కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరితో పాటు 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సమావేశమై.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరితో పాటు 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సమావేశమై.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్‌లో 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచనున్నట్లు ప్రకటించింది. వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాలు ధర రూ.2,300కు చేరింది. అలాగే రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న , పత్తితో సహా మొత్తం 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పెరిగిన ధరలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
పెంచిన ధరలతో కలిపి..
తాజాగా కేంద్ర కేబినెట్ 14 పంటలకు మద్దతు ధర పెంచడంతో క్వింటాలు వరి ధర రూ.2,300కు చేరగా.. కంది పప్పు కనీస మద్దతు ధర రూ.7,550కు చేరింది. మినుములు క్వింటాలు ధర రూ.7,400 కాగా.. పెసలు రూ.8,682కు, వేరు శనగ ధర క్వింటా రూ.6783కు చేరింది. పత్తి కనీస మద్దతు ధర రూ.7,212కు, జొన్న ధర రూ.3.371కు చేరింది.