పొందవచ్చు.

ధనియాలను నానబెట్టిన నీరు తాగితే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనియాల వాటర్‌తో ఈజీగా బరువు తగ్గుతారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ బూస్టర్:
రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరంలో ప్రధాన వ్యవస్థ. ఏ వ్యాధితో పోరాడాలన్నా రోగ నిరోధక వ్యవస్థ మనకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే ఆహార పదార్థాలు ధనియాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇండియన్ కిచన్ లో అందుబాటులో ఉండే ధనియాలు శరీరంలో రాడికల్, ఎలిమెంట్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఏ వ్యాధితో పోరాడాలన్నా రోగ నిరోధక వ్యవస్థ మనకు సహాయపడుతుంది.
వెంట్రుకలకు బలం:
ధనియాల్లో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడతాయి. గ్లాస్ నీటిలో ధనియాలను నానబెట్టి తాగడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా జుట్టు రాలడం సమస్య తగ్గిపోవడంతో పాటు చిట్లిపోవడం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనియాలు హెయిర్ మాస్క్ లాగా చక్కగా ఉపయోగపడతాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్:
నానబెట్టిన ధనియాల వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ధనియాల వాటర్ తాగటం మంచిది.
పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్:
ధనియాలలో ఉండే ఐరన్.. ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. మృదువైన చర్మం కావాలనుకునే వారు క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగడం మంచిది.
బరువు తగ్గడం:
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువు వల్ల ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే బరువు తగ్గడానికి ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే ధనియాల వాటర్ తాగడం వల్ల అరుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగటం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. ఈజీగా బరువు తగ్గటానికి ధనియాల వాటర్‌ను ఎంతగానో ఉపయోగపడుతుంది. 15 రోజులు క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగడం బరువు తగ్గుతారు. బరువు తగ్గటం కోసం సరైన డైట్ పాటిస్తూనే ధనియాల వాటర్ తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ధనియాల వాటర్ తయారు చేయడం ఎలా ?
కావాల్సినవి:

ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
ఒక గ్లాస్ నీరు
రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ధనియాల గింజలు తీసేసి నీటిని వడగట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల 15 రోజుల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ధనియాల వాటర్ కలిగిస్తుంది.

Acne Free Skin: ఈ టిప్స్ పాటిస్తే మీ ఫేస్‌పై ఒక్క మొటిమ కూడా ఉండదు తెలుసా ?

Acne Free Skin: ఈ టిప్స్ పాటిస్తే మీ ఫేస్‌పై ఒక్క మొటిమ కూడా ఉండదు తెలుసా ?

Tips For Acne Free Skin: అందంగా కనిపించడం కోసం చాలా మంది రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ముఖంపై వచ్చిన మొటిమలు, నల్ల మచ్చలు తగ్గడానికి వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మొటిమలతో ఇబ్బందిపడే వారు ఈ టిప్స్ ఫాలో అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండానే సహజంగా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఆ టిప్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ వాష్:
రోజులో రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా తక్కువ మంది చేస్తుంటారు. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక సారి అయితే, నైట్ పడుకునే ముందు రెండవ సారి. అయితే ముఖంపై మొటిమలు రావడానికి ఇలా రెండుసార్లు ముఖం కడుక్కోవడం కూడా ఓ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవడమే కాకుండా తప్పకుండా చెమట ఎక్కువగా వచ్చినప్పుడు అంత కంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీంతో ముఖంపై దుమ్ము, జిడ్డు తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. మొటిమలు కూడా ఏర్పడవు. అయితే ఈ క్రమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చర్మ తత్వానికి సరిపడే క్రీములను మాత్రమే ఫేస్ వాష్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి.
శుభ్రత ముఖ్యం:
సాధారణంగా మనం మొబైల్స్, ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని అంతగా పట్టించుకోము. కానీ వాటిపై చేరే బ్యాక్టీరియా చేతికి అంటుకుని అది ముఖం స్క్రీన్ పైకి చేరుతుంది . ఇలా కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని అధ్యయనాల్లో పబ్లిక్ టాయిలెట్ కంటే మొబైల్ స్క్రీన్‌పై ఎక్కువ అపరిశుభ్రత ఉంటుందని తేలింది. కాబట్టి ఫోన్ స్క్రీన్‌తో పాటు ఇతర గార్జెట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది.
ఇలా అస్సలు చేయకూడదు:
కొంతమందికి పదే పదే ముఖానికి చేతులను తాకించే అలవాటు ఉంటుంది. ఫలితంగా చేతులకు ఉన్న క్రిములు ముఖంపైకి చేరి మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి ముఖం కడుక్కునేటప్పుడు తప్ప మిగతా సమయంలో వీలైనంత వరకు చేతులను ముఖానికి తాకించకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొరపాటున ముఖంపై చేతులు టచ్ చేసిన ఎటువంటి బ్యాక్టీరియా ఫేస్ పైకి చేరదు. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా ఉండొచ్చు.

ఆహారపు అలవాట్లు:
ముఖం అందంగా మొటిమలు లేకుండా ఉండాలనుకునేవారు రోజు తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డైట్‌లో కూరగాయలు, ఆలివ్ నూనె, తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా తక్కువగా మాంసం వంటివి తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. మొటిమల సమస్య రాకుండా ఉండాలంటే బరువు కూడా అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.

జగన్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

Huge discussion on Jagan Resignation: జగన్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

Huge discussion on social Media over Jagan Resignation: ఏపీ ఎన్నికల్లో ఘోరంగా అపజయాన్ని చవిచూసిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. 175 సీట్లకు 175 సీట్లు వస్తాయంటూ ఆశ పెట్టుకున్న జగన్ కు ఎన్నికల్లో భారీ షాక్ ఎదురయ్యింది. అన్ని సీట్లు కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదాకు రావాల్సిన సీట్లు కూడా రాలేదు. 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఈ క్రమంలో జగన్ నిరాశలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే… ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయబోతున్నారంటూ భారీగా ప్రచారం జరుగుతుంది.

10 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేక రాజీనామా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని నెటిజన్స్ డిస్కర్షన్ చేస్తున్నారంటా. ప్రతిపక్ష హోదా లేకపోవడం, ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఈ దిశగా జగన్ నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్స్ చర్చిస్తున్నారంటా.

కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారంటూ నెటిజన్స్ లెక్కలు వేస్తున్నారంటా. కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లలోనూ వైసీపీ ఓడిపోవొచ్చంటూ అంచనాలు కూడా వేస్తున్నారంటా. అయితే, చూడాలి మరి జగన్ నిజంగానే ఆ దిశగా చర్చిస్తున్నారా లేదా? అనేది.

ప్రతిభకు అడ్డురాని వైకల్యం.. ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అంధురాలు!

కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఏనాడో మహానుభావులు చెప్పారు. విధి రాతను మార్చుకుని.. తన రాతను తానే రాసుకొని అనుకున్నది సాధించింది ఈ యువతి. తనకున్న వైకల్యంతో ఏనాడు నిరుత్సాహపడకుండా.. మనోధైర్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందరిలా తాను సాధిస్తే దాంట్లో విశేషమేముంటుంది. అందుకే ఆ యువతి ప్రతిభకు ఎలాంటి వైకల్యం అడ్డురాదని నిరూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.

నల్లగొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి అంధురాలైన కూతురు జన్మించింది. అయితే వీరు కుంగిపోకుండా కూతురు శ్రీపూజితను అంధురాలిగా కాకుండా సాధారణ యువతులా పెంచారు. పదోతరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో, ఇంటర్‌ సాయి అంధుల జూనియర్‌ కళాశాల (హైదరాబాద్‌), డిగ్రీ బీఏ కోర్సు నల్గొండ ఎన్జీ కళాశాలలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడీ నల్గొండ గోకుల్‌ కళాశాలలో చదివింది. జాతీయస్థాయిలో నిర్వహించే నెట్‌కు సైతం అర్హత సాధించింది. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తిచేసింది.

2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ ఉద్యోగం చేస్తూనే… గురుకుల లెక్చరర్‌ కొలువుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది. పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సోషల్, టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సాంఘికశాస్త్రం, జూనియర్‌ లెక్చరర్‌ తెలుగు, డిగ్రీ లెక్చరర్‌ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను పలువురు ప్రశంసిస్తున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం…
తాను అంధురాలునని ఏ రోజూ బాధపడలేదు. మా తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్త్యైర్యం ఇచ్చారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజూ చదువుపరంగా ఇబ్బంది పడలేదని శ్రీ పూజిత చెబుతోంది. ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారని, అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించేదానినని చెబుతోంది. పోటీపరీక్షల ప్రిపరేషన్‌కు అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్‌లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్‌ అయ్యానని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించవచ్చని నారు. టీచింగ్ ఫీల్డ్ పై తనకు మక్కువ ఉందని, ఆరు ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని శ్రీ పూజిత చెబుతోంది.

