Friday, November 15, 2024

కౌరవుల సభకు వెళ్లాల్సి ఉంటుంది.. అసెంబ్లీకి వెళ్లడంపై జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో గురువారం వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని జగన్ మాట్లాడారు.

ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందన్నారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమన్నారు. అయినా వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న విషయం మరచిపోవద్దని నాయకులకు భరోసా కల్పించారు. 2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయన్నారు. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారన్నారు. 2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారన్నారు.

జగన్‌కు వయసుతో పాటు సత్తువ కూడా ఉందన్నారు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో నాతో ఎవరూ సాటిరారన్నారు. కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని అసెంబ్లీని ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం లేదని.. అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామన్నారు. టీడీపీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్స్ అంటూ హోర్డింగ్‌లు పెడుతున్నారన్నారు. ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసేయాలని నేతలకు సూచించారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు తోడుగా ఉండాలని సూచించారు. దాడులకు గురైన వారికి భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుస్తా అని జగన్ తెలిపారు.

Telugu girls arrested in Dallas: అమెరికాలోని ఓ మాల్‌ చోరీ, తెలుగు విద్యార్థులు అరెస్ట్, ఆపై బెయిల్.. ఏమైంది?

Telugu girls arrested in Dallas: అగ్రరాజ్యం అమెరికా వెళ్లడానికి నానాకష్టాలు పడతారు భారతీయ విద్యార్థులు. వాళ్లు పెట్టే పరీక్షల్లో పాసవ్వడం ఒకెత్తు, ఇంకోవైపు లేనిపోని ఆంక్షలు.

కోటి ఆశలతో తమ పిల్లలను అక్కడికి పంపిస్తారు పేరెంట్స్. కనీసం జీవితంలో సెటిలవుతారని భావిస్తారు.

ఓవైపు జాబ్ చేస్తూ.. మరోవైపు చదువుకుంటారు భారతీయ విద్యార్థులు. ఈ క్రమంలో దుండగులు దాడుల్లో మరణించిన విద్యార్థులు లేకపోలేదు. తాజాగా ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ ఓ షాపింగ్ మాల్‌లో చోరీకి పాల్పడ్డారు.. అడ్డంగా బుక్కయ్యారు. చివరకు పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ చోరీ వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.

ఒకరు మానసరెడ్డి, మరొకరు సింధూజారెడ్డి. వీళ్లిద్దరు మాంచి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్లినా, ఏమిచేయాలన్నా ఇద్దరు కలిసే చేస్తారు. అది కష్టమైనా నష్టమైనా. అయితే డాలస్‌లోని మెకీ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడవాళ్లకి కావాల్సిన వస్తువులను చూసి టెంప్ట్ అయ్యారు. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలని భావించారు. ఎవరూ చూడలేదనుకున్నారు.. సీక్రెట్‌గా చోరీ చేశారు. అసలే అగ్రరాజ్యం నిఘా ఉండకుండా ఉంటుందా? పక్కగా దొరికిపోయారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీళ్లను అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చేశారు.

ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. పోలీసులు కంప్యూటర్‌లో వీళ్ల గురించి ఒక్కసారి క్లిక్ చేయడంతో అక్కడ మానస డేటా మొత్తం బయటపడింది. మానస గతంలోనూ చాలా చోట్ల చోరీకి పాల్పడినట్టు తేలింది. వీళ్ల ప్రవర్తన చూసిన మిగతా భారతీయు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడేకాదు ఈ ఏడాది మార్చి 19న ఇద్దరు మహిళలు ఇలాగే షాపింగ్‌లో చోరీ చేసిన విషయం తెల్సిందే.

Rain Alert: అబ్బ.. చల్ల చల్లని వార్త.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, అమరావతి, గోండియా, దుర్గ్, రాంపూర్ (కలహండి), 19.5°N/86.5°E, 23°N/89.5°E, మాల్దా, భాగల్పూర్, రక్సాల్ గుండా కొనసాగుతుంది. రానున్న 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలలో, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఈ క్రమంలో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దానిని ఆనుకుని తెలంగాణ మీద ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇపుడు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఆవరించి ఉంది.. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
గురువారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
గురువారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-
గురువారం, శుక్రవారం, శనివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

జగన్‌కు భారీ షాక్.. అప్రూవర్‌గా వాసుదేవరెడ్డి?

మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ముఖ్యనాయకులు సూత్రధారులుగా ఈ కుంభకోణం జరిగిందని, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని ఆయన విల్లాలో సీఐడీ ఐదురోజులపాటు సోదాలు నిర్వహించింది. వీటిల్లో కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

తనిఖీలతో వైసీపీ నేతల్లో ఆందోళన

ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైంది మద్యం పాలసీ. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతోపాటు దాని తయారీ, సరఫరా, అమ్మకాలతో సహా అన్నీ ప్రభుత్వమే చేపట్టింది. ఈ విధానం వల్ల వైసీపీ నేతలకు భారీగా ప్రయోజనం చేకూరినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరగడంతో వైసీపీ నేతల్లో

ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారినట్లు సమాచారం.

పెద్దల ఆదేశాల మేరకే

మాజీ సీఎం జగన్ తోపాటు ఇతర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మద్యం పాలసీని వారికి అనుకూలంగా తయారు చేశామని ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తన కార్యాలయం నుంచి చోరీ చేస్తుంటే చూశానని శివకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను వాసుదేవరెడ్డి మాయం చేశారని సీఐడీ గుర్తించింది.

UGC-NET: యూజీసీ నెట్‌ పరీక్షకు త్వరలోనే కొత్త తేదీ: కేంద్ర విద్యాశాఖ

UGC-NET: విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేందుకే యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షను రద్దు చేశామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

దిల్లీ: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 (UGC-NET) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ (Education Ministry) జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ గురువారం వెల్లడించారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

‘‘నెట్‌ పరీక్ష (NET Exam)లో అవకతవకలు జరిగాయని, విశ్వసనీయత దెబ్బతిందని ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో మాకు అర్థమైంది. అందుకే పరీక్షను రద్దు చేశాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినందుకు ఇంతకంటే వివరాలను మేం వెల్లడించలేం. త్వరలోనే మళ్లీ పరీక్షను నిర్వహిస్తాం. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని జైశ్వాల్‌ వెల్లడించారు.

జూన్‌ 18వ తేదీన దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (పెన్ను, పేపరు) విధానంలో యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష జరిగింది. దీనిని ఎన్‌టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షను రద్దు చేశారు.

లీక్‌లు లేకుండా పరీక్షలు నిర్వహించలేరా?: కాంగ్రెస్‌
ఓవైపు నీట్‌ యూజీ పరీక్షలో అక్రమాలపై వివాదం కొనసాగుతున్న వేళ యూజీసీ నెట్‌ పరీక్షను రద్దు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రంపై ధ్వజమెత్తాయి. లీక్‌లు, మోసాలు లేకుండా మోదీ సర్కారు పరీక్షలు నిర్వహించలేకపోతోందంటూ ఎద్దేవా చేశాయి. ‘పరీక్షా పే చర్చా’ అంటూ హంగామా చేసే ప్రధాని.. ఈ లీక్‌లపై మాట్లాడుతారా? అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. విజయవాడ డివిజన్ లో భారీ సంఖ్యలో జాబ్స్!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. విజయవాడ డివిజన్ ఏటీవీఎంలో ఫెసిలిటేటర్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

విజయవాడ డివిజన్ పరిధిలోని మొత్తం 26 రైల్వే స్టేషన్లలో 59 ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు కేవలం బోనస్ ఆధారితంగా కమిషన్ ద్వారా డబ్బులను సంపాదించే ఉద్యోగాలు కావడం గమనార్హం.

https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారాఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. మొత్తం26 రైల్వే స్టేషన్లలో 59 పోస్టులను భర్తీ చేయనుండగా విజయవాడ స్టేషన్ లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే ఎంపికైన వాళ్లకు 3 శాతం కమిషన్ లభించనుందని సమాచారం అందుతోంది.

అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో టికెట్లను మిషన్ల ద్వారా జారీ చేయడం కోసం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

Cleaning Tips: చిటికెలో వాటర్ ట్యాప్‌లను ఇలా క్లీన్ చేయవచ్చు.. ఎలాగంటే!

మనం వాడుకోవడానికి నీరు ట్యాప్‌ల ద్వారానే వస్తుంది. వాటర్ ట్యాప్‌లపై అనేక మరకలు పడుతూ ఉంటాయి. నీటి మరకలు, సబ్బు మరకలు, గిన్నెలు కడిగేటప్పుడు ఇలా వాటిపై మరకలు ఉండిపోతాయి.

వీటిని వెంటనే క్లీన్ చేయకపోతే.. అవి మరకలుగా అలాగే ఉంటాయి. ఇక వాటిపై దుమ్ము, ధూళి చేరి.. మరింత పేరుకుపోతాయి. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు. దీంతో వాటిపై ఉండే మొండి మరకలు అంత ఈజీగా పోవు. ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. అందులోనూ స్టెయిన్ సెల్ ట్యాప్స్ అయితే తుప్పు పట్టేస్తాయి. మరి ఇలాంటి మొండి మరకలను సైతం ఇప్పుడు చెప్పే చిట్కాలు ఎంతో చక్కగా పోగొడతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనిగర్:

వెనిగర్‌తో మనం ఎన్నో రకాల క్లీనింగ్ చిట్కాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా వెనిగర్ కిచెన్‌లో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా వైట్ వెనిగర్, నీటిని కలపండి. ఇందులో ఓ స్పాంజ్‌ వేసి ఓ ఐదు నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఆ స్క్రబర్ లేదా స్పాంజ్‌ తో ట్యా వాటర్ ట్యాప్‌లను బాగా రుద్దండి. ఓ రెండు నిమిషాలు అలానే వదిలేయండి. మొండి మరకలు పోకపోతే.. మళ్లీ రుద్దండి. ఇలా చేయడం వల్ల త్వరగా వాటర్ ట్యాప్స్ క్లీన్ అవుతాయి.

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్‌తో కూడా వాటర్ ట్యాప్‌లను ఈజీగా శుభ్రం చేయవచ్చు. పనికి రాని టూత్ బ్రష్ తీసుకుని దానికి టూత్ పేస్ట్ పెట్టండి. దానితో మురికిగా ఉండే ట్యాప్‌లపై బాగా రుద్దండి. ఆ తర్వాత కడిగేయండి. ఇప్పుడు మీ ట్యాప్స్ తెల్లగా మెరుస్తాయి. టూత్ పేస్టులతో కుళాయిపై ఉండే మరకలు, దుమ్ము, ధూళి పోతాయి.

నిమ్మరసం:

నిమ్మరసంతో కూడా బాత్‌రూమ్, సింక్‌, బయట ఉండే కుళాయిలను శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి నిమ్మరసం తీసుకోండి. అందులో కొద్దిగా సర్ఫ్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమంతో ట్యాప్‌లపై స్క్రబర్‌తో రుద్దండి. ఆ తర్వతా కడిగేయండి. ఇలా చేయడం వల్ల మురికి, దుర్వాసన కూడా పోతుంది.

కొత్త సలహాదారుల నియామకం – ఏబీతో సహా లిస్టులో..!!

ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. రేపు(శుక్రవారం) కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. అధికార ప్రక్షాళన మొదలైంది.

నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసారు. ఇక..ప్రభుత్వంలో సలహాదారుల నియామకం పైన కసరత్తు కొనసాగుతోంది. సీనియర్ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వరరావుతో సహా పలువురు సలహాదారుల జాబితాలో ఉన్నారు.

చంద్రబాబు కసరత్తు

ఏపీ ప్రభుత్వం కొత్త సలహాదారుల నియామకంపై కసరత్తు మొదలు పెట్టింది. పాలనా అనుభవంతో పాటుగా నమ్మకస్తులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వైపు ప్రభుత్వం ముగ్గు చూపుతుంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు సలహాదారుల నియామకం పైన పలువురు పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆర్థిక -ప్రణాళిక విభాగంలో పనిచేసిన సీనియర్ అధికారి టక్కర్, అవినీతి నిరోధక శాఖలో పట్టున్న ఆర్పీ ఠాకూర్, చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావులను సలహాదారులుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సలహాదారులుగా

ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ ఆదేశించినా.. గత ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపివేసింది. చివరి రోజున పోస్టింగ్ ఇవ్వగా ఆయన అదే రోజున పదవీ విరమణ చేసారు. అదేవిధంగా వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులకు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన జాస్తి కృష్ణ కిషోర్ ను కూడా ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అవకాశం దక్కేదెవరికి

ప్రభుత్వ ఏజే శ్రీరామ్ స్థానంలో దమ్మాలపాటి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. తాజాగా..జలవనరుల శాఖ సలహాదారుడగా వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఖరారు చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. నామినేటెడ్ పదవులు కంటే ముందుగానే పాలనాపరంగా సలహాదారుల నియామక పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో..ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం కీలక శాఖలకు సలహాదారుల నియామకం పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Karela Juice Benefits: ఉదయం ఖాళీకడుపున ఈ ఒక్క రసం తాగితే డయాబెటీస్‌ మీ దరిదాపుల్లోకి రాదు..

Karela Juice Benefits: డయాబెటీస్‌తో బాధపడేవారు చాలామంది మన దేశంలో ఉన్నారు. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాల్సి ఉంటుంది. అయితే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారు తీసుకునే ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఉదయం ఏ జ్యూస్‌ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

ఉదయం పరగడుపున కాకరకాయ జ్యూస్‌ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ ఉంటాయి. ఇది షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా కాపాడతాయి. గ్యాస్‌, మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టి మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కాకరకాయ జ్యూస్‌ మంచి డిటాక్సిఫైయింగ్‌ డ్రింక్‌ మాదిరి పనిచేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాకరకాయ జ్యూస్‌ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీకు మంచి రిఫ్రెష్మెంట్‌ అందుతుంది. కాకరకాయ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

డయాబెటీస్‌ కంట్రోల్‌..
కాకరకాయ జ్యూస్‌ గ్లూకోజ్‌, మెటబాలిజం రేటును నియంత్రిస్తుంది. ఇది గ్లూకోజ్‌ గ్రహించడాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఇది ప్యాంక్రియాటిక్‌ సెల్‌కు షీల్డ్‌లా కాపాడుతుంది. కాకరకాయ జ్యూస్‌ శరీరంలో మంటను కూడా తగ్గిస్తుందని ఎన్‌ఐహెచ్‌ నివేదిక తెలిపింది.

