Thursday, November 14, 2024

వాషింగ్ మెషీన్ స్క్రబ్బింగ్ లేకుండా 10 నిమిషాల్లో కొత్త లాగా మెరిసిపోతుంది, ఈ సులభమైన క్లీనింగ్ ట్రిక్ చూడండి

రోజూ చాలా మంది వాషింగ్ మెషీన్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ శుభ్రం చేయడం మర్చిపోతారు. మీ రోజువారీ దుస్తులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్ లోపల కూడా శుభ్రంగా మరియు మెరుస్తూ ఉండాలి.

లేదంటే కొన్ని రోజుల తర్వాత ఆ యంత్రం నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. అయితే, మనం దానిని శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే, బట్టలకు కూడా ఆ దుర్వాసన వస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, యంత్రాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. ఈ పని కష్టమని మీరు అనుకుంటే, దీన్ని చాలా సులభమైన మార్గంలో ఎలా చేయాలో చూడండి (లోపల నుండి వాషింగ్ మెషీన్ను ఎలా శుభ్రం చేయాలి). అంతేకాదు, దీన్ని చేయడానికి మీరు బ్రష్ లేదా స్క్రబ్బింగ్ మెషీన్‌తో కూర్చోవలసిన అవసరం లేదు. (వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడానికి సులభమైన మరియు సులభమైన పద్ధతి)

వాషింగ్ మెషీన్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి ఒక సాధారణ ట్రిక్

తక్కువ శ్రమతో వాషింగ్ మెషీన్ లోపలి భాగాన్ని ఎలా శుభ్రం చేయాలనే దానిపై ఒక సాధారణ ట్రిక్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ leeyonce_shineలో భాగస్వామ్యం చేయబడింది. మీరు ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ను శుభ్రం చేయడానికి ఈ ట్రిక్ని ఉపయోగించవచ్చు.

దీని కోసం, ముందుగా, 1-2 నిమ్మకాయలను తీసుకొని దానిని సగానికి కట్ చేసి రెండు భాగాలుగా విభజించండి. ఇప్పుడు మీ వద్ద ఉన్న ఏదైనా టూత్‌పేస్ట్‌ని ఈ నిమ్మకాయలపై అప్లై చేయండి.

యంత్రం యొక్క మూత తెరిచిన తర్వాత, లోపల ఉన్న రబ్బరుపై కొంచెం బేకింగ్ సోడా మరియు వెనిగర్ ఉంచండి. మెషిన్ యొక్క మూత యొక్క గ్లాస్ లోపలి భాగంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను కూడా వర్తించండి.

అప్పుడు యంత్రం యొక్క వాష్ సైకిల్‌లో “డ్రమ్ క్లీన్” ఎంపికను ఎంచుకోండి. మీ మెషీన్‌కు ఈ ఎంపిక అందుబాటులో లేకుంటే, మామూలుగా 15 నిమిషాల పాటు వాష్ సైకిల్‌ను ప్రారంభించండి. నిమ్మకాయ, టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా మరియు వెనిగర్ యొక్క మిశ్రమ ప్రభావం మీ వాషింగ్ మెషీన్‌ను శుభ్రంగా మరియు లోపలి నుండి మెరిసేలా చేస్తుంది.

Revanth Sarkar : మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో..

Revanth Govt : ఆన్ లైన్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళాశక్తి పథకం (Mahila Shakti Scheme) కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.

కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని రేవంత్‌ సర్కార్‌ (Revanth Sarkar) ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవ కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.

రాష్ట్రంలో 12, 769 గ్రామ పంచాయతీలుండగా… వేయిన్నర వరకే గ్రామాల్లో ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌ సేవలు, దరఖాస్తులు , చెల్లింపులు సహా 150 కి పైగా ప్రభుత్వ, 600 కు పైగా ప్రైవటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కింద మీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ పేరిట మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను రాష్ట్ర పరభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్ర ఏర్పాటుకు రూ. 2.50 లక్షల రుణాన్ని స్త్రీ నిధి ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంజూరు చేస్తుంది.

వీటితో ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్‌, బయోమెట్రిక్‌ పరికరాలు , కెమెరా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత మహిళా సంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

స్త్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక అంగన్వాడీ (Anganwadi) కేంద్ర భవనాలు , ఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో మీ సేవ కేంద్రానికి 10 అడుగుట పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు.

ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెలరోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సెక్యూరిటీపై హైకోర్టులో తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనంతగా ఓ వెలుగు వెలిగిన చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ పీపీ మిథున్ రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో చుక్కలు కనిపిస్తున్నాయి.

సీఎం చంద్రబాబుతో సై అంటే సై అనే వీరిద్దరికీ ప్రభుత్వ మార్పు తర్వాత భద్రత తగ్గించారు. దీనిపై వీరిద్దరూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై స్పందించిన ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పేసింది.

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 5 ప్లస్ 5 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కేవలం ఎమ్మెల్యే కావడంతో 1 ప్లస్ 1 కు తగ్గించేశారు. అలాగే గతంలో మంత్రి కుమారుడు, ఎంపీ అయిన మిథున్ రెడ్డికి 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు దాన్నీ 1 ప్లస్ 1కు తగ్గించారు. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా హడావిడిగా సెక్యూరిటీ తొలగించారని వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీంతో ప్రభుత్వం తరఫున వాదించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్.. చట్టపరమైన నిబంధనల ప్రకారమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భద్రత కల్పిస్తామని తేల్చిచెప్పేశారు. ఆయన కుమారుడి విషయంలోనూ చట్టప్రకారం ముందుకెళ్తామన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి తనకు అదనపు భద్రత కావాలంటూ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారని, ఎస్పీ మాత్రం అవసరం లేదని అభిప్రాయపడ్డారని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

టెన్త్​తో సెంట్రల్​ జాబ్.. 8,326 పోస్టులకు SSC నోటిఫికేషన్​

పది పాసవడంతోనే సెంట్రల్​ కొలువు సొంతం చేసుకునే అద్భుత అవకాశం స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్ ​ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్​ఎస్​సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ నోటిఫికేషన్‍ 2024 రిలీజ్​ చేసింది.

గ్రూప్ -సి, నాన్‍గెజిటెడ్‍, నాన్‍మినిస్టీరియల్​ ‍పోస్టులుగా పిలిచే ఎంటీఎస్‍ జాబ్​కు సెలెక్ట్​ అయితే స్టార్టింగ్​లోనే మంచి జీతంతో జీవితంలో స్థిరపడవచ్చు. ఎంటీఎస్​ నోటిఫికేషన్​, సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​ తెలుసుకుందాం..

సర్కారు కొలువు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఎంటీఎస్​ నోటిఫికేషన్​ మంచి చాన్స్. పక్కా ప్లాన్​తో కష్టపడితే ఫస్ట్​ అటెంప్ట్​లో జాబ్​ కొట్టొచ్చు. వివిధ శాఖల్లో 8,326 ఖాళీలు ఉన్నాయి. ఎంటీఎస్‍ ఎగ్జామ్‍ టెన్త్​ అర్హతతో నిర్వహించే పరీక్షే అయినప్పటికీ పీజీ, పీహెచ్‍డీలు చేసిన వారు కూడా పోటీపడతారు. కాంపిటీషన్​ హెవీగానే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్​ అందుకు తగినట్లుగానే ప్లాన్​ చేసుకోవాలి. ప్రశ్నలన్నీ టెన్త్​, ఇంటర్‍స్థాయిలోనే ఉంటాయి. పరీక్షకు దాదాపు 90 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టుకు 20 రోజుల చొప్పున కేటాయించుకొని ప్రిపరేషన్​ సాగిస్తూ.. చివరి 10 రోజుల్లో రివిజన్‍చేస్తే ఫలితముంటుంది.

శాలరీస్&డ్యూటీస్: పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఎంటీఎస్‍ అభ్యర్థులు ప్రారంభంలోనే మంచి వేతనం పొందుతారు. మూడేళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్‍ తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా ఐదేళ్లలోనే మూడు నుంచి నాలుగు ప్రమోషన్లు పొందవచ్చు. వీరికి సాధారణంగా ప్యూన్‍, డఫాట్రీ, జామ్‍దార్‍, ఫరాస్‍, చౌకీదార్‍, సఫాయివాలా, మాలి, జూనియర్‍ ఆపరేటర్ వంటి జాబ్​ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ర్టంలో ఉద్యోగం కోరుకుంటున్నామో అప్లికేషన్​లో స్పష్టంగా పేర్కొనాలి.

సిలబస్‍& ప్రిపరేషన్‍ టిప్స్​

ఇంగ్లీష్‍ లాంగ్వేజ్‍: ప్రాథమికంగా ఇంగ్లీష్‍ భాషపై అభ్యర్థికి గల అవగాహనను పరీక్షించేలా ఇందులో ప్రశ్నలిస్తారు. వొకాబులరీ, గ్రామర్‍, సెంటెన్స్ స్ర్టక్చర్‍, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వాటి ఉపయోగం మరియు రాత నైపుణ్యం (రైటింగ్‍ఎబిలిటీ) టెస్ట్ చేస్తారు. ఇందుకుగాను ప్రీవియస్​ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఏదైనా స్టాండర్డ్ బుక్​ ఇంటర్నెట్‍లో లభించే ఆంటోనిమ్స్, సినానిమ్స్ లిస్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. డిక్షనరీ సహాయంతో చదువుతూ రోజుకు కొన్ని కొత్త పదాలు, వాక్యాలు సాధన చేయాలి. వొకాబులరీతో పాటు గ్రామర్​ పెంచుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఉత్తమ మార్గం.

జనరల్‍ ఇంటెలిజెన్స్ & రీజనింగ్‍: ఈ విభాగంలో ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై నాలెడ్జ్ టెస్ట్ చేసేలా నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్‍ అండ్‍ డిఫరెన్సెస్‍, స్పేస్‍విజువలైజేషన్‍, ప్రాబ్లం సాల్వింగ్‍, అనాలసిస్‍, జడ్జిమెంట్‍, డెసిషన్​ మేకింగ్‍, విజువల్​ మెమొరీ, డిస్ర్కిమినేటింగ్​ అబ్జర్వేషన్, రిలేషన్‍షిప్స్ కాన్సెప్ట్స్, ఫిగర్​ క్లా సిఫికేషన్‍, అర్థమెటికల్​​​ నంబర్​ సిరీస్‍, నాన్‍వర్బల్​ సిరీస్​ వంటి టాపిక్‍లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి ఆలోచనలు, సింబల్స్, వాటిని గుర్తించడం, అర్థమెటికల్‍ కంప్యూటేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు. ప్రాక్టీస్‍తోనే మంచి మార్కులు పొందవచ్చు. దీనికి ఆర్‍ఎస్‍ అగర్వాల్‍ రీజనింగ్‍ పుస్తకంతో పాటు ఎస్‍ఎస్‍సీ ఇతర పరీక్షల ప్రీవియస్‍ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్​ ప్యాటర్న్ తెలుస్తుంది.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్: నంబర్​ సిస్టమ్స్, వోల్‍నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్‍ అర్థమెటిక్‍ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం–దూరం, నిష్పత్తి-కాలం, కాలం -పని వంటి టాపిక్‍ల నుంచి ప్రశ్నలిస్తారు. ముందుగా సిలబస్‍లో ఉన్న టాపిక్‍లను బాగా ప్రాక్టీస్​ చేయాలి. సమయం ఉంటే ఇతర టాపిక్‍లు నేర్చుకోవాలి. ప్రీవియస్​ పేపర్లను అవగాహన చేసుకుంటే ప్రిపరేషన్ సులువవుతుంది.

జనరల్​ అవేర్‍నెస్‍: జనరల్​ అవేర్‍నెస్​ విభాగం చాలా విస్తృతమైనది. కరెంట్‍అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్​ నాలెడ్జ్‌లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిషు పాలన, స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర్య సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీరధర్మ శాస్ర్తం, వ్యాధులు, వైరస్‍లు, మొక్కలు – ఉపయోగపడే భాగాలు వంటి అంశాలను చదువుకోవాలి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలుంటాయి కాబట్టి వీటికి ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాలను చదవాలి.

సెలెక్షన్​: ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సీబీటీ పరీక్ష: సెషన్-I: న్యూమరికల్ అండ్‌ మ్యాథమెటికల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు/ 60 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్ సాల్వింగ్ (20 ప్రశ్నలు/ 60 మార్కులు).

సెషన్-II: జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు). ప్రతి సెషన్ 45 నిమిషాల సమయం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్​, నవంబర్ నెలల్లో ఉంటుంది.

ఎంటీఎస్​ వివరాలు​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: మొత్తం 8,326 పోస్టుల్లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌మినిస్టీరియల్‌): 4,887, హవల్దార్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌): 3,439 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1-ఆగస్టు -2024 నాటికి పోస్టులను అనుసరించి 18- నుంచి 25, 18- నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 27 నుంచి జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.ssc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Phone Storage Tips: మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఖాళీ అవుతుంది

నేటి కాలంలో ప్రజలు తమ ఫోన్‌లలో ప్రతిదానికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉంచాలనుకుంటున్నారు. తద్వారా ఫోన్‌లో వారిని చూడాలని అనిపించినప్పుడల్లా ఆ క్షణం మళ్లీ గుర్తుకు తెచ్చుకోవచ్చు.

కానీ చాలా సార్లు మనం మన ఫోన్‌లో ప్రత్యేకమైన క్షణాన్ని క్యాప్చర్ చేస్తున్నప్పుడల్లా స్టోరేజ్ నిండినట్లు మీ ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూసినా ప్రతి సారి నిరాశకు గురవుతుంటాము. అప్పుడు వారు ఫోన్‌లో నిల్వను ఖాళీ చేయడం ప్రారంభిస్తారు. కానీ ఇప్పుడు మీరు స్టోరేజ్ పూర్తి నోటిఫికేషన్‌ను పొందకూడదు. అందుకే దీని కోసం మీరు కొన్ని ట్రిక్స్‌ని అనుసరించాలి. ఆ తర్వాత మీరు మీ ఫోన్ నిల్వను నిర్వహించగలుగుతారు. అందుకే ఆ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.

ఇది కూడా :
Mobile Restart: ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?

ఖాళీ స్థలాన్ని ఉపయోగించండి:

మీరు Android ఫోన్‌ని ఉపయోగిస్తుంటే స్టోరేజీ నిండినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. దీని కోసం మీరు ఫోన్‌ స్టోరేజీని ఖాళీ చేసేందుకు మరో స్టోరేజ్‌ని సృష్టించాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫోన్ నుండి ఉపయోగించని యాప్‌లను తొలగించండి. అవి ఫోన్‌లో ఖాళీని మాత్రమే ఆక్రమిస్తాయి. అటువంటి పరిస్థితిలో అవసరం లేని యాప్స్‌ను తొలగించడం చాలా ముఖ్యం. ఇది కాకుండా ఫోన్‌లో కొన్ని యాప్‌లు డిఫాల్ట్‌గా కూడా వస్తాయి. మీరు అలాంటి యాప్‌లను కూడా ఫోన్ నుండి తీసివేయవచ్చు.

ఆటోమేటి సెట్టింగ్‌ని నిలిపివేయండి:

ఫోన్‌లో ఎక్కువ స్టోరేజీ సోషల్ మీడియాతో నిండిపోవడం తరచుగా కనిపిస్తుంది. దీని కారణంగా మీరు స్టోరేజ్ నిండిన నోటిఫికేషన్‌లను మళ్లీ మళ్లీ పొందడం ప్రారంభిస్తారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. దీని కారణంగా చిన్న, పెద్ద అందరూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని వల్ల కొన్నిసార్లు అనవసరమైన ఫైల్‌లు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా నుండి మీ ఫోన్‌లోకి ఇష్టం లేకుండానే డౌన్‌లోడ్ అవుతాయి. వీటిని నిలిపివేయండి. అలాగే ఫోన్‌లో అవసరం లేని ఎక్కువ సైజు కలిగిన వీడియోలను తొలగించండి. ఒకే విధంగా ఉన్న ఫోటోలను డిలీట్‌ చేయడం ఉత్తమం. మీ అన్ని సోషల్ మీడియా యాప్‌ల సెట్టింగ్‌లకు వెళ్లండి. ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్ ఆన్‌ ఉంటే ఆఫ్‌ చేయండి. తద్వారా మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన వెంటనే ఫైల్‌లు డౌన్‌లోడ్‌ కావు. ఇది కాకుండా, మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా స్టోరేజ్ ఆప్షన్ నుండి అనవసరమైన ఫైల్‌లను కూడా తొలగించవచ్చు.

విద్యార్థులకు శుభవార్త వినిపించిన చంద్రబాబు ప్రభుత్వం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర మానవ వనరుసల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

తాజాగా నిర్వహించిన సమావేశంలో గత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకనుంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కింద కొన్ని కళాశాల్లో డబ్బు జమవలేదు.

సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు

అలా జమవకపోవడంవల్ల సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఉన్నప్పటికీ వారికి వెంటనే సర్టిఫికెట్లు అందించాలంటూ నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్ల బకాయిలు పెట్టడంతోపాటు ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం తొలగించిందని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవల్ల ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోయాయన్నారు.

సమూల ప్రక్షాళన

విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను, అధ్యాపకులను సినిమా థియేటర్ల దగ్గర కాపలాగా ఉంచిన విషయం తెలిసిందే. సినిమా థియేటర్లలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ ధరలకే అమ్మకాలు సాగుతున్నాయా? లేదా? అనే విషయం పరిశీలింపచేయడానికి వీరిని ఉపయోగించారు. దీనిపై టీచర్లు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇదొక్కటే కాకుండా కొన్ని సర్వేలకు, మరికొన్ని ఇతర పనులకు పాఠాలు బోధించే గురువులను ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటువంటివాటినన్నింటినీ చక్కదిద్ది గురువులను కేవలం పాఠాల భోదనకే పరిమితం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

Men Bald Head: పురుషుల బట్టతలకు ప్రధాన కారణాలు ఏంటంటే..

Men Bald Head: పురుషుల బట్టతల అనేది చాలా మంది పురుషులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇది ఒకరి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇకపోతే పురుషుల బట్టతలకు ప్రధాన కారణాలను చూస్తే..

జన్యుపరంగా:

పురుషుల బట్టతల ప్రధాన కారణాలలో ఒకటి జన్యుపరం. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని కూడా పిలువబడే మగ బట్టతల అనేది పెద్ద సంఖ్యలో పురుషులను ప్రభావితం చేసే వంశపారంపర్య పరిస్థితి. ఈ రకమైన జుట్టు రాలడం అనేది జుట్టు తగ్గడం, తలపై జుట్టు సన్నబడటం ద్వారా తెలుస్తుంది. మీ తండ్రి లేదా తాత వంటి మీ కుటుంబంలోని పురుషులు బట్టతలను అనుభవించినట్లయితే, మీరు కూడా ఈ లక్షణాన్ని వారసత్వంగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

హార్మోన్ల అసమతుల్యత:

పురుషుల బట్టతల దోహదపడే మరో అంశం హార్మోన్ల అసమతుల్యత. పురుషులలో అధిక స్థాయిలో ఉండే హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ను 5-ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ ద్వారా డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) గా మార్చవచ్చు. DHT జుట్టు కుదుళ్లను కుదించగలదు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. వృద్ధాప్యం లేదా కొన్ని వైద్య పరిస్థితుల కారణంగా హార్మోన్ల మార్పులు జుట్టు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా బట్టతల వస్తుంది.