Pillalamarri: ప్రపంచంలో రెండో అతిపెద్ద మహావృక్షం పిల్లలమర్రి రా..రమ్మని పిలుస్తోంది..

Pillalamarri: ప్రపంచంలో రెండో అతిపెద్ద మహావృక్షం పిల్లలమర్రి రా..రమ్మని పిలుస్తోంది..

మహబూబ్‌నగర్​ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది పిల్లలమర్రి మహావృక్షం. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెట్టు..ఉమ్మడి జిల్లాకే తలమానికం. సరైన సంరక్షణ లేక ఈ మహావృక్షం…నాలుగేళ్ల క్రితం ఓశాఖ నేలకొరిగింది. కానీ..తన చరిత్ర ముగియలేదని…పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. రారామ్మని సందర్శకులకు పిలుస్తోంది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు కనువిందు చేసింది. అయితే పునరుజ్జీవంతో ఇక నుంచి పర్యాటకులకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సందర్శకుల కోసం పిల్లలమర్రి గేట్లు తెరవబోతున్నారు.

నాలుగేళ్ల క్రితం తెగులు, చెదలతో పాలమూరు ప్రతీక పిల్లలమర్రికి గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు సరైన నిర్వాహణ లేక ఎండిపోవడం..మరోవైపు చెదల పట్టడంతో మహావృక్షం కొమ్మలు బాగా దెబ్బతిన్నాయి. ఊడలు ఊడిపోవడం, ఆకులు ఎండిపోవడంతో పచ్చని పందిరి వేసినట్లు ఉండాల్సిన పిల్లల మర్రి కళ తప్పింది.

ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందారు. పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పిల్లలమర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారుల స్పందించి సంరక్షణ చర్యలు చేపట్టారు. అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు. భారీ మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టడంతో అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావాణాన్ని నింపి చికిత్స అందించారు. పాదుల దగ్గర మట్టిలో జీవం పోయి చెదలు పట్టడంతో… బలమైన సేంద్రీయాలతో కూడిన మట్టిని నింపారు.

మర్రిచెట్టుకు బలమైన ఊడలకు ఎలాంటి సమస్య రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు. వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్ ను అందించారు. ఎట్టకేలకు ఊడలు భూమిని తాకడం, దాని ద్వారా చెట్టు బలంగా నిలబడింది. ఫారెస్ట్ అధికారుల చోరవతో పిల్లలమర్రికి మళ్లీ జీవం వచ్చింది. ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి. చెదలు పట్టిన కొమ్మలు మళ్లీ ధృడంగా తయారయ్యాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షం మళ్లీ దర్జాగా నిలబడింది. నిండా కొత్త కొమ్మలు, ఆకులతో కళకళలాడుతోంది. ఆకుపచ్చని పందిరి వేసి సంపూర్ణ ఆరోగ్యంగా తన మనుగడ ఇంకా ఉందంటూ నిరూపించింది పిల్లలమర్రి.

చెట్టును సంరక్షించే ప్రక్రియ సుధీర్ఘంగా కొనసాగడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి సందర్శకులను సమీప ప్రాంతాలకు అనుమతించలేదు. కేవలం దూరం నుంచి మాత్రమే చెట్టును చూసి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వాచ్ స్టాండ్ ను ఏర్పాటు చేసి చెట్టును తాకకుండా సదర్శనకు అవకాశం కల్పించారు. అయితే మహా వృక్షాన్ని దగ్గరి నుంచి చూసే అవకాశం లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిగా తిరిగి వెళ్లేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తాజా ప్రకటనతో సంతోషంలో మునిగిపోతున్నారు.

పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లలమర్రి గేట్లు తెరుచుకోనున్నాయి. మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల కోసం మౌలికవసతులను అభివృద్ధి చేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటు, పర్యాటకులు సేదతీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్తగా పార్కును, వాల్ పెయింటింగ్స్ సిద్ధం చేశారు.

అటవీశాక అధికారుల సంరక్షణ చర్యలు సత్ఫలితాలివ్వడంతో పాలమూరు ఐకానిక్ పిల్లలమర్రి మళ్ల జీవం పోసుకుంది. త్వరలోనే పర్యాటకులను అలరించేందుకు చేరువకానుంది.

krishnas lunch box తక్కువ ధరకే మూడు పూటల రుచికరమైన భోజనం.. గొప్ప మనసు చాటుకుంటున్న అమ్మ..!

Andhra Pradesh: తక్కువ ధరకే మూడు పూటల రుచికరమైన భోజనం.. గొప్ప మనసు చాటుకుంటున్న అమ్మ..!

అభివృద్ది చెందుతున్న పట్టణ, నగరాల్లో ఒంటరిగా ఉండే వృద్దుల సంఖ్య పెరిగిపోతుంది. పిల్లలు ఉద్యోగ రీత్యా, విద్య కోసం ఇతర నగరాలు, దేశాల బాట పట్టడంతో వారి తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. మలి సంధ్యలో సరైన ఆహారం, సాయం అందించే వారు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చింది ఓ అమ్మ.. మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టి తీర్చుతోంది గుంటూరు జిల్లాకు చెందిన వృద్దురాలు.

కృష్ణాస్ లంచ్ బాక్స్.. ఇదేదో కమర్షియల్ సంస్థ అనుకోకండి.. ఒంటరిగా ఉండే వృద్దుల ఆకలి తీర్చేందుకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించే సంస్థ ఇది. తెనాలి చెంచుపేటకు చెందిన లక్ష్మీ తన ఇంటిలో అతి సాధారణంగా ఈ మెస్ నిర్వహిస్తోంది. 2002లో ఒక వృద్దుడు కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో రెండు పూటలా ఆహారం పంపించే వారు ఎవరైనా ఉండే చూడాలంటూ లక్ష్మీని అడిగాడు. దీంతో ఆమె ఎవరో ఎందుకు తానే ఆ పనిచేస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే రెండు వారాల పాటు అతనికి రెండు పూటలా ఆహారం పంపింది. అంతే అప్పటి నుండి ఆమెకు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఆహారాన్ని పంపాలని అడగటం మొదలు పెట్టారు.

అప్పటి నుండి ఇప్పటి వరకూ తన ఇంటి నుండే 125 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇందులో గొప్పేముంది అనుకోకండి. కేవలం వంద రూపాయలకే మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఒక్క పూట మెస్ లో భోజనం చేయాలంటేనే వంద రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో కేవలం వంద రూపాయలకే రెండు పూటలా భోజనం ఉదయం పూట ఆల్పాహారం అందించడమంటే మాటలు కాదు. అది కూడా ఇంటింటికి వెళ్లి ఆహారాన్ని అందిస్తారు. లక్ష్మీ కుమారుడు పవన్ కుమార్ అతని భార్య శ్రీలేఖ ఆమెకు సహకారం అందిస్తున్నారు. ఆమె ఉంటున్న ఇంటిలో ఆహారాన్ని తయారు చేస్తారు. ఆమెనే స్వయంగా అందరి క్యారేజ్ లో ఆహార పదార్థాలను సర్ధుతారు. వాటిని డెలివరీ బాయ్స్ తీసుకెళ్లి అవసరమైన వారికి అందిస్తుంటారు. లక్ష్మీ మెస్ ద్వారా పదిహేను మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.

వంద రూపాయలకే మూడు పూటలా ఆహారం అంటే ఏదో ఒకటి పెడతారులే అనుకోవద్దు. ఉదయం పూట ఆల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం ఐదు కూరలతో పాటు అన్నం పంపిస్తారు. సాయంత్ర కూడా అదే విధంగా ఐదు కూరలు ఉంటాయి. ఇక ఆదివారం ఎగ్ కర్రీ, చికెన్, చేపల పులసు కూడా పంపిస్తారు. వారిచ్చే మెను చూస్తూ ఎవరైనా ఆ ఆహారాన్ని ఇష్టం తింటారు. తామెదో వ్యాపార పరంగా ఆలోచించి ఈ మెస్ నిర్వహించడలేదని, కేవలం సేవా దృక్పదంతోనే చేస్తున్నామంటున్నారు లక్ష్మీ. వృద్దులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారికి సకాలంలో ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి క్రమ తప్పకుండా సకాలంలో వారికి ఆహారాన్ని అందించడంతోనే ఎక్కువ మంది తమకు ఆహారం కావాలని అడుగుతున్నారని ఆమె తెలిపారు.

ఏది ఏమైనా ఒంటరి వృద్దుల కోసం అతి తక్కువకే ఆహారం అందిస్తున్న లక్ష్మీని పలువురు పుర ప్రముఖులు అభినందిస్తున్నారు.

Success Story: లక్షల రూపాయల ఉద్యోగాన్ని పక్కనపెట్టి కూరగాయలు పండిస్తున్న ఐఐటీ ఇంజనీర్‌.. ఫుల్లు గిరాకీ?!