వెయిట్‌ లాస్‌..
కాకరకాయ జ్యూస్‌లో యాంటీ ఒబేసిటీ గుణాలు ఉంటాయి. ఇది ఫ్యాట్‌ నిల్వను తగ్గించేస్తుంది. గ్లూకోజ్‌, మెటబాలిజం రేటును తగ్గిస్తుంది. కాకరకాయ జ్యూస్‌ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ముఖ్యంగా డయాబెటీస్‌ తో బాధపడేవారు కూడా కాకరకాయ జ్యూస్‌ డైట్లో చేర్చుకోవాలి.

కాలేయ ఆరోగ్యం..
కాకరకాయ జ్యూస్‌ తీసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ వ్యవస్థ శరీరంలో మంట సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా లివర్‌ను ఓ షీల్డ్‌లా కాపాడుతుంది అని ఎన్‌ఐహెచ్‌ నివేదిక తెలిపింది.

మలబద్ధకానికి చెక్‌..
కాకరకాయ రసం హెమరైయిడ్‌ సమస్యతో బాధడేవారికి ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయడుతుంది. ముఖ్యంగా కాకరకాయ రసం జీర్ణ రసాలను పెంచుతాయి. దీంతో మలబద్ధక సమస్య మీ దరిచేరదు.

చర్మ ఆరోగ్యం..
కాకరకాయ రసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీర మంట నొప్పులను మాత్రమేకాదు గాయాలు, ఎగ్జీమా, ర్యాష్‌, లెప్రసీ, సోరియాసిస్‌ను కూడా తగ్గిస్తుంది. కాకరకాయను ఉదయం ఖాళీ కడుపన తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

క్యాన్సర్‌కు వ్యతిరేకం..
ముఖ్యంగా కాకరకాయ రసంలో యాంటీ కేన్సర్‌ గుణాలు ఉంటాయి. అంతేకాదు కొలన్‌ కేన్సర్‌తో బాధపడేవారికి కాకరకాయ రసం ఎఫెక్టీవ్‌ రెమిడీ. అయితే, కాకరకాయ గింజలతో తయారు చేసిన నూనెలో యాక్టీవ్‌ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కేన్సర్‌ సెల్స్‌ను నివారిస్తాయని ఎన్‌ఐహెచ్ నివేదిక తెలిపింది.

బిగ్‌ బ్రేకింగ్‌: ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్‌!

టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిసిన క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవాళి క్రికెట్‌లో తన సత్తా చాటి భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకుని..

దేశానికి ప్రాతినిథ్యం వహించిన డేవిడ్‌ జాన్సన్‌(52) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉండే భవనం పైనుంచి దూకి ప్రాణం విడిచాడు. బెంగళూరులోని కొత్తనూరు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరసికెరెకు చెందిన డేవిడ్ 1996లో భారత్ తరఫున 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

కుడిచేతి వాటం పేస్‌ బౌలర్‌ అయిన జాన్సన్‌ 1996 అక్టోబర్‌ 10న ఆస్ట్రేలియాతో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌తో జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఎక్కువ కాలం టీమ్‌లో ఉండలేకపోయాడు. డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన టెస్ట్‌ జాన్సన్‌ కెరీర్‌లో చివరి టెస్ట్‌గా మిగిలింది. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం రెండు టెస్టు మాత్రమే ఆడిన జాన్సన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. కానీ, దేశవాళి క్రికెట్‌లో మాత్రం జాన్సన్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. తన కెరీర్‌లో మొత్తం 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్‌ 125 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా జాన్సన్‌ పేరిట ఉంది. అలాగే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 33 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.

1971 అక్టోబరు 16న హాసన్ జిల్లా అరసికెరెలో జన్మించిన డేవిడ్ జాన్సన్ 90వ దశకంలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అప్పట్లోనే గంటకు 157.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ స్లేటర్ వికెట్ తీశాడు. అంత వేగంతో బౌలింగ్‌ వేసినా.. ఎందుకో టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ అనిల్ కుంబ్లే సంతాపం తెలిపారు. ఆయనతో పాటు మరి కొంతమంది క్రికెటర్లు సైతం జాన్సన్‌కి మృతికి సంతాపం తెలిపారు. అయితే.. జాన్సన్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది.

పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రాల మార్పులు, జోన్ల ప్రధాన్యత మార్చుకునేందుకు ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు అవకాశం ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని ఇకపై సవరణలకు అవకాశం ఉండదని వివరించింది.
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఉన్నాయి.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు రిజిస్టార్‌ చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను పొందారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జులై 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

YS Jagan: బిగ్ బ్రేకింగ్.. జగన్ ఓదార్పు యాత్ర.. ఈ సారి ఎవరికోసమంటే.!

తాను ఇక జనంలోనే ఉండేలా ప్రయత్నిస్తానని వైసీపీ అధినేత జగన్ నేతలతో చెప్పారు. కిందిస్థాయి కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఎవరూ చూస్తూ ఊరుకోవద్దని, న్యాయపోరాటం చేసి క్యాడర్‌ను రక్షించుకుందామని ఆయన సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తూనే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిద్దామని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతల విసృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం. అలానే.. వైసీపీ ఓటమి బాధతో చనిపోయినవారి కుటుంబాలనూ పరామర్శించి.. ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. డిసెంబర్‌ లేదా జనవరి నుంచి జగన్‌ ఓదార్పు ఉండే అవకాశం సమాచారం.

ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ… భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటివరకు తన ఆఫీసుకు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన జగన్.. తాజాగా ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. ఆయా అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సెషన్స్‌లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

కాగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు హాజరకాలేకపోయారు. బెంగళూరు-విజయవాడ విమానం రద్దుతో హాజరుకాలేకపోతున్నట్లు పలువురు నేతలు పార్టీ ఆఫీస్‌కు సమాచారం ఇచ్చారు. ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వెంకటేగౌడ్, చెవిరెడ్డి భాస్కరెడ్డి, మోహిత్‌రెడ్డి, బుర్రా మధుసూదన్, విక్రమ్, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపిక, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన రెడ్డప్ప వంటి నేతలు మీటింగ్‌కు హాజరకాలేకపోయారు.

Tirumala: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం కోసం రోజుకు ఎంత ఖర్చవుతుందో తెల్సా..?

తిరుమలలో మార్పులకు శ్రీకారం చుట్టారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ప్రధానంగా భక్తులకు అందుతున్న సేవలపై ఫోకస్ పెట్టారు. తాజాగా భక్తుల అన్నప్రసాదాలపై సమీక్ష నిర్వహించారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు. టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది.

కాగా భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్‌ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.

మంత్రి లోకేశ్‌ను కలిశాక గంటలో సమస్య తీరిపోయింది: మహిళ భావోద్వేగం

అమరావతి: మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సమస్యలను విన్నవించుకున్నారు.

లోకేశ్‌ ఓపికగా వారి వినతులు స్వీకరించారు. మంత్రిని కలిశాక తమ సమస్యను వెంటనే పరిష్కరించారని విశాఖ నగరానికి చెందిన మహిళ తెలిపారు.

విశాఖకు చెందిన అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దేవకీదేవి ఎగ్జిబిషన్ గడువు రెన్యూవల్ కోసం గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. తాము తయారు చేసుకున్న చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకం కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం మంత్రి లోకేశ్‌ను కలిశాక గంటలో సమస్య తీరిపోయిందంటూ దేవకీదేవి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. పారా మెడికల్, ఆర్ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలను విని వాటి పరిష్కారానికి లోకేశ్‌ హామీ ఇచ్చారు. మిగతా జిల్లాల్లోని నేతలు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు.

Vizag Steel Plant: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా అన్ని విధాలా సహకరించేందుకు సిద్దమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ) ను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పథకంలో భాగంగా ప్రైవేటీకరించేందుకు దూకుడుగా అడుగులు వేసిన కేంద్రం..

ఇప్పుడు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదే క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డాక్యుమెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై ప్రస్తుతం ఎలాంటి కదలిక లేదని ఆయన వెల్లడించారు. బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ విషయం తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నా దాన్ని కొనే స్దాయిలో సంస్థలు లేవని కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం యథావిథిగా నిర్వహణకు కేంద్రం సాయం చేయబోతోందని కూడా ఆయన తెలిపారు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక కర్మాగారం నిలబెట్టేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పకనే చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయింపు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఉక్కు శాఖతో మాట్లాడి త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని గనులు దక్కించుకోవచ్చని సలహా ఇచ్చారు.

వైకాపా భక్తుడు.. హెల్త్‌ యూనివర్సిటీ అప్రతిష్ఠకు ఆద్యుడు

గత ఐదేళ్లలో భ్రష్టుపట్టిన ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఎన్టీఆర్‌ పేరు మారుస్తున్న తెదేపా యువ నాయకులు (పాత చిత్రం)

ఆరోగ్య విశ్వవిద్యాలయం(విజయవాడ), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ మానస పుత్రికగా..

దేశంలోనే ప్రప్రథమ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అప్రతిష్ఠపాలు చేసింది. వీరవిధేయులను వీసీగా నియమించుకొని యూనివర్సిటీ పేరును దిగజార్చింది. నూతన ప్రభుత్వం వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా రాత్రికి రాత్రి పేరు మార్చిన జగన్‌ ప్రభుత్వం వైద్య విద్యార్థుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. పేరు మార్పిడి వల్ల జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు జాతీయ వైద్య మండలి (ఎన్‌.ఎం.సి.) పేరు మార్పును సీరియస్‌గా తీసుకోకపోవడంతో విశ్వవిద్యాలయం చుట్టూ విద్యార్థులు పడిగాపులు పడ్డారు. తమకు వచ్చిన డిగ్రీ పట్టా ఎన్టీఆర్‌ పేరుతో ఉండగా, పీజీ డిగ్రీ పట్టా వైఎస్‌ఆర్‌ పేరుతో ఉండటంతో విదేశీ విశ్వవిద్యాలయాలు ఎన్నో అభ్యంతరాలు పెట్టాయి. మెడికల్, డెంటల్, ఇతర వైద్య కోర్సుల విద్యార్థులు పేరు మార్పు అవరోధాలను అధిగమించినా, నర్సింగ్‌ కోర్సుల పట్టభద్రులు మాత్రం అరబ్‌ దేశాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి ప్రైవేటు ఆస్పత్రులు సైతం వేర్వేరు పేర్లతో ఉన్న పట్టాలను అనుమతించలేదు.

వీరవిధేయుడిగా..

విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ బాబ్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైకాపా వీరవిధేయుడిగా వ్యవహరించారు. ఆయన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వియ్యంకుడు కావడంతో పేరు మార్పునకు ఆసక్తి చూపారు. రూ.లక్షలు వెచ్చించి వాహనాల కొనుగోలు, భారీ వ్యయంతో ఛాంబర్‌కు సొబగులు, వైఎస్‌ఆర్‌ విగ్రహం విశ్వవిద్యాలయం ఎదుట ఏర్పాటు వంటి పనులు చేశారు. వైకాపా నాయకులతో అంటకాగడం, ఆ పార్టీ నాయకులు చెప్పినవి చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఆయన చేసిన ప్రతి పనికి రిజిస్ట్రారు, డీఆర్‌ అధికారులు చేదోడుగా నిలిచారు. కీలక పోస్టులో తమకు భజన చేసే వారిని నియమించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఎప్పటి నుంచో విశ్వవిద్యాలయానికి క్యాంపస్‌ కావాలని ప్రతిపాదనలున్నా.. సాధించుకోలేకపోయారు. కులం కార్డుతో ఉన్న ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పూలకుండీలకున్న పసుపు రంగును కూడా ఉప కులపతి మార్పించేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లను ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. వైకాపా వైద్య విభాగం ప్రతినిధినని చెప్పుకుంటున్న ఓ దంత వైద్యుడిని వెన్నంటే పెట్టుకొని విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పాగా వేసిన వెంటనే ఉపకులపతిగా ఉన్న డాక్టర్‌ సీవీ రావుని పదవీ కాలం ముగియకుండానే తొలగించారు. డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ను అందలం ఎక్కించారు. ఆయన కూడా స్వామి భక్తి చాటారు.

పేరు తొలగింపు..

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కొంతమంది తెదేపా నాయకులు విశ్వవిద్యాలయం పేరును మార్చేశారు. వైఎస్‌ఆర్‌ అక్షరాలను తీసివేసి ఎన్టీఆర్‌ అక్షరాలను ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి కూడా తొలగించాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది.

రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

YS Sharmila demand Rushikonda palace: రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

YS Sharmila demand Rushikonda palace: ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రుషికొండ భవనాల అంశం. వందల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఇంటా బయటా విమర్శలు తీవ్రమయ్యా యి. అంతేకాదు నేషనల్ మీడియాలో హెడ్‌లైన్ వార్త అయ్యింది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అడ్డంగా మీడియా ముందు దొరికిపోతున్నారు.

తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. దీనిపై నేషనల్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆమె, ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలంటే కచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలే అప్పుల ఊబిలో రాష్ట్రం ఉందని, ఈ సమయంలో ప్రజల సొమ్ము తో ఖరీదైన భవనాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. విచారణ చేయిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు.

రుషికొండపై గతంలో టూరిజానికి సంబంధించి కాటేజీలు ఉండేవి. వాటి నుంచి ఏడాదికి దాదాపు 25 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్, హఠాత్తుగా వాటిని కూల్చేసి, స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించింది. అయితే నిర్మాణాలు చూస్తుంటే స్టార్ హోటల్ కాకుండా గెస్ట్ హౌస్‌లా కనిపించడంతో రాజకీయ పార్టీ నేతలు, మీడియా గగ్గోలు పెట్టింది. పరిస్థితి గమనించి జగన్ సర్కార్, ఈ ప్రాంతానికి ఎవరినీ రాకుండా పోలీసులను మోహరించింది.

మొన్నటి ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారింది. ఆ ప్రాంతం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి రావడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలను పరిశీలించారు. అంతేకాదు తనతోపాటు మీడియా ప్రతినిధులను వెంట బెట్టుకుని వెళ్లారు. దీంతో రుషికొండ భవనాలకు గురించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై జాతీయ ఛానెళ్లు చీల్చిచెండాడుతున్నాయి. చర్చా వేదికలో వైసీపీ నేతలను ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించాయి. ప్రముఖుల కోసమే కట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంబానీ, అదానీ, బిర్లాల కోసం కట్టారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాయి. విశాఖలో ప్రముఖులు బస చేయడానికి కనీసం హోటళ్లు లేవా అంటూ ప్రశ్నలను రైజ్ చేశారు.

ఇదే సమయంలో వైసీపీ నేతలు, మద్దతుదారులు కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. అంతేకాదు టీవీ డిబేట్లలో అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. ప్రజావేదిక నిర్మాణానికి 900 కోట్ల రూపాయల ను ఖర్చు చేశారంటూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. రాష్ట్రం విభజన తర్వాత ఏపీకి హైదరాబాద్ లేకుండా పోయిందని, విలాసవంతమైన భవనాలు అక్కడే ఉండిపోయాయని అంటున్నారు. అందుకే రుషికొండపై జగన్ సర్కార్, విలాసవంతమైన భవనాలను కట్టించిందని, ఇది ముమ్మాటికీ రాష్ట్రప్రజలకు గర్వకారణమని వైసీపీ నేతల సమర్థించుకునే పని చేశారు.

ఇక సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్‌లో వైసీపీని ఆటాడుకుంటున్నారు. పార్లమెంటు కొత్త భవనానికి 970 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, రుషికొండ ప్యాలెస్‌కు 500 కోట్లు వెచ్చిండమేంటని నిలదీస్తున్నా రు. నిద్ర లేవగానే సముద్రాన్ని చూడడం కోసం నిర్మాణం చేసిందని దుయ్యబడుతున్నారు.

Minister Nara Lokesh: పాలనపై నారా లోకేష్ తనదైన మార్క్.. హడావుడికి దూరంగా.. జనానికి దగ్గరగా

Minister Nara Lokesh aims to Bring Radical Changes in the Education Sector in AP: అవును ఏపీ మంత్రి లోకేష్.. జెట్ స్పీడ్ తో పని మొదలు పెట్టేశారు. టీడీపీ గత ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేసినా.. ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు. స్పీడ్ పెంచేశారు. జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతల స్వీకారానికి ముందే రంగంలోకి దిగేశారు. మంగళగిరి నియోజకవర్గం ఏర్పడ్డ 39 ఏళ్లలో అక్కడ టీడీపీకి అసలు విజయమే లేదు. కానీ నారా లోకేష్ రెండో ప్రయత్నంలోనే మంగళగిరిపై టీడీపీ జెండా ఎగరేశారు.

తెలుగుదేశం పార్టీకి రికార్డు విజయం సాధించి పెట్టారు. రికార్డు సృష్టించేలా చేశారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే గెలవాలి అన్న లక్ష్యంతో పని చేశారు నారా లోకేష్. నిజానికి చంద్రబాబు తనయుడిగా లోకేష్.. టీడీపీకి గట్టి పట్టు ఉండి, కచ్చితంగా గెలిచే చోటును ఏదైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ లోకేష్ రూటే సపరేటు. పార్టీ కండీషన్ చాలా టఫ్ గా ఉన్న చోటే నిలబడి గెలిచారు. అనుకున్నది సాధించారు. చివరికి మంగళగిరి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడం అలవాటు చేసుకున్న చంద్రబాబునే లోకేష్ స్పూర్తిగా తీసుకున్నారు. ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇదే మార్క్ చూపిస్తున్నారు. వర్క్ లో కచ్చితత్వం పెంచారు. ఏపీకి ఇప్పుడు ఏం అవసరం.. తనకు ఇచ్చిన శాఖల్లో పురోగతి చూపడం ఎలా అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పెట్టుకున్నారు. ఓవైపు పాలన, ఇంకోవైపు పార్టీ.. మరోవైపు ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడం ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చుట్టూ డైనమిక్ టీమ్ ను పెట్టుకున్నారు. దూకుడు పెంచారు.

నిజానికి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా రికమండేషన్ తో మంత్రి అయ్యారని గతంలో వైసీపీ విమర్శించింది. అప్పుడు పని చేసింది కొంత కాలమే అయినా ఐటీ శాఖలో స్పీడ్ పెంచారు. ఇక 2019లో మంగళగిరిలో ఓడిపోయాక నాడు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల తాకిడి మరింత పెంచారు. అన్నిటినీ భరించారు. ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఘన విజయంతో అందరి ముందు సగర్వంగా నిలబడ్డారు లోకేష్. అంతే కాదు.. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. అందులో మొదటిది క్యాంప్ ఆఫీస్ లో డే వన్ నుంచి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు.

గత ఐదేళ్లుగా జనం పాలకుల నుంచి ఏది మిస్సయ్యారో దాన్ని మంత్రి నారా లోకేష్ గ్రహించారు. అందుకే ప్రజాదర్బార్ పేరుతో జనం నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. పరిష్కారంపై భరోసా ఇస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జనంపై చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇన్నాళ్లకు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడు అనుకుంటున్నారు జనం. అటు మంత్రి లోకేష్ కూడా.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి తీరుతానంటున్నారు. రెండోసారి మంత్రి అయ్యాక లోకేష్ కు కీలక శాఖలే దక్కాయి. గతంలో చేపట్టిన ఐటీశాఖతో పాటు ఈసారి విద్యాశాఖ కూడా ఇచ్చారు. ఈ రెండూ ఛాలెంజింగ్ పోర్ట్ ఫోలియోసే. అయితే ఈ శాఖల్లో లోకేష్ తొలి రోజు నుంచే తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. రివ్యూ మీటింగ్ లు పెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై నజర్ పెట్టారు.

రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న అంశాలపై సమీక్షించారు. వీలైంత త్వరగా రిపోర్టులు ఇవ్వాలన్నారు. బెస్ట్ మెథడ్స్ ఎక్కడ అమలవుతున్నాయో పరిశీలించాలన్నారు. విశాఖను ఐటి హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్‌లో ఉండాలని ఇప్పటికే అధికారులకు టార్గెట్ పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

త్వరలోనే కొత్త ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఐటీ పాలసీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు పూర్వవైభవం తెచ్చేలా ఫోకస్ పెంచారు లోకేష్. అటు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా ఉండడంతో ఈ శాఖపై లోకేష్ ఫోకస్ మరింతగా పెంచారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అయి.. వారి ఆశలు, ఆకాంక్షల ప్రకారం విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సరికొత్త ఐడియాతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రెడీ చేశారు.

పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, అలాగే టీచర్లకు కేవలం చదువుల బాధ్యతలే ఉండేలా చూడాలనుకుంటున్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి ఉన్నతవిద్యాశాఖలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించేలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి టాప్ మోస్ట్ ప్రయారిటీలెన్నో లోకేష్ పెట్టుకున్నారు. ఒక విజన్ తో పని చేస్తున్నారు. చెప్పాలంటే యంత్రాంగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు.

Also Read: రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లకు లోకేష్ టార్గెట్ పెట్టారు. మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా నాణ్యతగా ఉండాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఫాలో అవుతున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను స్టడీ చేసి వాటి కంటే మెరుగైన పద్ధతి అమలు చేయాలంటున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలను విశ్లేషించి రిపోర్ట్ ఇవ్వాలని సమగ్ర శిక్షణ అధికారులను ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో విద్యార్థులకు స్కూల్ ఎంత దూరంలో అందుబాటులో ఉందన్న వివరాలనూ అడిగారు. గత ఐదేళ్లలో మూతపడ్డ స్కూళ్లు, అందుకు కారణాలు తెలుసుకోవాలని ఆర్డర్ వేశారు.

దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని మంత్రి లోకేష్‌ ఆదేశించారు. ఇక ఈనెల 15న ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సమయంలో.. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు గత వైసిపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం ఆపేసిందని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుస్తకాలు లేకుండా పేదవిద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి వెంటనే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునేలా తగిన ప్రణాళికలకు ఆదేశించారు. సో ఓవరాల్ గా బాధ్యతల స్వీకారానికి ముందే తనకు అప్పగించిన శాఖలపై మంత్రి నారా లోకేష్ ఓ విడత కసరత్తు పూర్తి చేసేశారు. ఇక బాధ్యతల స్వీకారం తర్వాత యాక్షన్ ప్లాన్ మరింత స్పీడ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

AP Gazette Notification : ఇట్స్ అఫీషియల్.. ముద్రగడ పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్

AP Gazette Notification on Mudragada Padmanabham Name : మాటంటే.. మాటే.. ఛాలెంజ్ చేసినట్లు ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ చేశారు. దీంతో పెద్దఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ ఛాలెంజ్ చేశారు.

ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడటం.. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో.. చెప్పినట్లే ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ఏడాది మార్చి 27న ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. తనకెలాంటి పదవి అక్కర్లేదని, పార్టీ సిద్ధాంతాలు నచ్చే చేరినట్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు వరకూ ఆయన జనసేన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోయిందని టాక్ వచ్చింది. వైసీపీలో చేరాక.. పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యతను ఆయనకే అప్పగించింది అధిష్టానం.

సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముద్రగడ పద్మనాభం తీర్పుపై ఆయన కుమార్తే ఆరోపణలు చేశారు. ఆమె జనసేనలో చేరేందుకు సిద్ధమవ్వగా.. పవన్ తన కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆరోపించారు. పవన్ పై విమర్శలు చేస్తూ వచ్చిన ముద్రగడ.. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. ఛాలెంజ్ ప్రకారం ఆయన పేరు మార్చుకున్నారు.

Crime News: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం.. ఉద్యోగం నుంచి కీచక ఎస్సై తొలగింపు

Crime News: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం.. ఉద్యోగం నుంచి కీచక ఎస్సై తొలగింపు

సమాజానికి రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉండి.. తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి ఒడిగట్టి పోలీసు శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాడో ఎస్సై. గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన సంఘటనలు ఉండడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్‌ ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరంలో లక్ష్మీ పంప్‌హౌస్‌ సమీపంలోని పాత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమకు కేటాయించిన గదుల్లో పోలీసులు నివసిస్తున్నారు. ఈ నెల 15న ఆ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ విధులు ముగించుకుని రాత్రి 10 గంటలకు తన గదికి వెళ్లారు. అదే భవనం రెండో అంతస్తులో నివసిస్తున్న భవానీసేన్‌ రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కిటీకీని తొలగించి ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించగా.. సర్వీసు రివాల్వర్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన ఆమె.. తన భర్తతో చర్చించి మంగళవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భవానీసేన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 20 రోజుల కిందట కూడా కాలు జారి కింద పడిపోయానంటూ ఎస్సై ఆమెను తన గదికి పిలిపించుకుని అత్యాచారయత్నం చేయబోగా.. ఆమె తప్పించుకున్నట్లు తెలిసింది.

ఎస్సై అరెస్టు.. రిమాండ్‌
జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఈ ఉదంతంపై ఎస్డీపీవో సంపత్‌రావుతో విచారణ చేయించారు. ఇందుకోసం ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, భారీ బందోబస్తు మధ్య విచారణ చేసినట్లు సమాచారం. ఎస్సై వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో భవానీసేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి ఫస్ట్‌ క్లాస్‌ అడిషనల్‌ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో అతడిని కరీంనగర్‌ జైలుకు తరలించారు.

సర్వీసు నుంచి శాశ్వతంగా ఉద్వాసన
ఎస్సై భవానీ సేన్‌ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ.. మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జులైలో ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్న సమయంలోనూ భవానీసేన్‌ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పట్లో అతడిని సస్పెండ్‌ చేశారు. గతంలో మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ప్రకారం భవానీసేన్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఐజీ పేర్కొన్నారు.

ఎవరైనా ఉపేక్షించం: మంత్రి శ్రీధర్‌బాబు
అత్యాచారం ఘటన విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

AP Govt: ఏపీలో ఒకటో తేదీకి.. రూ.10 వేల కోట్లు కావాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్‌ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జులై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి జులై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది.

అన్ని రకాల పింఛన్లకు కలిపి రూ.4,408 కోట్లు
జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు
సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు

 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్‌ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జులై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి జులై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను నెలకు రూ.1,000 చొప్పున బకాయిలనూ జులై 1న నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిపి ఈ జులై నెలకు రూ.4,408.31 కోట్లు అవసరమవుతాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటో తేదీన జీతం అందుతుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పింఛనుదారులదీ ఇదే ఆకాంక్ష. ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జులై ఒకటి నాటికి అన్నీ కలిపి ఎంత లేదన్నా రూ.10వేల కోట్లు అవసరమవుతాయి. అందుకు తగ్గట్టుగానే జూన్‌లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతోంది. ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ వద్ద ఉండేది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమయింది. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్‌ కాలం పూర్తయింది. రైల్వేశాఖ ఆయనను తమ సొంత శాఖకు వచ్చి రిపోర్టు చేయాలని ఉత్తర్వులిచ్చింది. అయినా రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నతాధికారి సౌరభ్‌గౌర్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సెలవులో ఉన్నారు. ఆర్థికశాఖలో కీలకాధికారులు సెలవులో ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచే ఏర్పాట్లు చేసినా.. జగన్‌ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికితీయాలనే ఆయనను ఇక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం.

జగన్‌ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.4,000 కోట్ల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్‌ 4 వరకు రూ.25 వేల కోట్ల రుణం తీసుకున్నట్లయింది. ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చుకునేందుకు ప్రయత్నించింది. తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. జూన్‌ 11న రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జులై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌ 11న ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుంది. వచ్చే వారం రుణసమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల పింఛన్లకు వినియోగించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.

ఆరు నెలలకు రూ.47 వేల కోట్లకే అనుమతి
కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు రూ.47వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అందులో జగన్‌ ప్రభుత్వం రూ.25వేల కోట్లు సమీకరించింది. సెప్టెంబరు వరకు మరో రూ.22వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే పది రోజుల రాబడులు, కొంత రుణం, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులను కలిపి జులై 1 నాటి అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఉద్యోగులకూ జులై 1న జీతాలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Journalist Rajinikanth : జర్నలిస్ట్ రజనీకాంత్ అంత సంపాదించాడా? ఐటీ శాఖ నోటీసులతో టీవీ9కు ‘సెలవు’?

Journalist Rajinikanth : టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సంపాదన అందనంత రేంజ్ లో ఉందా? ఆయన ఆదాయానికి, సమకూర్చిన ఆస్తులకు, చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు పొంతన లేదా?

అందువల్లే రజనీకాంత్ ఐటీ అధికారులకు చిక్కాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తోంది. అదనపు ఆదాయం, సంపాదించిన ఆస్తులపై వివరాలు ఇవ్వాలని రజనీకాంత్ కు ఆదాయపు పన్ను శాఖ తాఖీదులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.. టీవీ9 లో చర్చలు పెట్టకుండా, సెలవుపై వెళ్లాలని యాజమాన్యం ఆదేశించిన తర్వాత, ఈ వ్యవహారం మీడియా సర్కిళ్లల్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

టీవీ9 ఛానల్ ను ఏర్పాటు చేసింది రవి ప్రకాష్ అయినప్పటికీ.. కొత్త యాజమాన్యం బలవంతంగా ఆయనను బయటికి పంపింది. ఆ తర్వాత ఆయన స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అంతకుముందు రజనీకాంత్ టీవీ9 లో ఉన్నప్పటికీ.. తక్కువగా ఫోకస్ అయ్యాడు. ఎప్పుడో ఒకసారి రవి ప్రకాశ్ అనంతరం ప్రైమ్ టైం లో కనిపించేవాడు. కానీ ఎప్పుడైతే రవి ప్రకాష్ బయటకు వెళ్లిపోయాడో.. ఆ స్థానంలో రజనీకాంత్ స్థిరపడ్డాడు. అప్పటి నుంచి రజనీకాంత్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం, హైదరాబాదులో ఔషధ తయారీ సంస్థల్లో వాటాలు, ఏపీలో వైసిపి కి చెందిన కొంతమంది నాయకులతో కలిసి సాగిస్తున్న వ్యాపారాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో రజనీకాంత్ నిర్వహిస్తున్నారని భోగట్టా.. ఇదే సమయంలో రజినీకాంత్ అత్యంత విలువైన ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీద క్రయం చేసుకున్నారని తెలుస్తోంది.

ఎప్పటినుంచో రజనీకాంత్ వ్యవహార శైలి పై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనానికి దారి తీస్తోంది. ఈ విషయం ఈ నోటా, ఆ నోటా పడి, తెగ చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ వ్యవహార శైలి తెలుసుకున్నవారు..వామ్మో ఆయన ఈ స్థాయిలో ధనవంతుడా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలి ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసిపి ఓడిపోవడంతో రజనీకాంత్ తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. దీనిని మర్చిపోకముందే ఐటీ శాఖ రూపంలో నోటీసులు రావడం ఆయనను వేదనకు గురి చేస్తోందని తెలుస్తోంది. మరి ఈ విషయం టీవీ9 యాజమాన్యానికి తెలియడంవల్లే టీవీ స్క్రీన్ మీదకి రావద్దు అన్నట్టుగా ఆదేశాలు వెలువడ్డాయట. ఆయన ఇప్పట్లో స్క్రీన్ మీదకు వచ్చే అవకాశాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి వీటిల్లో ఎంత నిజం ఉందో, మరెంత అబద్ధం ఉందో రజనీకాంత్ నోరు విప్పేంతవరకు తెలియదు.

అందం, ఆరోగ్యం పెంచే రాగులు.. ఇలా వాడితే అద్భుతం చూస్తారు.!

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే సిరి ధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటితో చాలా మంది చాలా రకాల పదార్థాలను చేసుకుని తింటుంటారు.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఏ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. రాగుల్లో అమినో యాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది.

వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపి తింటే చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

ఫింగర్ మిల్లెట్ ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి.

Congress: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..

ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపించలేకపోయింది.

ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఏ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే దానిపై ఓ జాబితాను తయారు చేసింది. ఇలా ఎందుకు జరిగింది అనేదానిపై అంచనా వేసేందుకు ఫ్యాక్ట్‌-ఫైండింగ్‌ కమిటీలను నియమించింది.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో ప్రభావం చూపించనట్లుగా గుర్తించారు. అవి.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ. ఈ ఎనిమిది రాష్ట్రాలకు హైకమాండ్ కమిటీ సభ్యులను నియమించింది. వీళ్లందరు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందనేదానిపై అంచనా వేసి రిపోర్ట్‌ తయారు చేస్తారు. ఆ తర్వాత దీన్ని హైకమాండ్‌కు అందజేస్తారు. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కార్‌కు షాక్‌ తగిలినట్లైంది.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 8 ఎంపీ స్థానాలు రాగా.. బీజేపీకి కూడా ఎనిమిది స్థానాలు వచ్చాయి. మిగిలిన స్థానం ఎప్పట్లాగే ఎంఐఎం దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈసారి 10కిపైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కార్ భావించింది. కానీ 8 స్థానాల్లోనే గెలవడం, మరోవైపు బీజేపీ ఓటింగ్ శాతం కూడా పెరిగి ఆ పార్టీ కూడా 8 స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సరిగా ప్రభావం చూపించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంలో ట్విస్ట్..

Twist in Jr NTR Land Issue: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం హైకోర్టుకు చేరుకున్నట్టు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేయగా తనకు అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయని తెలిపారు. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫిర్యాదు చేయండంతో భూమిని విక్రయించిన సుంకు గీతపై కేసు నమోదైందని అన్నారు. అయితే బ్యాంకులకు హక్కులు ఉంటాయని DRT ఇచ్చిన తీర్పుపై హై కోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఇంటి రిజిస్టర్ GPA హక్కుదారు కిలారు రాజేశ్వర రావు ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ కోర్టును రాజేశ్వర రావు కోరగా DRT ఉత్తర్వులను పక్కకు పెట్టాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది.

రికవరీ అధికారి ఇరు పార్టీలను విచారించి చట్టానికి అనుగుణంగా త్వరితగతిన క్లెయిమ్ పిటిషన్ పరిష్కరించాలని కోర్టు సూచించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఇంటితో సంబంధం లేదని కిలారు రాజేశ్వర రావు పేర్కొన్నారు. 2012 లో రిజిస్టర్ GPA చేసుకొని, 2013లో ఇంటిని నా పేరుతో రిజిస్త్రేషన్ చేసుకొన్నానని, ఈ వ్యవహారంలో గతంలోనే సీసీఎస్ లో కేసు నమోదు చేశానని అన్నారు. సుంకు ఆటో లిమిటెడ్ చైర్మన్ సుంకు విష్ణు చరణ్ తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారని అన్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు స్థలాన్ని గీతా సంతోష్ విక్రయించారు. గీతా సంతోష్ సంతకాల తో పాటు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆమె మరిది విష్ణు చరణ్ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఇక ఇదే అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ టీం కూడా అప్పట్లో స్పందించింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారు, ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించవద్దు” అని ట్విట్టర్ వేదికగా టీం ప్రకటించింది.

