Friday, November 15, 2024

Andhra news: ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. 2014-19 మధ్య కాలంలో తెదేపా అధికారంలో ఉన్న సమయంలో ఆయనే ఏజీగా వ్యవహరించారు. తాజాగా మళ్లీ తెదేపా అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు దమ్మాలపాటినే ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

PM Kisan Scheme: పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం రైతులకు శుభవార్త తెలియజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ (PM Kisan) నిధులను ఆయన విడుదల చేశారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్రం.. ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా సహాయం అందనుంది.

ఎలా చెక్ చేసుకోవాలి

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని (https://pmkisan.gov.in) ఓపెన్ చేయాలి.

* బెనిఫిషియరీ స్టేటస్ పేజీని క్లిక్ చేసి.. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.

* రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.

* గెట్ డేటాపై క్లిక్ చేసి.. బెనిఫిషియరీ స్టేటస్‌‌లోకి వెళ్లి పేమెంట్ పడిందో లేదో చెక్ చేయొచ్చు.

ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల పీఎం కిసాన్ నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి రాకపోవచ్చు. అలాంటి సమస్యలు తలెత్తితే.. pmkisan-ict@gov.in లో ఫిర్యాదు చేయాలి. లేకపోతే హెల్ప్‌లైన్ నంబర్ 155261, 1800115526లను సంప్రదించవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే, రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ పథకానికి మీరు అర్హులా? కాదా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ?

వైసీపీ అధినేత జగన్ రెడ్డి దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో సహ సహా తమపార్టీ తరపున ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదని.

.. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరని.. అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని… ప్రజాస్వామ్య యుతంగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం లేదన్న కారణాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి జరగనున్నాయి. 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

గతంలో కూడాజగన్ ఓ సారి అసెంబ్లీ బ హిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. అసలు కారణం తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదన్న ఉద్దేశం. ప్రచారం చేసుకుంది మాత్రం… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయకపోవడానికి నిరసన. అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్‌లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే శాసనమండలిలో బలం ఉన్నందున.. మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

జగనన్న పేరు తీసేశారు.. చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం

Schemes Names Changed : ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.

ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పథకాల పేర్లని మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాలు పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.

జగన్ పథకాల పేర్లు మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం..
* జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరు మార్పు.
* జగనన్న విదేశీ విద్యాదీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు.
* వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ.
* వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు.
* జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు.

CBN And Pawan: సచివాలయంలో తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది. బుధవారం నాడు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్‌కు వెళ్లి చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పవన్ పరిచయం చేసుకున్నారు. సుమారు గంటన్నరపాటు సెక్రటేరియట్‌లో గడిపిన సేనాని.. రెండో బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌ను నిశితంగా పరిశీలించారు. అనంతరం మొదటి బ్లాక్‌కు వెళ్లిన పవన్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికిన సీఎం, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పేషీలో కూర్చోని సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ముచ్చటిస్తూ నవ్వుకున్నారు కూడా.!. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

భేటీ కావడానికి వచ్చిన పవన్‌కు సీటులో నుంచి లేచి ఎదురెళ్లి మరీ.. ఆలింగనం చేసుకున్న సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. సీఎం చాంబర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించిన పవన్.. ‘మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారు సార్’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ‘ధన్యవాదాలు పవన్’ అని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిభేటీ కావడంతో ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రేపు బాధ్యతలు తీసుకోనున్న విషయంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలో పవన్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.

సచివాలయంలోకి మునుపెన్నడూ రాని పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచివాలయం వెళ్లే దారులు మొదలుకుని లోపలికి అడుగుపెట్టేంతవరకూ అడగడుగునా ఘన స్వాగతం పలికారు. పవన్‌కు అమరావతి రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా పూలాభిషేకంతో ఆహ్వానించారు.

మందడంలో చెక్కతో చేసిన నాగలిని పవన్‌కు కానుకగా రైతులు చేశారు. అనంతరం సచివాలయంకు వెళ్లిన పవన్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం.. సచివాలయంలో సెకండ్ బ్లాక్‌కు వెళ్లి తన చాంబర్‌ను పరిశీలించారు. తొలుత అధికారులను పరిచయం చేసుకున్న పవన్.. ఆ తర్వాత మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ ముగ్గురూ కలిసి సీఎం చంద్రబాబు చాంబర్‌కు వెళ్లి సమావేశమయ్యారు.

Limited Offer: ఇదెక్కడి చవక బేరము.. 5G ఫోన్‌పై హెవీ డిస్కౌంట్.. టాప్ లేపుతుంది!

Limited Offer: ప్రస్తుతం స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు ఆఫర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త ఫోన్ లాంచ్ అయినా ప్రైస్ తగ్గినప్పుడు కొందామనుకుంటున్నాడు. ఇందుకోసం ఆఫర్ల కోసం వెతికేస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెజాన్ ఇండియాలో మరో సేల్‌ను తీసుకొచ్చింది. అమేజింగ్ లిమిటెడ్ టైమ్ డీల్ ప్రకటించింది.ఈ సేల్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

మీరు 64 మెగాపిక్సెల్ OIS కెమెరాతో Vivo ప్రీమియం ఫోన్ Vivo Y200 5Gని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,999. ఈ డీల్‌లో దీనిపై రూ. 750 కూపన్ తగ్గింపు లభిస్తుంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి HDFC లేదా SBI కార్డును ఉపయోగిస్తే మీకు రూ.1500 డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్‌పై రూ.1150 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. మీరు ఈ ఫోన్‌ని సులభమైన EMIలో కూడా దక్కించుకోవచ్చు.

Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ Vivo ఫోన్‌లో మీరు 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను చూస్తారు. ఈ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌ 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది.

ఇది 64-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో కంపెనీ సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చింది. ఫోన్‌లో 4800mAh బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. సేఫ్టీ పరంగా మీరు ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. OS గురించి మాట్లాడితే ఈ ఫోన్ Android 13తో Funtouch OS 13పై పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం మీకు ఫోన్‌లో 5G, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

Hanuman : ఆంజనేయుడికి మంగళవారం, శనివారం ఎందుకు ప్రత్యేకం – హనుమాన్ జయమంత్రం విశిష్టత తెలుసా!

Hanuman : ఆంజనేయుడు రామ భక్తుడు..రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మనుంచి వరాలు పొందినవాడు…అంటే హనుమంతుడు త్రిమూర్తుల తేజం, స్వరూపం నింపుకున్నవాడని అర్థం. ఆంజనేయుడిని నిత్యం పూజించేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి…ఎలాంటి గ్రహదోషాలు అయినా తొలగిపోతాయి. ముఖ్యంగా హనుమాన్ కి మంగళవారం, శనివారం అంటే అత్యంత ప్రీతికరం. కార్యసిద్ధి కోసం మంగళవారం, గ్రహదోషాలు – జాతకంలో దోషాలు తొలగించుకునేందుకు శనివారం పూజించాలని చెబుతారు.

యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షశాంతకామ్”

ఎక్కడైతే శ్రీరామచంద్రుడి సంకీర్తన జరుగుతుందో అక్కడ ఏదో ఒకమూలన ఆంజనేయుడు చేతులుజోడించి భక్తితో రామనామసంకీర్తనలో మునిగిపోతాయని అర్థం.

బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్

వాయుపుత్రుడిని నిత్యం పూజించేవారికి.. సరైన సమయానికి సరైన ఆలోచనను అందించే బుద్ధి..ధైర్యంగా ముందుకు అడుగేయగల మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అనారోగ్యాన్ని తరిమేసి…మనసుకి పట్టిన జడత్వాన్ని పారద్రోలుతాడు.

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్

త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, శివ స్వరూపుడైన ఆంజనేయుడిని రామదూతగా భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

లంకలో ఆంజనేయుడు పఠించిన ఈ జయమంత్రాన్ని చదువుకుంటే ఎంతటి కష్టంనుంచి అయినా బయటపడతారని పండితులు చెబుతారు… దీని అర్థం ఏంటంటే…రామలక్షణులు విశేషబలంలో వర్థిల్లుతున్నారు..సుగ్రీవుడు విజయోత్సాహంలో శోభిల్లుతున్నాడు..నేను రామబంటుని నా పేరు హనుమంతుడు .. యుద్ధంలో పెద్ద పెద్ద ఆయుధాలు వినియోగించను కానీ లంకాధిపతి సన్యాన్ని అరిపాదాలకింద పెట్టి తొక్కేస్తాను, పిడిగుద్దులతో నేలకూస్చేస్తాను, భారీ వృక్షాలు, బండరాళ్లతో శత్రుమూకని అంతమొందిస్తాను. వెయ్యిమంది రావణులు వచ్చినా నాకు ఓ కీటకంతో సమానం..అసలు నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణంలోనే లేడు. సీతాదేవిని చూసేందుకు ఎలా వచ్చానో..అలాగే ఈ లంకాపట్టణం నుంచి వెళ్లిపోతాను..నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అంటూ…ఈ జయ మంత్రాన్ని పఠించాడు ఆంజనేయుడు. చెప్పినట్టుగానే లంకకు నిప్పు పెట్టి తిరిగి రాముడి వద్దకు చేరుకుని సీతమ్మ సమాచారం అందించాడు..

ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కార్యం నెరవుతుందని చెబుతారు. అయితే స్వామివారికి అభిషేకాలు చేయించాలి అనుకుంటే..దేనితో అభిషేకం ఎలాంటి ఫలితం లభిస్తుంటే… తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది , ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి, ఆవుపెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆవునెయ్యితో ఐశ్వర్వం, విభూదితో సకలపాపహరణం, పూలతో భూలాభం కలుగుతుంది, పంచదారతో ఆంజనేయుడికి అభిషేకం చేస్తే దు:ఖాలు నశిస్తాయి..చెరుకురసంతో ధనం – కొబ్బరినీళ్లతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి…

ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

అమరావతి: ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువు కాగా.. ఉపసంహరణకు ఆ నెల 5 వరకు గడువు ఉంది. జులై 12న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇటీవల సి. రామచంద్రయ్య, షేక్‌ ఇక్బాల్‌పై మండలి ఛైర్మన్‌ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.

AP Assembly: ఈనెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈనెల 21 నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

శాసనసభ స్పీకర్‌గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్‌విప్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీపరంగా అయ్యన్నపాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్‌ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

Nara Lokesh: అక్రమ కేసులు రద్దు చేయాలి: లోకేశ్‌కు సీపీఎస్‌ ఉద్యోగుల విజ్ఞప్తి

అమరావతి: మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన వస్తోందని ఆయన ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు.

‘‘నా దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాను. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నా’’ అని పోస్టు పెట్టారు.

ప్రజా సమస్యలు తెలుసుకుని అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘ప్రజాదర్బార్’ మంగళగిరి ప్రజలకు సాంత్వన కలిగిస్తోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వారికి ఆయన భరోసా కల్పిస్తున్నారు.

మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలతో పాటు పలువురు ఉద్యోగులు, మీ సేవ నిర్వాహకులు వచ్చారు. తమకు న్యాయం చేయాలని మీసేవ నిర్వాహకులు కోరారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఆయా శాఖలకు పంపించేందుకు లోకేశ్‌ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వారి ద్వారా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు.

ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (జనరల్‌)

ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (ఒకేషనల్‌)

Best Cars under Rs 5 lakh: మిడిల్ క్లాస్ కార్లు.. బైక్ కంటే ఇవే బెటర్!

Best Cars under Rs 5 lakh: కారు కొనడం అనేది దాదాపు ప్రతి మిడిల్ క్లాస్ ప్రజల కల. కానీ చాలా మంది తక్కువ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఆఫర్ట్‌బుల్ ప్రైస్‌లో తక్కువ ధరకే కార్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఈ కార్లను కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు రూ. 5 లక్షలలోపు బెస్ట్ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం అదిరిపోయే నాలుగు కార్లు ఉన్నాయి. అంతే కాదు దీని మైలేజీ కూడా లీటరుకు 20 కి.మీ కంటే ఎక్కువ. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Alto 800
మీ బడ్జెట్ రూ. 5 లక్షల లోపు ఉంటే మీరు ఈ మారుతి కారును మీ సొంతం చేసుకోవచ్చు. మారుతి ఆల్టో 800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.54 లక్షలు. ఈ కారు లీటరుకు 22.05 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన కారు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.

మారుతి ఆల్టో 800 0.8L F8D పెట్రోల్, CNG అనే రెండు ఇంజన్ వేరియంట్‌లో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ 47.3 బిహెచ్‌పి పవర్, 69 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. కాగా CNG వెర్షన్‌ 40 bhp పవర్, 60 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఈ కారు స్టాక్ సేల్‌కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కంపెనీ తన తయారీని నిలిపివేసింది.

Maruti Alto K10
మారుతి ఆల్టో K10 కూడా భారతదేశంలోని చౌకైన కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. ఈ కారు లీటరుకు 24.39 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 1.0L K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 67 bhp, 90 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Maruti s Presso
మారుతి S-ప్రెస్సో మంచి ఆఫర్డ్‌బుల్ ప్రైస్‌తో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.26 లక్షలు. ఇందులో 1.0L K10B పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 67 bhp పవర్‌, 90 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. ఈ కారు మైలేజీ లీటరుకు 24.76 కి.మీ ఇస్తుంది.

రైతులకు కేంద్రం గుడ్​ న్యూస్.. ‘పీఎం కిసాన్’ డబ్బులు వచ్చేశాయ్!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం-కిసాన్ సాయాన్ని విడుదల చేసింది. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు.

మొత్తం 9.26కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతోంది. దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయల నిధి విడుదల చేసింది.

కేంద్ర బీజేపీ సర్కార్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకోచ్చింది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించారు.

అప్పటి నుంచి ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్‌లో నేరుగా కేంద్రం వేస్తోంది. కాగా, రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా.. కొందరికి ముందు, మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది.

T20 World Cup: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచడమే కాదు.. గ్రూప్-స్టేజి నుంచి అదిరిపోయే మూడు విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. సూపర్-8లో భారత్.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని టీమిండియా..

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచడమే కాదు.. గ్రూప్-స్టేజి నుంచి అదిరిపోయే మూడు విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. సూపర్-8లో భారత్.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని టీమిండియా.. సూపర్-8లో ఏమేరకు రాణిస్తుందోనన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో తలెత్తుతోంది. గత 8 టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో సూపర్-8 రౌండ్‌లో టీమిండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసింది. దీంతో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్స్.. ఈసారైన భారత్ అద్భుతంగా రాణించాలని.. లేదంటే అర్ధాంతరంగా ట్రోఫీ అందకుండానే టీమిండియా టోర్నీ నుంచి ఔట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్‌ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2009లో రెండో ఎడిషన్‌లో భారత్‌ సూపర్‌-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడు జట్లతో తలబడింది. అయితే ఈ మూడు జట్లపైనా టీమిండియా ఓడిపోయి.. చివరి స్థానంలో నిలవడమే కాకుండా.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2010 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ టోర్నీలో గ్రూప్ సీలో భాగంగా భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో తలపడిన టీమిండియా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో టీమిండియా టోర్నీ నుంచి ఔట్ అయింది.

2012లో షాకిచ్చిన నెట్ రన్ రేట్..
2009, 2010 ప్రపంచకప్‌ల మాదిరిగానే 2012 ప్రపంచకప్‌లోనూ భారత్‌ మరోసారి సూపర్‌-8 రౌండ్‌ నుంచే ఎగ్జిట్ అయింది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలబడిన భారత్.. పాక్, సఫారీలపై గెలిచి.. ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేట్ పరంగా పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండటంతో భారత జట్టు సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించింది.

ఈసారి పెద్ద సవాలే..
ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గడిచిన టీ20 మ్యాచ్‌ల గణాంకాలు పరిశీలిస్తే.. ఈ మూడు జట్లపై భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ల ఫామ్‌.. టీమిండియాను భయపెడుతోంది. వీరిని ఓడించి భారత్‌ సెమీఫైనల్‌‌కు చేరాలంటే.. అంత ఈజీ ఏం కాదు. కాబట్టి ఈ రౌండ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబరచాల్సిందే.

గత టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ ప్రయాణం ఇలా..
2007- ఛాంపియన్

2009- సూపర్-8

2010- సూపర్-8

2012- సూపర్-8

2014- రన్నరప్

2016- సెమీఫైనల్

2020- సూపర్-12

2022- సెమీఫైనల్

Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?

Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వేగంగా పెరుగుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. యువత కూడా బాధితులుగా మారుతున్నారు. ఈ వయస్సు వారు మధుమేహానికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మారుతున్న జీవనశైలి వల్ల నేడు చాలా మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. యువతలో కూడా ఈ వ్యాధి క్రమంగా పెరుగుతోంది.

డయాబెటిక్ అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్ ప్రకారం, గత నాలుగు-ఐదు సంవత్సరాలలో, 40 ఏళ్లలోపు వారిలో మధుమేహం కేసులు 23 శాతం పెరిగాయి. ఈ పరిస్థితి బ్రిటన్ లోనే కాదు భారత్ లోనూ ఉంది. ఈ పరిస్థితి బ్రిటన్ లోనే కాదు భారత్ లోనూ ఉంది. ఇక్కడ కూడా 30-40 ఏళ్ల వయసు వారిలో మధుమేహం వేగంగా పెరుగుతోంది. ఏ వయసులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో, దాని నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రభుత్వ ఉద్యోగులు కుర్చీ వేసి, టీ ఇచ్చి మీ పనులు చేసి పెడతారు: టీడీపీ వర్కర్లకు అచ్చెన్న హామీ

Kinjarapu Atchannaidu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో- ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా అచ్చెన్నాయుడు మాట్లాడటం చర్చనీయాంశమౌతోంది. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకుంటారని, అలా వారికి తాను ఆదేశాలను జారీ చేస్తారని అన్నారు. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని తాను దారిలోకి తెస్తాననీ చెప్పారు.

శ్రీకాకుళంలో పార్టీ నాయకులు, కార్యకర్తల విజయోత్సవ ర్యాలీలో.. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి పాల్గొన్నారాయన. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అయిదు సంవత్సరాల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినందున సంబరాలు జరుపుకొంటోన్నారని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా తాను సమావేశం పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తానని అన్నారు.

ఎస్ఈ, ఎమ్మార్వో, ఎండీఓ.. వంటి ఏ అధికారి వద్దకైనా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లాలని అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అధికారులు వారికి గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, వచ్చిన పని ఏంటని అడిగి మరీ పనులు చేసి పెడతారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అలా పని చేసేలా అధికారులు, ఉద్యోగులను తాను లైన్‌లో పెడతానని హామీ ఇచ్చారు.

ఎవరైనా ఒకరిద్దరు తన మాట వినకపోతే వాళ్లు ఏమౌతారో వారికి బాగా తెలుసునని, తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ పెసర మొలకలు దోస షుగర్ కంట్రోల్, బరువు తగ్గిస్తుంది

మన రోజువారీ జీవితంలో ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచే ఈ ఆహారాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండకుండా, మన శరీరానికి శక్తిని ఇస్తాయి.

మనం తినే ఆహారంలో పోషకాల కొరత ఉంటే, శరీరం ఖచ్చితంగా లోపాలను ఎదుర్కొంటుంది.

ఈ లోపాలు మన శరీరానికి చేరకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై అదనపు శ్రద్ధ పెట్టడం అవసరం. ఆహారంలో పాలు, పండ్లు, ఆకు కూరలు, మొలకలు మరియు పప్పులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఆయిల్ ఫుడ్స్ మరియు రెడీమేడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరం కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాలు, పండ్లతో పాటు మొలకలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు వాటిని క్రమం తప్పకుండా తినగలిగేలా మొలకెత్తిన పప్పుల నుండి స్నాక్స్ ఎలా తయారు చేయాలి అనే మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఉంది.

నేటి కథనంలో, ప్రొటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉండే మొలకల దోసను రుచి చూడండి. అత్యంత పోషకమైనది మొలకలలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రొటీన్‌తో

మొలకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి, ఇది బరువు తగ్గాలనుకునే వారికి మరింత సహాయపడుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా తయారు చేసుకోగలిగే మొలకల దోస తయారీ విధానాన్ని క్రింద అందించాము.

పరిమాణం: 4

*తయారీ సమయం: 1/2 గంట

*వంట సమయం: 1/2 గంట

కావాల్సిన పదార్థాలు

*పెసరపప్పు 250 గ్రాములు(మొలకకట్టినది)

*అల్లం – 1 ముక్క

*కొద్దిగా జీలకర్ర

*ఉప్పు – రుచికి సరిపడా

*పచ్చిమిర్చి – 4

*కొత్తిమీర – కొద్దిగా

*నూనె – 50 గ్రా

*ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)

తయారు చేసే విధానం

1. ముందుగా పేసర పప్పును నీళ్లలో 5 గంటలు నానబెట్టాలి.తర్వాత నీరు వంపేసి, పల్చటి కాటన్ బట్టలో వేసి ముడి కట్టి రాత్రంతా అలాగే పెట్టాలి.

