జగన్ ఇంటి ముందు కట్టడం కూల్చివేత ఎఫెక్ట్.. అధికారి బదిలీ

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యత వహించించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే ను బల్దియా కమిషనర్ బదిలీ చేశారు.


వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టారని హేమంత్ పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ మోహన్‌రెడ్డి ఇంటి ముందున్న రహదారిపై ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే.