Friday, September 20, 2024

Gold Price: బంగారం ధర పెరగడానికి ఐదు కారణాలు.. ఏంటంటే..?

గత కొన్నిరోజుల నుంచి బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.

గత కొన్నిరోజుల నుంచి బంగారం (Gold) ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం (Gold) ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.

స్థిరమైన ఆస్తి

‘యూఎస్ ఫెడ్ ద్వారా ద్రవ్య విధాన సడలింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి క్షీణించడంపై బెట్టింగ్ జరుగుతోంది. స్థిరంగా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ఎన్నికల రావడంతో బంగారం కొనుగోలు స్థిరమైన ఆస్తిగా ప్రజలు భావిస్తున్నారు. రూపాయి విలువ తగ్గిపోవడం బంగారం ధర పెరిగేందుకు ఊతం ఇస్తోంది అని’ ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఫండర్ సుగంద అభిప్రాయ పడ్డారు.

ఇంట్రెస్ట్

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్ల సమయంలో వధువు, వరుడు బంగారు ఆభరణాలు ధరిస్తారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. బంగారం వ్యాపారుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. బంగారం ధర పెరగడంతో కొనుగోలు దారుల సంఖ్య తగ్గిందని వివరించారు.

పెరిగేవి కావు..?

మధ్య ప్రాచ్య ప్రాంతంలో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం. అక్కడ ప్రశాంత పరిస్థితి ఉంటే బంగారం ధరలకు రెక్కలు వచ్చేవి కావని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ కారణాల చేత ఏడాదిలో బంగారం ధర 12 శాతం పెరిగిందని నిపుణులు వివరించారు.

Ugadi 2024: ఉగాది రోజున ఈ పనులు చేస్తే.. ఏడాదంతా మీకు శుభమే!

తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు..
తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా కొన్ని రకాల పనులు చేయాలట. దీని వల్ల ఏడాదంతా శుభంగా ఉంటుందని పెద్దలు, పురాణాలు చెబుతాయి. అలాగే చేయకూడని పనులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది రోజు చేయాల్సిన పనులు:
1. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. కొత్త బట్టలు ధరించాలి.

2. ఉగాది పండుగ రోజు మీకు ఇష్టమైన కులదైవాలను పూజించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి.
3. అదే విధంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని తినాలి. దైవ దర్శనం చేసుకోవాలి. ఆలయాలకు వెళ్లాలి.

4. ఉగాది పచ్చడి నవగ్రహాలతో పోలుస్తూ ఉంటారు. నవగ్రహాలలోని కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులతో సంబంధం ఉందని చెబుతారు.

5. ఖచ్చితంగా సాయంత్రం పూట పంచాంగం శ్రవణం చేయాలి. ఇలా చేస్తే ఏడాదంతా మంచే జరుగుతుంది.

6. లేని వారికి అన్నదానం, వస్త్రదానం, వస్తువులు దానాలు చేస్తూ ఉండాలి.

ఉగాది రోజు చేయకూడని పనులు:
1. పొద్దు పోయేంత వరకు నిద్రపోకూడదు.

2. ఎవర్నీ దూషించి మాట్లాడకూడదు.

3. గొడవలకు దూరంగా ఉండాలి.

4. చిరిగిపోయిన లేదా మాసిపోయిన బట్టలను ధరించకూడదు.

5. ఈ రోజు ఏడుస్తూ ఉండకూడదు.

ప్రపంచం ముంగిట్లో మరో మహమ్మారి.. మనుషులకు వ్యాపిస్తే మరణశాసనమేనా.?

కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది.
కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. ఒక దాని తర్వాత ఒకటి మానవాళిపై పంజా వసురుతున్నాయి. కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోకముందే మరో వేరియంట్‌ వెంటాడుతోంది. అమెరికాలో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూను కోవిడ్‌ను మించిన విలయంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. కరోనాను మించిన మృత్యుకౌగిలి అమెరికాలో ఇప్పుడు అలజడి రేపుతోంది. టెక్సాస్‌, కాన్సాస్‌ వంటి రాష్ట్రాల్లో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూతో పౌల్ట్రీ రంగం ప్రశ్నార్ధకంగా మారింది. కోళ్లలో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్టు మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీలోని వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ గుర్తించడంతో, ఆయా ప్లాంట్లలో కోళ్ల ఉత్పత్తికి బ్రేక్‌ పడింది.

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా-H5N1 వైరస్‌ సాధారణంగా పక్షులకు సోకే వ్యాధి. కానీ ఈ వ్యాధి క్షీరదాల్లోనూ బయటపడుతోంది. క్షీరదాల్లో ఈ కేసులు పెరిగితే మానవులకు కూడా ప్రమాదమే అన్నది నిపుణుల వాదన. అంతేకాదు దీని వల్ల కొత్త వైరస్‌లు పుట్టి మనుషులు, జంతువులకు కూడా హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌ఓ మనుషులకు వ్యాపిస్తే మరణాల రేటు గణనీయంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్‌లో ఓ కార్మికుడి ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అతన్ని వెంటనే ఐసోలేషన్‌ చేసిన అధికారులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పశువుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2022లోనూ అమెరికాలోని కొలరాడోలో ఒక వ్యక్తికి వైరస్‌ సోకినప్పటికీ అతడికి కోళ్ల నుంచి సోకింది. అమెరికాలోని ఆవుల మందల్లో H5N1 వైరస్‌ సోకుతోంది. కాన్సాస్‌, న్యూమెక్సికో, టెక్సాస్‌, ఓహియో, ఇడాహో, మిషిగన్‌లో పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్‌ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

కరోనాను మించి ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. H5N1 వైరస్‌ను తొలిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్‌లో వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. అప్పుడు 18 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది H5N1 బర్డ్‌ఫ్లూ బారిన పడగా 462 మంది మృతిచెందారు. వైరస్‌ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్‌లో మరణాల రేటు 0.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ లక్షలాది మందిని బలిగొన్నది. H5N1లో మరణాల రేటు 52 శాతం కాబట్టి ఇది కొవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? – ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

50 inch Smart TV Deals: తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని మీరు అనుకుంటున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద ఆఫర్ సేల్ జరుగుతోంది. దీనిలో పెద్ద సైజు టీవీలు కూడా మంచి తగ్గింపుతో లభిస్తాయి. ఈ సేల్‌లో 50 అంగుళాల స్మార్ట్ టీవీలు సగం ధరకే లభిస్తున్నాయి.

మీ కోసం అందుబాటులో ఉన్న మొదటి ఉత్తమ ఆప్షన్ కాంపాక్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ టీవీ ధర రూ. 43, 999 అయినప్పటికీ ప్రస్తుతం దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22, 990కి విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్‌లతో మీరు దీన్ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

కాంపాక్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్, డాల్బీ ఆడియో, బెజెల్ లెస్ స్క్రీన్, డబ్ల్యూసీజీ ప్లస్ వంటి ఫీచర్లతో వస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ గురించి చెప్పాలంటే రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 3500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ దీనిపై అందుబాటులో ఉంది.

రెండో ఆప్షన్ గురించి చెప్పాలంటే… థామ్సన్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ. థామ్సన్ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీని రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 40 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ ఆఫర్‌లలో మరింత చవకగా కొనుగోలు చేయవచ్చు.

ఈ థామ్సన్ టీవీలో ఉన్న అతిపెద్ద ఫీచర్ అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్, 40W స్పీకర్లు అని చెప్పవచ్చు. దీనిపై మీరు రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ దగ్గర ఉన్న మూడో ఆప్షన్ కోడాక్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈ సేల్‌లో దీన్ని రూ. 25,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ హెచ్‌డీఆర్10 ప్లస్, డాల్బీ అట్మాస్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

ఓరి దేవుడో.. కొండల మధ్య బొజ్జ గణపయ్య.. వీడియో చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే..

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాలు ఉన్నాయి.. అయితే దట్టమైన అడవిలో కొలువైన బొజ్జ గణపతి మందిరం వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ గణపయ్య గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండీ..

ఈ మందిరం.. ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉన్న 1,000 సంవత్సరాల పురాతనమైనది.. వినాయకుడికి హారతి ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఓ భక్తుడు ఈ వీడియోను షేర్ చేసాడు.. అది ధోల్కల్‌ గణేష్‌ ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం బైలాడిలా పర్వత శ్రేణి దట్టమైన అడవిప్రాంతంగా కనిపిస్తుంది. చుట్టూ అద్భుతమైన కొండ.. కన్నుల విందును అందిస్తుంది.

