మార్కెట్ లోకి నయా పల్సర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మార్కెట్ లో ఎన్ని రకాల బైక్స్ ఉన్నా పల్సర్ బైక్స్ కు ఉండే క్రేజ్ వేరు. యూత్ కు కనెక్ట్ కావడంతో మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది పల్సర్ బైక్ లకు. పల్సర్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ఎప్పటికప్పుడు బజాజ్ కంపెనీ సరికొత్త మోడల్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అంతేకాదు ఆధునిక టెక్నాలజీని జోడించి స్టన్నింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ బైక్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు మరోకొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250ని ఏప్రిల్ 10న మార్కెట్ లోకి విడుదల చేసింది. స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ బైక్ నయా టెక్నాలజీతో బైక్ లవర్స్ ను ఫిదా చేస్తోంది. ఇక దీని ధర రూ .1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.

పల్సర్ బైక్ పైన రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసినట్లే అని అంటుంటారు బైక్ లవర్స్. ఈ నేపథ్యంలోనే బజాజ్ కంపెనీ అప్ గ్రేడ్ వర్షన్లతో పల్సర్ బైక్ లను ఆటోమొబైల్ మార్కెట్ లోకి లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 2024బజాజ్ పల్సర్ ఎన్250 పేరుతో వచ్చిన ఈ బైక్ లో నయా ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేశారు. ఈ నయా పల్సర్ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే. ఈ కొత్త పల్సర్ బైక్ లో ముందువైపు రెండు డీఆర్ఎల్ లతో సింగిల్ హెడ్ లైట్ ఉంటుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు, అండర్‌బెల్లీ ఫెయిరింగ్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌తో పాటు దాని ట్యాంక్ డిజైన్‌ అలాగే ఉంది.

ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో ఏబీఎస్‌ డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. కొత్త పల్సర్ ఎన్ 250కి మూడు ఏబీఎస్ కలర్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లోని బటన్ ను ఉపయోగించి కాల్స్ ను స్వీకరించడం వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. పల్సర్ ఎన్ 250 లో 249 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 24.1 బీహెచ్పీ మరియు 21.5 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *