మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే ఆయుర్వేద మొక్క.. ఇలా వాడండి

Centella Asiatica: ఆయుర్వేద మొక్కలలో చాలావరకు ఓవరాల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. వీటిలో కొన్నింటిని పురాతన కాలం నుంచి వివిధ రకాల వ్యాధులకు చికిత్సగా వాడుతున్నారు.


అయితే వీటిలో ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు చాలా మంచి చేసేవి మాత్రం కొన్నే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ముఖ్యమైనది గోటు కోలా (Gotu Kola) లేదా సెంటెల్లా ఆసియాటికా (Centella asiatica) ఒకటి. దీని ఆకులను సరస్వతీ ఆకులు అంటారు. ఈ మొక్క ఆకులు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతూ వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అలాగే ఇతర అనారోగ్యాలకు చెక్ పెడతాయి.

గోటు కోలాలో ట్రైటెర్పెనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్, మచ్చలను తగ్గించే శక్తి వీటి సొంతం. వీటిలోని సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తాయని ‘మనీ కంట్రోల్’తో చెప్పారు BDR ఫార్మాస్యూటికల్స్‌లో టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బాడిగేర్. ఈ మొక్క హెల్త్ బెనిఫిట్స్‌ గురించి ఆయన వివరించారు.

చర్మ ఆరోగ్యం

గోటు కోలా గాయాలు త్వరగా నయం చేసే అద్భుతమైన ఔషధం. ఇందులో ఉన్న అసియాటికోసైడ్ వంటి పదార్థాలు కొత్త చర్మం ఏర్పడటానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి, స్కిన్ బలంగా ఉండేలా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది వృద్ధాప్య సాయిలు రాకుండా చూస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. దీని వల్ల ముడతలు, చిన్న గీతలు తగ్గుతాయి. స్కిన్ ఇన్‌ఫ్లమేషన్, దురద, ఎగ్జిమా, సోరియాసిస్, మొటిమలు వంటి సమస్యల నుంచి కూడా ఈ మొక్క ఒక రిలీఫ్ కలిగిస్తుంది. స్కిన్ రెడ్‌నెస్‌ను, దురదను తగ్గించి, చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

గోటు కోలా చర్మానికి నేచురల్ హైడ్రేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం తేమను నిలుపుకునేలా చేస్తుంది. అమైనో ఆమ్లాలు, బీటా కెరోటిన్, ఫ్యాటీ యాసిడ్స్‌, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటంతో చర్మానికి పోషణ లభిస్తుంది, చర్మాన్ని మృదువుగా, ఎలాస్టిక్‌గా తయారవుతుంది. గోటు కోలాను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే స్కిన్ టోన్ ఈవెన్‌గా, స్కిన్ టెక్చర్ మరింత సాఫ్ట్‌గా మారుతుంది. మచ్చలు, మొటిమల మచ్చలు తగ్గి, చర్మం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

అనారోగ్యాలకు చెక్

గోటు కోలాను మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, ఆందోళన, ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది. మెదడు కణాలను రక్షించడం, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికీ చాలా మంచిది. ఇది సిరలను, చిన్న రక్తనాళాలను బలోపేతం చేస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, వారికోస్ వెయిన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొట్ట సమస్యలు, ఒత్తిడి దూరం

గోటు కోలా అజీర్తి, అల్సర్స్ వంటి స్టమక్ ప్రాబ్లమ్స్‌ను పోగొడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్‌ను కూల్ చేస్తుంది. గట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మూలిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కామ్‌ అయిపోతుంది. దీని వల్ల ఆందోళన స్థాయిలు తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గోటు కోలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇవి వ్యాధులతో పోరాడతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని ఆక్సీడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది

ఎలా ఉపయోగించాలి?

మార్కెట్లో సెంటెల్లా ఆసియాటికా ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారు చేసిన క్రీమ్స్, సీరమ్స్‌ లభిస్తాయి. క్యాప్సూల్‌ లేదా టాబ్లెట్ల రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ మొక్కల ఆకులను ఎండబెట్టి టీ చేసుకోవచ్చు. లేదా పచ్చి ఆకుల సారాన్ని డ్రింక్స్‌లో కలిపి తాగవచ్చు.