Success Story: లక్షల రూపాయల ఉద్యోగాన్ని పక్కనపెట్టి కూరగాయలు పండిస్తున్న ఐఐటీ ఇంజనీర్‌.. ఫుల్లు గిరాకీ?!

శ్రీకాకుళం జిల్లా పెదపాడు తంగివానిపేటకు చెందిన సిమ్మ అప్పలరాజు కాన్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత క్యాంపస్ లో ఉండగానే ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు. కొన్నాళ్ళు ఉద్యోగం సజావుగా చేసిన అప్పలరాజుకు తాను చేస్తున్న ఉద్యోగం అంత సంతృప్తిని ఇవ్వలేదు. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే సిద్ధాంతాలతో ముందుకు సాగే అప్పలరాజు అన్నా హజారే ప్రోత్సహించే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పెట్రోల్ బంక్ సమీపంలో 26 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అలా కౌలుకు తీసుకున్న భూమిలో సేంద్రీయ వ్యవసాయంతో కూరగాయల సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. సాగు చేసే క్రమంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందడం ఎలాగో మెలకువలు నేర్చుకున్నాడు. అనంతరం రసాయన ఎరువులు, కెమికల్స్ లేకుండా సేంద్రీయ పద్ధతిలో పలు రకాల కూరగాయల సాగును ప్రారంభించారు.

సేంద్రియ వ్యవసాయం కావడంతో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దీంతో అప్పలరాజు పండించిన కూరగాయలకు కూడా మంచి గిరాకీ వచ్చింది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న కూరగాయలను తన తోట నుండే నేరుగా వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అనారోగ్యంతో ఉన్నవారికి నామమాత్రపు ధరకే కూరగాయలు ఇస్తున్నాడు. సేంద్రియ సాగులో ప్రధానంగా టమోటో, బీర, వంకాయ, బెండ, కర్బుజా, క్యాబేజ్, క్యాప్సికమ్ తో పాటు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రకృతి సాగును ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో అప్పలరాజును చూసిన ఇతర రైతులు కూడా ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రకృతి సాగులో పలు రకాల అరుదైన కూరగాయలు కూడా పండిస్తున్నారు.

పండిన పంటను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల సుమారు 300 టన్నుల వరకు కూరగాయలను ఎగుమతి చేస్తున్నారు. అధిక శాతం లో ఫర్టిలైజర్స్, కెమికల్స్ వాడటం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారించానని చెబుతున్నారు అప్పలరాజు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల వల్ల బిపి, షుగర్, ఆస్తమా వంటి వ్యాధులు నయమవుతాయని ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలకు మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉందని అంటున్నారు ఈ యువ ఇంజనీర్. లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం కన్నా సేంద్రియ వ్యవసాయమే ఆనందాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Business Ideas: రూ. 50 వేలతో నెలకు రూ. లక్షల్లో సంపాదించొచ్చు.. రిస్క్‌ లేని వ్యాపారాలు

Business Ideas: రూ. 50 వేలతో నెలకు రూ. లక్షల్లో సంపాదించొచ్చు.. రిస్క్‌ లేని వ్యాపారాలు

చేస్తోన్న ఉద్యోగంతో విసిగిపోయారా.? చాలీచాలనంత జీతం మీ నిత్యావసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉందా.? సాధారణంగా ఏ వ్యాపారమైన మొదలుపెట్టే ముందు.. అందులో రిస్క్ ఎంత ఉంటుంది.? పెట్టుబడి పెడితే.. వచ్చే లాభం ఎంత.? ఇలా ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. మరి ఈ తరుణంలో మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చేశాం. పెద్ద రిస్క్ లేకుండా.. కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాలు మొదలుపెట్టొచ్చు. దీంతో నెలనెలా రూ. లక్షల్లో ఆదాయం మీ సొంతమవుతుంది.

వస్త్రాల వ్యాపారం:
పెళ్లిళ్లు, పండుగలు, పుట్టినరోజు.. ఇలా ఒకటేమిటి మనకు స్పెషల్ డే ఏదైనా కూడా కొత్త బట్టలు వేసుకోకుండా ఆ రోజు గడవదు. దేశంలో ఏ ప్రాంతమైనా.. బట్టలకు డిమాండ్ విపరీతంగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వ్యాపారాన్ని కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ప్రారంభించి.. మాంచి లాభాలు ఆర్జించవచ్చు.

స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లేదా ఫుడ్ ట్రక్:
ఫుడ్ బిజినెస్.. దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా బెస్ట్ బిజినెస్ ఆప్షన్ ఇది అని చెప్పొచ్చు. మీరు కూడా రూ. 50 వేల పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెడితే.. వెంటనే ఫుడ్ స్టాల్ లేదా ఫుడ్ ట్రక్‌ని ప్రారంభించండి. దీనికి ముడిసరుకుతోనే పని ఉంటుంది. కాబట్టి వాటికీ అయ్యేది తక్కువ ఖర్చే. ఇక క్వాలిటీ, క్వాంటిటీ మాంచిగా ఉంటే.. మీ ఫుడ్ బిజినెస్ అద్భుతమే. నూడుల్స్, మోమోస్, చాట్-పకోడీ లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్ వంటి వాటిని మీరు అమ్మవచ్చు. ఫుడ్ ట్రక్కులలో కూడా మీరు స్ట్రీట్ ఫుడ్స్, టిఫిన్స్ లాంటివి ఉదయం, సాయంత్రం సమయాల్లో అమ్మకం పెట్టుకోవచ్చు.

ట్యూషన్ లేదా ఆన్‌లైన్ క్లాసులు: మీరు చదివిన, అలాగే మీ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచితే.. తప్పేమి కాదు. ఇప్పుడు టీచర్స్‌గా చేస్తున్న ప్రతీ ఒక్కరు.. సాయత్రం వేళల్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నారు. మరి మీరు కూడా ఏ సబ్జెక్ట్‌లో పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. మీ ఇంటి దగ్గరే స్థానికంగా టెన్త్ అంతకన్నా తక్కువ తరగతులు చదువుతున్న పిల్లలకు.. అలాగే ఇంటర్ చదివేవాళ్లకు ట్యూషన్ చెప్పొచ్చు. లేదా యూట్యూబ్ ద్వారా సొంతంగా చానెల్ ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్ క్లాసులు కూడా బోధించవచ్చు. వెడ్డింగ్ ప్లానర్: అతి తక్కువ పెట్టుబడితో ఇదొక విజయవంతమైన వ్యాపారం. మీరు మీ కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా అత్యంత సృజనాత్మకంగా వివాహాలు, ఈవెంట్‌లను నిర్వహిస్తే.. ఈ వ్యాపారంలో మాంచి లాభాలు ఆర్జించినట్టే. దీన్ని ప్రారంభించడానికి కొంత డబ్బు అవసరం పడుతుంది. కానీ ఆ తర్వాత వ్యాపారం లాభాల బాట పడితే.. రాబడి చాలా బాగుంటుంది. వెడ్డింగ్ ప్లానింగ్ లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అనేక డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఉదాహరణకు క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, డెకరేషన్ ఇలా ఏదొక దానిపై మీరు డబ్బు సంపాదించవచ్చు. ఊరగాయ వ్యాపారం తక్కువ పెట్టుబడితో మరో మంచి వ్యాపార ఆలోచన ఊరగాయ వ్యాపారం. భోజనం సమయంలో ఊరగాయ లేకుండా చాలామందికి ముద్దదిగదు. దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ఒక రకమైన ఊరగాయ ఉంటుంది. అందువల్ల, మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఊరగాయ వ్యాపారం రిస్క్ లేని బిజినెస్. భారతీయ మార్కెట్లలో ఏడాది పొడవునా పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చాలా సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Gas Cylinder: రూల్స్ మారనున్నాయ్.. ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. పూర్తి వివరాలు

Gas Cylinder: రూల్స్ మారనున్నాయ్.. ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. పూర్తి వివరాలు

ఎల్‌పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గ్యాస్‌ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్‌వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

గ్యాస్‌ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ జీసీఆర్‌లో పొందుపరిచినట్లు మంత్రి చెప్పారు. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనీ గ్యాస్‌ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ ఎంతో ఉపయోగపడుతుందని గోయల్ అన్నారు.

నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్‌ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పెసో ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీపీసీబీ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం – డీపీఐఐటీ కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్సింగ్‌ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు.

CNG Bike: ప్రపంచంలో తొలి CNG బైక్‌ వచ్చేసింది.. కిలో మీటర్‌కు రూపాయి కంటే తక్కువ

CNG Bike: ప్రపంచంలో తొలి CNG బైక్‌ వచ్చేసింది.. కిలో మీటర్‌కు రూపాయి కంటే తక్కువ

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది. ఎన్నో రోజుల ఎదురు చూపులకు చెక్‌ పెడుతూ బజాజ్‌ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్‌ను శుక్రవారం లాంచ్‌ చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ తొలి సీఎన్‌జీ బైక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు సీఎన్‌జీ కార్లు, ఆటోలు మాత్రమే అందులోబాటులో ఉండగా తొలిసారి బైక్‌ వచ్చింది.

ఈ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ డ్రమ్ రూ. 95,000కాగా డ్రమ్‌ ఎల్‌ఈడీ ధర రూ. 1.05 లక్షలు, డ్రమ్‌ ఎల్ఈడీ డిస్క్‌ ధర రూ. 110 లక్షల ఎక్స్ షోరూమ్‌ ప్రైజ్‌గా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభంకాగా ప్రస్తుతానికి మాత్రం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు.

సీటు కింద సీఎన్‌జీ ట్యాంకును అమర్చారు. ఈ బైక్‌ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఒక చిన్న బటన్‌ సహాయంతో ఫ్యూయల్‌ ఏది కావాలనేదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్‌ వద్ద ఈ స్విచ్‌ను అందించారు. దీంతో సులభంగా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీకి మారొచ్చు. ఇక ఈ బైక్‌ ఇంజన్‌ గరిష్టంగా 9.5bhp పవర్, 9.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ బైక్‌ సీఎన్‌జీతో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ. 92 ఉంది. దీంతో ఈ బైక్‌తో సుమారు రూపాయికి ఒక లీటర్‌ ప్రయాణించవచ్చన్నమాట. ఇక పెట్రోల్ విషయానికొస్తే 64 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్రీడమ్‌ 125లో DRLతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను అందించారు.

11 రకాల సేఫ్టీ టెస్టింగ్‌లను నిర్వహించిన తర్వాత ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అన్ని టెస్ట్‌ల్లోనూ సీఎన్‌జీ కిట్‌ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ బైక్‌ను ఎగుమతి చేయనున్నారు. కొత్త సీఎన్‌జీ బైక్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌ బైక్‌గా బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అభివర్ణించారు. ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సాహించాలని ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

Investment Ideas: సంపద సృష్టి రహస్యం ఇదే.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన.. ట్రై చేయండి..

ఇటీవల కాలంలో జనాలు వివిధ పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో తమ సంపాదన నుంచి ఎంతో కొంత ఏదో పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం మార్కెట్లో చాలా రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వంటి సంప్రదాయ పథకాలు నిర్ణీత సమయంలో మీకు మంచి మొత్తంలో రాబడిని అందిస్తాయి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్, ఈక్విటీ ట్రేడింగ్ వంటి అత్యంత పాపులర్ విధానాలు కూడా మీకు వెల్త్ క్రియేట్ చేయడంలో సాయపడతాయి. వీటిల్లో రిస్క్ ఉన్నా.. అధిక రాబడిని అయితే అందిస్తాయి. ఇవే కాక ఇంకా చాలా రకాల పెట్టుబడి పథకాలు మార్కెట్లో మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఇవి మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా అందుకునేందుకు దొహదపడతాయి. అయితే వాటిపై అవగాహన లేకపోవడమే ప్రధాన లోపం. ఈ నేపథ్యంలో అలాంటి ఓ ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి కూడా మీకు నిర్ణీత సమయంలో అధికా రాబడిని అందిస్తాయి.

రియల్ ఎస్టేట్..
ప్రాపర్టీలపై అద్దెలు.. మీకు ఏదైనా సొంత ఇల్లు, లేదా షాపులు ఉంటే వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం వల్ల చాలా నిరంతరాయంగా ఆదాయం వస్తుంది.

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్(ఆర్ఈఐటీ).. ఏదైనా మంచి రియల్ వెంచర్ వైపు మొగ్గుచూపొచ్చు. వాటిపై పెట్టుబడి పెట్టొచ్చు. దీని వల్ల మీకు డైరెక్ట్ ఓనర్షిప్ వస్తుంది. మీ డబ్బు లిక్విడ్ రూపంలో కాకుండా ఫిజికల్ రూపంలో అందుబాటులో ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి.. అయితే రియల్ ఎస్టేట్ లో మీరు పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అవేంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో మొదటి పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. అద్దెకు ఇచ్చిన సమయంలో బాధ్యతగా వాటిని మేనేజ్ చేసుకోవాలి.

పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్.. ఆన్ లైన్ వేదికగా వ్యక్తులకు, వ్యాపారస్తులకు అప్పుగా డబ్బును ఇవ్వొచ్చు. దీని వల్ల వడ్డీ ఆదాయం రూపంలో వస్తుంది. అయితే దీనిలో రిస్క్ ఉంటుంది. మీరు ఎవరికి అప్పు ఇస్తున్నారు? వారు తిరిగి చెల్లిస్తారా? వడ్డీ సక్రమంగా ఇస్తారా అన్న విషయాలు బేరీజు వేసుకోవాలి. అక్కడ మీ నమ్మకమే మీ పెట్టుబడి. ప్రస్తుతం ఈ బిజినెస్ బాగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది పెట్టుబడిదారులు ఈ విధంగా దాదాపు రూ. 10,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టినట్లు పలు ఆన్ లైన్ నివేదికలు చెబుతున్నారు.

ఏదైనా వ్యాపారం.. మీ వద్ద ఉన్న నగదుతో ఏదైనా వ్యాపారం ప్రారంభించొచ్చు. ఇది విజయవంతమైతే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం కష్టపడాలి. వ్యాపార వృద్ధికి తెలివిగా పనిచేయాలి.

ఏంజెల్ ఇన్వెస్ట్ మెంట్.. మీరు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి రాణిస్తాయనుకున్న కొత్త కంపెనీల్లో పెట్టడం ఉత్తమం. అయితే దీనిలోనూ అధిక రిస్క్ ఉంటుంది. అదే సమయంలో క్లిక్ అయితే అధిక రాబడి కూడా వస్తుంది.

విలువైన వస్తువుల సేకరణ.. ఏదైనా కళకు సంబంధించిన లేదా అరుదైన నాణేలు, పురాత వస్తువుల వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనే. ఆ వస్తువు పాతబడే కొద్దీ విలువ పెరిగేది అయి ఉండాలి.

ఇవి గుర్తుంచుకోండి..
మీరు దేనిలో పెట్టుబడి పెట్టినా కొన్ని అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే మీరు పెట్టబడిని డైవర్సిఫై చేయాలి. ఒకేచోట మీ పెట్టుబడులను ఉంచకూడదు. వివిధ ఆస్తి తరగతులలో విస్తరించాలి.
అదే సమయంలో ఏదైనా ప్రత్యామ్నాయ ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టే ముందు దానిపై పరిశోధన ముఖ్యం. దీని వల్ల దానిలో ప్రమాదాలు, దాని వ్యవహారం అవగతం అవుతుంది.
సంప్రదాయ స్టాక్స్, బాండ్ల కంటే ఈ ప్రత్యామ్నాయ పెట్టుబడులు చాలా ప్రమాదకరం. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందే దాని రిస్క్ టాలెరెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మేలు.

ఇంటి ముందు ఈ మొక్కను పెంచండి… ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు పరార్‌..!

ఇంటి ముందు ఈ మొక్కను పెంచండి… ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు పరార్‌..!

ఇంటిని ఎంత శుభ్రం చేసినా బల్లులు, ఈగలు, చీమలు వస్తూనే ఉంటాయి. వంటగది, బాత్రూమ్‌ ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతిచోటా బల్లులు, ఈగలు, చీమలు తిరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని మొక్కలు ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలతో సహా ఇంట్లో బాధించే కీటకాలను తొలగిస్తాయి. బాధించే క్రిమి కీటకాలను తరిమికొట్టే మొక్కలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

పుదీనా ఆకుల సువాసన మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, కొన్ని కీటకాలకు అది నచ్చదు. అందులో బల్లి ఒకటి. పుదీనా మొక్కను ఇంట్లో పెడితే బల్లులే కాదు ఎలుకలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పిప్పరమెంటులో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. పుదీనా బల్లులు, ఎలుకలు తట్టుకోలేని ఘాటైన వాసనను వెదజల్లుతుంది.

బల్లులను తరిమికొట్టేందుకు నిమ్మ గడ్డిని కూడా నాటవచ్చు. ఇది ఒక రకమైన గడ్డి. పేరుకు తగ్గట్టుగానే ఈ గడ్డి నిమ్మకాయ రుచి, వాసనతో ఉంటుంది. దీని వాసన కారణంగా బల్లులు అక్కడి నుంచి పారిపోతాయి. అలాగే లెమన్ గ్రాస్ లో సిట్రోనిల్లా అనే ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. ఇది అనేక క్రిమిసంహారక స్ప్రేలలో కూడా ఉపయోగించబడుతుంది.

బల్లుల సమస్య నుంచి బయటపడేందుకు మీరు బంతి పువ్వు మొక్కను కూడా పెంచుకోవచ్చు. బంతి పూలలో పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. పెంపుడు బల్లులు బంతి పూల వాసన చూస్తే పారిపోతాయి.

