Hanuman : ఆంజనేయుడికి మంగళవారం, శనివారం ఎందుకు ప్రత్యేకం – హనుమాన్ జయమంత్రం విశిష్టత తెలుసా!

Hanuman : ఆంజనేయుడు రామ భక్తుడు..రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మనుంచి వరాలు పొందినవాడు…అంటే హనుమంతుడు త్రిమూర్తుల తేజం, స్వరూపం నింపుకున్నవాడని అర్థం. ఆంజనేయుడిని నిత్యం పూజించేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి…ఎలాంటి గ్రహదోషాలు అయినా తొలగిపోతాయి. ముఖ్యంగా హనుమాన్ కి మంగళవారం, శనివారం అంటే అత్యంత ప్రీతికరం. కార్యసిద్ధి కోసం మంగళవారం, గ్రహదోషాలు – జాతకంలో దోషాలు తొలగించుకునేందుకు శనివారం పూజించాలని చెబుతారు.


యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షశాంతకామ్”

ఎక్కడైతే శ్రీరామచంద్రుడి సంకీర్తన జరుగుతుందో అక్కడ ఏదో ఒకమూలన ఆంజనేయుడు చేతులుజోడించి భక్తితో రామనామసంకీర్తనలో మునిగిపోతాయని అర్థం.

బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్

వాయుపుత్రుడిని నిత్యం పూజించేవారికి.. సరైన సమయానికి సరైన ఆలోచనను అందించే బుద్ధి..ధైర్యంగా ముందుకు అడుగేయగల మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అనారోగ్యాన్ని తరిమేసి…మనసుకి పట్టిన జడత్వాన్ని పారద్రోలుతాడు.

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్

త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, శివ స్వరూపుడైన ఆంజనేయుడిని రామదూతగా భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

లంకలో ఆంజనేయుడు పఠించిన ఈ జయమంత్రాన్ని చదువుకుంటే ఎంతటి కష్టంనుంచి అయినా బయటపడతారని పండితులు చెబుతారు… దీని అర్థం ఏంటంటే…రామలక్షణులు విశేషబలంలో వర్థిల్లుతున్నారు..సుగ్రీవుడు విజయోత్సాహంలో శోభిల్లుతున్నాడు..నేను రామబంటుని నా పేరు హనుమంతుడు .. యుద్ధంలో పెద్ద పెద్ద ఆయుధాలు వినియోగించను కానీ లంకాధిపతి సన్యాన్ని అరిపాదాలకింద పెట్టి తొక్కేస్తాను, పిడిగుద్దులతో నేలకూస్చేస్తాను, భారీ వృక్షాలు, బండరాళ్లతో శత్రుమూకని అంతమొందిస్తాను. వెయ్యిమంది రావణులు వచ్చినా నాకు ఓ కీటకంతో సమానం..అసలు నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణంలోనే లేడు. సీతాదేవిని చూసేందుకు ఎలా వచ్చానో..అలాగే ఈ లంకాపట్టణం నుంచి వెళ్లిపోతాను..నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అంటూ…ఈ జయ మంత్రాన్ని పఠించాడు ఆంజనేయుడు. చెప్పినట్టుగానే లంకకు నిప్పు పెట్టి తిరిగి రాముడి వద్దకు చేరుకుని సీతమ్మ సమాచారం అందించాడు..

ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కార్యం నెరవుతుందని చెబుతారు. అయితే స్వామివారికి అభిషేకాలు చేయించాలి అనుకుంటే..దేనితో అభిషేకం ఎలాంటి ఫలితం లభిస్తుంటే… తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది , ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి, ఆవుపెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆవునెయ్యితో ఐశ్వర్వం, విభూదితో సకలపాపహరణం, పూలతో భూలాభం కలుగుతుంది, పంచదారతో ఆంజనేయుడికి అభిషేకం చేస్తే దు:ఖాలు నశిస్తాయి..చెరుకురసంతో ధనం – కొబ్బరినీళ్లతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి…