Friday, November 15, 2024

Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..

క్రికెట్ లో ఆడటం, ఓడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎల్లవేళలా గెలుస్తూ ఆడలేం, అలాగని ఓడిపోతూ ఉండలేం. కానీ ఇదే ఫార్ములాని బయట బిజినెస్ లో అప్లై చేస్తే తీవ్రంగా నష్టపోతాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సోదరులు ఇద్దరూ కలిసి, వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తీరా సొదరుడు మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సోదరుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా.. ఇద్దరూ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కృనాల్ బరోడా జట్టులో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి వరసకి సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో బ్రదర్స్ ఇద్దరూ 40 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టారు. అంటే ఇద్దరూ 80శాతం పెట్టారు. వైభవ్ పాండ్యా ఏం చేశాడంటే తను 20 శాతం పెట్టాడు.

వ్యాపార నిర్వహణంతా వైభవ్ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. కొన్ని నెలలు బాగానే ఉంది. వచ్చిన లాభాలను ఇదే నిష్పత్తి లో పంచుకున్నారు. అయితే పాండ్యా సోదరులకు తెలియకుండా కొద్దిరోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో బిజినెస్ లో లాభాలను 20 శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. అలాగే సంస్థ అకౌంట్ నుంచి డబ్బులను భారీ మొత్తంలో తన ఖాతాకు మళ్లించుకున్నాడు.
అలా మొత్తంగా సుమారు రూ.4.3 కోట్లకు పాండ్యా బ్రదర్స్ కి టోపీ పెట్టాడు. విషయం గురించి బ్రదర్స్ ఇద్దరూ వైభవ్ ని గట్టిగా నిలదీశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరించినట్టు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఇద్దరూ ముంబాయి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై జట్టులో తలనొప్పులకు తోడు, ఇవి కూడా తోడవడంతో హార్దిక్ పాండ్యా తలపట్టుకున్నాడని అంటున్నారు.

AP Elections 2024: ఈనెల 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్: ఈసీ

AP Elections 2024: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ తేదీన విడుదల చేస్తామన్నది తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీంతో పాటుగా నామినేషన్లు, వాటి ఉపసంహరణ తేదీలను కూడా ప్రకటించారు.

18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఏపీ సీఈఓ మీనా తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు.

Also Read: సిద్ధం అంటున్నవారికి మరిచిపోలేని యుద్ధం ఇద్దాం: చంద్రబాబు

రాష్ట్రంలో మే 13న నిర్వహించే ఎన్నికలు.. పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాలను వెల్లడించారు.

నేటి పంచాంగం , నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (12/04/24)

నేటి పంచాంగం (12 -04 -2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.


సూర్యోదయం సమయం : ఉదయం 06:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 12 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:09 గంటల నుంచి ఉదయం 05:57 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : రాత్రి 09:21 నుంచి రాత్రి 11:17 గంటల వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 12 అశుభ సమయాలు

యమగండం సమయం : ఉదయం 03:22 నుంచి సాయంత్రం 04:55 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 08:34 నుంచి ఉదయం 09:23 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:16 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 07:38 నుంచి ఉదయం 09:11 గంటల వరకు ఉంటుంది.

 
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (12/04/24)

మేషం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

వృషభం
కీలక వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ‌సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మిథునం
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కర్కాటకం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

సింహం
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

కన్య
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ పై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

తుల
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

వృశ్చికం
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

ధనుస్సు
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలైన కాలం. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మకరం
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

కుంభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం శుభకరం.

మీనం
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన శ్రేయోదాయకం.

రైల్వే సూపర్ యాప్.. బుకింగ్, ట్రాకింగ్ అన్నీ సేవలు ఒకే యాప్ లో!

ఇండియన్ రైల్వే సిస్టమ్స్ ను ఎంతో మంది ఉపయోగిస్తూ ఉంటుంటారు. దేశంలో అన్ని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడంలో భారతీయ రైల్వేలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తక్కువ ధరలకు అయిపోతుంటాయి కాబట్టి చాలా మంది.. ప్రయాణానికి రైల్వే సదుపాయాలనే ఉపయోగిస్తూ ఉంటారు, అయితే ఈ క్రమంలో గత కొంత కాలంగా రైల్వే సంస్థలు అనేక సమస్యల గురి కావడంతో.. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో వాటికి కొత్త పరిష్కారాలను కనుగొంటోంది. టెక్నాలజీ మారుతోంది కాబట్టి.. ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. దీనితో ఇప్పుడు రైల్వేస్ కూడా ఉన్న సమస్యలను తొలగించేందుకు.. ఒక సూపర్ యాప్ ను డెవలప్ చేసింది. ఈ సూపర్ యాప్ అందించే సేవలన్నిటిని ఒకే చోట ప్రజలకు అందించబోతుంది. మరి ఏ ఏ సదుపాయలు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

ఆధునికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. దీనితో ఎటువంటి సమస్యనైనా కానీ క్షణాల్లో పరిష్కారం కనుక్కోవచ్చు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు వచ్చేశాయి. దాదాపు అన్ని సేవలను ఒకే చోట ఉపయోగించే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ లోనే టికెట్ బుకింగ్, ట్రైన్ ట్రాకింగ్ ఇలా అన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ క్యాన్సిలేషన్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా టికెట్ వాపస్ కోసం.. 24/7 సర్వీస్ ను కూడా ప్రారంభించబోతుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు.. దీనిని ప్రారంభించాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటికోసం యాప్స్ ఉన్నా కూడా.. ఇప్పుడు అన్ని సేవలను కలిపి ఒకటే యాప్ లో ఉపయోగించుకునేలా దీనిని ప్రారంభిస్తున్నారు.

ఇక ప్రస్తుతం అత్యధికంగా అందరు ఉపయోగిస్తున్న యాప్ IRCTC రైల్ కనెక్ట్ యాప్. ఇప్పటివరకు ఈ యాప్ 10 కోట్ల డౌన్లోడ్స్ ను కలిగి ఉంది. ఇక ఇది కాకుండా.. రైల్ మదద్, యుటీఎస్ , సతార్క్ లాంటి ఎన్నో యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ట్రైన్ ట్రాకింగ్ చేయడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ను వినియోగిస్తూ ఉన్నారు. వాటిలో అప్పుడప్పుడు సాంకేతిక కారణాల వలన ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ యాప్ లు అన్నిటిని కలిపి ఒకే అప్లికేషన్ కిందకు తెచ్చేందుకు.. రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే.. కలకత్తా మెట్రో మొబైల్ యాప్ ను 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండడంతో.. ఇప్పుడు ఈ సూపర్ యాప్ లాంచ్ చేసే దిశగా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సూపర్ యాప్ అందరికి అందుబాటులోకి రానుంది.

HYDలో భారత్ రైస్ అమ్మకాలు.. స్టోర్ల వివరాలు ఇవే!