Loneliness: నాణ్యమైన నిద్రతో “ఒంటరితనానికి” పరిష్కారం..

Loneliness: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఒకటి ”ఒంటరితనం”. ప్రస్తుతం ఒంటరితనం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించబడుతోంది.

అయితే, శరీరంలోనే ఏదైనా అనారోగ్యం వలే, దీనికి సంప్రదాయ వైద్య చికిత్స అనేది లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఆత్మహత్యని కూడా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనం మాత్రం ”ఒంటరితనం”కి చెక్ పెట్టే విషయాన్ని కనుగొంది. ”నాణ్యమైన నిద్ర” ఒంటరితనాన్ని అధిగమించడంలో సాయపడుతుందని తేలింది. పరిశోధకులు దాదాపు 2,300 మంది పెద్దల సర్వే నిర్వహించారు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు, భావోద్వేగ ఒంటరితనం మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. నిద్ర అనేది ఒంటరితనాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గం అని అధ్యయనం సూచిస్తుంది. అయితే, ఒంటరితనం విస్తృత ప్రభావాలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరింత పరిశోధన అవసరం అని అధ్యయనం సూచించింది.

వయస్సు కారణంగా కాకపోయినా, మానసిక ఒంటరితనంతో ఉన్న యువకులు ఆరోగ్యకరమైన నిద్ర నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. 2297 మంది( సగటు వయసు 44 , అంతకన్నా ఎక్కువ మంది పురుషులు) పై జరిగిన అద్యయనంలో ఆన్‌లైన్ స్లీప్ హెల్త్ ప్రశ్నాపత్రంతో పాటు డిజోంగ్ గిర్వెల్డ్ లోన్లీనెస్ స్కేల్ ఉపయోగించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సర్వీస్‌ పొడిగింపు

ఆరు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ

అమరావతి, జూన్‌ 19 : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని 6నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీరబ్‌ కుమార్‌ కొద్ది రోజుల కిందటే ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్‌ కాబోతున్నారు. కానీ, ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని నిర్ణయించింది.

అందులో భాగం గా కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలోనే ఆయన సీఎస్‌ కావాల్సి ఉంది. కానీ, జగన్‌ ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ అయిన జవహర్‌ రెడ్డికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీనియార్టీకి ప్రయార్టీ ఇచ్చారు.

సీనియారిటీలో ముందున్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను సీఎ్‌సగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయనకు 10 రోజుల సర్వీస్‌ మాత్రమే ఉండడంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వీస్‌ పొడిగింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఒకే విడతలో ఆరు నెలలు పొడిగింపు ఇస్తుందా.. లేదంటే మూడు నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందా అన్నది వేచి చూడాలి.

జగన్‌తో ప్రమాణం చేయించడంపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah Chowdary: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు చకచకా పూర్తయ్యాయి.

చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.

ఇక ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు.

దీనిపై ఆయన స్పందించారు. ప్రొటెం స్పీకర్ పెద్ద పోస్టేమీ కాదని అన్నారు. ఏదో రెండు రోజుల పాటు కొత్త సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయిస్తే అయిపోతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని కావడం వల్ల ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు తనను కోరారని, దీనికి అంగీకరించానని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకటేనని, అందరినీ సమానంగా చూస్తామని అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమానంగా గౌరవస్తామని చెప్పారు.

అలా అందరినీ సమానంగా చూడటం, గౌరవంగా వ్యవహరించడం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రభుత్వం వల్ల కాలేదని గోరంట్ల విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో శాసన సభ సజావుగా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ చక్కటి వేదిక అవుతుందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, మైకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని గోరంట్ల అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం లేదని, ఉన్నవాళ్లయినా సక్రమంగా సభకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ సభ్యులు నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చని, వాటిని స్వీకరిస్తామని అన్నారు.

RRB ALP Posts: రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన అసిస్టెంట్‌ లోకోపైలట్‌ పోస్టుల సంఖ్య, ఏకంగా మూడింతలు

RRB ALP Recruitment 2024: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 19న అధికారిక ప్రకటన విడుల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం.. 5,696గా ఉన్న ఏఎల్పీ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి మొదట 5,696 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఫిభ్రవరి 19 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. తాజా పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 585 నుంచి 1949కి పెరిగింది. సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 1192 నుంచి 3973 కి పెరిగింది. ఇక సౌత్ ఈస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 300 నుంచి 1001కి పెరిగింది. ఇక సదరన్ రైల్వే పోస్టుల సంఖ్య 218 నుంచి 726కి పెరిగింది. సౌత్ వెస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 473 నుంచి 1576కి పెరిగింది.

పోస్టుల వివరాలు ఇలా…

రైల్వే జోన్ ప్రకటించిన ఖాళీలు పెరిగిన ఖాళీల సంఖ్య
సెంట్రల్ రైల్వే 535 1786
ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76 76
ఈస్ట్ కోస్ట్ రైల్వే 479 1595
ఈస్టర్న్ రైల్వే 415 1382
నార్త్ సెంట్రల్ రైల్వే 241 802
నార్త్ ఈస్టర్న్ రైల్వే 43 143
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే 129 428
నార్తర్న్ రైల్వే 150 499
నార్త్ వెస్టర్న్ రైల్వే 228 761
సౌత్ సెంట్రల్ రైల్వే 585 1949
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే 1192 3973
సౌత్ ఈస్టర్న్ రైల్వే 300 1001
సదరన్ రైల్వే 218 726
సౌత్ వెస్టర్న్ రైల్వే 473 1576
వెస్ట్ సెంట్రల్ రైల్వే 219 729
వెస్ట్రర్న్ రైల్వే 413 1376
మొత్తం ఖాళీలు 5,696 18,799

పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ సీబీటీ-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు నెలలో సీబీటీ-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పరీక్ష నిర్వహించనున్నారు.

➥ ఆప్టిట్యూట్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

➥ అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాదికి సంబంధించిన ‘సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్’ను 2025 జనవరిలో విడుదల చేస్తారు.

నడుము నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని నడుము నొప్పి సమస్య వేధిస్తోంది. నడుం నొప్పికి విపరీతంగా మందులు వాడితే లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు.

నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిదని చెప్పవచ్చు. రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

నడుం నొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి. నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా మీ వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరే అవకాశాలు ఉంటాయి.

పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉండగా వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నడుం నొప్పిని నివారించడం కోసం చెప్పుల వినియోగం పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కూర్చునే, నిల్చునే భంగిమల విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా నొప్పికి చెక్ పెట్టవచ్చు.

బరువు తగ్గితే నడుం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పడంలో సందేహాలు అక్కర్లేదు. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యల సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.

Health

సినిమా