రోజ్మేరీ మొక్క నుండి తీసిన నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఈ మొక్క వింత వాసనను కూడా వెదజల్లుతుంది. దీనివల్ల బల్లులు సహా ఈగలు, దోమలు ఇంట్లో ఉండవు.

High Sugar: ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!

High Sugar: ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది స్వీట్లను ఇష్టపడతారు. కానీ, మిఠాయిలు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది మధుమేహం, ఊబకాయం నుండి వివిధ వ్యాధులకు కారణమవుతుంది. స్వీట్లలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు చక్కెర స్వీట్లు, మొలాసిస్ స్వీట్లు. ముఖ్యంగా చలికాలంలో నాలెన్ బెల్లంలో తియ్యదనం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కెర ఆరోగ్యానికి బెల్లం కంటే ఎక్కువ హానికరం అని ..

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది స్వీట్లను ఇష్టపడతారు. కానీ, మిఠాయిలు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది మధుమేహం, ఊబకాయం నుండి వివిధ వ్యాధులకు కారణమవుతుంది. స్వీట్లలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు చక్కెర స్వీట్లు, మొలాసిస్ స్వీట్లు. ముఖ్యంగా చలికాలంలో నాలెన్ బెల్లంలో తియ్యదనం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కెర ఆరోగ్యానికి బెల్లం కంటే ఎక్కువ హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు.

చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే మధుమేహం మూత్రపిండాలు, గుండె, కంటి సమస్యల నుండి వివిధ వ్యాధుల కారణాలలో ఒకటి.

ప్రస్తుతం పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మితిమీరిన తీపి లేదా చక్కెరతో కూడిన ఆహారాలు (శీతల పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం) తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ ఎక్కువగా తింటే ఊబకాయం సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అదనపు గ్యాస్, అజీర్ణంతో బాధపడుతున్నారా? ఇది చాలా చక్కెరను తీసుకోవడం వల్ల కూడా కావచ్చు. అధిక చక్కెర లేదా స్వీట్లు తీసుకోవడం వల్ల అపానవాయువు, అజీర్ణం, అసిడిటీ వస్తుంది.

చాలా మందికి పాదాలు వాచిపోతుంటాయి. యూరిక్ యాసిడ్ సాధారణమైనప్పటికీ, కాలు వాపుకు కారణం ఏంటో అర్థం కాదు. అలాంటప్పుడు, మీరు అదనపు స్వీట్లు తింటున్నారా లేదా అని ఆలోచించండి. ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం, మిఠాయిలు ఎక్కువగా తినడం వల్ల పాదాల వాపు, శరీరంలో నొప్పి వస్తుంది.

ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ముఖం ముడతలు సాధారణం కావచ్చు. అయితే చాలా మందికి చిన్న వయసులోనే ముఖంలో ముడతలు వస్తాయి. చాలా మంది చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. మిఠాయిలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు.

ఎక్కువ చక్కెర తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. దంతాలు, చిగుళ్ళలో నొప్పి, అకస్మాత్తుగా సగం దంతాలు విరిగిపోవడం, రూట్ ఇన్ఫెక్షన్ తీపిని అధికంగా తీసుకోవడం వల్ల సంభవించవచ్చు.

Wifi Router: రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా?.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో వైఫై ఉంటుంది. ఇది 24 గంటల పాటు ఆన్‌లోనే ఉంటుంది. రూటర్‌ వినియోగం విషయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ Wi-Fiని ఉపయోగించే విషయంలో చేసే పొరపాట్లు మిమ్మల్నీ ఇబ్బందులకు గురిచేస్తాయంటున్నారు నిపుణులు. రూటర్‌ నిరంతర వినియోగం శరీరానికి చాలా హానికరం అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా వైఫ్‌ రూటర్‌ విద్యుదయస్కాంత కిరణాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. దీంతో వై-ఫై వినియోగం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉంటుందని చెబుతున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో, వైఫై నుంచి వెలువడే రేడియేషన్‌ కూడా శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వైఫై రూటర్‌ను రాత్రంతా ఆన్‌లో ఉంచడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మెదడుపై ప్రభావాలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో మనం నిద్రపోయే ప్రాంతానికి దగ్గరగా వైఫ్ రూటర్‌ ఉండటం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో నిద్రలేమి, అలసట, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి నిద్రపోయేటప్పుడు వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాలని చెబుతున్నారు. ‘జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ’లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో రూటర్ దగ్గర పడుకునే వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇటలీలోని టురిన్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మార్కో డి పోర్టియో ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

అల్జీమర్స్: రూటర్‌ని రాత్రంతా అలాగే ఉంచడం వల్ల క్యాన్సర్, నరాల సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా అల్జీమర్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రాత్రంతా వైఫైని ఆన్‌లో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే వైఫై రూటర్‌ని మీరు పడుకునే ప్లేస్‌కి కాస్త దూరంలో ఉంచాలని చెబుతున్నారు. రేడియేషన్ ప్రభావం నుండి దూరంగా ఉండటానికి, రూటర్‌ను గదిలో ఓ మూలగా ఏర్పాటు చేసుకోవాంటున్నారు. ఇంకో కారణం కూడా ఉంది. మీరు రాత్రంతా ఉపయోగించకపోయినా, రూటర్‌ ఆన్‌లో ఉండటం వల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు విద్యుత్ బిల్లును ఆదా చేయాలనుకుంటే రాత్రిపూట రూటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.

ఉదయం నిద్రలేవగానే దాహంగా అనిపిస్తుందా? జాగ్రత్త లైట్‌ తీసుకోకండి

High Blood Pressure Symptoms: ఉదయం నిద్రలేవగానే దాహంగా అనిపిస్తుందా? జాగ్రత్త లైట్‌ తీసుకోకండి..

ఈరోజుల్లో హైపర్‌టెన్షన్ ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద సమస్యగా మారింది. లావు నుండి సన్నగా, పెద్దవారి నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు గుండె సమస్యలను కలిగిస్తుంది. గుండెపోటుతోపాటు బ్రెయిన్ స్ట్రోక్‌కు కూడా అధిక రక్తపోటు కారణం. చూపు సమస్యలు తలెత్తుతాయి..

ఈరోజుల్లో హైపర్‌టెన్షన్ ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద సమస్యగా మారింది. లావు నుండి సన్నగా, పెద్దవారి నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు గుండె సమస్యలను కలిగిస్తుంది. గుండెపోటుతోపాటు బ్రెయిన్ స్ట్రోక్‌కు కూడా అధిక రక్తపోటు కారణం. చూపు సమస్యలు తలెత్తుతాయి.

క్రమరహిత జీవనశైలి, అధిక ఒత్తిడి అధిక రక్తపోటు స్థాయిల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు. అంతేకాకుండా ఊబకాయం, మధుమేహం సమస్యలు కూడా రక్తపోటును పెంచుతాయి. రక్తపోటు స్థాయి పెరిగితే, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే.. రక్తపోటు నియంత్రణలో లేకపోతే చాలా ప్రమాదకరం.

ఉదయం నిద్ర లేవగానే కళ్లు తిరుగుతున్నట్ల అనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు. రక్తపోటు స్థాయి పెరిగినప్పుడు, గొంతు, నోటి లోపలి భాగం పొడిగా మారుతుంది. ఫలితంగా, ఉదయం నిద్రలేచిన తర్వాత చాలా దాహంగా ఉంటుంది. ఇలా అనిపిస్తే వెంటనే రక్తపోటును తనిఖీ చేసుకోవాలి.

ప్రతిరోజూ ఉదయం వికారంగా ఉన్నట్లయితే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు. వెంటనే బీపీని చెక్‌ చేసుకుని, వైద్యుడిని సంప్రదించాలి.

రక్తపోటు స్థాయి పెరిగినప్పుడు, కంటి చూపు కూడా బలహీనమవుతుంది. దీంతో చూపు అస్పష్టంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కంటి వైద్యుడిని కలవడమే కాకుండా, రక్తపోటును కూడా తనిఖీ చేసుకోవాలి.

Garlic Benefits : వెల్లుల్లిని ఇలా తింటే జిమ్ చేసిన‌ట్లే..! స్లిమ్‌గా, యంగ్‌గా అవుతారు..

మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు గొప్పగా చెబుతున్నారు. వెల్లుల్లి వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం.

వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి వెల్లుల్లి వాసన కూడా పడదు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వెల్లుల్లి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. మంచి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. కడుపు ఆమ్లం అంటే గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది.

అధిక రక్తపోటు ఉన్న రోగులకు వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లిలో చాలా ముఖ్యమైన పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది.

కొన్ని వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగండి. అతని ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగాలి. ఇది జలుబు, దగ్గు, అజీర్తిని నయం చేస్తుంది. అంతే కాదు ముఖం ముడతలు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి. వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. దీంతో ఈజీగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వెల్లుల్లిలోని అలిసిన్‌ అనే కెమికల్‌.. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

పొలాల బాట పట్టిన కలెక్టర్.. ఇతడు వెరీ స్పెషల్.. వీడియో చూస్తే అవాక్కే..!

