Friday, November 15, 2024

Nadu-Nedu Phase 2 Completion of works by 12th June 2024

Nadu-Nedu Phase 2 Completion of works by 12th June 2024 Instructions to District Education Officers and – Additional Project Coordinators regarding completion of works by 12th June 2024

Completion of Nadu Nedu components before re-opening of Schools in the State – Instructions issued – regarding Circular.No.2453202 /MBNN/2024 Dated.29/05/2024

Ref: Instructions issued in the Webex meeting held on 28.05.2024.

In the reference cited, the instructions were issued to the all field level functionaries to complete all Nadu Nedu components before reopening of schools on 12.06.2024 as detailed below:

Important tasks to be commenced before re-opening of Schools:

Ensure that all the Nadu Nedu Components ( civil works) are completed by 12th June, 2024 and installation of fixtures like doors windows and GCBs may be done after 12thJune.
In case of Additional Class Rooms efforts should be made to target completion of ACRs up to slab level by 12.06.2024. Only brick work, painting & finishing shall be taken up after 12thJune, 2024).
DEOs/Additional Project coordinators in the State should utilize TEO (funds) and TEO (material) option for required fund and material mobilization to complete Additional Class Rooms up to Slab level.
DEOs/APCs shall issue instructions to HMs and MEOs to ensure removal of debris and other construction material from the construction sites to prevent any accidents or injuries to students.
All the supplied CPM material should be installed and be made functional before the reopening of schools.
Hence, All the District Education Officers and Additional Project Co-ordinators are instructed to ensure compliance of the above instructions by the concerned field staff.

DSC 1998, DSC 2008 MTS Contract Teachers Service Renewal Orders 2024-25

DSC 1998, DSC 2008 MTS Contract Teachers Service Renewal Orders 2024-25 DSC 2008 MTS Teachers Contract Period Renewal Orders 2024-25 DSC-1998 Contract Teachers Renewal of the services of the DSC-2008 Contract Teachers for a period of 11 months with effect from 01.06.2024 to 30.04.2025, with a break of one month, in principle as ‘no work no pay’, for the Academic Year, 2024-2025

School Education Renewal of the services of the DSC-1998 and DSC-2008 Contract Teachers for a period of 11 months with effect from 01.06.2024 to 30.04.2025, with a break of one month, In principle as ‘no work no pay’, for the Academic Year, 2024-2025-Permission Accorded Orders Issued Memo.No.1712743/Services-I/A2/2024, Dated: 30/05/2024

Ref:

1. G.O.Ms.No.39, School Education (Exams) Department, dated: 21.06.2021.
2. G.O. Ms.No. 27, School Education (Exams) Dept., dated: 15.03.2023.
3. Govt. Memo.No. 1527176/Services-I/A2/2023, dated: 02.06.2023.
4. G.O.Rt.No. 98, dated: 13.06.2023. School Education (Ser.I) Dept.,
5. From the Commissioner of School Education, Lr.Rc.No. ESE02-20/24/2021-(RECTMT)-EST3, Dt: 24/04/2024.

In the circumstances reported by the Commissioner of School Education, In the reference 5th cited, Government, after careful consideration of the matter, hereby accord permission to him to renew the services of the DSC- 1998 and DSC-2008 Contract Teachers for a period of 11 months with effect from 01.06.2024 to 30.04.2025, with a break of one month, in principle as ‘no work no pay’, for the Academic Year, 2024-2025 for smooth running of academic class work and administrative works in the Government Schools.

The Commissioner of School Education, is therefore, requested to take further necessary action accordingly, in the matter.

This memo Issues with the concurrence of the Finance (H.R-IV-FR&LR) Department, vide their U.O.No. 2157008 /HR.IV- FR&LR/FIN01- HROPDPP(OCE)/106/2023, dated: 22.05.2024.

AP ICET Result 2024

AP ICET Result 2024 Download AP ICET 2024 Result Rank Card of AP Integrated Common Entrance Test APICET 2024 for admission into first year MBA / MCA Courses for the academic year 2024-25 https://cets.apsche.ap.gov.in/ICET

AP ICET Result 2024 Released ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు AP ICET 2024 Results విడుదల.

మే 6, 7న ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2024 విద్యా సంవత్సరానికి ఫుల్టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు.

APICET 2024 Result click here

పోస్టింగ్‌ ఇవ్వండి.. సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

పోస్టింగ్‌ ఇవ్వండి.. సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్‌కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుకి గురువారం ఉదయం హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.

Ap Elections: ఉద్యోగుల postal ballot పై హైకోర్టుకు YCP

Ap Elections: ఉద్యోగుల postal ballot పై హైకోర్టుకు YCP
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల(Postal ballot) చెల్లుబాటు అంశంలో హైకోర్టు(High court)ను వైసీపీ ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిక్లరేషన్‌పై గెజ్జిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని చెప్పడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ మెమోలు కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఉద్యోగులంతా కూటమి వైపు మెుగ్గు చూపడంతోనే వైసీపీ హైకోర్టుకు వెళ్లిందని తెదేపా నేతలు చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాబు కాకుండా చూసేందుకు వైసీపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఉద్యోగులంతా కూటమి మద్దతు తెలుపుతున్నారని, ఆ విషయం వైసీపీ అధిష్ఠానానికీ తెలుసన్నారు. అందుకే ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసి తమ ఓటు శాతాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే హైకోర్టును ఆశ్రయించారని మండిపడుతున్నారు.

Gautam Gambhir: గంభీర్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ అదే.. ప్రధాన కోచ్‌ రూమర్స్‌కు చెక్‌!

భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ నియామకం అయిపోయిందనే వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత.. జులై 1 నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేశారనేది ఇంకా తెలియలేదు. కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడు ఈసారి కోచ్‌గా వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని ఈ వ్యాఖ్యలనుబట్టి తెలుస్తోంది.

‘‘మేం ఇప్పటికి మూడు టైటిళ్లను సాధించాం. ముంబయి, చెన్నై కంటే ఇంకా రెండు కప్‌లను వెనుకబడే ఉన్నాం. ఇప్పుడు విజేతలుగా నిలిచినా.. మా టైటిళ్ల వేట కొనసాగుతుంది. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్ల జాబితాలో మేం లేము. అలా జరగాలంటే మరో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలవాలి. దాని కోసం తీవ్రంగా కష్టపడాలి. మా తదుపరి లక్ష్యం అదే. ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా కేకేఆర్‌ను నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. ఇప్పుడు జర్నీ ప్రారంభమైంది’’ అని గంభీర్‌ తెలిపాడు.

నరైన్ అలా అడిగాడు..
సునీల్ నరైన్‌ తనకు సోదరుడిలాంటి వాడని, 2012 సీజన్‌లో మొదటిసారి ఓ ప్రశ్న అడిగినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘క్యారెక్టర్ విషయంలో నరైన్‌కు నాకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఐపీఎల్‌లోకి అతడు 2012లో తొలిసారి అడుగు పెట్టాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది జైపుర్‌లో ప్రాక్టీస్‌ చేసిన తర్వాత లంచ్‌కు రమ్మని చెప్పా. అతడు చాలా సిగ్గుపడుతుంటాడు. లంచ్‌ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ‘నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?’ తొలి సీజన్‌ కావడంతో కాస్త భయపడ్డాడు. తర్వాతి నుంచి అద్భుతమైన ఆటతీరుతో జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేనెప్పుడూ అతడిని జట్టు సభ్యుడిగా చూడను. ఒక సోదరుడిగానే భావిస్తా. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్‌ దూరంలోనే ఉంటాం. కేవలం కోల్‌కతాకే కాకుండా టోర్నీకే అతడు అత్యంత విలువైన ఆటగాడు. భవిష్యత్తులోనూ చాలా క్రికెట్ ఆడగలడు’’ అని కేకేఆర్‌ మెంటార్ తెలిపాడు.

Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు.

‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుంది’ అని ప్రభాస్‌ అన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మాట్లాడుతూ.. ‘‘కల్కి’సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలో ఉంటారు. నేను ‘అవతార్‌’ చూశాక అలాంటి అనుభూతే పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ‘కల్కి’ (Kalki Movie) చూశాక థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాం. వీటిలో ఎలాంటి మార్పులు చేయం’ అని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇందులో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఆవిష్కరించారు. ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో ‘బుజ్జి’ (Bujji) చేసిన సందడికి సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk)ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కోరారు. ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. అలాగే బుజ్జి, భైరవకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Bujji and Bhairava on Prime)లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Agnikul: అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’..!ఏమిటీ పరీక్ష.. ఎందుకింత ప్రాధాన్యం

ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ (Agnikul) సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. గురువారం ఉదయం 7.15 గంటల సమయంలో దీనిని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించినట్లైంది. ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ కూడా అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు. వాస్తవానికి ఈ ప్రయోగం దాదాపు నెలన్నర క్రితమే జరగాల్సింది. కానీ, నాలుగుసార్లు వాయిదా పడింది. ఐదోసారి విజయవంతంగా పూర్తి చేసుకొంది.

ఏమిటీ పరీక్ష..
ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాలపాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్‌ కాస్మోస్‌కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌కూల్డ్‌ ద్రవ ఆక్సిజన్‌ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు.

దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్‌ పొడవు 6.2 మీటర్లు. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఈథర్‌నెట్‌ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్‌ వ్యవస్థను వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోపైలెట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఇందులో వినియోగించారు.

ఒకవేళ ప్రయోగం అదుపుతప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్‌ టర్మినేషన్‌ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు. పలురకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు. 300 కిలోలలోపు బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు దొరకవు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్‌ నిర్మించిన రాకెట్‌ సరిపోతుందని భావిస్తున్నారు.

తొలి ప్రైవేటు లాంచ్‌ ప్యాడ్‌పై ప్రయోగం రెండు నిమిషాలే..
ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాలు మాత్రమే జరిగింది. ముగిశాక రాకెట్‌ సముద్రంలో కూలిపోయింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌లో ఏర్పాటుచేసిన తొలి ప్రైవేటు లాంచ్ ప్యాడ్‌ ఏఎల్‌పీ-01 (ALP-01) ఈ పరీక్షకు వేదికైంది. ఈ రాకెట్‌ ప్రయోగించిన తర్వాత నాలుగు సెకన్ల సమయంలో నిర్ణీత దిశకు మళ్లింది. 1.29 నిమిషాల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి.. అక్కడినుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్‌ ఇంజిన్‌, ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపర్చడానికి ఈ రెండు నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ అగ్నికుల్‌ సంస్థను అభినందించారు. ప్రపంచంలోనే తొలిసారి 3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌ను కావడం విశేషమన్నారు.

Southwest monsoon: చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయ్యింది.

మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక, ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది.

వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది.

Virat Kohli: నేను అబద్ధాలు చెప్పడం లేదు.. ఆ రోజు చాలా భయపడ్డా: విరాట్ కోహ్లీ

భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేసి ఫామ్‌లో ఉన్న కోహ్లీ నుంచి మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌లు రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాను తొలిసారి వరల్డ్‌ కప్‌ (World Cup) ఆడినప్పటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాతో ఆడిన మ్యాచ్‌ మొదటిది కావడం విశేషం. అందులో కోహ్లీ 83 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.

‘‘ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తోనే నా తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్ ఆడా. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురయ్యా. నిజంగా.. నేనేమీ అబద్ధాలు చెప్పడం లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడటం వేరు. మెగా టోర్నీల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వేరు. అప్పుడు జట్టులో నేను చిన్నవయసు క్రికెటర్‌ను. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడమే అద్భుతం. మ్యాచ్‌కుముందు రోజు కూడా ఆందోళనగానే ఉన్నా. ఇవన్నీ కూడా మంచి శకునాలే. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తే జట్టుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. దాని కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యా. నా ప్రణాళికలను అమలు చేసేందుకు ఆ నెర్వస్‌నెస్‌ సాయపడిందని అనుకుంటా’’ అని కోహ్లీ తెలిపాడు.

విమర్శలను ఆటతోనే తిప్పికొడతాడు: డీకే
విరాట్ కోహ్లీపై ఆటపై ఏమైనా విమర్శలు చేస్తే తనకు ప్రాణహాని హెచ్చరికలు వచ్చాయని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై భారత వెటరన్ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది ఎలా ఉండాలనేది విరాట్ కోహ్లీ తన పుస్తకంలో ఆల్రెడీ రాసేసుకున్నాడు. ఇప్పటికే ప్రారంభించాడు. సైమన్‌ డౌల్‌ వంటి వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే కోహ్లీని ఎంత విమర్శిస్తే.. అతడిలోని అద్భుతమైన ఆట బయటకొస్తుంది. ఇలాంటివెన్నో అతడి కెరీర్‌లో చూశాం’’ అని కార్తిక్ తెలిపాడు.

Big Breaking: ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

Big Breaking: ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

అమరావతి, న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు (AP Election Results) మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు..ఇటు ఎన్నికల కమిషన్‌ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టయ్యింది.

ఇటు హైకోర్టుకు.. అటు ఆదేశాలు..!

ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బల్లెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్‌గా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈ రోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని.. తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్‌లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగుతిన్నది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అనేదానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

భారత్‌ బిగ్ డీల్.. ఇక శత్రు దేశాలకు చుక్కలే..!

ఆత్మనిర్భర్‌ భారత్‌ ….దేశ రక్షణ విషయంలో తగ్గేదేలేదన్న మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిన్‌ ఇండియ యుద్ధనౌక విక్రాంత్‌తో జోడిగా ఫ్రాన్స్‌ నుంచి 26 రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది.

భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య రాఫెల్‌ మెరైన్‌ ఫైట్‌ జెట్స్‌ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలిక్కి రానుంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఈ డీల్‌కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు. రాఫెల్‌ మెరైన్‌ వెర్షన్‌ ఫైటర్‌ జెట్స్‌ను తయారు చేసిన డసో ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రాఫెల్‌ యుద్ద విమానాలు వున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయనున్న 26 రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ ప్రత్యేకంగా ఇండియన్‌ నేవి కోసమే.

రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌‌ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. రాఫెల్ ఎం, సింగిల్ సీటర్ ఫైటర్‌ జెట్‌. ఇవి గగన తల రక్షణ, అణుదాడులను సమర్ధవంతంగా గా ఎదుర్కొంటాయి. శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి. అంతేకాదు నిఘా వ్యవస్థలోనూ ఈ ఫైటర్‌ జెట్స్‌ కీలకంగా వ్యవహరిస్తాయి. గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ .. గగనతలంలో 50 వేల అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి. ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిస్సైళ్లు, ఎంఐసీఏ క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, ఏఎం39, ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు.

గతేడాది జులైలో ప్రధాని నరేంద్ర మోది పారిస్‌లో పర్యటన సందర్భంగా రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి. గత డిసెంబర్‌లో బిడ్‌ దాఖలైంది. భారత్‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధర, మిషనరీ నిర్వహణ పై చర్చిస్తారు. తుది ఒప్పందం జరిగేది మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాకే.

NEET Answer Key : నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Pencil drawing selected choice on answer sheets. hand fill in Exam carbon paper computer sheet and pencil.

NEET UG 2024 ఆన్సర్ కీ విడుదలయ్యింది. దీంతో పాటు ప్రశ్నపత్రం, అభ్యర్థల OMR ఆన్సర్‌ షీట్‌లను కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)విడుదల చేసింది.

అభ్యర్థులు  exams.nta.ac.in/NEET  లేదా  neet.ntaonline.in లో నీట్‌ ఆన్సర్‌ కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆన్సర్‌ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు exams.nta.ac.in/NEET ను సంప్రదించగలరు. కాగా నీట్ యూజీ 2024 పరీక్ష ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఈ పరీక్షకు మొత్తం 24 లక్షల మంది హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా ఉన్న 571 నగరాలు, భారతదేశం వెలుపల 14 నగరాల్లో ఉన్న 4,750 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షను నిర్వహిస్తారు. తుది ఫలితాలను వచ్చే నెల 14వ తేదిన విడుదల చేయనున్నట్లు సమాచారం.

NEET UG 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in ను క్లిక్‌ చేయండి.
హోం పేజీలో కనిపిస్తున్న నీట్ యూజీ 2024 పేజీని క్లిక్‌ చేయండి.
మీ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేయండి
తర్వాతి పేజీలో ప్రొవిజనల్ ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది. ప్రింట్‌ అవుట్‌ తీసుకోవచ్చు.

ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి

కీపై అభ్యంతరాలకు క్లిక్‌ చేయండి

AP EAMCET 2024 లో మీకు వచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వస్తుందంటే..?

