ఒక వైపు సినిమాలు.. మరో వైపు టిఫిన్ బండి నడుపుతూ.. ఈ నటిని గుర్తుపట్టారా..?

ఒక వైపు సినిమాలు.. మరో వైపు టిఫిన్ బండి నడుపుతూ.. ఈ నటిని గుర్తుపట్టారా..?


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో కష్టపడి వచ్చిన వారు ఉన్నారు. కృష్ణానగర్ రోడ్ల పై అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన వారు వందలు, వేలల్లో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే తమ టాలెంట్ ను నిరూపించుకొని నటులుగా మారాలని చూస్తుంటారు. అలా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన తర్వాత ఇప్పుడు అవకాశాలు లేక ఎదో ఒక ఉపాధి వెతుక్కొని జీవనం సాగిస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గడం.. ఆర్ధిక సమస్యలు పెరగడంతో చాలా మంది ఇలా ఇతర పనులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నటి రోడ్డు పై టిఫిన్ బండి నడుపుతూ కనిపించారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో నటించారు ఆమె .

ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే యాంకర్ గానూ చేశారు. అలాగే సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా టిఫిన్ బండి నడుపుతూ కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆమె పేరు గీత. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణంలో నివసించే గీత.. సినిమాలు, సీరియల్స్ చేస్తూనే టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ.. నకిరేకల్ లో రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర్లు థియేటర్ ఉన్నాయి. ఈ థియటర్స్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా.. తనకు కూడా సినిమాల్లో నటించాలని, స్క్రీన్ పైన కనిపించాలని ఆశ కలిగిందని తెలిపారు. అలాగే టిక్ టాక్, డబ్ స్మాష్‌లాంటి యాప్స్ వాడి నటను మెరుగుపరుచుకున్నానని తెలిపారు. అలా వీడియోలు చేస్తూ తన నటన ఎలా ఉందో చూసుకునేదాన్ని.. ఆ వీడియోలు చూసిన స్నేహితులు కూడా నన్ను ప్రశంసించడం చేసేవారు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఇలా వీడియోలు చేశాను. ఆతర్వాత కొంతమంది పరిచయంతో సినిమా రంగంలోకి వచ్చాను. అలా టీవీ సీరియల్స్ లో అవకాశం దక్కింది అని తెలిపారు గీత. గృహప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్ళాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురులాంటి సీరియల్స్ లో నటించారు. అలాగే ప్రేమ విమానం,  లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ సినిమాల్లోనూ నటించారు గీత. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమాలోనూ నటించినట్టు ఆమె తెలిపారు. ఇలా సినిమాల్లో చేస్తూనే మార్ వైపు టిఫిన్ బండి నడుపుతున్న గీతను పలువురు ప్రశంసిస్తున్నారు.

Geetha

నటి గీత

Geetha 1