అంత ఎత్తైన కొండపై వినాయకుడిని భక్తితో పూజిస్తున్నాడు పూజారి. ధూపదీప నైవేధ్యాలు సమర్పించి భూమి, ఆకాశాలకు సైతం నివేదిస్తున్నాడు. అతడు చేసే పూజలు చుట్టూ ఉన్న బండరాళ్లపై నిలబడి ఉన్న ప్రజలు భయపడుతూనే భక్తితో చూస్తున్నారు.. ఇక ధోల్కల్ గణేష్ అని పిలువబడే గణేశ మందిరం అనేక వందల సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది ‘ధోల్’ ఆకారంలో ఉన్న పర్వత శ్రేణిలో ఉంది. ఈ విగ్రహం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో రూపొందించబడిందని నమ్ముతారు. ఆలయానికి చేరుకోవడానికి రహదారి అందుబాటులో లేనందున అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది.. ఆ గణపతి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాడు.. రిస్క్ అయినా చాలా మంది అక్కడకు వెళ్తున్నారు. ఆ గణపతి మందిరం వీడియోను మీరు చూడండి..

రక్తం ఏరు ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా?

మాములుగా నదులలో నీళ్లు నీలం రంగులో లేదా మట్టి కలర్ లో ఉంటాయి.. అయితే కొన్ని నదులలో నీళ్లు వివిధ రంగులలో దర్శనమిస్తు సైన్స్ కు సవాల్ విసురుతున్నాయి.. ఇప్పుడు ఓ నది ఎరుపు రంగులో ప్రవహిస్తుంది.. దాని పుట్టు పూర్వాలను కనుక్కోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ నది పై వారి పరిశోధనలు మొదలయ్యాయి. తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికా. నెలల తరబడి ఆ ఖండంపై సూర్యకాంతి పడదు. అయితే ఇక్కడ రక్త నది ప్రవహిస్తోంది. దీనికి బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచే ఉంటుంది.

తెల్లటి దుప్పటి కప్పుకున్న ఈ జలపాతంలో రక్తపు నీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెత్తుటి జలపాతంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ రివర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది…ఓ వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం..ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు. ఈ లోయలో ఐరన్‌ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు..

అక్కడ ఆక్సీకరణ కారణంగా ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదు అంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధన తర్వాత పరిశోధకుల బృందం కనుగొంది. కానీ 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది..ఇక్కడ ఇతర జీవులు అత్యంత క్లిష్ట పరిస్థితులలో మాత్రమే పెరుగుతాయని చెబుతున్నారు.. ఏది ఏమైనా ఈ నది భయంకరమైన రూపంతో అందరిని భయపెడుతున్నాయి..

ఈ చెట్లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయట..! రోజుకు ఒక్కో చెట్టు నుంచి 4660 యూనిట్ల విద్యుత్‌

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది.. ఒకప్పుడు మనం చూసిన ఊరికి ఇప్పుడు మనం చూస్తున్న ఊరికే పొంతన లేదు.. అన్నీ మారిపోయాయి.. ఇక ప్రపంచం మారకుండా ఉంటుందా. ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటండి అనేవాళ్లు.. ఇప్పుడు అదే రోడ్డుకు ఇరువైపులా.. సోలార్‌ ట్రీస్‌ వచ్చేశాయి.. మనుషుల వాడకం తగ్గుతుంది.. మనిషే మనిషితో పనిలేకుండా జరిగేపోయే యంత్రాలను, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ను కనుక్కుంటున్నాడు. ఇంతకీ ఈ సోలార్‌ ట్రీస్‌ సంగతేంటో చూద్దామా..!

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు గాంధీనగర్ మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ గట్టిగా ప్రయత్నిస్తోంది. గాంధీనగర్‌లో విపరీతమైన ఎండ. అందుకే.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతూ.. ఎండను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తున్నారు. వివిధ పబ్లిక్ పార్కులలో 20 సోలార్ చెట్లను ఏర్పాటు చేశారు. ఏడాది పొడవునా ఈ సోలార్ చెట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కరెంటును టొరెంట్ పవర్ లేదా ప్రభుత్వ విద్యుత్ కంపెనీకి అమ్మేలా అక్కడి అధికారులు ప్లాన్ చేశారు.

ఒక్కో చెట్టు రోజుకు 4660 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 20 సోలార్ చెట్లు ఏడాది పొడవునా రూ. 1.25 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి.. పర్యావరణ కాలుష్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది. ఎందుకంటే సోలార్ చెట్టు పరిమాణం చాలా పెద్దది, ఇది నిజమైన పెద్ద చెట్టులా ఉంటుంది. ఒక పెద్ద పొద్దుతిరుగుడు ఆకుపై సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు ఉంటుంది. 15 నుండి 20 ఆకుల లాంటి ప్యానెల్స్ ఉండటం వల్ల ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది.

గాంధీనగర్‌లోని వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ చెట్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ సోలార్ ట్రీ.. కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్‌ చేసేస్తారు.

పెదాల చుట్టుపక్కల నల్లగా ఉందా..? ఇలా చేయండి వారంలో సమస్య మాయం..!!

చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నా.. వారి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి.. ముఖ్యంగా పైన పెద మరీ నల్లగా ఉంటుంది. పెదాలు చుట్టుపక్కల కూడా బ్లాక్‌ ఉంటుంది. వీటిని కవర్‌ చేయడానికి లిప్‌స్టిక్‌లు వాడేస్తారు.. ఇలా అవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. దీనిని ఒక పిగ్మెంటేషన్‌ అంటారు. శరీరంలో విటమిన్ల లోపం వల్ల ఇలా అవుతుంది. ఒక చిట్కాను ఉపయోగించి.. పెదాలను, ముక్క పక్కన ఉన్న నలుపును పోగొట్టుకోవచ్చు ఎలా అంటే..
పెద‌వుల చుట్టూ ఉండే ఈ న‌లుపును దూరం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మ‌నం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, అర టీ స్పూన్ ప‌సుపును, 2 టేబుల్ స్పూన్ల పెరుగును, ఒక చెక్క ట‌మాట ముక్క‌ను తీసుకోండి.. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని, ప‌సుపును తీసుకోవాలి. త‌రువాత పెరుగును వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక ట‌మాట కాయ‌ను అడ్డంగా రెండు ముక్క‌లుగా చేసి ఒక ముక్క‌ను తీసుకోవాలి. ఈ ట‌మాట ముక్కతో ముందుగా క‌లిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ముఖంపై న‌ల్ల‌గా ఉన్న ప్రాంతంలో రాస్తూ 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి.

ఇలా మ‌ర్దనా చేసేట‌ప్పుడు బియ్యంపిండి మిశ్ర‌మం, ట‌మాట ర‌సం రెండు క‌లిసేలా చూసుకోండి.. ఇలా రాసిన 15 నుంచి 20 నిమిషాల త‌రువాత వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. త‌రువాత దూదితో గులాబీ నీటిని తీసుకుంటూ ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపు పోయి ముఖం నిగ‌నిగ‌లాడుతూ క‌న‌బ‌డుతుంది. అలాగే పెద‌వుల చుట్టూ ఉండే న‌లుపుద‌నం కూడా పోతుంది.

వీటిపో పాటు.. బ్రష్‌ చేసేప్పుడు ఆ పేస్ట్‌ నురుగు అనేది చాలా మంది మూతి చుట్టూ అంటించుకుంటారు. అసలు ఆ నురుగు పైకి రాకుండా బ్రష్‌ చేయాలి. అది మీ పెదాలకు, చుట్టుపక్కలా రోజూ అంటితే..దాని వల్ల అక్కడ మొత్తం నల్లగా మారిపోతుంది. అందుకే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేస్తే వెంటనే క్లీన్‌ చేసుకోవచ్చు.. అలాగే నిద్రపోయేప్పుడు సొల్లు కార్చే అలవాటు ఉంటే మానేయండి. ఒకవేళ సొల్లు కారుస్తున్నట్లు తెలిస్తే..వెంటనే క్లీన్‌ చేసుకోండి. ఈ రెండింటి వల్ల కూడా పెదాల దగ్గర నల్లగా అవుతుంది.

తొలిసారి జనసేనకు చిరంజీవి డైరెక్ట్ సపోర్ట్.. ఎన్నికల వేళ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ (వీడియో)

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతుగా నిలిచారు. తొలిసారిగా జనసేన పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ చేశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని పవన్ కల్యాణ్, నాగబాబులు ప్రత్యేకంగా కలిశారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి కీలక విషయాలపై కాసేపు చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల భారీ విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్‌తకు అందించారు. ప్రస్తుతం చిరంజీవి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఈ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనంతరం కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

Dahnush: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు..

Dahnush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా వారు చెన్నై కోర్టులో మ్యూచువల్ విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. సెక్షన్ 13 బి కింద వారు విడాకులకు అప్లై చేశారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ .. ధనుష్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 18 ఏళ్ళ తరువాత.. అనగా 2022 లో ఈ జంట కొన్ని విబేధాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

రెండేళ్ల నుంచి ఈ జంట విడిగానే ఉంటున్నారు. ” 18 సంవత్సరాలు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా మరియు ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాము. మా ఈ ప్రయాణం.. ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు మరియు అనుకూలతలతో సాగింది. ఈరోజు మేము ఒక చోట నిలబడ్డాము. మా దారులు విడిపోయే చోట. ఐశ్వర్య మరియు నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మరియు మమ్మల్ని మంచి వ్యక్తులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి” అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ విషయం చెప్పి రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటివరకు వీరు విడాకులు తీసుకోలేదా అనే అనుమానం అభిమానుల్లో మొదలయ్యింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండేళ్లు.. ఇరు కుటుంబ సభ్యులు వీరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేశారు అని, అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెండు కుటుంబాలు కూడా నగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కేసు విచారణకు రానుంది.

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి షేక్ జలీల్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు

జనసేన అగ్రనేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. జనసేన నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీ అభ్యర్థులను పోటీ చేయొద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.

పవన్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశానని షేక్ జలీల్ తెలిపారు. ఈసీని కలిసి ఎంపీ బాలశౌరితో పాటు నాదెండ్ల మనోహర్, పవన్ పై ఫిర్యాదు చేశామని చెప్పారు. బాలశౌరి తనకు తుపాకీ గురి పెట్టి బెదిరించారని ఆరోపించారు. ఏపీలో ఈసీ తన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించిందని గుర్తుచేశారు.

దీంతో జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందని, అందుకే తన పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు. రూ.5 కోట్లు ఇస్తానని పవన్ చెప్పారని తెలిపారు. అయినా తాను వారి ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. తాము లక్ష్మీనారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేస్తున్నామని అన్నారు.

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ..
దేశంలోని పలు పార్టీల పనితీరును వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ పాలన చెప్పుకొదగ్గట్లు జరగలేదని, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదని దీంతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈ కారణంగానే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. పీకే మా దగ్గర కూడా ఐదేళ్లు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు తీసుకుంటే మేము మనిగేవాళ్లం.. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పీకే మా నేతల దగ్గర దబ్బులు వసూలు చేసేవాడు. అతను మేనేజ్మెంట్ తప్ప చేసిందేమీ లేదు. బీహార్ లో పార్టీ పెట్టిన ఆయన్ను ప్రజలు తరిమేశారు. అందుకే ఆయన ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దీనిపై వైసీపీ తరుపున మేము ఎలాంటి చర్చకైన సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే నిన్నిటి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.

రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి రూ. 2 వేలు.. ఎప్పుడంటే

రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పెట్టబడి సాయం అందిచండంతో పాటు.. పండించిన పంటకు కనీస మద్దతు ధర, ప్రక్రుతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు బీమా సాయం, రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఎప్పుడు.. ఎందుకంటే..

అన్నదాతలను ఆదుకోవడం కోసం మోదీ సర్కార్ కొన్నాళ్ల క్రితం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. చిన్న,సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీంను తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ఏడాదికి మూడు విడతల్లో అందిస్తోంది.

ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధులను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 16 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం రూ. 32,000 అందించింది. ప్రస్తుతం అన్నదాతలు 17వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 16వ విడత నిధుల్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యావత్మాల్ వేదికగా విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతుల ఈ పథకం కింద లబ్ధి పొందారు.

తాజాగా కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది మే ఆఖరి వారంలో ఇవి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.

అయితే ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. కిసాన్ నిధుల పొందాలంటే.. ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

నాయనమ్మకు ప్రేమతో.. ఈ వాహనమే గిరిజన యువకుడి రోల్స్ రాయిస్

గిరిశిఖర గ్రామానికి చెందిన ఓ యువకుడు తన నాయనమ్మ పడుతున్న అవస్థలు చూసి చలించాడు. ఎలాగైనా సరే తన నాయనమ్మకు ఇబ్బందులు లేకుండా తన వంతు సహకారం అందించాలని అనుకున్నాడు.
వెంటనే తన మెదడుకు పని చెప్పాడు. నాయనమ్మ అవసరం తీర్చి అందర్నీ అబ్బురుపరిచాడు. ఇదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరుపల్లి అనే గిరిశిఖర గ్రామంలో మండంగి చిన్నమ్మి అనే 75 సంవత్సరాల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఈమెకు కళ్లు సరిగా కనిపించవు. వృద్ధాప్యంపై పడటంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. అయితే గిరిశిఖర గ్రామం కావడంతో ఆ గ్రామం నుండి ఏ చిన్నపాటి అవసరం ఉన్నా మైదాన ప్రాంతానికి రాక తప్పదు. గ్రామస్తులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడి మోటార్ సైకిల్ వెళ్లగలిగే రహదారిని గ్రామానికి ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు, రప్పలతో ఉన్న ఆ రహదారిలో బైక్ ప్రయాణం కూడా అతికష్టం మీద చేయాల్సిందే.

అయితే ఇది ఇలా ఉండగా చిన్నమ్మికి కురుపాం మండల కేంద్రంలోనే ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్‎లో చిన్నమ్మికి బ్యాంక్ అకౌంట్ ఉంది. తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో పాటు తన వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బును ఆ అకౌంట్ లోనే దాచుకుంటుంది. తాను దాచుకున్న సొమ్ము కోసం తన ఖాతా ఉన్న ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆమె అక్కడకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కనీసం మోటార్ సైకిల్ పై కూడా కూర్చునే ఓపిక ఆమెకు లేదు. దీంతో ఆమె పరిస్థితి గమనించిన ఆమె మనుమడు మండంగి శివ ఎలాగైనా సరే తన నాయనమ్మను బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి ఆమె అవసరం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన నాయనమ్మ అనారోగ్యానికి సంభందించిన అవసరం కానీ, ఇతరత్రా చిన్నపాటి అవసరాలను తీర్చడానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో వినూత్నంగా ఆలోచించాడు.

తన వద్ద ఉన్న పరికరాలతోనే తన నాయనమ్మ కూర్చునేలా ఒక వాహనాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడువుగా వాహనం తయారీలో నిమగ్నమయ్యాడు. తన వద్ద ఉన్న పాత మోటర్ సైకిల్ చక్రాలు ఒక పట్టె మంచానికి బిగించి తాళ్ళతో బలంగా కట్టి ఒక ట్రాలీలా తయారు చేశాడు. ఆ ట్రాలీలో కూర్చుంటే తన నాయనమ్మకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక దుప్పటి ఏర్పాటుచేశాడు. అలా తయారు చేసిన ఆ ట్రాలీని మోటార్ సైకిల్ వెనుక తగిలించి తన నాయనమ్మని తీసుకొని కురుపాం బ్యాంక్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బ్యాంక్‎లో నగదు విత్ డ్రా చేసుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకు నాయనమ్మపై ఉన్న ప్రేమాభిమానాలే ఈ వాహనం తయారీకి ఆజ్యం పోసిందని, ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మకు కావలసిన అవసరాలు తీరుస్తాను అంటున్నాడు మనువడు మండంగి శివ.

Sleep As Per Age: మీ వయస్సు ప్రకారం మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా?

Sleep As Per Age: ఈ కాలంలో నిద్రలేమి సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. దీనికి స్ట్రెస్ కారణం కావచ్చు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు. అయితే, నిద్రలేమితో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల కలుగుతాయి.
అయితే, మీ వయస్సు రీత్యా ప్రతిరోజూ ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం.

నవజాత శిశువు..
అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడు నెలల పిల్లల వరకు నిద్ర అందరి కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. నవజాత శిశువుకు రోజుకు దాదాపు 14- 17 గంటల నిద్ర అవసరం.

చిన్నపిల్లలు..
నాలుగు నెలల నుంచి 11 నెలల వరకు చిన్నపిల్లలకు రోజుకు 12-15 గంటల నిద్ర అవసరం ఉంటుంది.

ఏడాది నుంచి రెండేళ్లు ఉన్న పిల్లలకు ప్రతిరోజూ 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం ఉంటుంది. ఇది మంచి మెదడు పనితీరుకు ఎంతో అవసరం.
ప్రీ స్కూలర్స్..
మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లలు ప్రతిరోజూ నిద్ర 10 గంటల నుంచి 13 గంటలు అవసరం ఉంటుంది. వీళ్లు ప్రీ స్కూల్‌ కు చెందినవారు. స్కూళ్లకు వెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల వయస్సు ఉండే పిల్లలకు సరైన నిద్ర అవసరం. ఇది వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. ప్రతిరోజూ 9-12 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
టీనేజీ..
13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజీ పిల్లలు స్పోర్ట్స్‌, చదువులతో ఎక్కువగా అలసిపోతారు. ఈ సమయంలో వారి అవయవాలు కూడా పెరుగుతుంటాయి. టీనేజీ ఉన్నవారికి ప్రతి రోజూ 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం ఉంటుంది.