2. మరుసటి రోజు ఉదయం మొలకలను మూట విప్పి వాటిని మిక్సీలో వేసి అందులో కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి బాగా మెత్తగా దోస పిండిలా చేసుకోవాలి.

3.చివరిగా దోస పిండిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కులు, కొత్తిమీర తరుగు వేసి, మొత్తం మిశ్రమంను బాగా కలుపుకోవాలి

4. అంతలోపు, తవాను వేడి చేసి, దోస పిండిపోసి దోసెలా పాన్ మొత్తం స్పెడ్ చేసి రెండు వైపులా దోరగా వేయించుకోండి.

5. అంతే రుచికరమైన పెసరపప్పు మొలకల దోసె రుచి చూడటానికి సిద్ధంగా ఉంది. ఈ దోసెను, అల్లం చట్నీ గ్రీన్ చట్నీతో ఆస్వాదించడం వల్ల రుచి అద్భుతంగా ఉంది.

Hema : డబ్బు కోసం ఏమైన చేస్తా.. అది ఒక్కటి తప్ప అంటూ హేమ సంచలన కామెంట్స్

Hema : సినీ నటి హేమ ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గతనెల ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో హేమను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

అయితే ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. బెయిల్ లభించిన తర్వాత హేమ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె జైలు గేట్ వద్ద సంతకం చేస్తుండగా ఆమెతో కొందరు ఫోటోలు దిగితూ కనిపించారు. అయితే అనంతరం ఆమె హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్దమయ్యారు.

ఈ క్రమంలో ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా.. వారితో మాట్లాడే పనేముంది? వారితో మాట్లాడాల్సిన అవసరం లేదనే మాటలు ఆమె నుంచి వినిపించాయి. దాంతో ఆమెలో ఉండే ముక్కుసూటి తనం మరోసారి బయటపడింది. అయితే కన్నడ మీడియాలో మాత్రం మీడియాతో మాట్లాడకుండా ఆమె దురుసుగా వెళ్లిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేవలం సినిమా మీదే ఆధార పడి ఉంటే ఇంత డబ్బు ఉండేది కాదు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా కోట్ల విలువ చేసే ఫ్లాట్ లు, బీఎండబ్ల్యూ కార్లు ఎలా సంపాదించారు అని యాంకర్ ప్రశ్నించారు. హేమ సమాధానం ఇస్తూ మా ఊర్లో నాకు ఆస్తులు ఉన్నాయి. నా భర్త సంపాదిస్తారు. అలాగే నేను కూడా చిట్టీలు లాంటి వ్యాపారాలు చేస్తాను. కాబట్టి నా లైఫ్ హ్యాపీ అని తెలిపింది.

అంతా అనుకుంటున్నట్లు నా దగ్గర వందల కోట్లు అయితే లేవు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా నేను గంజి నీళ్లు తాగి బతకగలను. అడవిలో వదిలేసినా బతుకుతా. నాకు లగ్జరీ లైఫ్ మాత్రమే అవసరం లేదు అని తెలిపింది. పని విషయంలో నాకు చిన్న చూపు లేదు. డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పని అయినా చేస్తాను. అయితే తలవంచుకునే పని మాత్రం చేయను అని తెలిపింది. ఈ మాటలనే వైరల్ చేస్తూ.. హేమ రేవ్ పార్టీలో దొరికిన విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. తలదించుకునే పని మాత్రం జీవితంలో చేయను అని తెలిపింది. ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికిపోయి పరువు పోగొట్టుకుందిగా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. హేమని మా అసోసియేషన్ నుండి కూడా తప్పించిన విషయం తెలిసిందే.

Health Tips: చిన్న చిన్న విషయాలను మరచిపోతున్నారా? ఇలా చేయండి

వయసు పెరిగే కొద్దీ శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం సర్వసాధారణం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార వినియోగం వల్ల చిన్న వయసులోనే రకరకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.

మరీ ముఖ్యంగా, ఒత్తిడితో కూడిన జీవితం, ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటారు . అలాంటి ఒక సమస్య మతిమరుపు. గతంలో జరిగిన వాటిని మర్చిపోవడం సర్వసాధారణం. అయితే ముందు రోజు ఏం జరిగిందో గుర్తుకు రాకపోయినా, మరిచిపోయినట్లు అనిపించినా.. జాగ్రత్తగా ఉండండి అంటున్నారు నిపుణులు.

అధిక ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర వైద్య సమస్యలకు ఉపయోగించే మందులతో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు, ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి చురుకుగా ఉండేలా చూసుకోవాలి. దీనికి కొంత మెదడు పని అవసరం. చిన్న లెక్కల కోసం కూడా కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం మానుకోండి. చెస్, పజిల్స్ వంటి కార్యకలాపాలలో పాల్గొనాలని సూచిస్తున్నారు.

శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడు కణాలను చురుకుగా ఉంచుతుంది. ఏ వయసు వారైనా యోగా, నడకను నిత్యకృత్యంగా చేసుకోవాలి.

మద్యానికి బానిసలైన వారు దానిని వదులుకోవాలి. ఆల్కహాల్ నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ నీరు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకూడదు. శరీరంలో అకస్మాత్తుగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే, అది మెదడుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.