ప్రస్తుతం మార్కెట్ లో బియ్యం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ.. బియ్యం ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం భారత్ రైస్ అందిస్తామని ప్రకటించింది.కేవలం రూ. 29కే సన్నబియ్యం అందిస్తామని చెప్పి 50 రోజులు కావొస్తున్నా.. కేంద్రం నుంచి బియ్యం జాడే ఇప్పటి వరకు లేదు. అయితే అతి తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం ఎప్పుడూ వస్తాయా.. అని సామన్యులు, నిరుపేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నా భారత్ రైస్ కోసమే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ భారత్ రైస్ అనేది తాజాగా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. ఇంతకి ఈ భారత్ రైస్ హైదరాబాద్ లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భారత్ రైస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. కాగా, ఈ రైస్ విక్రయ బాధ్యతలను..నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)(NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలకు అప్పగించింది. ప్రస్తుతం భారత్‌ రైస్‌ విక్రయాలు అనేవి నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్‌ పరిధిలోని 24 కేంద్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్లు నాఫెడ్‌ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో భారత్ రైస్ విక్రయాలను 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. కానీ, ఎటువంటి ప్రచారం లేకపోవడంతో.. భారత్‌ రైస్‌ అమ్మకాలు ఊపందుకోలేదు. ఈ రైస్‌ మొదటి రకానికి అయి ఉంటాయని చాలా మంది భావించారని, అన్నం వండిన తర్వాత కాస్త దొడ్డుగా ఉంటోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇక అన్నం రుచిగా ఉంటున్నప్పటికీ.. సన్నగా ఉండకపోవడం వల్ల చాలామంది ఈ రైస్ పై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ట్రెడర్ తెలిసిన వారికి పది కిలోల బ్యాగ్‌లను విక్రయించానని తెలిపారు. అయితే పది కిలోల బ్యాగ్‌లను 40 వరకు తెచ్చి, అమ్మడానికి నానా తంటాలు పడ్డానని చెప్పారు. కాగా, రెండోసారి ఎవరూ ఈ బియ్యం తీసుకోలేదన్నారు. అలాగే, కాచిగూడలోని ఓ ట్రేడర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తాను 15 రోజుల నుంచి అమ్మకాలు చేస్తున్నానని, వినియోగదారులకు ముందుగా నమునా బియ్యం చూపించి విక్రయిస్తున్నానని చెప్పారు. మొదట 10 కిలోల బ్యాగులు 200 తెప్పించి, పూర్తిగా విక్రయించానని, రెండో సారి 100 తీసుకొచ్చినట్లు తెలిపారు. మరి నగరంలో పలు ప్రాంతాల్లో ఈ భారత్ రైస్ ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ పంపీణీ కేంద్రాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

పంపిణీ కేంద్రాలు..
ఏపీ రైస్‌ స్టోర్స్‌, మెట్టుగూడ
చంద్రమౌళి ట్రేడర్స్‌, కార్వాన్
ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌,
ఎస్‌ఆర్‌నగర్‌
డింగ్‌డాంగ్‌ సూపర్‌ మార్కెట్‌
గౌతమ్‌రైస్‌ డిపో, కాప్రా
జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్‌హౌజ్‌
మాణిక్య ట్రేడర్స్‌, ఆర్‌కే పురం
మురళీ కిరణ్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, పటాన్‌చెరువు
ముత్తయ్య గ్రాండ్‌ బజార్‌, శేరిలింగంపల్లి
ఖైసర్‌ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌, హైదరాబాద్‌
సాయిదీప్‌ సూపర్‌ స్టోర్స్‌, మెదక్‌
సిర్వి ట్రేడర్స్‌, బోడుప్పల్‌
శంకర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, సికింద్రాబాద్‌
శ్రీ గోవిందా ట్రేడర్స్‌, కాచిగూడ
శ్రీ వీరభద్ర ట్రేడర్స్‌, కవాడిగూడ
శ్రీ అంబ ట్రేడర్స్‌, హైదరాబాద్‌
శ్రీ బాలాజీ రైస్‌ డిపో, రాంనగర్‌
శ్రీ సాయిబాబా రైస్‌ డిపో, కార్వాన్‌
సాయిశివ రైస్‌ ట్రేడర్స్‌, కర్మన్‌ఘాట్‌
శ్రీ సాయి ట్రేడర్స్‌, కొత్తపేట
శ్రీ ట్రేడర్స్‌, చందానగర్‌
ఉజ్వల్‌ ట్రేడర్స్‌, మల్లేపల్లి
ఉప్పు రాజయ్య ట్రేడర్స్‌, షాపూర్‌నగర్‌
రిలయన్స్‌, దేవరయంజాల్‌

మార్కెట్ లోకి నయా పల్సర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే?

మార్కెట్ లో ఎన్ని రకాల బైక్స్ ఉన్నా పల్సర్ బైక్స్ కు ఉండే క్రేజ్ వేరు. యూత్ కు కనెక్ట్ కావడంతో మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది పల్సర్ బైక్ లకు. పల్సర్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ఎప్పటికప్పుడు బజాజ్ కంపెనీ సరికొత్త మోడల్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అంతేకాదు ఆధునిక టెక్నాలజీని జోడించి స్టన్నింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ బైక్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు మరోకొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250ని ఏప్రిల్ 10న మార్కెట్ లోకి విడుదల చేసింది. స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ బైక్ నయా టెక్నాలజీతో బైక్ లవర్స్ ను ఫిదా చేస్తోంది. ఇక దీని ధర రూ .1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.

పల్సర్ బైక్ పైన రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసినట్లే అని అంటుంటారు బైక్ లవర్స్. ఈ నేపథ్యంలోనే బజాజ్ కంపెనీ అప్ గ్రేడ్ వర్షన్లతో పల్సర్ బైక్ లను ఆటోమొబైల్ మార్కెట్ లోకి లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 2024బజాజ్ పల్సర్ ఎన్250 పేరుతో వచ్చిన ఈ బైక్ లో నయా ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేశారు. ఈ నయా పల్సర్ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే. ఈ కొత్త పల్సర్ బైక్ లో ముందువైపు రెండు డీఆర్ఎల్ లతో సింగిల్ హెడ్ లైట్ ఉంటుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు, అండర్‌బెల్లీ ఫెయిరింగ్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌తో పాటు దాని ట్యాంక్ డిజైన్‌ అలాగే ఉంది.

ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో ఏబీఎస్‌ డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. కొత్త పల్సర్ ఎన్ 250కి మూడు ఏబీఎస్ కలర్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లోని బటన్ ను ఉపయోగించి కాల్స్ ను స్వీకరించడం వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. పల్సర్ ఎన్ 250 లో 249 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 24.1 బీహెచ్పీ మరియు 21.5 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

రూ.లక్ష కోట్ల బ్యాంక్‌ స్కాం.. ప్రముఖ మహిళా వ్యాపారవేత్తకు మరణ శిక్ష విధించిన కోర్టు!

మన దేశంలో అయితే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టినా.. బడాబాబులు విదేశాల్లో దర్జాగా తిరుగుతారు. కానీ వియత్నం లాంటి దేశాల్లో ఆ పప్పులేం ఉడకవ్‌.. ఆ దేశ ప్రభుత్వాలు గాలెం వేసి పట్టి మరీ శిక్షిస్తారు. తాజాగా వియత్నాంకి చెందిన దిగ్గజ వ్యాపార వేత్త ట్రూంగ్‌ మై లాన్‌.. ఆ దేశ బ్యాంకును రూ.లక్ష కోట్లకు పైగా మోసం చేసినందుకుగానూ అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు గురువారం (ఏప్రిల్‌ 11) తీర్పు వెలువరించింది.

