హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పోలా భాస్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనరు పోలా భాస్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.


ఈ మేరకు ప్రభుత్వం జిఓ ఆర్‌టి నెంబరు 1077ను ఆదివారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ పోస్టులో పనిచేస్తున్న జె శ్యామలరావును ప్రభుత్వం టిటిడి ఇఒగా నియమించిన విషయం తెలిసిందే.