Whatsapp: వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు.. వీటి ఉపయోగాలు ఏంటంటే

ఇక యూజర్ల భద్రతతో పాటు యాప్ యూజర్ ఇంటర్‌ఫేజ్‌కు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌లో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్‌ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా ఆడియోతో పాటు స్క్రీన్‌ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్‌ స్పాట్‌లైట్‌ అనే మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్లు ఏంటి.?

ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. మార్కెట్లో ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా.. వాట్సాప్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గకపోవడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు.

ఇక యూజర్ల భద్రతతో పాటు యాప్ యూజర్ ఇంటర్‌ఫేజ్‌కు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌లో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్‌ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా ఆడియోతో పాటు స్క్రీన్‌ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్‌ స్పాట్‌లైట్‌ అనే మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్లు ఏంటి.? వీటితో కలిగే ప్రయోజనం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడియోతో స్క్రీన్‌ షేరింగ్‌..
వాట్సాప్‌లో గతకొన్ని రోజుల క్రితం స్క్రీన్‌ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమ స్క్రీన్‌తో పాటు ఆడియోను కూడా ఏకకాలంలో అవతలి వ్యక్తితో షేర్‌చేసుకునే అవకాశం లభిస్తుంది.

వీడియో కాల్‌లో కొత్త ఫీచర్‌..
గ్రూప్‌ వీడియో కాల్స్‌ అనగానే మనకు సహజంగా గూగుల్‌ మీట్‌ లేదా జూమ్‌ వంటి యాప్స్ గుర్తొచ్చేవి కానీ వాట్సాప్‌లో సైతం గ్రూప్‌ వీడియో కాల్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌లో పార్టిసిపెంట్‌ కెపాసిటీని పెంచింది. దీంతో ఒకేసారి ఏకంగా 32 మంది యూజర్లు వీడియో కాల్‌లో పాల్గొని మాట్లాడుకోవచ్చు.

స్పీకర్ స్పాట్‌లైట్ ఫీచర్..
వాట్సాప్‌ కాల్‌లో ఎవరు మాట్లాడుతున్నారో హైల్‌ చేసేందుకు గాను వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వచ్చిన వాట్సాప్‌ తాజాగా ఆడియో, వీడియో క్వాలిటీని మెరుగుపరిచే క్రమంలో ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

EVM లపై జగన్ సంచలన ట్వీట్‌- పేపర్ బ్యాలెట్లు వాడాలని డిమాండ్

EVM Controversy: ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు.

“న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో EVMలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి.” అని జగన్ ట్వీట్ చేశారు.

జూన్ 4న ఫలితాలు వచ్చిన రోజునే స్పందించిన జగన్ మోహన్ రెడ్డి… తాము ప్రజలకు ఎంతో మేలు చేశామని వాళ్లు వేసిన ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. చాలా అనుమానాలు ఉన్నప్పటికీ దానికి తగ్గ ఆధారాలు లేవని అన్నారు. అప్పటి నుంచి వైసీపీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు నేరుగా జగన్ మోహన్ రెడ్డే ఈవీఎంలపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

అయితే జగన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు అంతకు ముందు చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు జగన్ స్పీచ్‌లను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ఈవీఎంలను మ్యానుపులేట్ చేయవచ్చన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. అసలు ఈవీఎంలలో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని ఉదాహరణతో వివరించారు. ఎవరికి ఓటు వేస్తున్నామో వీవీ ప్యాట్‌లో కనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తిత తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తే వీవీప్యాట్‌ స్లిప్‌లో వేరే పార్టీ గుర్తు కనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తారని అన్నారు. అలా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదని గుర్తు చేశారు. అప్పట్లో చేసిన ఈ కామెంట్స్‌ను జగన్‌కు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

Nenu Badiki Pota OoSC Enrollment Drive 2024 Schedule, Action Plan

Nenu Badiki Pota OoSC Enrollment Drive 2024 Schedule, Action Plan నేను బడికి పోతా AP Samagra Shiksha – OSC Wing – Conduct of “Nenu Badiki Pota” Enrollment Drive – campaign in all the habitations in the State from 13-06-2024 to 12-07-2024 – Instructions issued

AP Samagra Shiksha – OSC Wing – Conduct of “Nenu Badiki Pota”- Enrollment Drive – campaign in all the habitations in the State from 13-06-2024 to 12-07-2024 – Instructions issued – Reg Rc.No. SS-22021/3/2024-OSC SEC-SSA, Dt.: 14/06/2024

Read: Memo No. Spl/A&I/2024-CSE, Dt. 10-06-2024 of the Commissioner of School Education, A.P., Amaravati.
The attention of all the District Educational Officers & Ex-Officio Project Coordinators and Additional Project Coordinators of Samagra Shiksha in the State is invited to the reference cited and are informed that the Commissioner of School Education, A.P., Amaravati issued permission for opening of all Schools from 13-06-2024 for the Academic year 2024- 25.

Further it is informed that, it is proposed to conduct a special drive on enrolment campaign to conduct Door to Door Survey of Identification of the OoSc Children with the Support of Gram/ward Sachivalayam in Consistent Rhythmes in the State. The major focus of the drive is to reduce the dropout rate and enroll all the school going children by creating awareness on the importance of Education and facilities, benefits and schemes related to Education.