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలను సాగు చేయాలని కోరారు. రైతు సమస్యలను చెప్పుకోవడానికి ఎప్పుడైనా సరే తన వద్దకు రావాలని కోరారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ తనకు తెలుసునని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పని తీరుపై కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల పని తీరు ఎలా ఉందని ఆరా తీశారు. కలెక్టర్ పనితీరు, సింప్లిసిటీ పై ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.

కలెక్టర్ అంటే ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు.. సైరన్లు, గన్ మెన్, హంగూ ఆర్భాటం హడావుడి ఉంటుందని సాధారణంగా అందరికీ తెలిసింది. చూసేది కూడా ఇదే. కానీ, ఈ కలెక్టర్‌ వెరీ స్పెషల్. ఇతడి రూటే సపరేటు అన్నట్టుగా ఉన్నాడు. ప్రజల కష్టాలు తెలుసుకున్న వాడే కలెక్టర్ అంటూ ప్రజా జీవితంలోకి అడుగెట్టాడు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ..10 రోజుల క్రితం ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ముజామిల్ ఖాన్.. వచ్చిన దగ్గర నుంచి స్కూల్స్, అంగన్ వాడి సెంటర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యుడు లా వెళ్లి ..అక్కడ కూర్చొని వారితో మమేకమై..సమస్యలు తెలుసుకుంటున్నారు..ఉద్యోగులు, ప్రజలతో ప్రేమగా మాట్లాడి మరింత దగ్గర అవుతున్నారు. ఇపుడు పొలం బాట పట్టారు కలెక్టర్.

కలెక్టర్‌ హోదాలో తనకు సెక్యూరిటీ గన్మెన్లు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తన చుట్టూ ఉన్న ఒక సామాన్యుడిలా ప్రజలు, రైతులతో కలిసిపోయాడు. అంతేకాదు.. వ్యవసాయ క్షేత్రంలోకి దిగినప్పుడు.. తన కాళ్లకు వేసుకున్న బూట్లు విప్పి చేతిలో పట్టుకుని పొలం గట్లపై మోసుకుంటూ పంటలను పరిశీలించారు కలెక్టర్. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం సమీపంలో రైతులు సాగు చేస్తున్న వరిసాగు పంటలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఈ సందర్భంగా తను వేసుకున్న షూస్ ను విడిచి తన చేతిలో పట్టుకొని చేను గట్లపై తిరుగుతూ కనిపించాడు. రైతులు పడుతున్న కష్టాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. రైతులతో సమానంగా పంట చేనులో ఉన్న బురదలో సైతం దిగారు. వారితో సమానంగా నేలపై కూర్చున్నాడు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులను సైతం అక్కడే కింద కూర్చోబెట్టి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలను సాగు చేయాలని కోరారు. రైతు సమస్యలను చెప్పుకోవడానికి ఎప్పుడైనా సరే తన వద్దకు రావాలని కోరారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ తనకు తెలుసునని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పని తీరుపై కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల పని తీరు ఎలా ఉందని ఆరా తీశారు. కలెక్టర్ పనితీరు, సింప్లిసిటీ పై ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.

 

ఒక వైపు సినిమాలు.. మరో వైపు టిఫిన్ బండి నడుపుతూ.. ఈ నటిని గుర్తుపట్టారా..?

ఒక వైపు సినిమాలు.. మరో వైపు టిఫిన్ బండి నడుపుతూ.. ఈ నటిని గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో కష్టపడి వచ్చిన వారు ఉన్నారు. కృష్ణానగర్ రోడ్ల పై అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన వారు వందలు, వేలల్లో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే తమ టాలెంట్ ను నిరూపించుకొని నటులుగా మారాలని చూస్తుంటారు. అలా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన తర్వాత ఇప్పుడు అవకాశాలు లేక ఎదో ఒక ఉపాధి వెతుక్కొని జీవనం సాగిస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గడం.. ఆర్ధిక సమస్యలు పెరగడంతో చాలా మంది ఇలా ఇతర పనులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నటి రోడ్డు పై టిఫిన్ బండి నడుపుతూ కనిపించారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో నటించారు ఆమె .

ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే యాంకర్ గానూ చేశారు. అలాగే సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా టిఫిన్ బండి నడుపుతూ కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆమె పేరు గీత. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణంలో నివసించే గీత.. సినిమాలు, సీరియల్స్ చేస్తూనే టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ.. నకిరేకల్ లో రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర్లు థియేటర్ ఉన్నాయి. ఈ థియటర్స్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా.. తనకు కూడా సినిమాల్లో నటించాలని, స్క్రీన్ పైన కనిపించాలని ఆశ కలిగిందని తెలిపారు. అలాగే టిక్ టాక్, డబ్ స్మాష్‌లాంటి యాప్స్ వాడి నటను మెరుగుపరుచుకున్నానని తెలిపారు. అలా వీడియోలు చేస్తూ తన నటన ఎలా ఉందో చూసుకునేదాన్ని.. ఆ వీడియోలు చూసిన స్నేహితులు కూడా నన్ను ప్రశంసించడం చేసేవారు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఇలా వీడియోలు చేశాను. ఆతర్వాత కొంతమంది పరిచయంతో సినిమా రంగంలోకి వచ్చాను. అలా టీవీ సీరియల్స్ లో అవకాశం దక్కింది అని తెలిపారు గీత. గృహప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్ళాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురులాంటి సీరియల్స్ లో నటించారు. అలాగే ప్రేమ విమానం,  లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ సినిమాల్లోనూ నటించారు గీత. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమాలోనూ నటించినట్టు ఆమె తెలిపారు. ఇలా సినిమాల్లో చేస్తూనే మార్ వైపు టిఫిన్ బండి నడుపుతున్న గీతను పలువురు ప్రశంసిస్తున్నారు.

Geetha

నటి గీత

Geetha 1

Electricity Bill: విద్యుత్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. క్యూఆర్‌ కోడ్‌తో బిల్‌ చెల్లింపు

Electricity Bill: విద్యుత్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. క్యూఆర్‌ కోడ్‌తో బిల్‌ చెల్లింపు

మొన్నటి వరకు కరెంట్‌ బిల్లు చెల్లించాలంటే కరెంట్‌ ఆఫీస్‌కు వెళ్లి లైన్‌లో నిలబడే పరిస్థితి ఉండేది. అయితే ఎప్పుడైతే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి కరెంట్‌ బిల్లుల చెల్లింపులు సింపుల్‌గా మారాయి. ఒక క్లిక్‌తో కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం లభించింది. అయితే తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ సేవలకు అంతరం ఏర్పడింది.

థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫేన్‌పో, పేటీఎమ్‌ వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు యాప్స్‌ ద్వారా పేమెంట్ చేస్తున్న వారు ఆందోళన పడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సింపుల్‌గో ఫోన్‌లోనే బిల్‌ పేమెంట్‌ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టీఎస్‌పీడీసీఎల్ యాప్‌ ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించే అవకావం కల్పించింది.

అయితే ఇది కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశం. కాబట్టి పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కరెంటు బిల్లులపైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే దిశగా టీజీఎస్‌పీడీసీఎల్‌ అడుగులు వేస్తోంది. దీంతో మీ కరెంట్‌ బిల్లుపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి బిల్లును సులభంగా పే చేయొచ్చు. ఏ నెలకు ఆ నెల బిల్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ అప్డేడ్‌ అవుతుంది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే మట్టేవాడ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) వరంగల్‌, భూపాలపల్లిలో అమలు చేస్తున్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో ఫోన్‌లోని యూపీఐ యాప్స్‌తో స్కాన్‌ చేసి సులభంగా పే చేసుకోవచ్చు. దీంతో థార్డ్‌ పార్టీ యాప్‌లు వసూలు చేసే ఛార్జీలను కూడా తప్పించుకోవచ్చు.

Venus rise effect: రాబోయే 9 నెలలు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి దయతో సంపద పెరుగుతుంది

Venus rise effect: హిందూ మతంలో శుభ కార్యాలను నిర్వహించడానికి శుక్రుడు, బృహస్పతి ఉదయించిన స్థితిలో ఉండటం చాలా ముఖ్యమైనది. గురు-శుక్రుడు ఉదయించిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, వివాహం, గృహ ప్రవేశం, ముండ మొదలైన అన్ని శుభకార్యాలకు శుభ సమయం ఏర్పడుతుంది.

ఏప్రిల్ 29న శుక్రుడు అస్తమించగా, మే 6న బృహస్పతి అస్తమించింది. ఈ కారణంగా మే-జూన్ నెలల్లో వివాహానికి శుభ ముహూర్తాలు లేవు. దృక్ పంచాంగ్ ప్రకారం శుక్రుడు జూన్ 29 రాత్రి 7:52 గంటలకు మిథున రాశిలో ఉదయించాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, అందం, వైవాహిక జీవితం, మంచి ఆరోగ్యానికి కారకంగా పరిగణిస్తారు.

జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సుఖాలు, సౌకర్యాలకు లోటు ఉండదు. ధనలాభం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం శుక్రుడు ఉదయించే స్థితిలోనే సంచరిస్తాడు. దీని వల్ల రానున్న తొమ్మిది నెలలు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. సంపద వెల్లివిరుస్తుంది. శుక్రుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

శుక్రుడు ఉదయించడం వల్ల మేషరాశి వారి జీవితాల్లో సంతోషం కలుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోతుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. కెరీర్‌లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి.

మిథున రాశి

రాబోవు 9 నెలలు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కెరీర్‌లో చాలా పెద్ద మార్పులు వస్తాయి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి.

కన్యా రాశి

శుక్రుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కెరీర్‌లో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు.

మకర రాశి

శుక్రుడు ఉదయించడం వల్ల మకర రాశి వారి జీవితాల్లో సంతోషం మాత్రమే ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి, వాహన ఆనందాన్ని పొందుతారు. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Money Plant: మనీ ప్లాంట్ ను ఈ మూల పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

మామూలుగా మనం ఇంట్లో బయట, ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని, ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు తలెత్తని చాలామంది భావిస్తారు.

మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం మంచిదే కానీ ఈ మొక్క విషయంలో కొన్ని రకాల విషయాలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా మంచి దిశలో పెట్టడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఆ వివరాల్లోకి వెళితే.. మనీ ప్లాంట్ మొక్కను తూర్పు లేదా పడమర దిశలో ఉంచకూడదు. ఇలా ఈ దిశలో ఉంచటం వల్ల ఇది సమస్యలను తీసుకువస్తుందట. మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఈ దిశల్లో ఉండకుండా చూసుకోండి. ఈశాన్య మూలలో పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ మొక్క దగ్గరలో ఎరుపు రంగులో ఉండే వస్తువులను ఉంచరాదు. ఇలా చేస్తే ఇది ఇంటికి అశుభం మీకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ మీరు ఇంటి వంట గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకున్న దాని పక్కన ఎరుపు రంగులో ఉండే వస్తువులు పెట్టకూడదు.

అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టూ ఉండే ప్రదేశం కాస్త విలాసవంతంగా ఉండేలా చూసువాలి. ఇరుకుగా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్కను కొనుగోలు చేసినప్పుడు వాటి ఆకులు హార్ట్ షేప్ లో ఉండేవి చూసి కొనుగోలు చేయండి ఇవి మనకు మన ఇంటికి సుఖశాంతులను తీసుకువస్తాయి.

రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా పొందేందుకు ఆధార్ ఉంటే చాలు! ఎలా దరఖాస్తు చేయాలి?

రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా పొందేందుకు ఆధార్ ఉంటే చాలు! ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రస్తుత కాలంలో కొత్త రోగాలు పుట్టుకొచ్చి మనిషి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి.దీనికి పరిశుభ్రత పాటించకపోవడం, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం.

డబ్బు ఉన్నవాళ్ళు వైద్యం చేయించుకోవచ్చు కానీ డబ్బు లేని వాళ్ళు చిన్న చిన్న జబ్బులు కూడా నయం చేసుకోలేరు.

ఈ సందర్భంలో, ‘ఆయుష్మాన్ భారత్’, ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనదేశంలోని పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి

దీని ప్రకారం 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వ బీమా పథకం ద్వారా ఉచిత వైద్యం పొందవచ్చని రాష్ట్రపతి తెలిపారు.

మరియు 70 ఏళ్లలోపు పేదలు మాత్రమే వైద్య బీమా ద్వారా తగిన వైద్యం పొందగలరు, అయితే, 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్య బీమా గురించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబడుతుంది ముందస్తుగా ఉచిత వైద్య బీమా.

ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య బీమా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

అవసరమైన పత్రాలు:-

1) ఆధార్ కార్డ్

2) రేషన్ కార్డు

3) చిరునామా రుజువు

ఆయుష్మాన్ భారత్ బీమా పథకాన్ని ఎలా దరఖాస్తు చేయాలి

ముందుగా https://abdm.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి, క్రియేట్ ABHA నంబర్‌పై క్లిక్ చేయండి.

అప్పుడు మీరు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి, దాన్ని నమోదు చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

తర్వాత కొత్త యూజర్‌పై క్లిక్ చేసి, ఉచిత వైద్య బీమా కోసం దరఖాస్తు చేసుకోండి.

Chinta Mohan: ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది.!

Chinta Mohan: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌.. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన..

తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.. ఇక, జూ పార్క్ ను వడమాలపేటకు తరలించి ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం నేను ఎంపీగా ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి.. భూమి పూజ చేసి పునాది రాయి వేశాం.. క్రికెట్ స్టేడియం కోసం వేసిన పునాది రాయి అనాది రాయి కాకుండా నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..

ఇక, తిరుపతిలో పది ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు చింతామోహన్‌.. ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు.. వైఎస్.., వైఎస్‌ జగనే కారణంగా చెప్పుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్‌ జగన్ ఉంటే.. విభజన జరిగి ఉండేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ ను బలహీన పర్చారని మండిపడ్డారు.. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుందని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. రాహుల్‌ గాంధీతో సహా.. కాంగ్రెస్‌ నేతలు ప్రకటించిన మాట విదితమే.. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోగా.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఇప్పటి నేతలు అంటుండగా.. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ మాత్రం.. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Viral Video: ఇల్లాలా మజాకా..! ఉతికేయడంలో ఉపాయం.. నయా వాషింగ్ మిషన్ కనిపెట్టిన మహిళ

మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన వాషింగ్ మెషీన్లు ప్రజలకు బట్టలు ఉతికే శ్రమను తగ్గించాయి. కానీ దాన్ని కొనడానికి అందరి దగ్గర డబ్బు ఉండదు. విద్యుత్ వినియోగం కూడా మారుతూ ఉంటుంది.

పేదలు, సామాన్యులకు వాషింగ్‌ మెషీన్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కానీ, అలాంటి వారు కూడా తమకు అందుబాటులో ఉన్న వస్తువులను వినియోగించుకుని వాషింగ్‌ మెషీన్లను తయారు చేసిన వీడియోలు గతంలో మనం సోషల్ మీడియాలో వైరల్‌ కావటం చూశాం. గతంలో ఓ మహిళ సైకిల్‌ వీల్‌ సాయంతో వాషింగ్‌ మెషిన్‌ వంటి టెక్నిక్‌ ప్లే చేసింది. ఇప్పుడు కూడా అలాంటిదే మరో కొత్త రకం వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసింది ఓ ఇల్లాలు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక మహిళ ఇంట్లో ఇటుకలు, సిమెంట్ సహాయంతో వాషింగ్ మెషీన్ను తయారు చేసింది. దానికి ఓ వైపు నీళ్లు నిలబడేందుకు తొట్టి ఆకారంలో నిర్మించి, రెండో వైపు బట్టలు ఉతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంది.ఈ వీడియో చూసిన ప్రజలు దీనిని దేశీ వాషింగ్ మెషీన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌లో పదే పదే బకెట్ నీళ్లు మార్చకుండా.. తొట్టి కింది భాగంలో మురికి నీరు వెళ్లేలా ఇంకొ కొళాయి ఏర్పాటు చేసింది. ఇలా మురుగు నీటిని బయటకు వదలడం, ట్యాప్‌ ఓపెన్‌ చేసుకుని ఎప్పటికప్పుడు మంచి నీటిని ఆ తొట్టిలో నింపుకుంటూ బట్టలు శుభ్రం చేస్తోంది. ఇక అక్కడే తిష్టవేసుకుని కూర్చునే పని లేకుండా నిలబడే సులభంగా బట్టలన్నింటినీ ఉతికేసింది. ఈమె తెలివి చూసిన నెటిజనం ఆశ్చర్యపోయారు. ఏం తెలివి అక్క నీది అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.

భారత్‌లో బ్రెయిన్‌-ఈటింగ్‌ డిసీజ్‌ కలకలం.. ఇ‍ప్పటి వరకు 22 మంది మృతి

భారత్‌లో బ్రెయిన్‌ ఈటింగ్‌ డిసీజ్‌ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు.

ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.

ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారు. అయితే..

దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.

అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు.

Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు.

అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్గఢ్లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో ఆ గొడవకు ఫుల్స్టాప్ పడింది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. బర్రె కోసం గొడవ పెట్టుకున్న ఇద్దరూ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీని ఎలా తేల్చాలో తెలియక కాస్త వినూత్నంగా ఆలోచించారు పోలీసులు. రోడ్డుపైకి తీసుకొచ్చి వదిలి పెట్టారు. అది నేరుగా తన యజమాని ఇంటికి వెళ్లిపోయింది. అక్కడితో ఈ తగవు తీరిపోయింది.

ఏం జరిగిందంటే..?