ఒత్తిడి, జీవనశైలి కారకాలు:

ఒత్తిడి, జీవనశైలి కారకాలు కూడా మెన్ బాల్డ్ హెడ్లో పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి టెలోజెన్ ఎఫ్లువియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది, దీనివల్ల జుట్టు అధికంగా రాలుతుంది. పేలవమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం మరియు ధూమపానం జుట్టు పెరుగుదలతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం మరియు ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

వైద్య పరిస్థితులు, చికిత్సలు:
కొన్ని వైద్య పరిస్థితులు మరియు చికిత్సలు పురుషుల బట్టతలకు దోహదం చేస్తాయి. అలోపేసియా ఏరియాటా, థైరాయిడ్ రుగ్మతలు, స్వయం ప్రతిరక్షక వ్యాధులు వంటి పరిస్థితులు జుట్టు రాలడానికి కారణమవుతాయి. అదనంగా, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తాత్కాలిక లేదా శాశ్వత బట్టతలకు దారితీయవచ్చు. జుట్టు రాలడానికి కారణమయ్యే అంతర్లీన వైద్య సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.

Health Tips : ఖాళీ కడుపుతో టీకి బదులుగా తులసి-అల్లం నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Health Tips : ఖాళీ కడుపుతో టీకి బదులుగా తులసి-అల్లం నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Health Tips : ఆరోగ్యంగా ఉండటానికి, ప్రజలు తరచుగా వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం, సమయానికి లేవడం, వ్యాయామం చేయడం, కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభిస్తుంటారు. మన దేశంలో చాలా మంది టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించేందుకు ఇష్టపడతారు. కానీ బదులుగా మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజు మొదలుపెట్టవచ్చు. మీరు రోజు ప్రారంభంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటే వ్యాధుల నుండి బయటపడవచ్చు. దీని కోసం, మీరు ప్రతిరోజూ ఉదయం పాలు టీ లేదా కాఫీకి బదులుగా తులసి, అల్లం నీరు త్రాగవచ్చు. తులసి, అల్లం రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, ప్రతిరోజూ ఉదయాన్నే తులసి, అల్లం నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. తులసి, అల్లం రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం అల్లం, తులసి నీటిని తాగడం ద్వారా మీరు అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు,

ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
1.యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్
యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు తులసిలో ఉన్నాయి. మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంతో పాటు, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

2.బరువు తగ్గడంలో సాయం
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీళ్లు తాగితే బరువు తగ్గడం సులువవుతుంది. ఇది మీ పొట్టలో ఉండే అదనపు కొవ్వును సులభంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

3.మెరుగైన జీర్ణక్రియ
తులసిలో యుజినాల్ ఉంటుంది, ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్లంలో జింజెరాల్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

4. బలమైన రోగనిరోధక శక్తి
మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే లేదా వాతావరణం మారుతున్నందున మీరు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే దాని నుండి బయటపడటానికి, మీరు ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా తులసి, అల్లం నీటిని త్రాగాలి.

5. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు
తులసి, అల్లం నుండి తయారైన ఈ పానీయం యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది మీ శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ డ్రింక్ తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.

Stress Effects: ఒత్తిడికి గురవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసా..?

ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ఇది డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది. అధిక ఒత్తడికి గురైతే అనేక వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి, ఆందోళన గుండెపై చాలా ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి హార్ట్ రేటు, రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది, ఇది గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాలక్రమేణా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అరిథ్మియా వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదం పెంచుతుంది. స్ట్రెస్ గుండెపోటు, స్ట్రోక్‌ రిస్క్‌ను పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఒత్తిడి లేదా ఆందోళనకు బాడీ ఎలా స్పందిస్తుందో నిర్ణయించడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. స్ట్రెస్‌ ఎదుర్కొన్నప్పుడు, మెదడులోని హైపోథాలమస్ కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదలను పెంచుతుంది. ఈ హార్మోన్లు శరీరాన్ని ముప్పును ఎదుర్కోవడానికి లేదా దాని నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉంచుతాయి. స్ట్రెస్ లెవల్స్ ఎగ్జిమా, సోరియాసిస్, మొటిమలు వంటి సమస్యలను మరింత పెంచుతాయి. ఒత్తిడి వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత ఆయిల్ ప్రొడక్షన్‌ను పెంచుతుంది. దీంతో మొటిమలు ఏర్పడతాయి. అంతేకాకుండా, ఒత్తిడి స్కిన్ బ్యారియర్ ఫంక్షన్‌పై నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపుతుంది. దీని కారణంగా ముడతలు, సన్నని గీతలు ఏర్పడతాయి.

ఒత్తిడి, ఆందోళన శ్వాస వ్యవస్థపై కూడా ప్రభావితం చూపిస్తాయి, స్ట్రెస్ ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస వేగం పెరగడం, పానిక్ అటాక్స్ కూడా రావచ్చు. ఆందోళన కారణంగా హైపర్‌వెంటిలేషన్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ తగ్గింపు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే, వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురైన వ్యక్తులు తరచుగా జలుబులు వస్తాయి, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తాయి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు, గట్ గట్-బ్రెయిన్ యాక్సెస్ ద్వారా నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ, ఒకదానితో ఒకటి దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి. ఒత్తిడి ఈ కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తుంది, అప్పుడు ఇర్రిటబుల్ బావెల్ సిండ్రోమ్ (IBS), యాసిడ్ రిఫ్లక్స్, క్రానిక్ ఇన్‌డైజెషన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఒత్తిడి వల్ల పేగులోని బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా క్రోన్స్ వ్యాధి, పెప్టిక్ అల్సర్ వంటి పరిస్థితులను మరింత తీవ్రతరమవుతుంది. ఒత్తిడిలో ఉన్న చాలా మందికి వికారం, అతిసారం లేదా మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Ghee: నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే

Ghee: నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే

నెయ్యి మన జీవితంలో ఒక భాగమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నారులు తినడానికి మారాం చేస్తే అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తుంటారు. పెద్దలు కూడా నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక ఎన్నో రకాల స్వీట్ల తయారీలో, వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ప్యూర్‌ నెయ్యితో చేసే స్వీట్స్‌ రుచి మాములుగా ఉండదు. అందుకే నెయ్యిని ఇష్టంగా తింటుంటారు.

అయితే చాలా మంది నెయ్యి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనే భావనలో ఉంటారు. మరి నిజంగానే నెయ్యి తింటే బరువు పెరుగుతారా.? అసలు నెయ్యితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

ముఖ్యంగా రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండొచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భినీలు నెయ్యి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖంలో నిగారింపు రావాలంటే ప్రతీరోజూ కచ్చితంగా నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

మహిళలు పీరియడ్స్‌ సమయంలో నెయ్యిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలసరి క్రమంగా రాని వారికి నెయ్యి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్‌ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్‌ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

Lifestyle: ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేస్తున్నారా.? ఈ సమస్య తప్పదు..

ఉదయం టిఫిన్‌ చేయడం ఎంతో ముఖ్యమని చెబుతుంటారు. రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి ఉదయం వీలైనంత త్వరగా టిఫిన్‌ చేయాలని సూచిస్తుంటారు. అయితే ఉదయం టిఫిన్‌ చేయడం ఎంత ముఖ్యమో, ఏ సమయంలో చేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా టిఫిన్‌ చేసే వారిలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇదేదో ఆషామాషిగా చెబుతోన్న విషయం కాదు. పలువురిపై పరిశోధనలు చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చారు. ఉదయం 8 గంటల్లోపే టిఫిన్‌ చేసిన వారికి, 9 గంటల తర్వాత తిన్న వారితో పోలిస్తే మధుమేహం వచ్చే అవకాశాలు 59 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. టైప్‌ 2 డయాబెటిస్‌ రావడానికి అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తగ్గడం, స్మోకింగ్ వంటివి మాత్రమే కారణమని మనకు ఇప్పటి వరకు తెలుసు. అయితే ఆలస్యంగా టిఫిన్‌ చేయడం కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

ఆహారాన్ని తీసుకునే సమయం రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునే సమయాల మధ్య గ్యాప్‌ టైప్‌2 డయాబెటిస్‌ మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు గాను ఐఎస్‌గ్లోబల్‌ నిపుణులు పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా 1,03,312 మందిని పరిగణలోకి తీసుకొని వారి ఆహార అలవాట్లను విశ్లేషించారు. దాదాపు ఏడేళ్లకు పైగా వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.

వీరిలో ఆలస్యంగా టిఫిన్‌ తీసుకున్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రోజూ ఉదయం 9 గంటల తర్వాత టిఫిన్‌ తీసుకున్న వారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారికి కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Nitish Kumar: కేంద్రానికి నీతీశ్ కుమార్‌ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం

Nitish Kumar: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు.

దిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నీతీశ్ (Nitish Kumar) కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మోదీ సర్కారుకు గట్టి మెలిక పెట్టింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బిహార్‌ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వాలని అడిగింది. ఈమేరకు పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది.

జనతాదళ్‌ (యునైటెడ్‌) జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఇందులో బిహార్‌కు ప్రత్యేక హోదా (Special Status for Bihar) లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతోపాటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని కోరింది.

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్‌ గతేడాది నవంబరులో ఆమోదించింది. అయితే, అప్పటికి నీతీశ్ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కూటమికి గుడ్‌బై చెప్పిన సీఎం.. మళ్లీ భాజపా గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఈ క్రమంలోనే ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని నీతీశ్ పార్టీ తాజాగా లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సమావేశం అనంతరం జేడీయూ (JDU) సీనియర్‌ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ కొత్తదేమీ కాదు. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ’’ అని అన్నారు. ఇక, ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్‌ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.

AP News: విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం

విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డి అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

కడప: కడప జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డి అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ను నియమించింది. రాఘవరెడ్డి అక్రమాలపై మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ప్రభుత్వం విచారణ చేపట్టింది.

‘ఆర్జేడీ రాఘవరెడ్డి గతంలో డీఈవోగా పనిచేస్తున్న సమయంలో వైకాపా నేతలతో అంటకాగుతూ విధులు నిర్వర్తించారు. ఉపాధ్యాయులను దూషించడం, మహిళా ఉపాధ్యాయినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని ఇష్టానుసారంగా బదిలీలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ లేకుండా లంచాలు తీసుకుని బదిలీలు, డిప్యుటేషన్లు చేయడమే కాకుండా వీటిపై ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించారు. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించకున్నా అనుమతులిచ్చారు. 2023, మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పనిచేశారు. ఆయన తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే నా అంతు చూస్తానని ఆర్జేడీ బెదిరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈయన కోట్లాది రూపాయలు వసూలు చేసి అక్రమ బదిలీలు చేశారు’ అని భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

లావెక్కుతామని రాత్రిపూట తిండి మానేస్తున్నారా?.. తర్వాత జరిగేది తెలిస్తే..

కాస్త లావు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రిపూట తిండి మానేస్తుంటారు. మరి కొందరు ఉద్యోగాల నుంచి ఇంటికి తిరిగి రావడంలో ఆలస్యం కారణంగా ఏమీ తినకుండానే పడుకుంటారు.

కానీ ఇది ప్రమాదకరమని, వివిధ అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.

* బరువు తగ్గాలన్న ఉద్దేశంతోనో, టైమ్ లేదన్న కారణంతోనో రాత్రిపూట తిండి మానేస్తే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఈ పరిస్థితి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రించే శక్తిని బలహీన పరుస్తుంది. దీంతో బీపీ, షుగర్ పేషెంట్లు అయితే గనుక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ముఖ్యంగా సాయంకాలం ఏడెనిమిది గంటలలోపు తినడం ఆరోగ్యానికి మంచిది.

* రాత్రిళ్లు తిండి మానేసేవారు తమకు తెలియకుండానే జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒకటి తినాలనే కోరిక క్రమంగా పెరుగుతుంది. అన్నానికి బదులు కొందరు చిప్స్ లేదా ఓ స్వీటు ముక్క తింటుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. మెల్లిగా ఈటింగ్ డిజార్డర్‌కు దారితీయవచ్చు.

* సమయం ప్రకారం శరీరానికి ఆహారం అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కావాల్సిన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. రాత్రిళ్లు తిండి మానేయడంవల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. క్రమంగా ఇతర అనారోగ్యాలకు కారణం అవుతాయి.

* సాయంత్రం ఏడు తర్వాత చేసే భోజనం శరీరంలో వివిధ జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. కండరాల బలానికి కూడా ఇది ముఖ్యం. ఒకవేళ తినకుండా పడుకోవడం దీర్ఘకాలం కొనసాగిస్తే కండరాలు, నరాల బలహీనత వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ప్రోటీన్లు, అమైనో యాసిడ్స్ రిలీజ్ అయ్యే సామర్థ్యం కూడా తగ్గుతుంది.

* కారణాలేమైనా రాత్రిపూట తినకుండా నిద్రపోవడంవల్ల శరీరంలో పోషకాల లోటు ఏర్పడుతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గి, నీరసం, బలహీనత ఆవహిస్తాయి. ఫలితంగా ఏ పనిమీదా ఆసక్తి ఉండదు. మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంటాయి. కోపం, చిరాకు వంటివి పెరుగుతాయి.

* చాలా మంది రాత్రిళ్లు తినకుండా పడుకుంటే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ బరువు పెరిగే అవకాశాలే ఎక్కువట. ఎందుకంటే తినకపోవడం అనేది జీవక్రియ రేటును నెమ్మదిస్తుంది. శక్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఒబేసిటీకి దారితీసే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిళ్లు పూర్తిగా తిండి మానేయడం కాకుండా తేలికపాటి ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

New Rules: ఇక రూల్స్‌ మరింత కఠినతరం.. జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు

ప్రతి నెల కొత్త కొత్త మార్పులు జరుగుతుంటాయి. వినియోగదారులు ప్రతినెల రాగానే ఏయే విషయాలలో కొత్త నిబంధనలు మారనున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మార్పులు మీకు నేరుగా సంబంధించినవి కాబట్టి, మీరు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల, ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా చాలాసార్లు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అలాగే చాలా సార్లు, గడువు తేదీలు తెలియకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతాయి.

జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు మారనున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ TRAI SIM కార్డ్ దొంగతనం లేదా SIM స్వాప్ మోసాన్ని నిరోధించడానికి లాకింగ్ వ్యవధిని ఏడు రోజులకు పొడిగించింది. అంటే ఇప్పుడు మీరు సిమ్‌ పోర్ట్‌ పెట్టుకున్నట్లయితే వెంటనే పొందలేరు.

దాని కోసం మీరు ఏడు రోజులు వేచి ఉండవలసి ఉంటుంది.
జూలైలో మీ మొబైల్‌కి రీఛార్జ్ చేయడానికి మీరు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ తమ టారిఫ్‌లను పెంచడమే దీనికి కారణం.
ప్రతి నెలా మొదటి తేదీన, పెట్రోలియం కంపెనీలు LPG సిలిండర్లు, టీటీఎఫ్‌ ధరలను సవరిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు జూలై 1 నుండి గ్యాస్ సిలిండర్‌పై కూడా ఉపశమనం పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుకు సంబంధించిన కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో అన్ని బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

అయితే, బ్యాంకులు ఇంకా ఈ సూచనలను పాటించలేదు. ఇప్పటి వరకు 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి.
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉండి, ఎక్కువ కాలం ఉపయోగించకుంటే, జూలై 1 నుంచి అది పనిచేయదు. ఏప్రిల్ 30, 2024 నాటికి, 3 సంవత్సరాలకు పైగా వాడుకలో లేని ఖాతాలు ఇప్పుడు ఒక నెలలో మూసివేయబడతాయని బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కస్టమర్‌లను అసౌకర్యం నుండి కాపాడేందుకు బ్యాంక్ 30 జూన్ 2024 వరకు గడువు విధించింది.

సెల్‌ఫోన్ వాడితే క్యాన్సర్‌ వస్తుందా? ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే!

Cancer: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే చాలా మంది గందరగోళానికి గురవుతారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, ఒకసారి వచ్చిందంటే కోలుకోవడం కష్టమనే అపోహలు పెట్టుకుంటారు.

ఇలాంటి అపోహలతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో క్యాన్సర్‌పై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎజిలస్ డయాగ్నోస్టిక్స్‌లో గ్లోబల్ రెఫరెన్స్ లాబోరేటరీ హెచ్‌ఓడీ, అసిస్టెంట్ డైరెక్టర్ డా.కునాల్ శర్మ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి గురించి వాస్తవాలు ప్రచారం చేయాలని ‘న్యూస్9లైవ్’తో చెప్పారు. బాధితులకు ఉండే 13 అపోహలు, అసలు నిజాల గురించి ఆయన వివరించారు.

క్యాన్సర్ నిజంగానే ప్రాణాంతక వ్యాధి?

క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రెగ్యులర్ స్క్రీనింగ్స్ ద్వారా వ్యాధిని ఎర్లీగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మోడర్న్ మెడిసిన్‌తో వ్యాధి నయం అవుతుంది. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల సర్వైవల్ రేటు 90 నుంచి 95 శాతంగా ఉండటం ఇందుకు ఒక ఉదాహరణ.

పొగరాయుళ్లకే లంగ్ క్యాన్సర్ వస్తుందా?

పొగరాయుళ్లకే లంగ్ క్యాన్సర్ వస్తుందనే అపోహ ఉంటుంది. స్మోకింగ్ లంగ్ క్యాన్సర్‌కి కారణమవుతుంది. కానీ, నాన్ స్మోకర్స్ కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. లంగ్ క్యాన్సర్లలో దాదాపు 10-20 శాతం మంది నాన్ స్మోకర్లే ఉంటున్నారు. పొగ పీల్చడం, రేడాన్ గ్యాస్, పర్యావరణ కాలుష్యం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి దారితీస్తాయి.

వంశపారంపర్యంగా క్యాన్సర్ వ్యాధి సోకడం?

అన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. వారసత్వం కారణంగా క్యాన్సర్ సోకే ముప్పు మాత్రమే పెరుగుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, కేవలం 5-10 శాతం క్యాన్సర్లు జెనిటిక్ మ్యుటేషన్స్ వల్ల సోకుతున్నాయి. ప్రధానంగా పర్యావరణం, జీవనశైలి క్యాన్సర్లకు కారకమవుతున్నాయి.

ఇ-సిగరెట్లు తాగితే క్యాన్సర్ రాదా?

ఇది కూడా అపోహే. ఇ-సిగరెట్లలోనూ హానికర పదార్థాలు ఉంటాయి. వీటిని తాగితే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. తద్వారా లంగ్ క్యాన్సర్‌కి దారితీయొచ్చు.

ఆల్కహాల్ ఫుల్లుగా తాగితేనే క్యాన్సర్ వస్తుందా?

ఆల్కహాల్ అతిగా తాగకున్నా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. ఓ మోస్తరుగా తాగినా రొమ్ము, లివర్, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ముప్పు ఉంటుంది. తాగుబోతులకు మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకోవడం అపోహే.

అంతా ఐపోయాక స్మోకింగ్, డ్రింకింగ్ మానేస్తే ప్రయోజనం ఉండదా?

స్మోకింగ్, డ్రింకింగ్ ఏ సమయంలోనైనా మానేయచ్చు. ఎంత ఆలస్యమైనా సరే మానేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. తీవ్ర దుష్పరిణామాలు ఉండవు.

గంజాయి సిగరేట్ తాగితే క్యాన్సర్ రాదా?

గంజాయిలోనూ క్యాన్సర్ కారక కార్సినోజెన్లు ఉంటాయి. వీటిని తాగితే లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

క్యాన్సర్ వ్యాధి కన్నా చికిత్సనే ఇబ్బందిగా ఉంటుందా?