The objectives of the programme are:

To ensure 100% enrolment of all eligible children into schools
To ensure that no child in the age group of 6-14 years is left out of
To bring back all dropout children to school

Encl.:Model copy of Banner and Format for day wise report.

Download AP SS Proceedings, Action Plan

Rushikonda: రుషికొండపై వైకాపా కుప్పిగంతులు!

విశాఖపట్నం: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలు జగన్‌ కోసం కాదు అంటూనే.. ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే అక్కడి నుంచే జగన్‌ పాలన చేసేవారంటూ మాజీమంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను మొదటి నుంచి పర్యాటక ప్రాజెక్టు అనే చెప్పామన్నారు. విశాఖ నుంచి పాలన జరిగితే రుషికొండ భవనాలు బాగుంటాయని ఐఏఎస్‌ల కమిటీ.. నివేదిక ఇచ్చిందని తెలిపారు. రూ. 450 కోట్లతో ఎందుకంత విలాసవంతంగా నిర్మించారని విలేకరులు ప్రశ్నించగా ‘2014-19 మధ్య అమరావతిలో తాత్కాలిక భవనాలకు చంద్రబాబు చదరపు గజానికి రూ.10 వేల చొప్పున రూ. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. రుషికొండలో వైకాపా శాశ్వత నిర్మాణాలను చేపట్టింది’ అంటూ అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. భవనంలోని ఫర్నిచర్‌ ధరలను కూటమి నేతలే ఫిక్స్‌ చేసి మైకుల ముందు ఊదరగొడుతున్నారన్నారు. విశాఖలో మంచి ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ లేదు కనుక నగరానికి రాష్ట్రపతి, గవర్నరు వంటివారు వచ్చినప్పుడు విడిది కోసం ఈ భవనాలు నిర్మించామంటూ మరో కొత్త రాగం అందుకోవడం గమనార్హం.

ముందే తెలిస్తే ఆ 11 సీట్లూ వచ్చేవి కావు: గంటా
రుషికొండ రహస్యం ఎన్నికలకు ముందే వెల్లడై ఉంటే వైకాపాకు ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్స్‌ వేదికగా చురకలంటించారు. ‘రుషికొండ నిర్మాణాలపై ఎందుకీ కుప్పిగంతులు? మొదట టూరిజం ప్రాజెక్టు అన్నారు. తర్వాత ఫైవ్‌స్టార్‌ హోటల్, సీఎం క్యాంపు కార్యాలయం అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌లు బస చేయడానికి ఐఎన్‌ఎస్‌ డేగ, నేవల్‌ గెస్ట్‌హౌస్‌ వంటివి ఉన్నాయి’ అని గంటా గుర్తుచేశారు. సరైన అనుమతుల్లేవని ప్రజావేదిక కూల్చినవాళ్లు.. అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చేయాలో చెప్పాలి’ అని గంటా పేర్కొన్నారు.

ఆ విలాసాల ఖర్చుతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొచ్చు: ఎంపీ కలిశెట్టి
రుషికొండపై రాజసౌధాల కోసం ఖర్చు చేసిన నిధులను ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెచ్చించి ఉంటే ప్రజలు హర్షించేవారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జగన్‌ విలాసాల కోసం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేయడం ఎంతవరకు హర్షణీయమని ప్రశ్నించారు. ‘ఆ ప్యాలెస్‌ల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులతో ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేసి ఉండొచ్చు’ అని అప్పలనాయుడు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు హెచ్చరికలతో జారుకునే ప్రయత్నం.. చెక్ పెట్టిన సిఎస్

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో కొంతమంది అధికారులు వేరే చోటే ఉద్యోగాలు చూసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ తాజాగా అదేబాటలో నడిచారు. మూడు రోజుల క్రితం నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో జాయిన్ అయ్యారు. అటు రైల్వే ఉన్నతాధికారులు కూడా వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో మార్గం సుగుమం అయిందనకున్న సత్యనారాయణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ భారీ జలక్ ఇచ్చారు.

ఈస్ట్రన్ రైల్వేలో సత్యనారాయణ జాయిన్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవింగ్ అర్డర్ సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ నిలిపివేశారు. గత ప్రభుత్వంలో సత్యనారాయణ వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సత్యనారాయణను రిలీవ్ కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అటు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ఈ నెల 18 వరకూ లీవ్‌లో ఉండటంతో సత్యనారాయణ ప్రయత్నాలకు చీఫ్ సెక్రటరీ చెక్ పెట్టారు.

`నల్లారి`కి రాజయోగం: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు..?

Nallari Kiran Kumar Reddy: భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు నల్లారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి ఆయనే. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి అయ్యారు.

రాష్ట్ర విభజన తరువాత చాలాకాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ చెయ్యొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ, అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించడం.. పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు. ఇప్పుడున్న సీపీ రాధాకృష్ణన్.. ఇన్‌ఛార్జ్ మాత్రమే. జార్ఖండ్‌కు ఆయన పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉంటోన్నారు. గతంలో గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తరువాత తెలంగాణ వంటి కీలక రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంలో ఉంది బీజేపీ. పైగా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకొంది. దీన్ని మరింత బలోపేతం చేసేలా కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్‌గా పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంగీకరించారనే అంటోన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు కావడం వల్ల గతంలో పార్టీలు వేరైనప్పటికీ.. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.

జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!

]అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ అధినేతకు..పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ కేడర్‌తో చంద్రబాబు ఫోటోలు దిగారు. సెల్ఫీలూ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ అధినేతకు..పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ కేడర్‌తో చంద్రబాబు ఫోటోలు దిగారు. సెల్ఫీలూ ఇచ్చారు.

ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు. పార్టీ అధ్యక్షుడి రాకతో పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకుంది. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన చంద్రబాబు.. జగన్ కూల్చిన ప్రజావేదికను మళ్లీ నిర్మించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలను అలానే ఉంచుతామన్నారు. పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్నారు.

అసెంబ్లీ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి..సచివాలయంలోనే వినతుల స్వీకరణకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రజలనుండి విజ్ఞప్తుల స్వీకరణకు వీలైనంత సమయం కేటాయిస్తానన్నారు చంద్రబాబు.

SSC Exam Calender: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

SSC Exam 2024-25 Calendar: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

2024-25 సంవత్సరానికి నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక కాలపట్టికలను కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే పరీక్షల తేదీలను వెల్లడించింది. ఇందులో జూనియర్ ఇంజినీర్ (JE), సెలక్షన్ పోస్టులు (Selection Posts), ఢిల్లీ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (DP SI), సీజీఎల్ (CGL), ఎంటీఎస్ (MTS), హవల్దార్, గ్రేడ్ సి/డి స్టెనోగ్రాఫర్ (Stengrapher), కానిస్టేబుల్ (Constable GD), జూనియర్ హిందీ ట్రాన్స్టేటర్ (JHT) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. జూన్ 24న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సీజీఎల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్ 27న మల్టీటాస్కింగ్ స్టాఫ్(MTS), ఆగస్టు 27న కానిస్టేబుల్ (జీడీ) నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్లో ఎంటీఎస్ పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో కానిస్టేబుల్ (జీడీ) రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు క్యాలెండర్లో పేర్కొన్నారు.

➥ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2024
➛నోటిఫికేషన్: 24.06.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.06.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.07.2024.
➛ టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: సెప్టెంబరు-అక్టోబరు, 2024.

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), అండ్ హవాల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2024
➛ నోటిఫికేషన్: 27.06.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.06.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2024.
➛ టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు-నవంబరు, 2024.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్, 2024
➛ నోటిఫికేషన్: 26.07.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.07.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.08.2024.
➛ రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు – నవంబరు, 2024.

➥ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్, 2024
➛ నోటిఫికేషన్: 02.08.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.08.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2024.
➛ పేపర్-1(సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు – నవంబరు, 2024.

➥ కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) ఇన్ సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2025
➛ నోటిఫికేషన్: 27.08.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.08.2024.
➛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.10.2024.
➛ రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: జనవరి- ఫిబ్రవరి 2025.

ఆ పరీక్షల తేదీల్లో మార్పులు..

⫸సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫేజ్-12, 2024 పేపర్-1 పరీక్షలను జూన్ 24 నుంచి 26 వరకు నిర్వహించాల్సి ఉండగా.. తాజా షెడ్యూలు ప్రకారం జూన్ 20, 21, 24, 25, 26 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించన్నారు.

⫸ అదేవిధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024 టైర్-1 పరీక్షలను జులై 1 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా.. కొత్త షెడ్యూలు ప్రకారం జులై 1 నుంచి 5 వరకు, తిరిగి జులై 8 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

⫸ ఇక ఢిల్లీ పోలీసు, సీఏపీఎఫ్ విభాగంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి జూన్ 27 నుంచి 29 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు.

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్ వినిపించిన చంద్రబాబు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబునాయుడు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సత్వరమే పరిష్కరించారు. మామిడి ధరలు పతనం కావడంతో ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు టన్నుకు రూ.30వేల ధర నిర్ణయించారు.

టన్ను మామిడికి రూ.30వేలు

ప్రస్తుతం ఎకరాకు రూ.19వేల నుంచి రూ.21వేల మధ్యలో ధర ఉంది. వేసవికాలంలో వీచిన ఈదురు గాలులకు, కురిసిన వర్షాలకు మామిడి నేలరాలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగయ్యే మామిడిలో 90 శాతం తోతాపురి ఉంటుంది. వెంటనే వీరికి టన్నుకు రూ.30వేలు ఇచ్చేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. పల్ప్ కంపెనీలు, వ్యాపారస్తులు, మామిడికాయ మండీల యాజమాన్యం ఈ ధర చెల్లించాలని, అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ధరలు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని, దీనిపై తనకు అప్‌డేట్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.

యాజమాన్యం అడ్డుకుంటోంది

తాజాగా ఈ విషయాన్ని పులివర్తి నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలకు చెందిన యాజమాన్యం, మామిడి ర్యాంపు యజమానులు, మామిడికాయ మండీల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. టన్నుకు రూ.30వేలు నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి రకం సాధారణ స్థితిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడినిస్తుంది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక కంపెనీ మాత్రం టన్నుకు రూ.23వేలు చెల్లిస్తోంది.

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

కొందరికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి.
ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి.

భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

తులసి ఆకులను మూడు పూటలా భోజనానికి ముందు నమిలితే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు.

భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి. దీని వల్ల అసిడిటీ తగ్గుతుంది.

భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు.

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మిడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు.

మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.

ఇంటర్మిడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Health

సినిమా