ఎంసెట్ లో మీకు ఏ BRANCH లో సీటు వస్తుంది..? మీ ర్యాంక్ కి మీరు అనుకున్న కళాశాలలో మీకు సీటు వస్తుందా? విద్యార్థుల్లో ఇలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏటా ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు www.sakshieducation.comఅండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా SakshiEducation.com మీకు సరికొత్త EAPCET 2024 కాలేజ్ ప్రిడిక్టర్‌ని అందిస్తుంది, ఇది మీకు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో .. ఏ బ్రాంచ్‌లో ర్యాంక్ వస్తుంది అని అంచనా వేస్తుంది. EAPSET-2023లో ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో ఇచ్చిన ర్యాంక్.. EAPSET 2024 కౌన్సెలింగ్‌లో మీకు దాదాపు అదే వచ్చే అవకాశం ఉందని అధికారిక లెక్కల ప్రకారం www.sakshieducation.com  మీ కోసం ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని అందిస్తోంది.

AP EAPCET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది ఇక్కడ  క్లిక్ చేయండి

TS EAMET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి 

https://collegepredictor.sakshieducation.com/ ని సందర్శించండి

స్టెప్ 1: పై  లింక్ పై క్లిక్ చేయండి

స్టెప్ 2: మీ ర్యాంక్‌ను నమోదు చేయండి మరియు మీ లింగం, వర్గం, కోర్సు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలను ఎంచుకోండి.

సబ్మిట్ పై క్లిక్ చేయండి

చివరి దశ : ఎంపిక చేసిన బ్రాంచ్‌కు సంబంధించి ప్రిడిక్టెడ్ కాలేజీలు ప్రదర్శించబడతాయి

కౌన్సెలింగ్ సమయంలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగించబడే జాబితాను సేవ్ చేయండి లేదా ప్రింటవుట్ తీసుకోండి.

‘బెడ్’ పెర్మార్మెన్స్ కారణంగా..13 మంది టీచర్ల జీతం కట్..ఇంటర్నెట్లో లెటర్ వైరల్

ఇంగ్లీషులో కొన్ని పదాల్లో ఒక్క అక్షరం మారినా వాటి అర్థమే మారుతుంది.ఉదాహరణకు BAD కు బదులుగా BED అని రాస్తే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇలా అక్షరం మార్పుతో 13 మంది టీచర్ల జీతాలు కట్ కట్ కావడమే కాదు..ఉపాధ్యాయ సంఘాల ఆందోళకు దారితీసింది. Bed performanceపేరుతో 13 మంది టీచర్ల జీతా లు కట్ చేస్తూ విద్యాశాఖ అధికారులు లెటర్ రాశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అధికారుల తీరును ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చెపట్టాయి. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని జాముయి జిల్లా విద్యాశాఖ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. విద్యా శాఖ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీని గురించి ప్రజలు రకరకాల చర్చలు జరుపుతున్నారు. డ్యూటీ లకు గైర్హాజరైన టీచర్లకు బెడ్ ఫర్మార్మెన్స్ కారణంగా 13 మంది ఉపాధ్యాయుల జీతాన్ని విద్యాశాఖ కట్ చేసింది. ఇది ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసనలను రేకెత్తించింది.
మే 22న జాముయి జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో ఆకస్మిక తనఖీలు నిర్వహించిన అధికారులు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైనట్టు తెలిపారు. చాలామంది ఉపాధ్యాయుల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని తేలింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాసింది. అయితే ఆ లేఖలోని అంశాలు.. ఉపాధ్యాయుల కంటే విద్యాశాఖనే తప్పుపట్టేలా కనిపించాయి.

లేఖలో పేర్కొన్ ప్రకారం.. 13 మంది ఉపాధ్యాయుల జీతం Bed performance కారణంగా తగ్గించబడింది.Bad Performance కు బదులుగా Bed Performance అని లేఖలో పొరపాటున టైప్ చేయబడింది.ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న డీఈవో కార్యాల యం హడావుడిగా క్లారిటీ ఇచ్చింది. టైపింగ్ లోపం కారణంగా బ్యాడ్ పెర్పార్మెన్స్ అని బదులుగా బెడ్ ఫెర్మార్మెన్స్ అని టైప్ చేశారు. అని డీఈవో సంజాయిషీ ఇచ్చు కుంది.

Thyroid Disease: థైరాయిడ్ సమస్య మహిళలకే వస్తుందా..! ఈ వ్యాధికి సంబంధించిన నిజం, అపోహలు ఏమిటంటే..

థైరాయిడ్ సమస్య ప్రస్తుతం సర్వసాధారణంగా మారుతున్న వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఎవరినైనా, ఏ వయస్సులోనైనా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను ఎక్కువగా మహిళలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తమకు థైరాయిడ్ సమస్య మొదలైంది అని మొదట్లో గుర్తించడం లేదు. దీనికి సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో థైరాయిడ్ వ్యాధి ఏమిటి? దీని గురించి అపోహలు ఏమిటి? వ్యాధి గురించి నిజాలు ఏమిటి? ఈ రోజు తెలుసుకుందాం..

థైరాయిడ్ వ్యాధి అంటే ఏమిటంటే
థైరాయిడ్ అనేది హార్మోన్ల వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోక పొతే సమస్యలు తీవ్రంగా ఉంటాయి. నిజానికి థైరాయిడ్ అనేది మెడ ముందు ఉండే చిన్న గ్రంథి. దీని పని హార్మోన్లను విడుదల చేయడం. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను విడుదల చేసినప్పుడు సమస్యలు మొదలవుతాయి. అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం.. అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్లను విడుదల చేయడం వల్ల హైపోథైరాయిడిజం ఏర్పడుతుందని

థైరాయిడ్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన ఆహారం
థైరాయిడ్ సమస్య వస్తే బరువు పెరుగుతామనే ఒక అపోహ ప్రజల్లో ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. బరువు పెరగడం అనేది సాధారణ లక్షణం.. అదే విధంగా బరువు తగ్గడం కూడా జరగవచ్చు.
థైరాయిడ్ జన్యుసంబంధమైన వ్యాధి అని అనుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఎవరికైనా, ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. దీనికి కారణం చెడు జీవనశైలి కూడా కావచ్చు.

థైరాయిడ్ సమస్య మహిళల్లో మాత్రమే వస్తుంది అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే ఈ సమస్య ఎవరికైనా రావచ్చు.
థైరాయిడ్ ఉంటె లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య బయటపడదు. అయితే ఆలోచనలో మార్పులు, చిరాకు, జుట్టు రాలడం వంటి చాలా సాధారణ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ నిర్దారణ కోసం పరీక్ష సహాయం తీసుకోవాలి.
ఔషధం మాత్రమే ఈ వ్యాధిని నియంత్రించగలదని భావిస్తున్నారు. అయితే మందులతో పాటు మెరుగైన జీవనశైలితో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
ఆహారం: అయోడిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా ఏమీ చేయవద్దు.
ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే వస్తుందని ఎక్కువమంది అనుకుంటున్నారు. అయితే మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం అన్ని వయస్సుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించిగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని.. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరించింది.

AP ECET RESULTS 2024

AP ECET Results 2024 Manabadi (Released), AP ECET Rank Card Download

AP ECET Results 2024, Rank Card Download Name Wise: Andhra Pradesh ECET Examination result with marks and score are Released in the official website cets.apsche.ap.gov.in. Students can download their Manabadi AP ECET Result and Rank card from schools9, indiaresults websites.

AP ECET Rank Card Download

సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌కు షాక్‌

సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌కు షాక్‌

భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్‌ టోర్నమెంట్‌ ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై ఊహించని విజయం నమోదు చేశాడు.

18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్‌ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం.

మూడో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్‌సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్‌ నంబర్‌ టూ ర్యాంకర్‌ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు.

45 గంటల పాటు మోడీ ‘ధ్యానం’.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని కాంగ్రెస్ ఫిర్యాదు

ప్రధాని మోడీ కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర 45 గంటలు పాటు ధ్యానం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధాన్య మండపం దగ్గర మెడిటేషన్ చేయనున్నారు.

కన్యాకుమారిలో మోడీ సందర్శన సందర్భంగా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భద్రత కోసం 2 వేల మంది పోలీసులు, భద్రతా ఏజెన్సీలు మోహరించారు. రాక్ మెమోరియల్, బోట్ జెట్టీ, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రెండ్రోజుల పాటు పర్యాటకులకు బీచ్ లోకి అనుమతి లేదని తెలిపారు. గురువారం నుంచి శనివారం వరకు బీచ్ లో ఆంక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీచ్ లోకి ప్రైవేటు పడవలను అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రధానికి చెందిన ప్రత్యేక భద్రతా బృందం కూడా ధ్యాన మండపం చేరుకుని భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్ పరీక్షలను కూడా జరిపింది.

మోడీ ‘ధ్యానం’లో ఉండనున్నట్టు ప్రకటించడంపై ఎన్నికల కమిషన్‌ కు కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. ఇదంతా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ ఎవరినీ ఎలాంటి ప్రచారానికి అనుమతించరాదని ఈసీకి తెలిపినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. మే 30వ తేదీ 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుందని పేర్కొన్నారు. మోడీ తనను తాను ప్రచారంలో ఉంచుకునేందుకు వేసిన ప్లాన్ ఇదని మండిపడ్డారు. జూన్ 1 సాయంత్రం తర్వాత ధ్యానం చేసుకునేలా ఆదేశించాలని ఈసీని కోరినట్లు వివరించారు. అలా కాకుండా మే 30 నుంచే దీక్ష చేస్తానంటే.. దానికి సంబంధించిన వార్తలు మీడియాలో టెలికాస్ట్ కాకుండా నిషేధించాలని కోరినట్లు అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.

AP Election results: కౌంటింగ్‌రోజు మధ్యాహ్నం 2గంటలకే అధికారం ఎవరిదో డిసైడ్.. లెక్క ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధిస్తారు? కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది? అధికారం కూటమిదా, లేకా వైసీపీదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లపై ముఖేష్ కుమార్ మీనా
అయితే జూన్ 4న ఏపీ కౌంటింగ్ కు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్టుగా పేర్కొన్న ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నాల్గవ తేదీ రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాలు తుది ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈసీకి నియోజకవర్గాల వారీగా లెక్కింపు ఏర్పాట్ల వివరణ
ఢిల్లీ నిర్వచన సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను గురించి తెలిపారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.

175 వర్గాలలో ఎన్ని రౌండ్ల లెక్కింపు అంటే
ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఫలితాలు వెంటవెంటనే ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఒక మూడు నియోజకవర్గాలలో మాత్రం 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

2 గంటలలోపే అధికారం ఎవరిదో డిసైడ్
మెజారిటీ ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల్లోపే వస్తాయని, 111 నియోజకవర్గాలలో మధ్యాహ్న రెండు గంటల లోపు, మిగతా 61 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల లోపు, మిగిలిన మూడు నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం టేబుల్ లను పెంచి సకాలంలో బ్యాలెట్ లెక్కింపును కూడా పూర్తి చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

మొత్తం లెక్కింపు రాత్రికి పూర్తి
మొత్తంగా రాత్రి 8 గంటల నుండి 9 గంటల లోపే అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి చెప్పిన దాన్ని బట్టి ఏపీలో అధికారం ఎవరిది అనేది మధ్యాహ్నం రెండు గంటల వరకే తేలనుంది. అయితే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి రాత్రి అయ్యే అవకాశం ఉంది.

Chanakya Niti: సంపాదన విషయంలో చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు అమలు చేస్తే.. ఎన్నడూ డబ్బుకు కొరత ఉండదు..

ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే డబ్బుతో కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. డబ్బు గురించి పండితుడు, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడి తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను చెప్పాడు. ఇంకా చెప్పాలంటే మనిషికి డబ్బే నిజమైన స్నేహితుడు.. కనుక ఎప్పుడూ డబ్బును పొదుపు చేయాలని సూచించాడు. పొదుపు చేసిన డబ్బు అవసరాల్లో నేను ఉన్నాను అంటూ ఆదుకుంటుంది. అంతేకాదు జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నాడు. అందుకనే ఎవరైనా ధనవంతులు కావాలని కోరుకుంటే ఆచార్య చాణక్యుడి మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం ముఖ్యం. పురాణ గ్రంధాలతో సహా చాణక్య నీతిలో డబ్బు ప్రత్యేక ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో డబ్బు సంపాదించడం, ధనవంతుడు కావడం గురించి విలువైన సూచనలను వివరంగా వివరించాడు. వీటిని అనుసరించే వ్యక్తులు ఎన్నటికీ పేదలు కారు.

డబ్బుపై చాణక్యుడి విధానం మీ సంపదను కాపాడుకోవడానికి మీ సంపాదనను ఖర్చు చేసే విధానం కూడా ముఖ్యం. ఖర్చు అనేది ధార్మిక కార్యకలాపాలను సూచిస్తుంది. దానం చేయడం వల్ల ధనం తరగదు. పైగా రెట్టింపు అవుతుంది. అంతేకాదు ప్రతి వ్యక్తి సంపాదన లో కొంత మొత్తం అయినా పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. తద్వారా భవిష్యత్తులో అతనికి ఆర్ధిక కష్టాలు వస్తే.. ఎదుటి వారి సహాయం అర్దించే అవసరం ఏర్పడదు. డబ్బుల కోసం ఇబ్బందిని ఎదుర్కోరు.

దానం చేయడం, మతపరమైన కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేయడం ఎప్పటికీ అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా కష్ట సమయాల్లో డబ్బును ఆదా చేయడం పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. తద్వారా జీవితంలో డబ్బుకు కొరత ఉండదు.
అలాంటి డబ్బు జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది డబ్బును ఎల్లప్పుడూ నైతికంగా, సరైన పద్ధతిలో సంపాదించినట్లయితే అది చాలా కాలం పాటు వ్యక్తితో ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కష్టపడి పని చేసి సంపాదిస్తే దాని ఫలాలు మీకే కాదు మీ కుటుంబానికి కూడా లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో కష్టపడి సంపాదించిన డబ్బు జీవితానికి ఆనందాన్ని శాంతిని తెస్తుంది.

అబద్ధం ఎంతకాలం నిలవదు. ఎందుకంటే అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది, అదే విధంగా అనైతిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలో బహిర్గతమవుతారు. దీని తరువాత అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తాడు. అందుకే ఎల్లప్పుడూ కష్టపడి, నిజాయితీతో డబ్బులు సంపాదించమని చాణుక్యుడు పేర్కొన్నాడు.

అహాన్ని ఓడించండి, విలువలతో గెలవండి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగి ఉంటుంది. చాణక్యుడు ప్రకారం తమ సంపద గురించి గర్వపడే వారు త్వరగా పేదరికం బారిన పడతారు. విలువల ద్వారా అన్నీ గెలవవచ్చు .. అదే విధంగా గెలిచింది కూడా అహంతో పోగొట్టుకోవచ్చు అంటారు. అటువంటి పరిస్థితిలో వినయం, విలువలు, సంపద పట్ల గౌరవం మాత్రమే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని తెస్తుంది.

అలాంటి డబ్బు చాలా కాలం పాటు ఉంటుంది ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే ఎల్లప్పుడూ నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించాలి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉండదు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో పడతారు. అక్రమ సంపాదన ఖచ్చితంగా వారి నుంచి దూరం అవుతుంది. నిజాయితీగా కష్టపడి సంపాదించిన ఆస్తి, సంపద ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సహాయం చేస్తుంది.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. స్కూల్స్ తెరవక ముందే

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. స్కూల్స్ తెరవక ముందే

రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. జూన్ 12న బడులు తిరిగి పున:ప్రారంభం కాబోతున్నాయి. ఎండాకాలం సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడిబాట పట్టే టైమ్ రానే వచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే బడి గంట మోగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. విద్యార్థుల కోసం రెండు భారీ కానుకలను అందించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విద్యార్ధుల భవిష్యత్ కోసం.. నాణ్యమైన విద్య కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఆధునిక వసతులతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యనందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏటా అందించే కిట్లు జూన్ 12 నాటికే పాఠాశాలలకు పంపిణీ చేసి. అనంతరం పాఠశాల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు‌. ఏపీలో విద్యాకానుకను 2021 ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఎనిమిది ఐటమ్స్ తో కిట్లు ఇస్తారు.

రెండు జతల స్కూల్ యూనిఫాం (స్టిచింగ్ ఛార్జీలుతో సహా), పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, తెలుగు-ఇంగ్లిష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్టు, రెండు జతల నలుపు షూస్, రెండు జతల సాక్సులతో కూడి‌న కిట్లు ప్రతి విద్యార్థికి అందజేస్తారు. ఈ కిట్లు జూన్ 5 నాటికి అన్ని స్కూల్స్ కు షూస్ రవాణా పూర్తి చేయనున్నారు. పాఠశాలలు తెరుచుకునే సమయానికి విద్యార్థులందరికీ స్కూల్ కిట్స్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.‌ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 44,57,441 మంది ఉన్నారు. వీరందరికీ విద్యా కానుక కిట్లును అందించనున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలను సైతం స్కూల్స్ ఓపెన్ అయ్యేనాటికి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Diabetes Cure: మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం.! శాస్త్రవేత్తల అద్భుత విజయం..

Diabetes Cure: మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం.! శాస్త్రవేత్తల అద్భుత విజయం..