ఎవరీ ట్రూంగ్‌ మై లాన్‌..
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఛైర్మన్‌గా కొనసాగుతోంది. అయితే వియత్నాంలోనిసైగాన్ కమర్షియల్ బ్యాంక్ (SCB) నుంచి ఆమె పదేళ్ల కాలంలో దాదాపు12.5 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లు) సంబంధించి మోసాలకు పాల్పడినట్లు రుజువైంది. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. వియత్నం దేశంలోని అతిపెద్ద స్కాంలలో ఇది ఒకటి. దీంతో కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ఆ దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. లాన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 85 మంది దోషులను ఐదు వారాలపాటు విచారించారు. లాన్‌ సహా నిందితుల జాబితాలో మాజీ సెంట్రల్ బ్యాంకర్లు, మాజీ ప్రభుత్వ అధికారులు, మాజీ SCB అధికారులు ఉన్నారు. అధికార దుర్వినియోగం, లంచం, బ్యాంకింగ్‌ చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు వీరిపై వచ్చాయి.

ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (SCB)లో దాదాపు 90 శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఆమె వియత్నాంలోని ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపార వేత్తలు లక్ష్యంగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి 2012 నుంచి 2022 మధ్య SCB బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకుపైగా ఆమె కాజేసింది. ఇది ఆ దేశ జీడీపీలో 3 శాతం. 2022లో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఆమెను అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ స్కాం వల్ల దాదాపు 42 వేల మంది నష్టపోయారు. దీంతో ఈ వ్యవహారం ఆగ్నేయాసియా దేశమంతటా షాక్‌కు గురి చేసింది. ఇందుకు గానూ SCB అధికారులు 5.2 మిలియన్‌ డాలర్లు లంచంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Central Government: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి రూ.21 వేలకు పెంచే యోచనలో కేంద్రం

ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగం పైనా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.

RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త… EMI భారం తగ్గింపు…!

RBI : ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో RBI కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈసారి రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే 7వ సారి కూడా రేట్లు స్థిరంగానే ఉంచిందని చెప్పాలి. ఒకవేళ ఆర్.బి.ఐ రెపో రేట్లను మార్చినట్లయితే దాని ప్రభావం మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలపై పడే అవకాశంశం ఉంటుంది. అంటే మీ EMI విపరీతంగా పెరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాంకులలో వివిధ రకాలుగా రుణాలను తీసుకుంటున్నారు. గృహ రుణం ,వాహన రుణం ఇతర ఏవైనా రుణాలు తీసుకున్నట్లయితే ఈ EMI లో కాస్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

RBI : రెపో స్థిరత్వం
తాజాగా జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో ఆర్.బీ.ఐ వరుసగా 7వ సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేట్లు ప్రభావితం ఇప్పుడు రుణాలపై పడే అవకాశం లేదు కాబట్టి రుణ గ్రహీతల లోన్స్ EMI ప్రస్తుతానికి అలాగే కొనసాగుతాయి. ఉదాహరణకు. .. మీరు ఒక 20 సంవత్సరాలకు గాను 8.60% వడ్డీటు తో 25 లక్షల గృహరుణాన్ని తీసుకున్నారు అనుకోండి. దీనికి గాను నెలకు EMI రూ.21,854 అవుతుంది. ఇదే నిబంధన ప్రకారం 40 లక్షల రుణాన్ని పొందినట్లయితే దానికి గాను నెలకు EMI రూ.34,967 ,అవుతుంది. అయితే ప్రస్తుతం ఆర్.బి.ఐ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కాబట్టి మీ యొక్క EMI లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.

RBI భవిష్యత్తులో జరిగే మార్పులు..
రాబోయే కాలంలో ఒకవేళ RBI ద్వారా రెపో రేట్లు ఏమైనా మార్పులు చెందినట్లయితే బ్యాంకులలో మరియు ఆర్థిక సంస్థల ద్వారా తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పై కూడా సవరణలు జరుగుతాయి. ఒకవేళ రెపో రేట్లు పెరిగినట్లయితే రుణ వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనికి విరుద్ధంగా RBI రెపో రేటు తగ్గించినట్లయితే వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు మరింత సరసమైన రుణాలను అందుకుంటారు. మొత్తానికి ఇప్పుడు రెపో రేట్లు స్థిరత్వంగా ఉండటం వలన రుణ గ్రహీతలు ప్రయోజనాలను పొందారనే చెప్పాలి.

RBI : గుడ్‌న్యూస్‌.. క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్.. బిల్స్ ఎప్పుడు, ఎలా క‌ట్టాలి అంటే..!

RBI : ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడుతుండడం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. క్రెడిట్ కార్డ్ సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గతి వారికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. క్రెడిట్ కార్డ్ విష‌యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే క్రెడిట్ స్కోరు కూడా బాగానే ఉంది. క్రెడిట్ కార్డ్ వాడిన వారు స‌కాలంలో బిల్లులు చెల్లిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అయితే క్రెడిట్ కార్డ్ విష‌యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధ‌న‌లు తీసుకురాగా, ఆ రూల్స్ ప్ర‌కారం ఎవ‌రైన స‌రే తమ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మార్చుకోవడానికి మాత్ర‌మే బ్యాంకు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పటి రూల్ ప్ర‌కారం ఆర్బీఐ ప‌లు మార్పులు చేసింది.

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకోవడానికి అవ‌కాశం క‌ల్పిస్తూ ఆర్బీఐ ప‌లు రూల్స్ జారీ చేసింది. గ‌తంలో బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉండ‌గా, ఆ బిల్లింగ్ సైకిల్ అనేది ఎప్పుడు క్రెడిట్ కార్డ్ యాక్టివ్ అయితే అప్ప‌టి నుండి మొద‌ల‌వుతుంది. అయితే స్టేట్‌మెంట్ జ‌న‌రేట్ అయిన త‌ర్వాత బిల్లు చెల్లించ‌డానికి పది నుండి ప‌దిహేను రోజుల స‌మ‌యం ఉంటుంది కాబట్టి 30-రోజుల బిల్లింగ్ సైకిల్, గడువు తేదీ వరకున్న 10-15 రోజులు కలిపి 45 రోజులు మొత్తం ఫ్రీ పిరియ‌డ్ పొందుతారు. మీరు ప్రతి నెలా 1వ తేదీ, 10వ తేదీ మధ్య క్రెడిట్ కార్డు వాడిన‌ట్టైతే , 25వ తేదీ తర్వాత స్టేట్‌మెంట్ తేదీని అడ్జెస్ట్ చేస్తారు. అప్పుడు మీకు గ‌డువు తేదిని వ‌చ్చే నెల 10 నుండి 15 వ‌ర‌కు ఉంటంది.

దీని వల‌న వినియోగ‌దారుడికి చాలా లాభం ఉంటుంది. క్రెడిట్ కార్డుల్లో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కూడా ఒక‌ప్పుడు కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇప్పుడు ఇవ్వొచ్చు అనే నిబంధ‌న కూడా తీసుకు వ‌చ్చారు. ఒక వేళ క‌స్ట‌మ‌ర్‌కి ఇష్టం లేదంటే దానిని డియాక్టివేట్ చేయ‌వ‌చ్చు. కస్టమర్‌కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం చేయ‌వ‌ద్దు. ఇక క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డీయాక్టివేషన్ చేసినట్లయితే వాడేటందుకు ఏ మాత్రం కుద‌ర‌దు. మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసేయాల్సి న ప‌రిస్థితి నెల‌కొని ఉంటుంది.

కవితను అరెస్ట్ చేసిన సీబీఐ: బిగుసుకున్న ఉచ్చు ..

Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. తాజాగా ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.

కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం. విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపర్చాగా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. మూడుసార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సేకరిస్తోన్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు ఈడీ అధికారులు. ఇదే కేసులో సీబీఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిందని ఈడీ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సమాజంలో పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. అందుకే మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోరారు.

నీళ్లు కావాలని అడిగి మరి దాహం తీర్చుకున్న ఉడుత..!

మనుషులకి దాహం వేస్తె అడిగి మరి దప్పిక తీర్చుకుంటాం. కానీ ఉడుత చేసిన సాహసం అందరిని అబ్బుర పరిచింది. దాహం వేసి నాలుక పిడచకట్టుకుపోవడంతో ఓ ఉడుత నీళ్ల కోసం చేసిన పోరాటం నెటిజన్లను ఆకర్షిస్తోంది. మనిషికి దండం పెడుతూ.. వెంటపడింది. నీరు పోసే వరకు వెంట తిరిగి తీరా దాహార్తి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

రోడ్డుపై నీళ్ల బాటిల్ తీసుకొని వెళ్తున్న ఓ యువ జంటను ఉడుత గమనించింది. దానిలో నీరు కనిపించడంతో అది ఆ యువకుడి వెంట పడింది. వెనక కాళ్లపై పైకి లేస్తూ.. ప్లీజ్ నీళ్లు పోయండి అన్నట్టుగా ప్రాధేయపడింది. ముందుగా ఆ యువకుడికి అది ఎందుకు వెంటపడుతోందో అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు. తన చేతిలోని నీటిని దానికి తాగించగా, దప్పిక తీర్చుకొని వెళ్లిపోయింది. నీళ్ల కోసం ఆ ఉడుత చేసిన సైగలు పలువురి హృదయాలను కట్టిపడేసింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.

https://x.com/susantananda3/status/1283744266620043264

APPSC Group 2 Mains Date: ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 899 గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 21 నుంచి జనవరి 17 వరకు కొనసాగింది. ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,04,037 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను వెలువరించింది. ప్రిలిమినరీ పరీక్షలొ దాదాపు 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. మరో 2557 మంది అభ్యర్థులను వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ రిజెక్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తదుపరి దశ అయిన మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలతోపాటు రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను కూడా వేర్వేరుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మెయిన్స్‌కు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్‌ ఎంపిక చేసింది. ఇక త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 రిజెక్ట్‌ అభ్యర్ధుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జవహర్ రెడ్డికి స్థాన చలనం – నూతన సీఎస్ గా రేసులో..!?

ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ అనుకూల అధికారులు అంటూ కొందరి పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై లేఖ రాసారు. అందులో భాగంగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి మార్పు పైన అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జవహర్ రెడ్డికి స్థాన చలనం కలిగితే నూతన సీఎస్ గా పరిశీలనలో అయిదుగురు పేర్లు ఉన్నాయి.

సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పని చేస్తున్నారని ఎన్నిక సంఘానికి పురందేశ్వరి లేఖ రాసారు. సీఎస్ తో పాటుగా డీజీపీ, పలువురు సివిల్ సర్వీసు అధికారుల పేర్లు అందులో ప్రస్తావించారు. ఈ లేఖ పైన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది. సీఎస్ గా జవహర్ రెడ్డికి స్థాన చలనం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డిని తప్పిస్తే ఇంఛార్జ్ సీఎస్ గా అయిదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్‌పి సిసోడియా, రజత్‌ భార్గవ్‌, శ్రీలక్ష్మి, అనంతరామ్‌లతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫిర్యాదుల ఆధారంగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో పురందేశ్వరి చేసిన ఫిర్యాదు పైన రాజకీయంగానూ దుమారం చెలరేగింది. వాలంటీర్ల ను పెన్షన్ల పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో అధికారుల తీరు పైన ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేసారు. దీంతో, ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రంగంలోకి భారతి, అటు షర్మిల – సమరమే…!!

ఏపీ ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి – వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ – వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలచారు. దీంతో..కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. కడప లో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. హోరెత్తుతున్న ప్రచారం ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరంది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అటు చంద్రబాబు – పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నకల ప్రచారం కొనసాగిస్తున్నారు. జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ నెల 18 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సీఎం జగన్ ీ నెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత పులివెందులో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది.

పులివెందులలో భారతి జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ తరువాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం. పులివెందుల టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ది ఖరారు కావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలోనూ భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేసారు. ఈ సారి పులివెందుల తో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అయితే, ఈ సారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అవినాశ్ పోటీ చేస్తున్నారు. షర్మిల, సునీత తమ ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాశ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆసక్తి కర రాజకీయం సీఎం గా జగన్ వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లా లో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది. జగన్ కడప లో జరిగిన సభలో వివేకా హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత గురించి ప్రస్తావించినా..ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేస్తారని.. షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో..కడప కేంద్రంగా చోటు చేసుకోనున్న ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది.

Best Schemes: ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అద్భుతమైన స్కీమ్స్‌

మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్రమే కాదు, దాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న పొదుపు పథకం ఈ పనిలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ డబ్బును సురక్షితంగా పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ రోజు 3 అటువంటి స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి ఇటీవల పెట్టుబడిదారుల పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేశాయి.

కిసాన్ వికాస్ పత్ర:
ఈ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ స్కీలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దానిని కొన్ని సంవత్సరాలలో రెట్టింపు చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000. గరిష్టపెట్టుబడికి పరిమితి లేదు. ఇది ఏకమొత్తం పెట్టుబడి పథకం. అంటే ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టి వదిలేయవచ్చు. మీరు మళ్లీ మళ్లీ వాయిదాలలో డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు పెడుతున్న పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 115 నెలలు అంటే 9 సంవత్సరాల 7 నెలలు. మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, ఈ సమయం తర్వాత మీ మొత్తం రూ. 10 లక్షలకు పెరుగుతుంది. అయితే, మీరు రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తం రూ. 8 లక్షలకు పెరుగుతుంది.

పీపీఎఫ్‌ స్కీమ్‌:
పీపీఎఫ్‌పై వడ్డీ రేట్లు 7.1 శాతం, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతంగా ఉంచారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయడంలో సహాయపడుతుంది. ఈ పథకం పన్ను ఆదాలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో 72 నియమం ప్రకారం, మీ డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం పడుతుంది.

సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్ చేసిన మొత్తంపై 8.2 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో పోస్టాఫీసు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి (SSY) అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం చదువు, పెళ్లి ఖర్చులకు తోడ్పడుతుంది. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు అందుబాటులో ఉంది. పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Viral: ‘వీడే అసలైన జాతిరత్నం’.. ఎగ్జామ్‌లో ఏం ఆన్సర్ రాశాడో చూడండి..

ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్‌‌లోని క్లాసుల్లో కొందరు ఆణిముత్యాలు ఉంటారు. ఆణిముత్యాలు అంటే మరీ పాత వెర్షన్ అయిపోతుందేమో.. ఇలాంటి వారిని మన లేటెస్ట్‌ ట్రెండ్ ప్రకారం జాతిరత్నాలు అనాలి. వీళ్ల గొప్పతనం ఏంటి అంటే.. పరీక్షా పేపర్‌లో ప్రశ్నలకు సమాధానం తెలీనప్పుడు.. అలా వదిలెయ్యరు. తమకు వచ్చింది, నచ్చింది, తోచింది రాసి.. పేపర్స్ నింపేస్తారు. ఇన్విజిలేటర్… షీట్‌కు ఒక మార్క్ వేసినా పాస్ అవుతామని.. కొందరు అడిషినల్ షీట్స్ తీసుకుని మరీ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాసే సోది విషయంలో కూడా ఒక్కొక్కరికీ ఒక్కో స్మార్ట్‌నెస్ ఉంటుంది. కొందరు మూవీ కథలు రాస్తారు. మరికొందరు తమకు తెలిసిన వంటకం గురించి వివరిస్తారు. ఇక ఏ గ్రేడ్ ఆణిముత్యాలు అయితే.. బట్టలు ఎలా ఉతకాలి.. ఉప్మా ఎలా చెయ్యాలి.. చేపలు ఎలా పట్టాలి వంటివి రాసుకొస్తారు.

మీ స్కూల్లో, కాలేజీల్లో ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ రాసిన మీరూ లేదా మీ ఫ్రెండ్స్ టీచర్‌కు దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చి ఒకింత ఉద్వేగానికి కూడా లోనవుతారు. తాజాగా ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ లెక్కల్లో అడిగిన ఓ ప్రశ్నకు.. టీచర్ బుర్ర హీటెక్కే సమాధానం ఇచ్చాడు. తనకు తిక్క ఏ రేంజ్‌లో ఉందో చూపించాడు. (a+b)^n ఈక్వెషన్‌ను విస్తరించమని అడిగితే.. ఆన్సర్ షీట్‌పై… స్పేస్ పెంచుతూ అదే ఈక్వెషన్‌ను రాసుకుంటూ వెళ్లాడు. బాబు పైత్యానికి స్టన్ అయిన టీచర్.. 10 మార్కుల ప్రశ్నకు సున్నా మార్కుల వేసింది. ఈ జాతిరత్నం రాసిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇది చూసిన నెటిజన్స్.

Gold Price Record: రికార్డ్‌ స్థాయిలో బంగారం ధరలు.. 100 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర తొలిసారిగా రూ.72 వేల స్థాయికి చేరుకుంది. కాగా వెండి ధర రూ.85 వేలు దాటింది. దీనికి విరుద్ధంగా విదేశీ మార్కెట్లలో బంగారం ధర తగ్గుదల కనిపిస్తోంది. దీని ప్రభావం దేశంలోని ఫ్యూచర్స్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. నిజానికి, ఫెడ్ రేటు అవకాశాలు దెబ్బ తిన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్, భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్ రెండింటిలోనూ క్షీణతకు ఇదే కారణం. ఏప్రిల్‌ 10న రాత్రి 9 గంటల సమయానికి దేశంలో బంగారం ధర రూ.380 మేర పెరుగుదల కనిపిస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల 10

ఢిల్లీలో రికార్డు స్థాయిలో బంగారం, వెండి

దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరో సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.72,000 స్థాయికి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో బంగారం ధర రూ.160 పెరిగి 10 గ్రాముల గరిష్ట స్థాయి రూ.72,260కి చేరుకుంది. మంగళవారం ఈ రికార్డు 10 గ్రాములకు రూ.71,840 వద్ద ముగిసింది. వెండి ధర కూడా రూ.200 పెరిగి, కిలో రూ.84,700 వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, విదేశీ మార్కెట్‌లలో బలపడుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు తాజా రికార్డు గరిష్టంగా రూ.72,000 వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి కంటే 100% ఎక్కువ. ముగింపు ధర రూ.160 పెరిగింది.

100 రోజుల్లో ఎంత పెరిగింది?

గత 100 రోజులుగా బంగారం ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. గతేడాది చివరి ట్రేడింగ్ రోజు బంగారం ధర పది గ్రాములు రూ.63,920గా ఉంది. ప్రస్తుతం రూ.72 వేలకు చేరింది. అంటే ప్రస్తుత సంవత్సరంలో ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.8,080 పెరిగింది. మరోవైపు, వెండి గురించి మాట్లాడినట్లయితే, ప్రస్తుత సంవత్సరంలో వెండి ధరలో మంచి పెరుగుదల ఉంది. గతేడాది చివరి ట్రేడింగ్ రోజున వెండి ధర రూ.78,500గా ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.6,200 పెరుగుదల కనిపించింది.

నిపుణులు ఏమంటున్నారు?

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్‌ వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, మార్చి నెల వడ్డీ రేట్ల గురించి ఆందోళనల కారణంగా బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా డిమాండ్‌లో ఉంది. యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ)తో ఫెడరల్ రిజర్వ్ మార్చి సమావేశం వివరాలు కూడా బుధవారం తర్వాత రానున్నాయని ఆయన చెప్పారు.

అంతు చిక్కని శివయ్య లీల.. 12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది…!

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.

కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.

ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది.ఈ ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు.

అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని… ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి.

12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.

Diabetes : షుగర్ 500 ఉన్నా.. మీరు 15 రోజుల్లో ఇలా తగ్గించుకోండి…!

Diabetes :  ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.

తెల్లన్నం తినడం పూర్తిగా మానేయాలి
షుగర్ రావడానికి ప్రధాన కారణం మనం తినే అన్నం. అవును.. మన భారతదేశంలో ఎక్కువగా అన్నం తినే వాళ్లలో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి.మనం తినే బియ్యం బాగా పాలిష్ చేసినవి. వాటిలో ఉండే విటమిన్స్, మాంసకృత్తులు అన్నీ పోయి.. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే. బియ్యంలో 77 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువగా అన్నాన్నే తింటూ ఉండటం అలవాటు చేసుకోవడం వల్ల.. షుగర్ వ్యాధి తొందరగా బాడీని అటాక్ చేస్తుంది.షుగర్ వ్యాధిని నయం చేయాలంటే ముందు అన్నం తినడం మానేయాలి. అలాగే చాలా మంది అన్నం ఎక్కువ కూర తక్కువ తింటుంటారు. కానీ.. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలి. కురల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే.. షుగర్ వెంటనే డౌన్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూరలు ఎక్కువగా తినే వాళ్లకు అసలు షుగర్ రానే రాదు. ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.
Diabetes : ఉప్పు వాడకం తగ్గించాలి
షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినేవాళ్లకు 70 శాతం షుగర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పును వాడకూడదు.

Diabetes : మొలకెత్తిన విత్తనాలు
రోజూ ఉదయమే మొలకెత్తిన విత్తనాలను తినండి. పరిగడుపున మూడు రకాల గింజలను తినండి. ఉదయం పూట టిఫిన్ బదులు.. మొలకలు, పండ్లను తీసుకోండి.
Diabetes : చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి
ఉదయం పూట ఖచ్చితంగా వ్యాయామం చేయండి. రోజూ ఉదయం అర్ధగంట చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి. రాత్రి పూట అన్నం తిన్న తర్వాత ఓ అర్ధగంట నడవండి.

Viral video : ఫోన్ మైకంలో పడి పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన తల్లి… ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో…!

Viral video : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామి అయిపోయిందని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేని వ్యక్తి కనిపించాడంటే కచ్చితంగా అది ఒక వింత అనే చెప్పాలి. అలాంటి పరిస్థితులలో నేటి సమాజం జీవిస్తోంది. అంతేకాదు బయటకు వెళ్లేందుకు ఆటో కావాలన్నా…ఆకలేసినప్పుడు ఫుడ్డు కావాలన్నా… బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా… మొబైల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఈ ఫోన్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ వేరే ఖండాల్లో ఉన్నవారితో సైతం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని అవసరాలను మన దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు. అందుకే నేటి కాలంలో మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే అని పెద్దలు అంటున్నారు. దీంతో నేటి కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

అయితే వాస్తవానికి ఈ మొబైల్ ఫోన్ వలన మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా అదే టెక్నాలజీకి బలవుతున్న మనుషులను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. మన తాతల కాలంలో సాయంత్రం వేళ అందరూ అరుగులపై కూర్చొని ముచ్చట్లు పెడితే నేటి కాలంలో ఫోన్ మాయాజాలంలో పడి పక్కవారితో సైతం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అలాగే మన చిన్నప్పుడు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తింటే ఇప్పుడు మాత్రం పిల్లల చేతికి ఫోన్ ఇవ్వనిదే నోట్లో ముద్ద కూడా పెట్టనివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు సైతం మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ సోషల్ మీడియాను చూస్తూ మైమర్చిపోతున్నారు. ఈ తరుణంలోనే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని పరిస్థితులలో కనిపిస్తున్నాయి.

Viral video తల్లి ఫోన్ లోనే నిమగ్నం
ఈ క్రమంలోనే ఈ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని గమనించినట్లయితే ఓ ఇంట్లో తల్లి తండ్రి చిన్నబాబు ఉంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లాడు హాల్లో ఆడుకుంటూ ఉండగా తన తల్లికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ లోనే నిమగ్నం అవుతుంది. ఈ క్రమంలోనే తన పనులు తాను చేసుకుంటూ పిల్లాడు ఆడుకుంటుండగా చూస్తూ ఉంటుంది. పంట కోసం కూరగాయలు తరిగి మిగిలిన కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి అనుకుంటుంది. కానీ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాయలో మునిగిపోయిన ఆ తల్లి కూరగాయలకు బదులుగా హాల్లో ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టింది. ఇంతలోకే ఆ పిల్లాడి తండ్రి స్నానం చేసి హాల్ లోకి వస్తాడు. పిల్లాడు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని టెన్షన్ పడుతూ భార్యని అడుగుతాడు. అయితే ఫోన్ మైకంలో తాను ఏం చేసిందో తెలియని భార్య పిల్లాడి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక పిల్లాడిని ఇంట్లో ఎక్కడ వెతికిన కనిపించడు.

ఇదే సమయంలో తండ్రికి ఆ పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు శబ్దం వింటూ తండ్రి ఫ్రిడ్జ్ డోర్ వద్దకు చేరుకుంటాడు. పిల్లాడి ఏడుపు శబ్దం ఫ్రిడ్జ్ నుండి రావడాన్ని గమనించిన తండ్రి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూడగా అందులో పిళ్లాడు కనిపిస్తాడు. ఇంకేముంది ఫ్రిడ్జ్ లోకి కొడుకు ఎలా వెళ్లాడో తెలియని పరిస్థితిలో ఉన్న భార్య వెంటనే కొడుకుని ఎత్తుకొని మొద్దాడుతుంది. ఈ విధంగా ఫోన్ మైకంలో పడి తల్లి తన సొంత బిడ్డని చంపుకునే పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి ఇంకాస్త ఆలస్యం చేసుంటే ఆ పిల్లాడు ఫ్రిజ్ లో చలి తట్టుకోలేక చనిపోయి ఉండేవాడు. అయితే ఈ వీడియోలో ఆ తల్లి ఫోన్ కు ఎంతలా ఎడిక్ట్ అయిందో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అనడానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పాలి. కావున మొబైల్ ను అవసరమైన వరకే వాడడం మంచిది. అంతకుమించి వాడితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వీడియో నేటి కాలంలో కొందరికైనా అవేర్నెస్ కల్పించేలా చేస్తే చాలు. మరి ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేసి ఇలాంటి పరిస్థితులకు గురికాకుండా జాగ్రత్త పడండి.

Dropout Chaiwala : టీ, కాఫీలు అమ్ముతూ ఏడాదికి రూ.5 కోట్లు సంపాదించిన కాలేజీ డ్రాపవుట్ స్టూడెంట్.. ఎలా సాధ్యం అయిందంటే?

Dropout Chaiwala : చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుందా? మంచి జాబ్ వస్తే మంచిగా సంపాదించవచ్చు. ఇదే కదా.. అందరూ చెప్పేది. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు.. మంచిగా చదువుకో అంటూ పిల్లలకు పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందని కూడా చెబుతారు. చదువుకోకపోతే ఏ పని చేయలేమని కూడా అంటారు. కానీ.. కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే చదువుతో సంబంధం లేకపోయినా జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఓ కుర్రాడు. అది మన తెలుగు కుర్రాడే. నెల్లూరుకు చెందిన ఆ కుర్రాడు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుదామని అనుకున్నాడు. అక్కడికి వెళ్లాడు కానీ.. మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. దానికి కారణం..

ఏదైనా వ్యాపారం చేయాలని అనుకోవడమే. అతడికి వచ్చిన ఆలోచనను కార్యరూపం దాల్చాడు. సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో బీబీఏ చదవడానికి సంజిత్ అనే నెల్లూరుకు చెందిన కుర్రాడు వెళ్లాడు కానీ.. అక్కడ అతడికి చదువు అబ్బలేదు. కాలేజీ డ్రాప్ అవుట్ గా మారాడు. కాలేజీ డ్రాపవుట్ అవడంతో తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలి అనిపించింది. ఓడిపోయి ఇండియాకు తిరిగి వెళ్లలేక తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. అక్కడే ఆస్ట్రేలియాలో డ్రాపవుట్ చాయ్ వాలా అనే ఓ టీ స్టాల్ ను తెరిచాడు. తాను చదువు వదిలేసి టీ కొట్టు పెట్టుకున్నాను అని తన తల్లిదండ్రులకు చెబితే ముందు బాధపడ్డారు. కానీ.. ఇప్పుడు తను ఒక స్థాయిలో ఉండటంతో అతడిని చూసి తల్లిదండ్రులు గర్విస్తున్నారు.

నిజానికి సంజిత్ కు టీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి టీ అంటే ఉన్న ఇష్టంతో ఆస్ట్రేలియాలో టీ షాప్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఎన్ఆర్ఐని ఒప్పించి పెట్టుబడి పెట్టించాడు. ఒక ఏడాదిలోనే రూ.5.2 కోట్ల లాభం వచ్చింది సంజిత్ కు. నిజానికి ఆస్ట్రేలియాలో కాఫీ ఎక్కువగా తాగుతారు. కానీ.. సంజిత్ చేసే చాయ్ కు మెల్ బోర్న్ వాసులు ఫిదా అయిపోయారట. అతడి టీ కొట్టులో చాయ్ విత్ సమోసా, చాయ్ విత్ పకోడాలు చాలా ఫేమస్ అట. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇండియన్స్ కూడా ఖచ్చితంగా మనోడి చాయ్ ను రుచి చూడనిదే వెళ్లరట.

Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

Garlic Health Benefits : మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
1. రోగనిరోధక వ్యవస్థ :
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. అంతేకాదు.. అంటువ్యాధులు, అనారోగ్యాలను ఎదుర్కోవడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
2. కార్డియోవాస్కులర్ :
వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు :
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. వివిధ దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి, వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

4. మెరుగైన జీర్ణక్రియ :
వెల్లుల్లిని సాంప్రదాయకంగా జీర్ణక్రియకు, జీర్ణశయాంతర సమస్యల నుంచి ఉపశమనానికి ఉపయోగిస్తారు. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. క్యాన్సర్ నిరోధక లక్షణాలు :
కొన్ని అధ్యయనాల్లో వెల్లుల్లికి యాంటీకాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలలో కణితులు ఏర్పడకుండా నిరోధించే సమ్మేళనాలను కలిగి ఉంది.

6. ఎముకల ఆరోగ్యం :
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల నష్టాన్ని నివారించవచ్చు. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

7. రక్తంలో చక్కెర నియంత్రణ :
వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలపై తగ్గించగలదు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు సమర్థవంతంగా సాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా క్రమంగా తగ్గిస్తుంది.

8. శ్వాసకోశ ఆరోగ్యం :
వెల్లుల్లి మ్యూకోలైటిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శ్వాసకోశ వ్యవస్థలో రద్దీని తగ్గించగలదు. తరచుగా జలుబు, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది.

Good news : Flipkartలో ఇకపై బస్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు…భారీ డిస్కౌంట్‌ పొందండి

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ గురించి అందరికి తెలిసిందే.ఎప్పటికప్పుడు వినియోదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తులను ఈ ఫ్లిప్ కార్ట్ సంస్థ అందిస్తోంది. అలాగే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను అతి తక్కువ ధరలతో కష్టమర్లను ఆకర్షించడంలో ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ ఎప్పుడు ముందుటుంది. ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ పేమెంట్స్, సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి సేవలెన్నో ఈ యూపీఐలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ మరో కొత్త సర్వీస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ డిజిటల్‌ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సేవలనేవి వినియోగాదారులకు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంతకి ఆ సేవలు ఏమిటంటే.. ఫ్లిప్ కార్ట్ తాజాగా బస్‌ టెకెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్‌ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ రావాణా సేవలనేవి బెంగళూరు, ఛండీగఢ్‌, ఢిల్లీ, జైపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నై వంటి ప్రాంతాల్లో టికెట్‌ బుకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే దీనిలో ఎలాంటి చార్జీలు లేకుండా బస్‌ టికెట్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, ఈ కొత్త సేవలు ప్రారంభ సందర్భంగా.. ఈ నెల 15 వరకు 20 శాతం వరకు రాయితీని కల్పించనుంది.ఇక పై దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ బస్ టికెట్ సేవలన కూడా ఫ్లిప్ కార్డ్ ప్రారంభించింది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఈ యాప్ లో Android, iPhone వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాప్ బస్ బుకింగ్ ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్‌లు, రూ. 50 వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు, 24×7 వాయిస్ హెల్ప్‌లైన్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. దీంతో పాటు లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఫ్లాట్ 15% తగ్గింపుతో పాటు 5% అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా.. ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌లో లక్కీ డ్రా పోటీని కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ రూ. 1 వద్ద బస్సు టిక్కెట్‌లను అందిచబోతుంది. అయితే వారణాసి, అయోధ్య, హరిద్వార్, తిరుపతికి వెళ్లాలనుకునే కస్టమర్‌లకు కంపెనీ ఫ్లాట్ 25 శాతం తగ్గింపు బస్సు బుకింగ్ కూపన్‌ను కూడా అందిస్తోంది.

Diabetic Tea Options: మీకు డయాబెటిస్ ఉందా..? రోజుకు రెండుసార్లు ఇలాంటి టీ తాగండి చాలు..!

పాలు, చక్కెర కలిపి తయారు చేసిన టీ తాగటం మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. కానీ, డయాబెటిక్ పేషెంట్లు టీ ఎలా తాగాలో ప్రత్యేకించి చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ డైట్‌ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. షుగర్ లెవల్స్ మెయింటెయిన్ చేయడం తప్పనిసరి అంటున్నారు. షుగర్‌ బాధితులు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో టీ కూడా ఒకటి. ఇందులో పాలు, పంచదార ఉన్నందున దీనిని నివారించడం మంచిదని చెబుతున్నారు.. కానీ, డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి టీ తాగితే మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

1. గ్రీన్ టీ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన టీలలో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
2. దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క టీ మధుమేహాన్ని నియంత్రించడంలో ఉత్తమమైనది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ చేయడానికి, ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత టీకి బదులుగా తాగేయాలి.

3. మెంతి టీ

డయాబెటిక్ బాధితులకు మెంతి టీ మరొక గొప్ప ఎంపిక. మెంతులలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. మెంతి టీ చేయడానికి, ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసి 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టి తాగేయండి. రుచి కోసం కావాలంటే మీరు నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

4. వాముతో తయారు చేసిన టీ

వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాము టీ తయారు చేయడానికి ఒక గ్లాస్‌ నీటిలో పావు చెంచా వాము వేసి 5 నిమిషాలు మరిగించండి. కాస్త ఆ తర్వాత వడకట్టి తాగాలి.

5. తులసి టీ

తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని కోసం, ఒక కప్పు వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచి కోసం కొంచెం తేనె కలుపుకుని తాగేయొచ్చు.