పెద్దలు..
ఇక 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉద్యోగాలు, ఫ్యామిలీ వర్క్‌తో బిజీగా ఉంటారు. వీళ్లు ఎక్కువ స్ట్రెస్‌కు కూడా గురవుతారు. ఈ వయస్సు వారికి ఎక్కువ రెస్ట్‌ కూడా అవసరం. ఈ వయస్సుకు చెందినవారు ప్రతిరోజూ 7-9 గంటల నిద్ర అవసరం.
61 ఏళ్లు ఆపైన ఉన్నవారికి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఈ వయస్సువారిలో నిద్రలేమి కూడా వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం వారి ఆరోగ్య సమస్యలు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Mannam Web దీనిని ధృవీకరించడం లేదు. )

ఈ ప్రపంచం బ్రహ్మ దేవుడ్ని ఎందుకు మర్చిపోయింది.. పూజార్హత ఎందుకు కోల్పోయాడో తెలుసా?

ఉగాది పండుగ యుగానికి నాంది పలుకుతుంది. మరి ఇలాంటి యుగానికి కారకుడైన దేవుడికి దేశంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవాలయం ఉందంటే మీరు నమ్ముతారా?
సృష్టికర్త గురించి ఆలోచించినప్పుడు, మనకి వెంటనే బ్రహ్మ దేవుడు గుర్తొస్తాడు. మరి అలాంటి దేవుడిని ఈ ప్రపంచం ఎందుకు మర్చిపోయింది? పూజార్హత ఎందుకు కోల్పోయాడో ఇక్కడ తెలుసుకుందాం.

పద్మ పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర్ వద్ద ఒక యాగం చేసాడు. అతని భార్య సరస్వతి తన భార్యతో కలిసి ఈ యాగంలో కూర్చోవలసి ఉంది, కానీ అతని భార్య సరస్వతి ఈ పూజకి ఆలస్యం చేసింది. పూజ సమయం దాటిపోతుందేమోనని అప్పుడు బ్రహ్మ స్థానిక గొర్రెల కాపరిని వివాహం చేసుకుని యాగానికి కూర్చున్నాడు. కొంతసేపటికి సరస్వతి అక్కడికి చేరుకుంది. యాగంలో బ్రహ్మ ప్రక్కనే ఉన్న మరో స్త్రీని చూసి ఆమె చాలా కోపం తెచ్చుకుని ఆ సమయంలో బ్రహ్మను శపించింది.

ఈ లోకం బ్రహ్మను మరచిపోతుందని సరస్వతి శపించింది. అలాగే బ్రహ్మదేవుడిని ఎవ్వరూ పూజించరని శపించింది. సరస్వతి కోపాన్ని చూసి, యాగం వద్ద ఉన్న దేవతలందరూ ఆమెను శాపాన్ని తొలగించమని కోరారు. కానీ ఇది అసాధ్యం. అయితే భూమ్మీద ఒక గుడి మాత్రమే గుడి ఉంటుందని, అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని సరస్వతి చెప్పింది. ఈ గుడిని ఎక్కడా నిర్మించాలనుకున్నా అక్కడ మొత్తం నాశనమైపోతుందని శపించింది.

Anantapur: పరీక్ష పేపర్ లో విద్యార్థి రాసింది చూసి మెంటలెక్కిపోయిన ఉపాధ్యాయుడు.. ఇంతకీ ఏం రాశాడంటే?

Anantapur: వార్షిక పరీక్షలంటే చాలు విద్యార్థుల్లో ఎనలేని భయం ఉంటుంది. పరీక్షలు బాగా రాయాలి. చేతిరాత బాగుండాలి.. మంచి మార్కులు సాధించాలనే తపన విద్యార్థుల్లో ఉంటుంది.
అయితే కొందరు విద్యార్థులు మాత్రం విభిన్నంగా ఉంటారు. సరిగ్గా చదవరు. పాఠశాలకు వచ్చినా.. మాస్టారు చెప్పే పాఠాలను సరిగ్గా వినిపించుకోరు. ఇంకా అలాంటివారు పరీక్షల్లో ఏం రాస్తారు? అలాంటి కోవకు చెందిన ఓ విద్యార్థి వార్షిక పరీక్షల్లో లెక్చరర్ ను తన రాతలతో బెదిరించాడు. దెబ్బకు అదిరిపోయిన ఆ ఉపాధ్యాయుడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే

అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఆ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల 10 పరీక్షలు పూర్తి కావడంతో అతనికి స్పాట్ (జవాబు పత్రాల మూల్యాంకనం) డ్యూటీ పడింది.. అతను తన డ్యూటీలో ఉండగా.. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని పరిశీలించాడు.. అందులో ఉన్న సమాధానాలు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. 28 పేజీల జవాబు పత్రం లో ఆ విద్యార్థి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కు కూడా సమాధానం రాయలేదు. 28 పేజీల్లో 25 పేజీలను ఖాళీగా ఉంచాడు. ఇంతకీ అందులో ” నీకు దమ్ముంటే నన్ను పాస్ చేయ్ ” అని రాశాడు. అంతటితోనే ముగించాడు.

షాక్ కు గురయ్యాడు

ఆ జవాబు పత్రాన్ని చూసిన ఆ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ సమాధానానికి అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే బయటికి వచ్చి ఒక వీడియో తీశాడు. “అన్ని జవాబు పత్రాలు చూసిన నేను.. ఆ విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ షీట్ చూడడంతో తలనొప్పి మొదలైంది. 28 పేజీలు ఉన్న ఆన్సర్ షీట్ మొత్తం ఖాళీగా ఉంది. ప్రారంభ పేజీని వదిలిపెట్టి రెండు, మూడు, నాలుగు పేజీల్లో “నీకు దమ్ముంటే నన్ను పాస్ చెయ్” అని నన్ను బెదిరించినంత పని చేశాడు.. ఆ జవాబు చూసి ఒక్కసారిగా నాకు తల తిరిగిపోయింది.. ఈ తలనొప్పి తగ్గించుకోవాలంటే అర్జెంటుగా నేను జ్యూస్ తాగాలి. ఆ జ్యూస్ తాగి వచ్చి.. మిగతా జవాబు పత్రాలు ఎలా ఉన్నాయో మీకు చెబుతాను.. ఆ విషయాలను మరో వీడియోలో పంచుకుంటానని” ఆ ఉపాధ్యాయుడు తన బాధను వెళ్ళగక్కాడు.

వైరల్ గా మారాయి

అనంతపురం జిల్లాలోని మూల్యాంకనం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఆ ఉపాధ్యాయుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.. ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి తలుచుకుని చాలామంది లోలోపల నవ్వుకుంటున్నారు. మరి కొంతమంది బాగా రాశాడు కదూ! అంటూ సెటైర్లు వేస్తున్నారు. పరీక్ష ఇలా కూడా రాస్తారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా కాలేజీకి వెళ్లి, అధ్యాపకులు చెప్పే పాఠాలు విని.. సక్రమంగా పరీక్ష రాస్తే ఇలాంటి తిప్పలు తప్పేవి కదా? అని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో ఆ ఉపాధ్యాయుడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ

Ugadi 2024 : రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం.
పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో ఉగాది పండుగను ‘గుడి పడ్వా’ పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు.

పండుగ విశేషాలివీ..

మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని అంటారు.
బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే.
ఉగాది టైంలోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది.

కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలుపెడుతుంటారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు.
ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారు చేస్తారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ.

Income Tax: ఆదాయపు పన్ను శాఖకు హైకోర్టు మెుట్టికాయలు.. ఇక అలా చేయెుద్దంటూ..!!

High Court: పన్ను చెల్లింపుదారులు, సంస్థలకు తరచుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు వస్తుంటాయి. మరికొన్ని సార్లు పెనాల్టీలకు సంబంధించిన నోటీసులు కూడా వస్తుంటాయి. వీటి విషయంలో ప్రజలు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు.
తాజాగా పన్ను చెల్లింపుదారుల హక్కులను పరిరక్షించే తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఆదాయపు పన్న అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు పూర్తి సమాచారాన్ని అందించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పుతో పన్ను చెల్లింపుదారుల హక్కులతో పాటు ప్రభుత్వాలు బాధ్యతతో మెలగటంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్ & హర్యానా హైకోర్టు ముంజాల్ BCU సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు వ్యతిరేకంగా నవంబర్ 2022 షో-కాజ్ నోటీసును రద్దు చేసింది. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటే ముందుగా నోటీసులు సరిగా అందించాలని కోర్టు పేర్కొంది. కేవలం నోటీసులను పన్ను అధికారులు తమ ఈ-పోర్టల్ లో ఉంచి దానిని సదరు వ్యక్తికి కమ్యూనికేట్ చేసినట్లు ఊహించుకోవటం సరైనది కాదని నొక్కి చెప్పింది.
ఆదాయపు పన్ను శాఖాధికారులు ముందుగా సదరు వ్యక్తిగా ఈమెయిల్ ద్వారా అందించాలనుకున్న నోటీసులను పంపాలని తన రూలింగ్ లో వెల్లడించింది. అలాగే సమన్లు, ఆర్డర్లు, నోటీసులు, అవసరమైన సమాచారం కోరటం, నిర్ధారణలు వంటి చర్యలకు మెయిల్స్ పంపాలని తీర్పులో సూచించింది. అంటే సరైన రీతిలో పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవటం సరైనది కాదని మందలించింది.

టవల్‌ను ఎన్నిరోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా..?

వేసుకునే బట్టలను అయితే రోజు ఉతుకుతారు.. కానీ చాలమంది.. దిండు గలేబీలు, బెడ్‌షీట్‌లు, టవల్స్‌ ఉతికే విషయంలో ఒక టైమ్‌ను పాటించరు. బాగా మురికిగా కనిపిస్తే అప్పుడు ఉతుకుతారు. టవల్స్‌ అయితే వారానికి ఒకసారి వేస్తారు..ఎందుకుంటే.. అవి స్నానం చేసినప్పుడే కదా తుడుచుకుంటాం ఎందుకు డైలీ ఉతకడం అని..! తువ్వాలను ఉపయోగించిన తర్వాత వాటిని ఎన్నిరోజులకు ఉతకాలి తెలుసుకుందాం?

తలస్నానం చేసినా, ముఖం , చేతులు కడుక్కున్న తర్వాత ముందుగా టవల్ ఉపయోగిస్తాము. అయితే, చాలా మంది తమ శరీరాన్ని బాగా శుభ్రం చేసుకుంటారు, కానీ టవల్స్ శుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. టవల్స్ మన దైనందిన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. మీ మురికి తువ్వాలు ఎంత బ్యాక్టీరియాను తీసుకువెళతాయో ఎప్పుడైనా ఆలోచించారా?

స్నానం చేసి, ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత మనం మన శరీరం లేదా చేతులు తుడుచుకున్నప్పుడు కొన్ని బ్యాక్టీరియా దాని ఫైబర్‌లకు అంటుకుంటుంది. దీని తరువాత, మీ టవల్‌లో ఉన్న తేమ ఈ జెర్మ్స్ వృద్ధి చెందడానికి, పెరగడానికి ఉత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు మీ టవల్‌ను ఉతకకుండా, ఆరబెట్టకుండా పదేపదే ఉపయోగిస్తే, దానిలోని బ్యాక్టీరియా మీ చర్మం, ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

అమెరికాలోని ‘ది లాండ్రీ ఎవాంజెలిస్ట్’ పాట్రిక్ రిచర్డ్‌సన్ ప్రకారం.. చర్మ వ్యాధులను నివారించడానికి మీ టవల్‌లను తరచుగా ఉతకడం చాలా అవసరం. అదే సమయంలో, కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం. తువ్వాళ్లను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగించిన తర్వాత ఉతికి ఎండబెట్టాలి. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు రోజుకు ఒకసారి స్నానం చేస్తే, మూడవ రోజు ఉపయోగించిన తర్వాత వాష్‌ చేయాలి.

స్నానం చేసిన తర్వాత శరీరాన్ని టవల్‌తో తుడిచినప్పుడు, మిగిలిన వ్యాధికారక క్రిములు ఫైబర్‌లపై ఉంటాయి. అంతే కాకుండా మన చర్మంలో ప్రత్యేకమైన యాసిడ్ కూడా ఏర్పడుతుంది. ఇది బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. ఈ యాసిడ్ కారణంగా, మీరు తడి టవల్ ఉపయోగిస్తే అది బాధిస్తుంది. చేతులు కడుక్కున్న తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత టవల్‌తో రుద్దడం ద్వారా మన శరీరాన్ని పొడిగా మార్చినప్పుడు మన డెడ్ స్కిన్ మురికితో పాటు అంటుకుంటుంది. ఇప్పుడు ఈ టవల్ ను ఉతకకుండా ఉపయోగిస్తే మన డెడ్ స్కిన్ తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మళ్లీ మన చర్మానికి చేరుతాయి. ఇలా పదే పదే జరిగినప్పుడు మన వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోతాయి..

ఉతకకుండా మురికి తువ్వాళ్లను పదేపదే ఉపయోగించడం వల్ల కూడా చర్మ వ్యాధి మొటిమలకు దారి తీస్తుంది. మురికి తువ్వాలు మిమ్మల్ని తామర, గులకరాళ్లు లేదా దద్దుర్లు వంటి తీవ్రమైన చర్మ వ్యాధులకు కూడా గురి చేస్తుంది. అసలు ముఖానికి సపరేట్‌గా ఒక టవల్‌ మెయింటేన్‌ చేయాలి.

స్విచ్ బోర్డులు మురికిగా ఉన్నాయా..? మరి ఇలా చెయ్యండి.. చిటికెలో తెల్లగా వచ్చేస్తాయి..!

చాలా మంది ఇళ్లల్లో స్విచ్ బోర్డులు (switch board cleaning tips) నల్లగా మాసిపోయినట్లు కనబడుతూ ఉంటాయి. నిజానికి స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యము. మనం హడావిడిలో ఏ చేతితో పడితే ఆ చేతితో స్విచ్ లని నొక్కేస్తూ ఉంటాము. దీనివలన వాటి మీద మచ్చలు పడుతూ ఉంటాయి కొన్నాళ్ళకి స్విచ్ బోర్డులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇల్లంతా బాగుండి స్విచ్ బోర్డులు మురికిగా ఉంటే ఏం బాగుంటుంది…? కనుక వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి.

బాబోయ్ స్విచ్ బోర్డులని కూడా క్లీన్ చేసుకోవాలా ఎక్కువ సమయం పట్టేస్తుందని మీరు భయపడక్కర్లేదు. క్షణాల్లో మీరు స్విచ్ బోర్డులని క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా పెద్ద కష్టమేమీ కాదు మీ ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో ఈజీగా స్విచ్ బోర్డులని శుభ్రం చేసుకోవచ్చు.

వెనిగర్:
వెనిగర్ ని స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవడానికి వాడొచ్చు. రెండు టీ స్పూన్ల వెనిగర్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు నీళ్లు వేసి టూత్ బ్రష్ తో కానీ ఒక క్లాత్ తో కానీ స్విచ్ బోర్డ్ ల మీద రుద్దండి. ఇలా చేయడం వలన స్విచ్ బోర్డు మీద మురికి త్వరగా పోతుంది.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా తో కూడా మీరు ఈజీగా స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవచ్చు.

నెయిల్ పాలిష్ రిమూవర్:
మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ ని ఉపయోగించి స్విచ్ బోర్డ్ ల మీద మురికి ని తొలగించవచ్చు.

ఆల్కహాల్:
ఆల్కహాల్ కూడా స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది కాబట్టి ఆల్కహాల్ తో కూడిన మెటీరియల్స్ ఏదైనా మీరు వాడొచ్చు.

స్విచ్ బోర్డులని శుభ్రం చేసిన తర్వాత ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వండి..
స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసిన తర్వాత వెంటనే స్విచ్ లని వెయ్యొద్దు కాసేపు ఆగి ఆ తర్వాత వేయండి పూర్తిగా స్విచ్ బోర్డ్ ఆరిన తర్వాత మాత్రమే మీరు స్విచ్ లని వేయండి కరెంట్ భయం ఉన్న వాళ్లు మెయిన్ ఆఫ్ చేసుకుని స్విచ్ బోర్డ్స్ ని శుభ్రం చేసుకోవడం మంచిది.

చివరగా..
స్విచ్ బోర్డ్ లని క్లీన్ చేస్తున్న క్రమంలో మీరు చేతికి గ్లౌజులని వేసుకోండి అలానే చెప్పులని వేసుకోండి. ఇలా సేఫ్టీ టిప్స్ ని కూడా పాటించడం అవసరం.