ప్రతాప్గఢ్లోని ఓ గ్రామంలో బర్రె ఉన్నట్టుండి అదృశ్యమైంది. చాలా రోజులుగా జాడ కోసం ప్రయత్నించాడు. దాదాపు మూడు రోజుల పాటు వెతగ్గా మరో వ్యక్తి ఇంట్లో అది కనిపించింది. ఆ వ్యక్తిపై యజమాని ఫిర్యాదు చేశాడు. అక్రమంగా తన బర్రెని లాక్కున్నాడని ఆరోపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. గంటల పాటు పంచాయితీ నడిచింది. అయినా బర్రె నాదంటే నాదంటూ ఇద్దరూ వాదించారు. ఈ సమస్యకి బర్రె మాత్రమే పరిష్కారం చూపించగలదని భావించిన పోలీసులు దాన్ని రోడ్డుపైన వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా అసలు యజమాని ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి వరకూ బర్రె నాదని వాదించిన మరో వ్యక్తిని పోలీసులతో పాటు గ్రామస్థులూ మందలించి పంపించారు.

Sprouted potatoes:ఈ దుంపలను తింటున్నారా.ఈ విషయాలు తెలిస్తే అసలు నమ్మలేరు

Sprouted potatoes : బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బంగాళాదుంపతో వేపుళ్ళు,కూర,చిప్స్,మసాలా గ్రేవీలు వంటివి చేసుకుంటారు. మనం ఒక్కోసారి బంగాళాదుంపలు చవకగా వస్తున్నాయని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం.

అలాంటి సమయంలో బంగాళా దుంపలకు మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినవచ్చా…లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
మొలకెత్తిన బంగాళాదుంపలో ఉండే పిండి పదార్ధం చక్కెరలుగా మారుతుంది.

ఆకుపచ్చ లేదా మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ప్రాణాంతకం కాదు, కానీ కొన్ని పరిస్థితులలో బంగాళాదుంపలు కొద్దిగా విషపూరితంగా ఉంటాయి. బంగాళాదుంప మొలకలు వచ్చినప్పుడు బంగాళాదుంపలో ఉండే పోషకాలు మొలకల కోసం ఉపయోగపడతాయి.

అందువల్ల బంగాళాదుంప మొలకలను తీసేసి కూరగా చేసుకున్న మాములు బంగాళాదుంపతో పోలిస్తే పోషకాలు తగ్గుతాయి. రుచిలో కూడా కాస్త తేడా వస్తుంది. బంగాళాదుంప మొలకలలో సోలనిన్ మరియు గ్లైకోకాల్లాయిడ్లు ఉంటాయి.

ఇవి కొంత విషపూరితమైనవి. వీటి ప్రభావం తీవ్రంగా లేనప్పటికీ మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినటం వలన పొట్ట అప్సెట్ మరియు జీర్ణ సమస్యలు,తలనొప్పి,వాంతులు,వికారం, విరేచనాలు, గొంతు మంట,మైకం వంటివి వస్తాయి.

అందువల్ల బంగాళాదుంపలు కొనే ముందు మొలకలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మొలకలు ఉంటే మొలకలు తీసేయటం మరియు బంగాళా దుంపను ఉడికించి ముందు తొక్కను తీసేసి ఉడికించాలి.

బంగాళాదుంపల మీద ఆకుపచ్చని రంగు పాచెస్ ఉంటే వండటానికి ముందే వాటిని కట్ చేయాలి. బంగాళాదుంప మొలకలు వచ్చినప్పుడు బంగాళాదుంప గట్టిగా ఉంటే తినవచ్చు. కానీ బంగాళాదుంప కుంచించుకుపోయి,ముడతలు పడి, మొలకలు ఉంటే మాత్రం అసలు తినకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Free Gas Cylinder Scheme : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ స్కీమ్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

Ap CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అద్భుత విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. వీటిలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో కూడా ముఖ్య కారణంగా చెబుతారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక హామీలు పట్ల ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కూటమికి ఓట్లు వేశారు. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతినెల రూ.1500 చొప్పున చెల్లిస్తామన్న హామీ, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ వంటి పథకాల పట్ల ఆకర్షితులై కూటమికి భారీగా ఓట్లు వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 164 స్థానాల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపుతోపాటు డీఎస్సీ విడుదల వంటి హామీలను అమలు చేసేలా చంద్రబాబు నాయుడు 5 సంతకాలను చేశారు. మిగిలిన పథకాలు అమలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు పథకాలు అమలుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతుంది అన్న ఆసక్తి లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అక్కడ ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా, ఏపీలో మాత్రం పూర్తిగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లును ఇవ్వనున్నారు. ఈ పథకం అమలకు సంబంధించిన విధివిధానాలు తయారీపై అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఇక్కడి అధికారులు పరిశీలిస్తున్నారు. ఉచిత పథకాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నదానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి వంద రోజుల్లోనే పలు పథకాలను అమలు చేసింది. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటివి పథకాలు ఉండగా, ఈ క్రమంలోనే ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రజల నుంచి కూడా ఈ పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

పెన్షన్ పెంపు లబ్ది ప్రజలకు అందజేత..

ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో వేయి రూపాయల పెన్షన్ను పెంచి రూ.4 వేల రూపాయలను లబ్ధిదారులకు జూలై నెలలో అందజేసింది. అలాగే, మూడు నెలలకు సంబంధించిన ఎరియర్స్ కలిపి రూ.7 వేల రూపాయలను ఒక్కో లబ్ధిదారుడికి అందించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇతర పథకాలు అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తరువాత ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నారు. ముందుగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే, ఆ తరువాత మహాశక్తి దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీ అమలు చేయనున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులు పనిచేస్తుండడంతో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

నిరుపేదలకు ఎంతో మేలు

ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే నిరుపేదలకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే రూ.860 రూపాయలు ఉంది. ప్రాంతాలు వారీగా ఈ సిలిండర్ ధరలో కొంత మార్పులు ఉండవచ్చు. అంటే మూడు సిలిండర్లు ఉచితంగా లబ్ధిదారులు అందిస్తే.. రు.2600 వరకు లబ్ధిదారులకు మిగలనుంది. ఈ పథకం అమలు కోసం వేలాదిమంది మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే తేదీ ఇప్పుడు ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది.

Deputy CM Pawan : ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోండి – డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా అటవీ శాఖాధికారులతో సమీక్షించిన ఆయన… శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు.

జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతోందని… నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలని దిశానిర్దేశం చేశారు.

ఇటీవల వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. ఈ డంప్ లో 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయనీ, వీటి విలువ రూ.1.6 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు.

అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలించేస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ … నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. అక్రమ రవాణా చేస్తున్నవారిని అరెస్టు చేయడంతో పాటు వాళ్ళ వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ దందాపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ…. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారని అన్నారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని స్పష్టం చేశారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలన్నారు. నరికివేత కూలీలు, రవాణాదారులను తెర వెనక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. అలాంటి కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.

గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయట తిరుగుతున్నవారిపై నిఘా పెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. వారి కార్యకలాపాలతో పాటు వాళ్ళకు ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి వంటి అంశాలపై నిఘా ఉంచాలన్నారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

కేసుల వివరాలపై ఆరా….

ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకూ నమోదైన కేసుల వివరాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలుపడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేసులు వీగిపోతే అందుకుగల కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

స్మార్ట్ ఫోన్ వల్లే ఆ వ్యాధులు వస్తున్నాయంటూ సర్వేలో షాకింగ్ నిజాలు బయట పెట్టిన పెట్టిన నిపుణులు

ప్రస్తుతం మనలో చాలా మంది సగం జీవితం స్మార్ట్ ఫోన్ లోనే గడిపేస్తున్నారు. కానీ, ఇదే ఫోన్ మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుందన్న విషయం తెలుసా..

అవును మీరు చదువుతున్నది నిజమే.. ఎక్కువ సమయం ఫోన్ లో గడిపే వాళ్ళకి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తాజాగా చేసిన సర్వేలో షాకింగ్ నిజాలు బయట పెట్టారు.

ముందుగా కడుపు నుంచి మొదలయి ఆ తర్వాత శరీరమంతటా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ప్రజలు, వారి ఫోన్‌లను ఎక్కడికి పడితే తీసుకువెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే బాత్రూంలో కూడా ఎదో పని చేసినట్టు వాడుతున్నారు. ఈ గాడ్జెట్‌లపై అనేక బ్యాక్టీరియాలు ఉంటున్నాయని నిపుణులు చేసిన అధ్యయనంలో తేలింది. దీనివల్ల కొత్త వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఫోన్ వేడిని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ బ్యాక్టీరియా చాలా ఈజీ గా పెరుగుతుంది. బ్యాక్టీరియాతో పాటు వైరస్‌లు, శిలీంధ్రాలు కూడా స్క్రీన్ పై ఉంటాయి. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ పైన కనిపించని స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, భోజనం చేసేటప్పుడు ఫోన్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Health

సినిమా