చివరగా, మధుమేహులు ఇలాంటి టీ తాగుతున్నప్పుడు దానికి చక్కెర, లేదా తేనె కలుపుకోవడం మంచిదికాదు. రుచి కోసం కావాలంటే మీరు దాల్చినచెక్క పొడి లేదా ఏలకుల పొడి వేసుకుని తాగొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఇంటి చిట్కాలు, ఆయుర్వేద మందులు వాడే ముందు..మీరు మీ వైద్యుడిని సంప్రదించండి. దీనితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సలహాలను అనుసరించడం చాలా ముఖ్యం.

Cockroach: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా.. అయితే వెంటనే టిప్స్ ఫాలోకండి

చాలామంది మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ బొద్దింకలు వస్తూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇంట్లో తిరుగుతూ చికాకాను తెప్పిస్తాయి. బెద్దింకలకు చెక్ పెట్టే కొన్ని టిప్స్ ఎంటో తెలుసుకుంటే ఇక హాయిగా ఉంటూ వాటిని వదిలించుకోవచ్చు. అయితే చాలామంది మార్కెట్లో దొరికే మందులను వాడుతుంటారు. అయితే అందులో కొన్ని పనిచేస్తే, మరికొన్ని ఏమాత్రం ప్రభావం చూపవు. అంతేకాదు.. ఇంట్లోవాళ్లు అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. అయితే ఇంట్లోనే నేచురల్ గా దొరికే పదార్థాలతో బొద్దింకలకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి హాని లేకుండా శాశ్వతంగా బొద్దింకలను వదిలించుకోవచ్చు. ఎలాగంటే…

నిమ్మరసం, నీరు

ముందుగా, స్ప్రే బాటిల్‌లో ఒకే మోతాదులో నిమ్మరసం, నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వంటగది మూలల్లో షెల్ఫ్‌ల కింద, సింక్ చుట్టూ, బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయండి. బొద్దింకలు నిమ్మకాయ పుల్లని వాసనను ఇష్టపడవు. దీంతో అక్కడ్నుంచి పారిపోతాయి.

బేకింగ్ సోడా, చక్కెర

ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా, చక్కెర కలపండి. వంటగదిలోని వివిధ భాగాలలో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అయితే బేకింగ్ సోడా వాటిని చంపుతుంది.

బోరిక్ యాసిడ్

మీ వంటగదిలోని పగుళ్లలో బోరిక్ యాసిడ్ పొడిని వేయండి. బోరిక్ యాసిడ్ బొద్దింకలకు ప్రాణాంతకం. వెంటనే వాటిని చంపుతుంది.

వేపనూనె, నీటితో

వేపనూనెలోని గుణాలు బొద్దింకలను దూరంగా ఉంచుతాయి. మీరు చేయాల్సిందల్లా వేపనూనెను నీటిలో కలిపి, స్ప్రే బాటిల్‌లో నింపి మీ వంటగదిలోని మూలలో స్ప్రే చేయండి. దీని వల్ల బొద్దింకలు చనిపోతాయి.

క్లీనింగ్ తప్పనిసరి

అయితే చాలామంది సింకుల్లో ఉన్న గిన్నెల తోమకుండా అలాగే వదిలేస్తుంటారు. వాటి వల్ల బొద్దింకలతో పాటు ఇతర కీటకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకుంటూ డెటాల్ లాంటి వాడితే ఎలాంటి సమస్య ఉండదు.

ఏపీ రాజధానిపై స్పష్టత లేదు.. అందుకే RBI కార్యాలయం ఏర్పాటు చెయలేక పోయాం

అమరావతి: ఏపీకి రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు.

అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

అఖిలభారత పంచాయతీ పరిషత్‌ ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాసిన లేఖను.. ప్రధాని కార్యాలయం ఆర్‌బీఐకి పంపించింది. దీంతో రిజర్వు బ్యాంకు అధికారులు ఆ లేఖకు సమాధానమిచ్చారు. రాజధాని విషయం తేలనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులుకు ఆర్‌బీఐ లేఖ పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆర్‌బీఐ అధికారులు అందులో సమాధానమిచ్చారు. దీనిపై జాస్తి వీరాంజనేయులు ఆగ్రహం వెలిబుచ్చారు. ”2016లోనే అమరావతిలో ఆర్‌బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వ మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది. అయినా, ఆర్‌బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టు సమాధానమివ్వడం దారుణం” అని వ్యాఖ్యానించారు.

Whatsappలో ఈ చిన్న తప్పు చేశారంటే.. మీ అకౌంట్‌ బ్లాక్ అవుతుంది!

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్ ను వినియోగించేవారే. వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం మరింత సులభమైపోయింది. క్షణాల్లోనే కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా చేరవేయొచ్చు. చాట్స్, కాల్స్ తో యూజర్లు తెగ వాడేస్తుంటారు. రోజులో ఒక్కసారైనా వాట్సాప్ ని చూడని వారు ఉండరేమో కదా. మరి వాట్సాప్ యూజర్లు ఈ యాప్ ను వినియోగించే సమయంలో ఏవైనా తప్పులు చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తుంది. భారత్ లో కూడా వాట్సాప్ వినియోగం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే వాట్సాప్ వినియోగించేటపుడు దాని నియమ నిబంధనలకు లోబడి వ్వవహరించాల్సి ఉంటుంది. మెసేజ్ లు పంపేటపుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌ని నిబంధనలను ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించే అవకాశం ఉంది. కాబట్టి వాట్సాప్ ను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉంటే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చు.

ఇటీవల వాట్సాప్ నియమాలను ఉల్లంఘించిన దాదాపు 76 మిలియన్ల ఖాతాలను బ్లాక్‌ చేసింది. మత విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అల్లర్లకు తెరలేపే విధంగా మెసేజ్ లను వైరల్ చేయడంతో వాట్సాప్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. కాబట్టి మీరు మెసేజ్ లను పంపే సమయంలో.. ఫార్వాడ్ చేసే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మెసేజ్ లు ఉన్నట్లైతే వాట్సాప్ చర్యలు తీసుకునేందుకు వెనకాడదు.ఈ చిన్న చిన్న తప్పులు చేశారంటే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Shubman Gill: విరాట్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్! ఇది మామూలు ఘనత కాదు..

శుబ్ మన్ గిల్.. ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమ్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు గిల్. తాజాగా రాజస్తాన్ తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 72 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు గుజరాత్ కెప్టెన్. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్. మరి ఈ ఘనతకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు శుబ్ మన్ గిల్. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ తో కలిసి తొలి వికెట్ కు 61 రన్స్ జోడించాడు. ఇక ఈ మ్యాచ్ లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు గిల్. ఐపీఎల్ చరిత్రలోనే 3000 వేల పరుగులను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఈ మార్క్ ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకోగా.. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.

ఈ లిస్ట్ లో వీరిద్దరి తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు. దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ ల పరంగా 3000 వేల రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో చేరాడు. 94 ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 75 ఇన్నింగ్స్ ల్లోనే 3 వేల పరుగులు దంచికొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్ ను చివరి బంతికి ఛేదించింది గుజరాత్ టీమ్. అసలైతే ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలవాల్సింది. కానీ రియాన్ పరాగ్ ఓవరాక్షన్ కారణంగా స్లో ఓవర్ రేట్ తో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Health

సినిమా