మంగళవారం నాడు ఎందుకు గోళ్ళని, జుట్టుని కత్తిరించుకోకూడదు..? కారణం ఇదే..!

మంగళవారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం తప్పు అని మన పెద్దలు అంటూ ఉంటారు. అందుకని చాలా మంది ఆ తప్పును చేయరు. అయితే దీని వెనక ఏమైనా కారణం ఉందా..? ఊరికే పెద్దలు ఈ విషయాన్ని మనకు చెప్పరా అనేది చూస్తే మంగళవారం నాడు హిందూ సంప్రదాయం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. అదే విధంగా పురుషులు మంగళవారం నాడు జుట్టుని కత్తిరించుకోవడానికి వెళ్ళరు.

గోళ్ళని కూడా మంగళవారం నాడు అసలు కత్తిరించరు. దీని వెనక ఒక పెద్ద కారణం ఉంది అదేంటంటే మంగళవారం నాడు అంగారక గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహం అని కూడా పిలుస్తారు మంగళవారం నాడు ఈ గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎరుపు వర్ణానికి చిహ్నం. అధిక వేడి ని ఇది కలిగి ఉంటుంది మానవ శరీరం పై దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది.

ఆ రోజు శరీరంపై ఎక్కువ గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాట్లు పడే ప్రమాదం ఉంటుంది. అందుకనే మంగళవారం నాడు జుట్టు కత్తిరించరు గోళ్లు కత్తిరించరు. ఈ కారణంగానే పెద్దలు మనతో మంగళవారం నాడు ఈ తప్పులను చేయొద్దని అంటారు ఒకవేళ కనుక అలా చేస్తే కత్తిగాట్లు పడడం కానీ ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉండడం కానీ జరుగుతుంది కాబట్టి తప్పుల్ని చేయకండి.

ఇంట్లో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటున్నారా..? ఈ విషయాలు ముందు తెలుసుకోండి..!

మీరు ఈ మధ్య చూసే ఉంటారు.. ఆఫీసుల్లో, ఇళ్లల్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఇంట్లో బుద్ధ విగ్రహాలు అలంకరించుకోవడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. అయితే బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవాలి.. ఇలా నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుందట..

ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం, సామరస్యం వెల్లివిరుస్తుంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, ఆత్మ బలానికి చిహ్నం. ఫెంగ్షూయ్, వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా బావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారుచేసినవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.. రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి. ఎలాంటి విగ్రహం ఎక్కడ అమర్చుకోవాలంటే..

పడుకుని ఉన్న బుద్ధుడు
కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకుని ఉన్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

ఆశీర్వదిస్తున్న బుద్ధ ప్రతిమ
ఆశీర్వాదం కోసం ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారిస్తుందట…ఇలాంటి విగ్రహం శాతం, భయం నుంచి విముక్తికి సంకేతం. వాస్తు దోషాలను పోగొట్టేందుకు ఇలా ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఆశీర్వాద ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఉంటుంది.

ధ్యాన బుద్ధ..
ధ్యానంలో ఉన్న బుద్ధుని ప్రతిమ ఇంట్లో శాంతిని తెస్తుంది…ఈ విగ్రహాన్ని మీరు ద్యానం చేసుకునే చోట పెట్టుకోవచ్చు. లేదా విశ్రాంతిగా గడిపే చోట కూడా ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసినపుడు ఒక శాంతి భావన మనసులోకి వస్తుంది.

తోటలో ఎక్కడ పెట్టాలంటే..
బుద్ధ విగ్రహం ఇంట్లో శాంతిని పెంచే సాధనం. దీన్ని బాల్కని లేదా తోటలో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పూల మొక్క పక్కన ఈ విగ్రహాన్ని అలంకరించుకోవడం వల్ల అందంగా ఉండడం మాత్రమే కాదు ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ నెస్‌తో వైబ్రెంట్‌గా మారుతుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ద్యాన బుద్దుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు.

బుద్ధ విగ్రహాన్ని అలంకించేందుకు కొన్ని వాస్తు నియమాలు..
అన్నింటి కంటే ముందు బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని తెలుసుకోండి..
బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్‌లో పెట్టకూడదు
బుద్ధ విగ్రహం ఎప్పుడు కూడా చూసేందకు కంటికి సమాంతరంగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్లు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.
కూర్చుంటున్నపుడు లేదా పడుకుంటున్నపుడు బుద్దుడి వైపు కాళ్లు ఉండకుండా జాగ్రత్త పడాలి.
విగ్రహం చుట్టు చెత్త చేరనియ్యకూడదు.
విగ్రహం, విగ్రహం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా దుమ్ము, ధూళీ చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
బెడ్ రూమ్‌లో, బాత్ రూమ్‌లో, వంట గదిలో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.

Tadepalli SIT Office papers burned: సీక్రెట్‌గా పేపర్లు దహనం, హెరిటేజ్‌కి చెందినవా?

Tadepalli SIT Office papers burned: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తాజాగా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌‌లో పేపర్లు తగలబడడం తీవ్ర కలకలం రేపుతోంది. తగలబడుతున్న వాటిలో పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆఫీసు పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది.

ముఖ్యంగా సిట్ కార్యాలయ సిబ్బంది పలు పత్రాలు దహనం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. హెరిటేజ్ సంస్థకు చెందిన పేపర్లుగా చెబుతున్నారు. పత్రాలు తగలబెట్టడంపై స్థానికులు సంబంధి త సిబ్బందిని ప్రశ్నించి వీడియోలు తీశారు. పత్రాలు తగలబెట్టినప్పుడు తీసిన వీడియోలు తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

సిట్ అధిపతి ఆదేశాల మేరకే వ్యక్తిగత సిబ్బంది నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారన్న విమర్శలు జోరందుకున్నాయి. దీనిపై టీడీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థకు చెందిన కీలకపత్రాలు ఉండవచ్చని భావిస్తోంది. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు సిట్ అక్రమ కేసులు పెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించిన పేపర్లు అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. చాన్నాళ్ల కిందట ఓఆర్ఆర్ కేసులో నారా లోకేష్‌ను సీఐడీ విచారించింది. ఈ క్రమంలో హెరిటేజ్ పేపర్స్ చూపించి పలు ప్రశ్నలు సంధించారు అధికారులు. ఆయా పత్రాలు ఎలా వచ్చాయని అధికారులను లోకేష్ ప్రశ్నించినట్టు మీడియా ఎదుట ఆయనే చెప్పారు. కేసుతో సంబంధం లేని పత్రాలను ఇప్పుడు సిబ్బంది తగలబెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీని గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం! ఇంత సైలెంట్ గా చక్రం తిప్పింది ఎవరు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, 2021 న జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా 2021 మా ఎన్నికలు జరిగాయి. ఇరు పక్షాల నుంచి పోటా పోటీ ప్రచారం, ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలు పేల్చుకున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ మా ఎన్నికల గురించి వార్తలే హల్ చల్ చేశాయి. ఒకరకంగా ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయని వార్తలు వచ్చాయి. ఉత్కంఠంగా సాగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు దక్కించుకున్నాడు. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో అని అందరూ భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకంది.. సైలెంట్ గా ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండోసారి నియామకం అయ్యారు. ఇంత సైలెంట్ గా జరిగిన ఈ పరిణామం వెనుక చక్రం తిప్పింది ఎవరు.. అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.

2024 ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు చాలా సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయాయి.. రెండోసారి మంచు విష్ణు నియామకం అయ్యారు. ఆదివారం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా మంచు విష్ణుని ఎన్నుకున్నారు.‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ని కొనసాగిస్తున్నట్లు 26 మంది కమిటీ సభ్యులు ఏక గ్రీవంగా తీర్మానించారు.ఈ విషయాన్ని ఉపాధ్యక్షుడు మాదాల రవి తెలిపారు. అయితే దీని వెనుక సైలెంట్ గా కథ నడిపింది మంచు విష్ణు కుటుంబ సభ్యులు అని మీడియాలో టాక్ నడుస్తుంది. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, ట్రెజరర్ గా శివబాలాజీ ఎంపిక చేశారు. ఈసీ సభ్యులుగా మధుమిత, శైలజ, జైవాణిలను ఎన్నుకున్నారు. వాస్తవానికి ‘మా’ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ లెక్కన గతేడాది సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది మే నెలకు కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు.

ఇంకో నెలలో ఎన్నికలు సిద్దమవ్వాల్సిన తరుణంలో ‘మా’ జనరల్ బాడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల ‘మా’ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. దీని వెనుక మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 2011 లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడానికి ముఖ్య కారణంగా ఆయన ‘మా’ అసోసియేషన్‌కు నూతన భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు. ఇంతపెద్ద నగరంలో ఒక అసోసియేషన్ కి బిల్డింగ్ నిర్మించాలంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు. కోట్ల డబ్బుతో కూడుకున్న విషయం.. అందుకే నూతన భవనం నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతుందని మా అధ్యక్షుడు మంచు విష్ణు పలుమార్లు మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాను ఇప్పటికీ అన్న మాటకు కట్టుబడి ఉన్నానని.. ఎట్టి పరిస్థితుల్లో ‘మా’ అసోసియేషన్ కి నూతన భవనం నిర్మించి ఇస్తానని అంటున్నారు.

ఈ క్రమంలోనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈసారి కూడా మంచు విష్ణు కి అధ్యక్ష పదవి కట్టబెడితే తాను చెప్పినట్లు నూతన భవనం ఏర్పాటు పూర్తయ్యేందుకు వీలు ఉంటుందని భావించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు పోటీ చేసినా ధైర్యంగా ‘మా’ అసోసియేషన్‌కు నూతన భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వలేదు. మంచు విష్ణు ఇప్పటికీ తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పినందువల్లనే ఆయనకే మళ్లీ పట్టం కట్టినట్లు వార్తలు వస్తున్నాయి.‘మా’ ఎన్నికలు అంటే ఎప్పుడు గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు అన్న పదానికి ఈసారి అర్థం మార్చారు. ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక్కతాటిపై నిలబడటం నిజంగా ఇదో మంచి శుభపరిణామం అని అంటున్నారు.సినీ ప్రముఖులు మంచు విష్ణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రంజాన్ సెలవు ఈనెల 11వ తేదీగా మార్పు ఈనెల 10వ తేదీ పని దినంగా సర్కులర్

రంజాన్ సెలవు ఈనెల 11వ తేదీగా మార్పు ఈనెల 10వ తేదీ పని దినంగా సర్కులర్

nava graha slokam: నవగ్రహ శ్లోకాలు

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవి

జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్

తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర

దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్

నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

కుజ

ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్

కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||

బుధ

ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురు

దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం

బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్ర

హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం

సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

శని

నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

రాహు

అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం

సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||

కేతు

పలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

Ugadi Rasi Phalalu 2024: క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలం

ఆదాయం 8; వ్యయం 14 రాజపూజ్యం 4; అవమానం 3

ఈ రాశివారికి అదృష్టయోగం 75శాతం బాగుంది. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం, కీర్తి, ధనలాభం, ధర్మకార్యాచరణ ఉంటాయి. మే వరకూ గురుబలం తక్కువగా ఉన్నా తర్వాత చాలా బాగుంటుంది. ధనలాభం శుభప్రదంగా ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. విద్యాయోగం శుభప్రదం. ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాడు. ఉద్యోగంలో మంచి ఆలోచనావిధానంతో పనిచేయండి, తప్పక కలిసివస్తుంది. వృత్తిలో రాణిస్తారు. పంటలు బాగా పండుతాయి. విదేశీ యోగం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. భూ గృహ వాహన యోగాలు కలిసివస్తాయి. అవివాహితులకు ఉత్తరార్ధంలో కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగముంది. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబసభ్యులకు మేలు కలుగుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. అనారోగ్య సమస్యలు తక్కువ. మీమీ రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ధర్మం రక్షిస్తుంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి. మార్చి 29నుంచి మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వీరికి శనిధ్యానం మేలుచేస్తుంది. మరిన్ని శుభఫలితాలకై పూర్వార్థంలో గురుశ్లోకం, సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకం చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 7; అవమానం 3

అదృష్టయోగం 25శాతమే ఉంది. ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం, ప్రభుసన్మానం, పశులాభం, భోజనసౌఖ్యం, వస్త్ర, వస్తుప్రాప్తి మొదలగు శుభఫలితాలు ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యావిషయంలో గురుబలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. గ్రహదోషం అధికంగా ఉంది. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశయోగం అనుకూలం. ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి. భూ, గృహ, వాహన యోగాలు బాగున్నాయి. అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి. సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.  నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 6

మిథునరాశి వారికి 50శాతం అదృష్టయోగముంది. పూర్వార్థంలో గురువు వల్ల కీర్తివృద్ధి, సర్వత్రా విజయం, శత్రువులు మిత్రులవడం జరుగుతుంది. రాహువు దశమ రాజ్యకేంద్రంలో సంతోషం, భోజన సౌఖ్యం, కర్మసిద్ధి, శరీరబలం, మొదలైన శుభఫలితాలను ప్రసాదిస్తున్నాడు. మే తర్వాత గురుబలం తగ్గుతుంది. విద్యాయోగం శుభప్రదం. ఉద్యోగంలో పదవీలాభముంది. వ్యాపారంలో ధనలాభం సూచితం. వృత్తి నైపుణ్యంతో ఉన్నతస్థితిని సాధిస్తారు. వ్యవసాయం కలిసివస్తుంది. విదేశ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనలాభం మే వరకూ అద్భుతంగా ఉంటుంది. వివాహఘడియలు మే వరకూ సానుకూలం. కష్టాలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్యం నెరవేరుతుంది. మరిన్ని శుభఫలితాలకై శని, కేతు శ్లోకాలు చదవాలి.నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 6; అవమానం 6

అదృష్టయోగం 50శాతముంది. ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి, శత్రువులపై విజయం సిద్ధిస్తాయి. మూడోరాశిలో కేతువు వల్ల సౌభాగ్యం, ధనలాభం, ఆరోగ్యం వంటి శుభాలున్నాయి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగముంది. ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. మే నుండి విశేష లాభాలుంటాయి. వ్యవసాయంలో విజయాలుంటాయి. విదేశీ యానానికి అవకాశమొస్తే సద్వినియోగం చేసుకోవాలి. తీర్థయాత్రలు చేస్తారు. భూ, గృహ, వాహనయోగాలు శుభఫలితాన్నిస్తాయి. మంచి జీవితభాగస్వామి లభిస్తారు. సంతాన సౌఖ్యముంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి కర్కాటక రాశివారికి పుష్కలంగా ఉంటాయి. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి.నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 14; రాజపూజ్యం 2; అవమానం 2

ఈ రాశివారికి అదృష్టయోగం 25శాతమే. భాగ్య బృహస్పతియోగం వల్ల మే వరకు ధనలాభం, మంచి భోజనం, సుఖం లభిస్తాయి. శని, రాహు, కేతు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి. విద్యార్థులకు మే వరకూ మంచి ఫలితాలున్నాయి. వ్యాపారయోగం కూడా మే వరకూ బాగుంది. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మే తర్వాత విదేశ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి. భూ, గృహ వాహనాల విషయంలో ప్రయత్నం బాగా చేయాలి. అవివాహితులకు మే వరకూ అనుకూలం. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్లాలి.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 5 అవమానం 2

కన్యారాశి వారికి గురు, శని గ్రహాల వల్ల యాభైశాతం శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం, గృహలాభం, మంచి భోజనం తదితర ఫలితాలుంటాయి. ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటంతో అదృష్టవంతులవుతారు. ఉన్నతవిద్యల్లో రాణిస్తారు. ఉద్యోగంలో పదవీయోగం సూచితం. స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అధిక ధనలాభాలు ఉంటాయి. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి. పంటలు బాగా పండుతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మే వరకూ సామాన్యంగా ఉన్నా ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. కార్యసిద్ధి ఉంది. మే తర్వాత వివాహయోగం శుభప్రదం. సంతానం గురించి శుభవార్త వింటారు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సుఖాలే అధికంగా ఉంటాయి. ఆనందాన్నీ, మనశ్శాంతినీ, సంకల్పసిద్ధినీ పొందుతారు. మరిన్ని శుభఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 1; అవమానం 5

ఈ రాశివారికి అదృష్టయోగం యాభైశాతముంది. గురు, రాహువులు యోగిస్తున్నారు. మే వరకూ సప్తమంలో మేష గురువు రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి శుభఫలితాలను ప్రసాదిస్తాడు. షష్ఠ స్థానంలో మీన రాహువు ధైర్యాన్నీ శత్రువులపై విజయాన్నీ భూలాభాన్నీ కలుగజేస్తాడు. పూర్వార్థంలో బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. వ్యాపారంలో అధిక ధనలాభముంది. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భూ గృహ వాహన యోగాలు కలిసివస్తాయి. ఈ ఏడాది వివాహయోగం శుభప్రదంగా ఉంది. సంతానవృద్ధి కలుగుతుంది. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, కేతువులను ధ్యానించాలి.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి



ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5

ఈ రాశి వారికి యాభైశాతం అదృష్టయోగముంది. ఉత్తరార్థంలో వృషభ బృహస్పతి రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధినిస్తాడు. ఏకాదశంలో కన్యా కేతువు పశులాభాన్నీ భోజనసౌఖ్యాన్నీ వస్త్ర, వస్తు ప్రాప్తినీ కలిగిస్తాడు. మంచి విద్యాయోగం ఉంది. మనోభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అధికార లాభముంది. వ్యాపారం కలిసివస్తుంది. వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యవసాయంలో ఆశించిన లాభాలొస్తాయి. విదేశ యత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రదర్శనం శక్తినిస్తుంది. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భూ, గృహ, వాహన యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉత్తరార్థంలో కల్యాణఘడియలు బాగున్నాయి. సంతానభాగ్యముంది. కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. గురు, శని, రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలుంటాయి ..నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి



ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 3; అవమానం 1

గురు, కేతు గ్రహాల వల్ల అదృష్టయోగం 50శాతం అనుకూలం. ఉత్తరార్థంలో గురువు- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం కలుగజేస్తాడు. తృతీయస్థానంలో రాహువు సౌభాగ్యం, ఆరోగ్యం, కీర్తి తదితర ఫలితాలను ఇస్తాడు. చక్కని విద్యాయోగం సూచితం. ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశదిశలా వ్యాప్తిచెందుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బుద్ధిబలంతో మెప్పిస్తారు. స్థిరమైన వృత్తి లభిస్తుంది. వ్యవసాయపరంగా కలిసివస్తుంది. ఆశించిన లాభాలొస్తాయి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు. అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొందరికి ఆదర్శనీయులు అవుతారు. కష్టాలు తొలగుతాయి. కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్లండి. సంతృప్తి, మనశ్శాంతి, సంకల్పసిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి. శని, కేతు, గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి



ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 5

ఈ రాశివారికి 75శాతం అదృష్టయోగం ఉంది. పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం తదితర ఫలితాలనిస్తున్నాడు. దశమంలో కేతువు- సర్వసుఖాలనూ ప్రసాదిస్తున్నాడు. బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకూ అద్భుతమైన విద్యాయోగం ఉంది. గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభఫలితాలుంటాయి. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారయోగం సూచితం. వ్యాపారంలో మే వరకూ బ్రహ్మాండమైన లాభాలున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయంలో  మంచి పంట చేతికి అందుతుంది. విదేశయోగం అద్భుతంగా ఉంది. మే వరకూ విశేష ఆర్థిక యోగాలున్నాయి. తర్వాత రుణసమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. భూ, గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. వివాహయత్నాల్లో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తొలగుతాయి. ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం, మనశ్శాంతి లభిస్తాయి. మరిన్ని శుభఫలితాలకై రాహు, గురు శ్లోకాలు చదువుకోవాలి.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి



ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 6; అవమానం 1

కుంభరాశి వారికి ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు గ్రహాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. గ్రహదోష నివారణార్థమై ఇష్టదేవతాసందర్శనం మంచిది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. మార్చి 29 నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటిశని ఉంటుంది. మరిన్ని సత్ఫలితాలకై గురు, శని, రాహు, కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి



ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 4

మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్థంలో సదా రక్షిస్తున్నాడు. సుఖం, సౌభాగ్యం, కీర్తి తదితర శుభఫలితాలనిస్తున్నాడు. వాక్శుద్ధి వీరిని కాపాడుతుంది. విద్యాయోగం మే వరకూ అనుకూలం. ఉన్నతవిద్యల్లో బాగా కష్టపడాలి. ఉద్యోగం సానుకూలం. వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. భూ, గృహ, వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి. అవివాహితులకు మే వరకూ కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగం శుభప్రదం. మార్చి 29 నుంచి మీనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది. అందుకని శనిధ్యానం చేయాలి. రాహు, కేతు, గురు శ్లోకాలూ చదువుకోవాలి.  .నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి

 

Moodham: మూఢం అంటే ఏంటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు?

Moodham: వివాహాది శుభ కార్యాలు చేసుకోవడానికి ఇంక కొన్ని రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏయే సమయాల్లో మూఢం వచ్చింది? ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

Moodham: నవగ్రహాలకు అధిపతి రవి. ఈ సూర్యగ్రహం చుట్టూ మిగతా గ్రహములన్నీ తిరుగుతాయి. అందువల్ల సూర్యుడికి నవగ్రహ నాయకత్వం లభించినది. ఇలాంటి నవగ్రహ నాయకుడైనటువంటి సూర్యునితో శుభగ్రహాలైనటువంటి బృహస్పతి కానీ, శుక్రుడు కానీ కలసి ఒకే రాశిలో ఉన్న సమయాన్ని మౌఢ్యము లేదా మూఢము అని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రవి గురునితో కలసి ఉన్నట్లయితే దానికి గురు మూఢమని, రవి గనుక శుక్రునితో కలసి ఒకే రాశిలో ఉంటే దానిని శుక్రమూఢమని అంటారని చిలకమర్తి తెలిపారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం గురు మూఢము, శుక్రమూఢము కాని ఏర్పడిన సమయములలో శుభకార్యాలను ఆచరించినట్లయితే ఆ కార్యాలు శుభఫలితాలు ఇవ్వవని అలా చేసుకున్నటువంటి కార్యక్రమాల వలన జీవితంలో సమస్యలు ఇబ్బందులు పెరుగుతాయని అందుకే ఈ సమయాలలో శుభకార్యాలను నిషేధించారని చిలకమర్తి తెలిపారు.

మూఢంలో ఏం చేయకూడదు?
మౌఢ్య దినాలలో వివాహము, ఉపనయనము, గర్భాదానము, గృహారంభం, గృహ ప్రవేశం, వాస్తు సంబంధిత కార్యక్రమాలు వంటివి చేయరు. శంఖుస్థాపన, నూతన ఆరంభము వంటి కార్యక్రమాలను ఆచరించకూడదని చిలకమర్తి తెలిపారు. నిత్య దైవిక కార్యక్రమాలు, పితృదేవత కార్యక్రమాలు, అబ్బికాలు, పిండప్రధానాలు, సంవత్సరీకాలు, పుంసవనం, శ్రీమంతం వంటి కార్యక్రమాలు, నామకరణం వంటి కార్యక్రమాలు యథావిధిగా ఆచరించుకోవచ్చు.

ఉపనయనాది, వివాహం వంటి శుభకార్యాలు మాత్రం ఆచరించకూడదు. మౌఢ్య సమయంలో వివాహాది శుభరార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు/ పనులు (తాంబూలాలు మార్చుకోవడం, వినాయకునికి మీదు కట్టడం, పసుపు కొట్టడం వంటివి) కూడా ఆచరించరాదు. 2024 సంవత్సరంలో 29 మార్చి 2024 నుండి శుక్రమూఢము ప్రారంభమైనదని ఈ సంవత్సరం జూన్‌, జూలై వరకు కూడా శుక్రమూఢము, గురుమూఢము ఫలితంగా ముహూర్తాలు లేవని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.

చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంతం గణితం ఆధారంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురు, శుక్రమూఢముల వలన చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ముహూర్తములు పనికిరావు.

గురు మూఢం

14-4-2024 నుండి 1-5-2024 వరకు,

15-5-2024 నుండి 14-6-2024 వరకు

శుక్ర మూఢము
9-4-2024 నుండి 14-4-2024 వరకు,

24-4-2024 నుండి 14-5-2024 వరకు

19-5-2024 నుండి 6-7-2024 వరకు,

16-7-2024 నుండి 31-7-2024 వరకు,

16-8-2024 నుండి 24-8-2024 వరకు,

16-9-2024 నుండి 18-9-2024 వరకు

14-8-2025 నుండి 29-03-2025 వరకు ఉన్నాయి.

Pushpa 2 Teaser: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

Pushpa 2 Teaser: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప2’ మూవీ ఒకటి. ఈ రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఫుల్ టీజర్ రిలీజ్ అవుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ టీజర్ ఎలా ఉండబోతుందా?.. అంటూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎట్టకేలకు ఈ టీజర్ వచ్చేసింది. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ప్రేక్షకులకు ట్రీట్ అందించింది. ఇక ఈ టీజర్ చూస్తే అబ్బో ఓ రేంజ్‌లో ఉంది అనే చెప్పాలి.

టీజర్‌లో ఫుల్ జాతర.. జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్ మరో స్థాయిలో ఉన్నాయి. దీనిని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా చెప్పాలని అభిమానులు అంటున్నారు. టీజర్‌లో ఐకాన్ స్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు. మాస్ యాక్షన్ సీన్లతో కట్ చేసిన ఈ టీజర్ అద్భుతంగా ఉంటూ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

Health

సినిమా