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. చాపకింద నీరులా వ్యాపిస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కారణాలేమైనా కానీ ఒకసారి ఇది వచ్చిందంటే జీవితాంతం దాంతో సావాసం చేయాల్సిందే. పూర్తిగా నయం చేసుకునే మార్గాలు అందుబాటులో లేకపోవడంతో అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాల్సిందే. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రయోగాలు ప్రారంభించిన చైనా శాస్త్రవేత్తలు సెల్ థెరపీ ద్వారా డయాబెటిస్ రోగులను బయటపడేశారు. షాంఘైలోని చాంగ్‌షెంగ్, రెంజీ ఆసుపత్రి వైద్యుల బృందం ఈ సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జులై 2021లో ఓ డయాబెటిస్ రోగికి సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా 11 వారాల్లోనే వారికి బయటి నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది.

ఆ తర్వాత ఏడాది వరకు ఆ రోగి క్రమంగా మందులు తీసుకోవడం తగ్గిస్తూ ఆ తర్వాత పూర్తిగా నోటి ద్వారా మందులు తీసుకోవడం మానేశాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతడిలో పాంక్రియాస్ తిరిగి మునుపటిలా పనిచేయడం ప్రారంభించినట్టు అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన యిన్ తెలిపారు. ప్రస్తుతం ఆ పేషెంట్ 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. డయాబెటిస్ విషయంలో సెల్‌థెరపీ గణనీయమైన పురోగతిని సూచిస్తుందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిమోతీ కీఫెర్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాలో అత్యధికమంది మధుమేహ రోగులు ఉన్నారు. ఇది ఆ దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం చైనాలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో 40 మిలియన్ల మంది జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధారపడుతున్నారు.

Viral Video Watch: ఓరీ దేవుడో.. 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

Viral Video : Watch: ఓరీ దేవుడో.. 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

మొసలి..ఈ పేరు వింటనే జనాలు భయపడుతుంటారు. అలాంటిది ఓ భారీ మొసలి రద్దీగా ఉన్న రోడ్డు పైకి రావడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు..దాదాపు10 అడుగుల పొడవున్న ఆ మొసలి కాళ్లు, చేతులు కలిగి ఉన్న మనిషిలా ప్రవర్తించటం చూసి ప్రజలు షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న నదిలోంచి బయటకు వచ్చిన భారీ మొసలి సమీపంలోని రైలింగ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ షాకింగ్ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? అసలు సంగతి ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద 10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఎట్టకేలకు స్థానికులు, పోలీసు, అటవీ శాఖ అధికారులు అతికష్టం మీద మొసలిని పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు. మరి కొందరు మొసలి రైలింగ్‌ ఎక్కుతున్న దృశ్యాలను తమ మొబైల్స్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మే 31న భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. ముందస్తు బెయిల్ ఏమైందంటే..?

మే 31న భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. ముందస్తు బెయిల్ ఏమైందంటే..?
కర్ణాటక సెక్స్ స్కాండల్‌ కేసులో కీలక పరిణామం శుక్రవారం (మే 31న) జరగబోతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకోనున్నాడు.
బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్ పోర్టులో ఆయన కాలు మోపగానే అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) అధికారులు సర్వం సిద్ధం చేశారు.
మ్యూనిచ్ (జర్మనీ) టు బెంగళూరు విమానం టికెట్‌ను ఇప్పటికే ప్రజ్వల్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చేరుకున్న వెంటనే తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రజ్వల్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
దీంతో ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులకు లైన్ క్లియర్ అయింది. గతంలోనూ ప్రజ్వల్ రెండుసార్లు జర్మనీ నుంచి బెంగళూరుకు విమాన టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరి ఈసారైనా ఆయన వస్తారా ? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మే 31న సిట్ ఎదుట విచారణకు హాజరవుతానంటూ మే 27న ప్రజ్వల్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
సెక్స్ స్కాండల్ బయటపడటంతో ఆయన ఏప్రిల్ 26న దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. అప్పటి నుంచి మ్యూనిచ్ నగరంలోనే ఉన్నారు.

AP Elections 2024: ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఫలితం.. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇదీ

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌)లో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. అయితే వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసింది.

మొదటి దశ: కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం

ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకుంటారు. వారు ఏ టేబుల్‌ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. తర్వాత తమకు కేటాయించిన టేబుల్‌ వద్దకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి… కౌంటింగ్‌ సిబ్బంది అందరితో కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్‌ ద్వారా మూడు దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.

రెండో దశ: పోస్టల్‌ ఓట్ల లెక్కింపు

తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్‌లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్‌ ఓట్లు లెక్కిస్తారు.
ప్రతి 25 పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు.
పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు పూర్తికాకుండా… కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు.
ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్‌ వద్ద అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.

మూడో దశ: ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు

ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటుచేస్తారు.
ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల సీరియల్‌ నంబర్‌ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఉదాహరణకు ఒక శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారనుకుంటే ఆ నియోజకవర్గంలో సీరియల్‌ నంబర్‌ 1-14 వరకూ ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌ పూర్తయినట్టు.
ఆ తర్వాత సీరియల్‌ నంబర్‌ 15 నుంచి 29 వరకూ ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు రెండో రౌండ్‌ పూర్తయినట్లు. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రం సీరియల్‌ సంఖ్యకు అనుబంధంగా ఏ, బీ, సీ వంటి బై నెంబర్లు ఉంటే.. వాటినీ విడిగా ఒక పోలింగ్‌ కేంద్రంగానే పరిగణించి.. కౌంటింగ్‌ టేబుల్‌ కేటాయిస్తారు.
ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత సీరియల్‌ నంబర్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

నాలుగో దశ: ఈవీఎంల తుది రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్‌ చీటీలు

ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్‌ లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది.
నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి.. లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు.
మొరాయించిన ఈవీఎంల పోలింగ్‌ కేంద్రాలను, మాక్‌ పోల్‌ వీవీ ప్యాట్‌ చీటీలను తొలగించని పోలింగ్‌ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు.
లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు.
ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ను ఏర్పాటుచేసి అక్కడే లెక్కిస్తారు.
ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్‌ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసమొస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపును రిటర్నింగ్‌ అధికారి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సొంతంగా నిర్వహిస్తారు. పరిశీలకుడు ఈ ప్రక్రియ పర్యవేక్షిస్తారు.
ఈ వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు.

ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం

ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఏర్పాటుచేసే కౌంటింగ్‌ టేబుళ్లు: 14
ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు పట్టే గరిష్ఠ సమయం: 30 నిమిషాలు
ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని రౌండ్లలో, ఎంతసేపట్లో లెక్కింపు పూర్తవుతుందనేది ఆధారపడి ఉంటుంది.
ఉదయం 11 గంటలకు దాదాపు ఐదు రౌండ్ల ఫలితాలు వచ్చేస్తాయి.

ఒక్కో అభ్యర్థికి ఎంతమంది కౌంటింగ్‌ ఏజెంట్లు?

ప్రతి అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
వీరికి అదనంగా రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద ఉండేందుకు ఒక ఏజెంటును ఏర్పాటు చేసుకోవాలి.
పోస్టల్‌ బ్యాలట్ల వద్ద పరిశీలించుకునేందుకు అభ్యర్థులు వారి తరఫున ప్రత్యేకంగా కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలి.
కౌంటింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించరు.

రైతులకు గుడ్ న్యూస్ : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్…

రైతులకు గుడ్ న్యూస్ : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్…

ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించగా.. ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మే 29 రాత్రి కల్లా నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వస్తుండటంతో ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కేరళను నైరుతి తాకిన నాలుగైదు రోజుల్లోనే ఏపీ, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. నైరుతి రాకతో అగ్నిగోళంలా మండుతున్న రాష్ట్రాలు చల్లబడనున్నాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు దంచికొట్టనున్నాయని పేర్కొన్నారు. గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. కాగా.. ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వారంరోజులుగా అక్కడక్కడా అడపాదడపా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు అంచనా వేసిన సమయానికి రుతుపవనాలు తీరాన్ని తాకి వర్షాలు పడితే.. వ్యవసాయ పనులను కూడా ప్రారంభించవచ్చని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.

విద్యార్థి జీవితంతో టీచర్స్ ఆటలు.. టెన్త్ లో 82 మార్కులొస్తే 18 మార్కులు వేశారు!

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విజ్ఞానాన్ని బోధించి సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. అందుకే గురువులను త్రిమూర్తులతో పోల్చి గౌరవిస్తుంటారు. ఒకప్పుడు మహరాజులు కూడా తమ పిల్లలను గురువులపై నమ్మకం ఉంచి ఆశ్రమాల్లో ఉంచేవారు. అంత గొప్ప గురువు స్థానం ఈ మధ్య కొంతమంది అప్రదిష్టపాలు చేస్తున్నారు. గురువు స్థానానికి మచ్చ తెస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు స్కూల్ కి మద్యం సేవించి వస్తున్నారు, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా టీచర్ల నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యం ఓ విద్యార్థిని మానసికంగా కృంగదీసింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో లోపభూయిష్టమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్లు దిద్దే టీచర్లు చేస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది. ఆ మధ్య అన్ని సబ్జెక్టుల్లో 100 కు 96 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి ఓ విద్యార్థికి 40 మార్కులు వేశారు. రీవాల్యుషన్ అప్లై చేస్తే 96 మార్కులు వచ్చినట్లు చూపించారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.ఉపాధ్యాయులు చేసే తప్పిదాల వల్ల విద్యార్థులు పడే మనోవేదన వర్ణణాతీతం. తాజాగా అలాంటి ఘటన బత్తలపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాఘవపల్లి గ్రామానికి చెందిన గోగుల సూర్యనారాయణ కొడుకు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. మార్చిలో బత్తులపల్లిలోని జడ్పీహెచ్ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు.

ఇటీవల వచ్చిన మార్కుల ప్రకారం తెలుగులో 98, హిందీ 98, మ్యాథ్స్ 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రం లో 86 మార్కులు వచ్చాయి. కానీ ఇంగ్లీష్ లో మాత్రం 18 మార్కులు రావడంతో అంజితో సహా అందరూ షాక్ అయ్యారు. మెరిట్ విద్యార్థి అయిన అంజి ఫెయిల్ కావడం ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోయారు. మానసికంగా కృంగిపోతున్న అంజికి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వేరిఫికేషన్ దరఖాస్తు చేశారు. ఈ ఫలితాలు సోమవారం వెలువడగా మ్యాథ్స్ లో 100 కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కొడుకుకి తక్కువ మార్కులు రావడంతో తీవ్ర నరకాన్ని అనుభవించాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పిదాలు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విద్యాశాఖాధికారులను కోరారు.

ఈ చికిత్సతో షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.. చైనా అద్భుత సృష్టి

మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. చైనా సైంటిస్టులు సెల్ థెరపీతో డయాబెటిస్ నయం చేశారు.

సెల్ థెరపీ ద్వారా డయాబెటిక్ పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే, ఈ విధానం అమల్లోకి రానుంది.

గత 25 ఏళ్లుగా చైనా వైద్యులు సెల్ థెరపీ పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల బాధితుడిపై ఈ ప్రయోగం మొదలు పెట్టారు. ఇదే వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి చికిత్స కొనసాగించారు.

ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ లో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగు పడినట్లు పరిశోధకులు గుర్తించారు. తర్వాత పూర్తిగా అతను మధుమేహాం నుంచి కోలుకున్నాడు.

Health

సినిమా