క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంతో వ్యాధి వల్ల కలిగే నొప్పికన్నా ట్రీట్‌మెంట్‌తో ఎక్కువ బాధ కలుగుతుంది. అయితే, అడ్వాన్స్‌డ్ థెరపీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మారింది. నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసి చికిత్స చేసే ఫెసిలిటీ ఉంది. దీంతో ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం జరగదు. త్వరగా క్యాన్సర్‌ని గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ సమస్య నుంచి బయటపడొచ్చు.

షుగర్ కంటెంట్ క్యాన్సర్‌కి కారకం అవుతుందా?

సాధారణ కణాలతో పోలిస్తే క్యాన్సర్ కణాలు అధిక గ్లూకోజ్ పీల్చుకుంటాయి. అయితే, క్యాన్సర్ కణాలు పెరగడానికి షుగర్ కంటెంట్ కారణమని చెప్పడానికి సరైన ఎవిడెన్స్ లేదు. కాకపోతే, ఎక్కువ మోతాదులో షుగర్ కంటెంట్ తింటే ఊబకాయం వస్తుంది. ఊబకాయం ఉంటే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది.

క్యాన్సర్‌తో భరించలేని నొప్పి వస్తుందా?

అన్ని రకాల క్యాన్సర్లు నొప్పిని కలగజేయవు. వ్యాధి ముదిరితే తప్ప నొప్పి రాదు. కాబట్టి, లక్షణాలను పసిగట్టి ఎర్లీగా వ్యాధిని నిర్ధారిస్తే సరైన చికిత్సతో నయం చేసుకోవచ్చు.

ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ని నయం చేస్తుందా?

ప్రకృతి వైద్యంతో క్యాన్సర్ నయమవుతుందనే విషయంపై సరైన ఆధారాలు లేవు. సంప్రదాయ వైద్యం లక్షణాలను మాత్రమే మేనేజ్ చేస్తుంది. ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి.

వృద్ధులపైనే క్యాన్సర్ ప్రభావం ఎక్కువా?

వయసు మీరిన వారిపైనే క్యాన్సర్ ప్రభావం అధికంగా ఉంటుందనేది అవాస్తవం. క్యాన్సర్ ఏ వయసులోనైనా సోకుతుంది. వయసు పెరుగుతన్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది. ల్యూకేమియా, ఎముకల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్ వంటివి చిన్నారుల్లోనూ వ్యాపిస్తున్నాయి.

సెల్ ఫోన్స్ క్యాన్సర్‌కి కారణం అవుతున్నాయా?

సెల్‌ఫోన్స్ వాడితే క్యాన్సర్ వస్తుందని కచ్చితంగా చెప్పలేం. దీనిపై లోతైన పరిశోధనలు జరగాలి. రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్ కార్సినోజెనిక్‌గా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, దీనికి డైరెక్ట్ ప్రూఫ్ లేదు.

మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే ఆయుర్వేద మొక్క.. ఇలా వాడండి

Centella Asiatica: ఆయుర్వేద మొక్కలలో చాలావరకు ఓవరాల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. వీటిలో కొన్నింటిని పురాతన కాలం నుంచి వివిధ రకాల వ్యాధులకు చికిత్సగా వాడుతున్నారు.

అయితే వీటిలో ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు చాలా మంచి చేసేవి మాత్రం కొన్నే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ముఖ్యమైనది గోటు కోలా (Gotu Kola) లేదా సెంటెల్లా ఆసియాటికా (Centella asiatica) ఒకటి. దీని ఆకులను సరస్వతీ ఆకులు అంటారు. ఈ మొక్క ఆకులు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతూ వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అలాగే ఇతర అనారోగ్యాలకు చెక్ పెడతాయి.

గోటు కోలాలో ట్రైటెర్పెనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్, మచ్చలను తగ్గించే శక్తి వీటి సొంతం. వీటిలోని సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తాయని ‘మనీ కంట్రోల్’తో చెప్పారు BDR ఫార్మాస్యూటికల్స్‌లో టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బాడిగేర్. ఈ మొక్క హెల్త్ బెనిఫిట్స్‌ గురించి ఆయన వివరించారు.

చర్మ ఆరోగ్యం

గోటు కోలా గాయాలు త్వరగా నయం చేసే అద్భుతమైన ఔషధం. ఇందులో ఉన్న అసియాటికోసైడ్ వంటి పదార్థాలు కొత్త చర్మం ఏర్పడటానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి, స్కిన్ బలంగా ఉండేలా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది వృద్ధాప్య సాయిలు రాకుండా చూస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. దీని వల్ల ముడతలు, చిన్న గీతలు తగ్గుతాయి. స్కిన్ ఇన్‌ఫ్లమేషన్, దురద, ఎగ్జిమా, సోరియాసిస్, మొటిమలు వంటి సమస్యల నుంచి కూడా ఈ మొక్క ఒక రిలీఫ్ కలిగిస్తుంది. స్కిన్ రెడ్‌నెస్‌ను, దురదను తగ్గించి, చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

గోటు కోలా చర్మానికి నేచురల్ హైడ్రేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం తేమను నిలుపుకునేలా చేస్తుంది. అమైనో ఆమ్లాలు, బీటా కెరోటిన్, ఫ్యాటీ యాసిడ్స్‌, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటంతో చర్మానికి పోషణ లభిస్తుంది, చర్మాన్ని మృదువుగా, ఎలాస్టిక్‌గా తయారవుతుంది. గోటు కోలాను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే స్కిన్ టోన్ ఈవెన్‌గా, స్కిన్ టెక్చర్ మరింత సాఫ్ట్‌గా మారుతుంది. మచ్చలు, మొటిమల మచ్చలు తగ్గి, చర్మం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

అనారోగ్యాలకు చెక్

గోటు కోలాను మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, ఆందోళన, ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది. మెదడు కణాలను రక్షించడం, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికీ చాలా మంచిది. ఇది సిరలను, చిన్న రక్తనాళాలను బలోపేతం చేస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, వారికోస్ వెయిన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొట్ట సమస్యలు, ఒత్తిడి దూరం

గోటు కోలా అజీర్తి, అల్సర్స్ వంటి స్టమక్ ప్రాబ్లమ్స్‌ను పోగొడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్‌ను కూల్ చేస్తుంది. గట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మూలిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కామ్‌ అయిపోతుంది. దీని వల్ల ఆందోళన స్థాయిలు తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గోటు కోలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇవి వ్యాధులతో పోరాడతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని ఆక్సీడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది

ఎలా ఉపయోగించాలి?

మార్కెట్లో సెంటెల్లా ఆసియాటికా ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారు చేసిన క్రీమ్స్, సీరమ్స్‌ లభిస్తాయి. క్యాప్సూల్‌ లేదా టాబ్లెట్ల రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ మొక్కల ఆకులను ఎండబెట్టి టీ చేసుకోవచ్చు. లేదా పచ్చి ఆకుల సారాన్ని డ్రింక్స్‌లో కలిపి తాగవచ్చు.

1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా?

Calories Burned By 1 Km Walk: నడక అనేది ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాయామం. నడకకు వెళ్లడం ద్వారా మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే క్యాలరీలు కరిగిపోవడానికి ఒక్క నడక సరిపోదని కొందరు అంటున్నారు.

1 కి.మీ నడిచేటప్పుడు ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి?

మేము ఇప్పటికే చెప్పినట్లుగా నడక అనేది వ్యాయామం యొక్క సరళమైన మరియు అత్యంత ప్రభావవంతమైన రూపాలలో ఒకటి. గుండెను ఆరోగ్యంగా ఉంచడం నుండి శ్వాసకోశ వ్యవస్థను అదుపులో ఉంచడం వరకు, నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఒక వ్యక్తి 1 కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయనే ప్రశ్నకు నిజమైన సమాధానం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. అవును, ఈ విషయం ఒకరి బరువు మరియు నడక వేగంపై ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నడిచేటప్పుడు మీరు ఎన్ని కేలరీలు బర్న్ చేస్తారో ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి…

బరువు:

నడక సమయంలో కేలరీలను బర్న్ చేయడంలో ఒక వ్యక్తి యొక్క బరువు (Weight) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్నవారు నడిచేటప్పుడు ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలరు. ఎందుకంటే వారు నడవడానికి ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 90 కిలోల బరువున్న వ్యక్తితో పోలిస్తే 70 కిలోల బరువున్న వ్యక్తి 1 కిలోమీటరు నడవడం వల్ల తక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి.

వేగం:

ఒక వ్యక్తి తన నడకలో ఎంత వేగంగా నడుస్తాడో కూడా అతను ఎన్ని కేలరీలు బర్న్ చేయగలడు. అంటే గంటకు 3-4 కి.మీ నడవడం కంటే ఒక గంటలో 5 నుండి 6 కి.మీ నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. నడక సమయంలో చురుకైన నడక హృదయ స్పందన రేటు మరియు శక్తి వ్యయాన్ని పెంచుతుంది. దీంతో శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయి.

వేదిక:

మనం నడిచే ప్రదేశం యొక్క భూభాగం కూడా కేలరీల వ్యయంపై ప్రభావం చూపుతుంది. కొండ ప్రాంతాలపై నడవడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది మరియు లోతువైపు నడవడం కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.

వయస్సు:

వయస్సుతో జీవక్రియ మందగిస్తుంది, కాబట్టి యువకులు నడకకు వెళ్ళే వృద్ధుల కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. అదనంగా, పురుషులు సాధారణంగా స్త్రీలతో పోలిస్తే ఎక్కువ కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు, దీని కారణంగా పురుషులు నడిచేటప్పుడు కొంచెం ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారు.

కేలరీల బర్న్ గురించి అంచనా వేసిన సమాచారం:

55 కిలోల బరువున్న వ్యక్తి గంటకు 5 కి.మీ వేగంతో నడవడం వల్ల కిలోమీటరుకు 50-60 కేలరీలు బర్న్ చేయగలవు.
అదే సమయంలో, 70 కిలోల బరువున్న వ్యక్తి ఒక కిలోమీటరు నడవడం ద్వారా దాదాపు 60-75 కేలరీలు బర్న్ చేయవచ్చు.
అంటే, 90 కిలోల బరువున్న వ్యక్తి 1 కి.మీ దూరం మితమైన వేగంతో నడవడం ద్వారా 80-100 కేలరీలు బర్న్ చేయగలడు.
ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం ఎలా?

నడకలో ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి బ్రిస్క్ వాకింగ్ ఒక గొప్ప మార్గం. కొంచెం వేగవంతమైన వేగంతో చురుకైన నడక హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఇది ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. పర్వత మార్గాల వంటి కఠినమైన మరియు అసమాన భూభాగాలపై నడవండి.

కల్కి మూవీలో అశ్వత్థామ తలదాచుకున్న గుడి నెల్లూరులోనే ఉంది! దాన్ని ఎవరు కట్టారో తెలుసా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి మానిమా నడుస్తోంది. ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే ఏకంగా 190 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, విజయ్‌ దేవరకొండ, దిషా పటాని లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. వీరికి తోడు రాజమౌళి, ఆర్జీవీ, సల్మాన్‌ దుల్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌ కూడా చిన్న చిన్న కామియోలు చేశారు.

ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అంత భారీ సక్సెస్‌ దిశగా దూసుకెళ్తోంది. అయితే.. ఈ కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ ఓ గుడిలో తలదాచుకుంటాడు. కొన్ని వందల ఏళ్లుగా ఆ గుడిలోనే ఆయన ఉంటాడు. కల్కి పుట్టికకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ గుడి నుంచి బయటికి వస్తాడు. అయితే.. అన్ని వందల ఏళ్లు అశ్వత్థామకు ఆశ్రయమించినట్లు చూపించిన ఆ గుడి.. నిజానికి మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయమే.. కల్కిలో అశ్వత్ధామ తలదాచుకున్న ఆలయంగా చూపించారు.

సినిమాలో ఆ ఆలయం కాశీలో ఉన్నట్లు చూపించారు. కానీ, నిజానికి ఆ ఆలయం నెల్లూరులో ఉంది. పెన్నానది తీరంలో దశాబ్దాలా పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ ఆలయం.. 2020లో ఇసుక తవ్వకాల్లో బయటపడింది. సప్త చిరంజీవుల(మరణం లేని వారు)లో ఒకడైన అశ్వత్థామ లాగే పరశురాముడు కూడా చిరంజీవుడే. ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1850లో వచ్చిన వరుదల్లో ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే.. ఈ ఆలయం బయటపడిన సమయంలో కంటే.. ఈ ఆలయాన్ని కల్కి సినిమాలో చూపించిన తర్వాత.. ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.

గుడిలో చేసే విధంగా ఇలా పొంగలిని ఎప్పుడైనా చేసుకున్నారా..?

పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం, బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకుంటాం. నెయ్యివేసి చేసిన పొంగలి టేస్టు గురించి మాటల్లో చెప్పలేము. పొంగలిని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు మీకు అందిస్తున్నాం.

చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే మీరు పొంగలిని చేసుకోవచ్చు.

పొంగలిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

1 కప్పు బియ్యం

ముప్పావు కప్పు పెసరపప్పు

ఉప్పు,

పావు టీ స్పూన్ మిరియాలు

3 టేబుల్ స్పూన్ల నెయ్యి

1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు

అర టీ స్పూన్ ఆవాలు

అర టీ స్పూన్ జిలకర

అల్లం ముక్కలు

3 పచ్చి మిరపకాయలు, కాజూలు

అర టీ స్పూన్ మిరియాలు

పావు టీస్పూన్ ఇంగువ

కొన్ని కరివేపాకులు

పొంగలిని తయారు చేసే విధానం

1. బౌల్‌లో 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి.

2. ముప్పావు కప్పు పెసరపప్పును తీసుకొని ప్యాన్‌లో బాగా ఫ్రై చేయాలి.

3. బియ్యంలో పెసరపప్పు తీసుకొని రెండింటిని బాగా కడగాలి.

4. నీళ్లు పోసుకొని అరగంట వరకు నానబెట్టాలి.

5. స్టవ్‌పై బౌల్‌ పెట్టి అందులో 7 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి.

6. రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాలను వేసుకొని నీళ్లను బాగా వేడి చేయాలి.

7. నానబెట్టిన బియ్యం, పప్పులను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి.

8. కొన్ని నిమిశాల తరువాత అన్నం ఉడుకుతుంది.

9. పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేయాలి.

10. ఒక కప్పు నీళ్లను కూడా ఇందులో పోసుకోవాలి.

11. కొన్ని నీళ్లను పోసుకొని మరో 4 నిమిశాలు ఉడికించాలి.

12. స్టవ్‌పై మరో ప్యాన్‌ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి.

13. నెయ్యి వేడయిన తరువాత అందులో 1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 14.

14. అర టీ స్పూన్ జిలకరను యాడ్ చేసుకోవాలి.

15. సన్నగా తరిగిన అల్లం ముక్కలను, 3 పచ్చి మిరపకాయలను, కొన్ని కాజూలను, అర టీ స్పూన్ 16. మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

17. ఇందులోనే పావు టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పావు 18. టీస్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి.

19. ఈ మొత్తాన్నీ ఉడుకుతున్న పొంగలిలో వేసుకోవాలి.

20. ఉడికిన అన్నం, పొంగలి పోపును బాగా కలుపుకుంటే పొంగలి రెడీ అయినట్టే.

బంగారం ధర: ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంటుంది మరియు బంగారం ధర రూ. 3000 తగ్గుతుంది

గోల్డ్ రేట్: మీరు బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కొంచెం ఆగండి.. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. రానున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది.

దీంతో బంగారం, వెండి ఆభరణాలు చౌకగా మారే అవకాశం ఉంది.

ఎన్‌బిటి నివేదిక ప్రకారం, బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుండి తగ్గించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10 శాతం తగ్గిస్తే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

మూలాధారాల ప్రకారం, కస్టమర్లు తమ ప్రీ-ఓన్డ్ బంగారాన్ని విక్రయించినప్పుడు GSTలో కొన్ని రాయితీలు పొందాలి. దీంతో దిగుమతులు తగ్గుతాయని, ప్రభుత్వ ద్రవ్యలోటుపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం ధర రూ. 3000 తగ్గవచ్చు, వెండి ధరలు రూ. 3800 తగ్గవచ్చు.

బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, దిగుమతి సుంకం తగ్గింపు బంగారం మరియు వెండి ధరలను పెద్దగా మార్చదు.

ప్రభుత్వం జీఎస్టీని 18 శాతానికి పెంచి, కస్టమ్స్ సుంకాన్ని జీరో చేస్తే బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టవచ్చని బంగారం-వెండి నిపుణుడు తెలిపారు. కస్టమర్ల వద్ద ఉన్న బంగారం అమ్మకంపై 3% జీఎస్టీని రద్దు చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. భారతీయ పౌరులు బంగారం మరియు వెండి పట్ల చాలా ఆకర్షితులవుతున్నారు. ప్రపంచంలోనే చైనా తర్వాత బంగారం, వెండిని అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారత్‌. అందుకే భారతదేశంలోకి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి అవుతుంది.

బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో బంగారం స్మగ్లింగ్ ఘటనలు భారీగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో DRI 1658 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గతేడాది కంటే ఈ సంఖ్య దాదాపు 35 శాతం ఎక్కువ.

GO. 117 రద్దు చేయాలి : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS

ప్రచురణార్ధం , తేదీ : 23/6/24

GO. 117 రద్దు చేయాలి : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ( TNUS )

ఎన్టీఆర్ భవన్ , మంగళగిరి నందు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ గారు పాలొన్నారు ఉపాధ్యాయ సమస్య లు పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కి పూర్తిగా అవగాహన ఉందని వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ GO. 117 రద్దు చేయాలనీ కోరారు. దీనివలన ప్రాధమిక పాఠశాలలు వేళాకొలది సింగల్ టీచర్ స్కూల్స్ గా మారిపోయి..మూత పడేదిశలో ఉన్నాయని తెలిపారు..కనుక ప్రాధమిక పాఠశాలల విలీనం రద్దు చేసేలా GO. 117 రద్దు చేయాలనీ కోరారు. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు నుంచి విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం లో ప్రధానకార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి పినాకఫాణి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యం రజనీబాబు నాయుడు,కే.రామలింగప్ప, సీహెచ్ పూర్ణ చంద్రరావు, బజారన్న,
కైతేపల్లి దాస్, సంజీవరెడ్డి, రాధాకృష్ణ ఉమ్మడి పదమూడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sajjala Ramakrishna Reddy: సజ్జల’ చుట్టూ ఉచ్చు బిగుస్తోందిలా

Sajjala Ramakrishna Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించారు సజ్జల భార్గవ్ రెడ్డి. వైసిపి ప్రభుత్వానికి, పార్టీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎంట్రీ తో వైసీపీలో సీన్ మారింది. జగన్ వెంట ఉండే కీలక నాయకులంతా వెనక్కి వెళ్లిపోయారు. అందరికంటే ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా క్రియాశీలకంగా మారారు ఆయన. అటు వైసీపీలో కీలకమైన సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి హ్యాండిల్ చేయడం ప్రారంభించారు. ప్రత్యర్థులను వెంటాడి వేటాడి సోషల్ మీడియాలో వేధించడం పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు భార్గవ రెడ్డి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి.. అప్పటి ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్లాయి అన్నది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది. దీనిపై విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా వైసిపి కోసం పనిచేశారు. పైకి మాత్రం కార్పొరేషన్. చేసిందంతా మాత్రం దోపిడీనే. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసిపి ప్రచారం చేసిందని తేలింది.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో శాఖలో జరిగిన అవినీతి బయటపడుతోంది. అందులో భాగంగా సమాచార శాఖలో బయటకొస్తున్న స్కాం మూలాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విచారణ జరపాలంటూ మంత్రులకు టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో.. త్వరలో కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే.. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన వారికి కూడా లక్షల్లో జీతాలు చెల్లించినట్లు బయటపడింది. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా వారికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించేవారని తేలింది. ఇటీవల టిడిపి నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన పాలేటి రాజ్ కుమార్, ఆయన భార్యకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసిపి సోషల్ మీడియాను హ్యాండిల్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి. అందులో పని చేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించేది. అందుకే ఈ కేసు ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మెడకు చుట్టుకుంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కడ ఉన్నా విడిచి పెట్టే ఛాన్స్ లేదు. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటే భార్గవ రెడ్డి పై సైతం ఉక్కు పాదం మోపి అవకాశం ఉంది. వీరిపై మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉందని.. అన్నింటికీ ఈ తండ్రీ కొడుకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా?

AP Volunteers: ఏపీలో అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? కొనసాగించే ఉద్దేశం ఉందా? రాజీనామా చేయని వారిని కొనసాగిస్తారా? కొత్త వారిని తీసుకుంటారా? తీసుకుంటే ఏ మార్గదర్శకాలు పాటిస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండదని తెలుస్తోంది. పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదని సమాచారం. సచివాలయ వ్యవస్థ తోనే పల్లె పాలనను కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ అనుమానాలను నిజం చేస్తూ.. క్యాబినెట్ లో సీనియర్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించింది. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవల బాధ్యతలను అప్పగించింది. అయితే వాలంటీర్లంతా వైసిపి సానుభూతిపరులు అని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ఈ క్రమంలో ఎన్నికల విధుల నుంచి వారిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ప్రచారాస్త్రంగా మారింది. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానిపై టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. పాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినా సరే చాలామంది వలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. ఇప్పుడు వైసిపి ఓటమి చవిచూడడంతో వాలంటీర్లు మాట మార్చారు. వైసీపీ నేతలే తమతో బలవంతంగా రాజీనామా చేయించారని.. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అయితే చంద్రబాబు హామీ ఇచ్చినందున తమను కొనసాగిస్తారన్న ఆశ వాలంటీర్లలో ఉంది. మరోవైపు టిడిపి శ్రేణులు సైతం వాలంటీర్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నాయి. టిడిపి శ్రేణులనుంచి విపరీతమైన పోటీ ఉంది. వీటిని భర్తీ చేస్తే గ్రామస్థాయిలో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని కూడా టిడిపి నాయకత్వం భయపడుతోంది. గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ఉన్నారని.. అది కూడా డిగ్రీ పూర్తి చేసిన వారికే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పై కీలక ప్రకటన చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అదే సమయంలో వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు అయింది. వారి నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. గతంలో వాలంటీర్ల మాదిరిగానే ఇంటి ఇంటికి పింఛన్లు పంపిణీ సచివాలయ ఉద్యోగులతో చేపడుతున్నట్లు తెలిపారు. వాలంటీర్లను నియమిస్తే కేవలం పింఛన్ల పంపిణీ పరిమితం చేయమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు విధివిధానాలు తయారవుతున్నాయని చెబుతూనే.. వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Success Story: రూ.1500 జీతం నుంచి రూ.3 కోట్ల ఆదాయం.. ఈ యువకుడు పలువురికి ఆదర్శం..

Success Story: ఓ యువకుడు తను ఎంచుకున్న మార్గాన్ని చేరడానికి విపరీత ప్రయత్నాలు చేశాడు. చివరికి లక్స్యానికి చేరువవుతున్నాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే?

Success Story: జీవితంలో గొప్పగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొందరు గమ్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఉండొచ్చు. వాటికి భయపడకుండా ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇలాంటి విషయాలను బగా పసిగట్టిన వాళ్లు జీవితంలో సక్సెస్ అవుతారు. ఇదే కోవలో ఓ యువకుడు తను ఎంచుకున్న మార్గాన్ని చేరడానికి విపరీత ప్రయత్నాలు చేశాడు. చివరికి లక్స్యానికి చేరువవుతున్నాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే?

అష్పాక్ సునావాల.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇతను రూ. 1500 జీతానికి ఒకప్పుడు పనిచేశాడు. ఇప్పుడు నెలకు రూ.3 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఎలాంటి అండాదండా లేకున్నా.. స్వయం శక్తితో ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాడు. అయితే ఇంతటితో తన లక్ష్యం పూర్తికాలేదని, ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నాడు. అసలు విషయమేంటంటే అష్పాక్ సునావాల చదివింది 10వ తరగతి మాత్రమే.

అష్పాక్ సునావాల 10 తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. ఆ తరువాత 2004లో రిటైల్ స్టోర్ లో రూ.1500 జీతంతో పనికిచేరాడు. అయితే జీవితంలో ఎప్పటికైనా అత్యున్నత స్థాయిలో ఉండాలని అతని కోరిక. అందుకు అన్ని రకాలుగా కష్టాలు పడ్డాడు. దాదాపు 10 ఏళ్ల పాటు వివిధ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాలను వెతుక్కున్నాడు. ఈ క్రమంలో 2013లో సునావాల రైడ్ హెయిలింగ్ యాప్ ప్రకటనను చూశాడు. ఈ కంపెనీ ప్రకటించిన స్కీమ్ సహాయంతో ఓ చిన్న కారును కొనుగోలు చేశాడు.

అయితే ఉదయం 7 నుంచి కారు నడుపుతూ ఆ తరువాత రెగ్యులర్ ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలా ఉద్యోగం ద్వారా నెలకు రూ.35 వేలు, పార్ట్ టైం కారు నడుపుతూ రూ.15 వేలు సంపాదించేవాడు. ఆ తరువాత రెండో కారును కొనుగోలు చేశాడు. ఈ రెండు కార్లను నడపగా వచ్చిన ఆదాయంతో మరో మూడు కార్లను కొనుగోలు చేశాడు. వీటికి డ్రైవర్లను నియమించుకున్నాడు. ఇలా వచ్చిన ఆదాయంతో కార్లను కొనుగోలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతని వద్ద 400 కార్లు ఉన్నాయి.

అయితే 500 కార్లను ఉంచుకోవాలనేది అతని టార్గెట్. అయితే ప్రస్తుతం అతనికి వార్షిక ఆదాయంగా రూ.36 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.3 కోట్లు న్నమాట. ఉద్యోగంలో రాజీనామాలు, తప్పుడు ప్రవర్తన వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కోట్ల రూపాయల ఆదాయంతో హ్యాపీగా ఉంటున్నట్లు అష్పాక్ సునావాల తెలుపుతున్నాడు.

AP Legislative Council: ఏపీలో శాసనమండలి రద్దు?

శాసనమండలిలో వైసీపీ ది స్పష్టమైన మెజారిటీ. 38 మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. అందుకే జగన్ సైతం శాసనమండలిపై ధీమాతో ఉన్నారు. శాసనసభలో సంఖ్యా బలం లేకపోయినా.. శాసనమండలిలో అధికార పార్టీకి చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు.

AP Legislative Council: ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తారా? ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? వైసిపి ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే అదే మార్గమా? లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవా? కీలక బిల్లులకు మోక్షం రాదా? అందుకే రద్దు చేయడం ఉత్తమమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రద్దు కంటే శాసనమండలిని అచేతన అవస్థలో పెట్టేందుకు ప్రయత్నిస్తారన్న టాక్ ప్రారంభమైంది.

శాసనమండలిలో వైసీపీ ది స్పష్టమైన మెజారిటీ. 38 మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. అందుకే జగన్ సైతం శాసనమండలిపై ధీమాతో ఉన్నారు. శాసనసభలో సంఖ్యా బలం లేకపోయినా.. శాసనమండలిలో అధికార పార్టీకి చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు. అందుకే ఓటమి ఎదురైన తర్వాత ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితోనే రాజకీయం నడపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అసెంబ్లీలో మనం లేకున్నా.. మండలిలో మనోళ్లే ఉంటారని.. వారే చూసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే అసెంబ్లీలో దక్కని అధికారాన్ని.. పరోక్షంగా మండలిలో వినియోగించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తుందన్నమాట.

2019 ఎన్నికల్లో 151 స్థానాలతో విజయం సాధించింది వైసిపి. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. దీంతో కీలక బిల్లులను అప్పట్లో అడ్డుకోగలిగింది టిడిపి. అందుకే ఏకంగా మండలిని రద్దు చేసేందుకు నిర్ణయించారు జగన్. కానీ కేంద్రం అనుమతించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే శాసనమండలిలో వైసిపి ప్రాతినిధ్యం పెరిగింది. శాసనసభలో అంతులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమికి శాసనమండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు. దీంతో కీలక బిల్లులుగా భావిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని బిల్లులు, ఆర్ ఫైవ్ జోన్లో పేదలకు ఇచ్చిన ఇళ్ళను కూడా రద్దు చేయడం.. వంటి వాటిపై బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ శాసనమండలిలో వీటికి బ్రేక్ పడనుంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకునేందుకు అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాలన్న వాదన వినిపిస్తోంది. కూటమిలో సైతం బలమైన చర్చ సాగుతోంది. కానీ వచ్చే మూడేళ్లలో శాసనమండలిలో వైసిపి సంఖ్యాబలం తగ్గుతుంది. కూటమి సంఖ్యా బలం పెరుగుతుంది. అందుకే మండలిని రద్దు చేయడం కంటే.. సుప్త చేతనావస్థలో ఉంచేందుకు చూడాలని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలను చంద్రబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో శాసనమండలిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

PPF, సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదారులకు షాకింగ్ న్యూస్..!

Small Savings Schemes: దేశంలోని ప్రజలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికి కారణం వాటిలో స్థిరమైన, సురక్షితమైన ఆదాయాలే. మిగిలిన సాధనాలతో పోల్చినప్పుడు రాబడి కొంత తక్కువగానే ఉన్నప్పటికీ వీటి నుంచి ఖచ్చితమైన రాబడులు ప్రభుత్వ హామీతో కలిగి ఉండటం చాలా మందిని వీటివైపు మళ్లిస్తున్నాయి.

తాజాగా వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన కాలానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటించింది. దీనికి ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వడ్డీ రేట్లలో పెంపు ఉంటుందనే ఊహాగానాలు భారీగా వినిపించటంతో అనేక మంది పెట్టుబడిదారులు ప్రకటన కోసం ఇన్నాళ్లు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ క్రమంలో కేంద్రం తిరిగి మెుండి చేయి చూపటంతో చాలా చిన్న పొదుపు పథకాల ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జూలై 1, 2024 నుంచి ప్రారంభమై 30 సెప్టెంబర్, 2024తో ముగిసే కాలానికి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతాయని పేర్కొంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కొన్ని ప్రసిద్ధ స్మాల్ సేవింగ్ స్కీమ్స్.

ప్రస్తుతం వివిధ పథకాల వడ్డీ రేట్లు:
– సేవింగ్స్ డిపాజిట్ 4.0%
– ఒక-సంవత్సర కాల డిపాజిట్ 6.9%
– రెండు-సంవత్సరాల కాల డిపాజిట్ 7.0%
– మూడేళ్ల కాల డిపాజిట్ 7.1%
– ఐదు సంవత్సరాల కాల డిపాజిట్ 7.5%
– ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ 6.7%
– సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2%
– నెలవారీ ఆదాయ ఖాతా 7.4%
– నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7%
– పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 7.1%
– కిసాన్ వికాస్ పత్ర 7.5% (115 నెలలు)
– సుకన్య సమృద్ధి ఖాతా పథకం 8.2%

పన్ను ప్రయోజనాలు..
పైన ఉన్న వాటిలో కొన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను తగ్గించుకోవటంలో దోహదపడతాయి. ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్ 80C సింద పన్ను ప్రయోజనాలను అందించే స్కీమ్స్ సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నాయి. ఇదే క్రమంలో కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు (5 సంవత్సరాల పదవీకాలం మినహా), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఇన్కమ్ స్కీమ్, మహిళా సమన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు పథకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి పన్ను ప్రయోజననాలను అందించవు.

మొబైల్ నెట్ వర్క్ మార్చుకోవడానికి ( Porting ) కేంద్రం కొత్త రూల్స్..!

స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏజ్ తో సంబంధం లేకుండా మొబైల్ లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెండు సిమ్ కార్డులను కూడా వాడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒక నెట్ వర్క్ నుంచి మరొక నెట్ వర్క్ కు మారేందుకు యూజర్లు ఇంట్రస్టు చూపిస్తుంటారు. ఫోన్ నెంబర్ మార్చకుండానే మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌ ద్వారా ఇతర నెట్ వర్క్ లకు మారే సౌకర్యం ఉంది. అయితే తాజాగా మొబైల్‌ నంబర్ పోర్టింగ్‌ కోసం కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

ఈ కొత్త రూల్ ప్రకారం నెట్ వర్క్ మారడానికి ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. మీరు మొబైల్ నెంబర్ పోర్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ఫోన్ నంబర్ పోర్టింగ్‌కు అర్హత పొందేందుకు ఏడు రోజుల పాటు ఆగాల్సిందే అని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ వెల్లడించింది. సిమ్ కార్డుల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ నెట్ వర్క్ మార్చుకునేందుకు 7 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది 10 రోజులుగా ఉంది. తాజాగా దీన్ని 7 రోజులకు తగ్గించారు. అంటే వారం రోజుల పాటు వేరే నెట్ వర్క్ కు మారేందుకు అవసరమయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ ను జారీ చేయడం జరగదు.

అయితే సిమ్ కార్డు పోయినప్పుడు లేదా.. పాడైపోయినప్పుడు సంబంధిత టెలికాం సంస్థలను సంప్రదిస్తే అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని కొత్త సిమ్ కార్డును జారీ చేస్తుంటారు. అదే ఒక వేళ ఫోన్ నెంబర్ మార్చుకోకుండా నెట్ వర్క్ మార్చుకోవాలనుకున్నప్పుడు మీ ఫోన్ నుంచి PORT <మొబైల్‌ నంబర్‌> ను 1900 కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. దీంతో సదరు మొబైల్ నంబర్ వినియోగదారుడికి ఒక యునిక్‌ పోర్టింగ్ కోడ్‌ వస్తుంది. ఇతర మొబైల్ కంపెనీ నెట్‌వర్క్‌కు మారాలనుకున్నప్పుడు ఈ యూనిక్ పోర్టింగ్ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం సిమ్ కార్డు నెట్ వర్క్ మారడానికి వారం రోజులపాటు ఆగాల్సి ఉంటుంది.

Tasty Garelu for Breakfast : గారెలను ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. హెల్తీ రెసిపీ ఇదే చాలా సింపుల్

Thotakura Garelu Recipe : చాలామంది పిల్లలు తోటకూర తినేందుకు ఇష్టపడరు. తల్లులకేమో దానిని ఎలా అయినా వారికి పెట్టాలని.. వారికి పోషకాలు అందుతాయని చూస్తారు. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే తోటకూరతో గారెలు చేసేయండి. ఈ రెసిపీ మంచి రుచిని అందిచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అసలు తోటకూరతో గారెలు ఏంటి? వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే అస్సలు కంగారు పడకండి. దీనిని చేయడం చాలా సులభం. ఎలా వండాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు
మినపప్పు – 1 కప్పు

అల్లం – 2 అంగుళాలు

పచ్చిమిర్చి – 5

ఉప్పు – రుచికి తగినంత

జీలకర్ర – 1 స్పూన్

నీరు – గ్రైడింగ్ చేసుకోవడానికి తగినంత

తోటకూర – 3 కప్పులు

నూనె – డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత

తయారీ విధానం
ముందుగా మినపప్పు ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. లేదంటే మీరు ఈ గారెలు చేసుకోవాలనుకునే 4 లేదా 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మినపప్పును కడిగి మిక్సీ జార్​లో వేసుకోవాలి. ఇప్పుడు అల్లంపై ఉన్న పొట్టు తీసి కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కడిగి మధ్యలోకి కోసుకోవాలి. వీటిని మిక్సీ జార్​లో వేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుని.. పిండిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా.. గట్టిగా కాకుండా పిండిని రుబ్బుకోవాలి.

నూనె పీల్చుకోకుండా ప్రో టిప్
పిండిని మిక్సీ చేసేందుకు కాస్త నీరు ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువ నీరు వేయకూడదు. అలా చేస్తే గారెలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలా అని గట్టిగా పిండి ఉంటే లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. కాబట్టి గారెలు బాగా రావాలంటే సరైన మోతాదులో నీరు వేసుకుని.. పిండిని రుబ్బుకోవడం చాలా ముఖ్యం. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని.. మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా శుభ్రం చేసి.. ముక్కలుగా కోసి కడిగి పెట్టుకున్న తోటకూర వేయాలి. ఆకు కూరలో నీరు లేకుండా చూసుకోవాలి. లేదంటే గారెల పిండి వదులు అయిపోతుంది.

గారెలు ఇలా ఈజీగా వేయొచ్చు..
తోటకూర వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్​ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్​ ఫ్రై చేయడానికి సరిపడేంత నూనెను వేసుకోవాలి. అది వేడైన తర్వాత.. సిద్ధం చేసుకున్న గారెల పిండిని మరోసారి కలపాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నీటిని తీసుకుని.. దానిని అద్దుకుంటూ గారెల పిండిని ముద్దగా తీసుకుని.. గారెలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి. ఇదే తరహాలో పిండి మొత్తాన్ని గారెలుగా వేసుకోవాలి. అంతే వేడి వేడి, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ రెడీ.

పిల్లలకు ఇలా పెడితే..
తోటకూరతో చేసిన ఈ గారెలు మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పిల్లలు తోటకూర తినట్లేదు.. కానీ ఈ ఆకుకూరను వారికి ఎలా అయినా డైట్​లో చేర్చాలి అనుకుంటే ఈ గారెలు బెస్ట్ ఆప్షన్. వీటివల్ల వారికి మంచి పోషకాలు అందుతాయి. గారెలకు కాంబినేషన్​గా అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అవుతుంది. పెరుగులో వేసి ఆవడ కూడా పెట్టొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వెంటనే ఈ తోటకూర గారెలు ట్రై చేసి.. మీ టేస్ట్, హెల్త్​ని మరింత రెట్టింపు చేసుకోండి.

CM Chandrababu : పెన్షన్ పంపిణీలో చంద్రబాబు సంచలనం – ఒకటో తేదీన స్వయంగా పంపిణీకి శ్రీకారం

Chandrababu will go beneficiaries homes : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వృద్ధాప్య పెన్షన్లను భారీగా పెంచారు. అన్ని రకాల పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తానే స్వయంగా వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఏ లబ్దిదారుల ఇళ్లకు వెళతారన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చంద్రబాబు పెన్షన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే లబ్దిదారులకు చంద్రబాబు బహిరంగలేఖ

పెన్షన్ లబ్దిదారులకు ఇప్పటికే చంద్రబాబు బహిరంగలేఖ రాశారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. 1000 పెంచి…. ఇకపై రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి… ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని లేఖలో తెలిపారు.

నెలకు రూ. 819 కోట్ల భారం

పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా.. ప్రజా శ్రేయస్సుకోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాలకోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభపెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి… ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము. మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

పెన్షన్లు ప్రారంభించి ఎన్టీఆర్ – అందుకే ఆయన పేరు

సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆధ్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.అందరికీ తన సందేశం చేర్చడంతో పాటు కొంత మంది లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.

Health

సినిమా